టీ20 వరల్డ్ కప్‌: టాస్ ఓడినా మ్యాచ్ గెలిచిన ఇంగ్లండ్, 137 పరుగులకు శ్రీలంక ఆలౌట్

జాస్ బట్లర్

ఫొటో సోర్స్, Alex Davidson/getty images

ఫొటో క్యాప్షన్, సెంచరీ చేసిన జోస్ బట్లర్

టీ20 వరల్డ్ కప్ సూపర్ 12లో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ 26 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 4 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

164 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 19 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

తొలి ఓవర్ మూడో బంతికే పథుమ్ నిసంక రనౌట్ కావడంతో శ్రీలంక ఒక పరుగుకే మొదటి వికెట్ కోల్పోయింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

అతడి స్థానంలో వచ్చిన చరిత్ అసలంక(21) కాసేపు ధాటిగా ఆడినా, అదిల్ రషీద్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.

ఆ తర్వాత పది పరుగులకే మరో ఓపెనర్ కుశాల్ పెరీరా(7) కూడా ఆదిల్ రషీద్ బౌలింగ్‌లోనే ఇయాన్ మోర్గాన్‌కు క్యాచ్ ఇచ్చాడు.

మిడిల్ ఆర్డర్‌లో భానుక రాజపక్స(26), కెప్టెన్ దసున్ షనక(26), వాణిందు హసనరంగ(34) స్కోర్ ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

వీరు ముగ్గురూ అవుటైన తర్వాత శ్రీలంక కష్టాల్లో పడిపోయింది. 17వ ఓవర్లో 6వ వికెట్ పడినప్పుడు శ్రీలంక స్కోర్ 129, కానీ తర్వాత మరో 8 పరుగులకే జట్టు మిగతా 4 వికెట్లు కోల్పోయింది.

18వ ఓవర్ చివరి బంతికి 8వ వికెట్ కోల్పోయిన శ్రీలంక చివరి రెండు ఓవర్లలో విజయానికి 30 పరుగులు చేయాల్సిన దశలో 19వ ఓవర్లో మిగతా రెండు వికెట్లు కూడా కోల్పోయి అపజయం మూటగట్టుకుంది.

ఇంగ్లండ్ బౌలర్లలో మొయిన్ అలీ, ఆదిల్ రషీద్, క్రిస్ జోర్డాన్ చెరి 2 వికెట్లు పడగొట్టగా, క్రిస్ వోక్స్ ఒక వికెట్ తీశాడు.

సెంచరీతో నాటౌట్‌గా నిలిచిన జాస్ బట్లర్ మాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్ విజయంతో గ్రూప్-1లో ఇంగ్లండ్ సెమీ ఫైనల్ చేరుకుంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

టీ20 వరల్డ్ కప్ సూపర్ 12లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది.

35 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను ఓపెనర్, వికెట్ కీపర్ జోస్ బట్లర్ సెంచరీతో ఆదుకున్నాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

6 ఫోర్లు, 6 సిక్సర్లతో శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన జోస్ బట్లర్ 67 బంతుల్లోనే 101 పరుగులు చేసి చివరి వరకూ నాటౌట్‌గా నిలిచాడు.

బట్లర్‌కు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అండగా నిలిచాడు. ఇద్దరూ నాలుగో వికెట్‌కు 112 పరుగుల భాగస్వామ్యం అందించారు.

1 ఫోర్, 3 సిక్సర్లతో 36 బంతుల్లో 40 పరుగులు చేసిన ఇయాన్ మోర్గాన్ 19వ ఓవర్లో వాణిందు హసరంగకు క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 6
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 6

మోర్గాన్ టీ20ల్లో హసరంగకు 50వ వికెట్‌గా అవుట్ అయ్యాడు.

ఓపెనర్ జేసన్ రాయ్ 9, డేవిడ్ మలన్ 6 పరుగులకు అవుటవగా జానీ బెయిర్‌స్టో పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు.

మొయిన్ అలీ(1 నాటౌట్)తో కలిసి చివరి వరకూ క్రీజులో ఉన్న జోస్ బట్లర్ 95 పరుగులు దగ్గర ఉన్నప్పుడు 20వ ఓవర్ చివరి బంతికి సిక్స్ కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 7
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 7

ఇదే ఓవర్లో జోస్ బట్లర్ 93 పరుగుల దగ్గర ఇచ్చిన క్యాచ్‌ను నిసంక వదిలేశాడు.

ఈ సెంచరీతో జోస్ బట్లర్ క్రికెట్ మూడు ఫార్మాట్లలో వంద పరుగులు పూర్తి చేసిన ఏకైక ఇంగ్లండ్ ప్లేయర్ అయ్యాడు.

ఇంతకు ముందు ఇంగ్లండ్ మహిళా టీమ్ కెప్టెన్ హీతర్ నైట్ ఈ ఘనత సాధించారు.

జోస్ బట్లర్ టీ20ల్లో సెంచరీ చేసిన ఇంగ్లండ్ నాలుగో ఆటగాడు. మొదటి 38 బంతుల్లో 35 పరుగులు చేసిన బట్లర్ మిగతా 66 పరుగులు 29 బంతుల్లో కొట్టాడు.

శ్రీలంక బౌలర్లలో వాణిందు హసరంగ మూడు వికెట్లు పడగొట్టగా, దుష్మంత చమీర 1 వికెట్ తీశాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)