టీ20 వరల్డ్ కప్: జాస్ బట్లర్ మెరుపులు, ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం

ఓపెనర్ జాస్ బట్లర్

ఫొటో సోర్స్, Alex Davidson/getty images

ఫొటో క్యాప్షన్, ఇంగ్లండ్ ఓపెనర్ జాస్ బట్లర్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ 2లో భాగంగా శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఇంకా 50 బంతులు మిగిలుండగానే 126 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది.

5 ఫోర్లు, 5 సిక్సర్లతో 32 బంతుల్లోనే 71 పరుగులు చేసిన ఓపెనర్ జాస్ బట్లర్ జట్టును విజయం దిశగా నడిపించాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ఓపెనర్ జాసన్ రాయ్(22) ఆడం జంపా బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యు కాగా, అతడి స్థానంలో వచ్చిన డేవిడ్ మలన్(8) ఆష్టన్ ఆగర్‌ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.

ఇంగ్లండ్ 66 పరుగులకు తొలి వికెట్, 97 పరుగుల దగ్గర రెండో వికెట్ కోల్పోయింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

తర్వాత జాస్ బట్లర్, జానీ బెయిర్ స్టో(16)తో కలిసి మరో వికెట్ పడకుండా జట్టును విజయం దిశగా నడిపించాడు.

ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడం జంపా, ఆష్టన్ ఆగర్ చెరో వికెట్ పడగొట్టారు.

ఆరాన్ ఫించ్

ఫొటో సోర్స్, Francois Nel/getty images

ఫొటో క్యాప్షన్, ఆరాన్ ఫించ్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ 2లో భాగంగా శనివారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి ప్రారంభంలోనే కీలక వికెట్లు కోల్పోయింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

క్రిస్ ఓక్స్ వేసిన రెండో ఓవర్లో ఓపెనర్ డేవిడ్ వార్నర్(1) అవుటవగా, అతడి స్థానంలో వచ్చిన స్టీవ్ స్మిత్‌(1)ను క్రిస్ జోర్డాన్ తన మూడో ఓవర్ మొదటి బంతికే పెవిలియన్ పంపాడు.

తర్వాత క్రీజులోకి వచ్చిన గ్లెన్ మాక్స్‌వెల్‌(6) క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో, మార్కస్ స్టోయినిస్(0) అదిల్ రషీద్‌కు ఎల్‌బీడబ్ల్యు అయ్యారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

21 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియాను కెప్టెన్ ఆరాన్ ఫించ్(44) ఆదుకున్నాడు.

ఒకవైపు వికెట్లు పడుతున్నా.. ఆచితూచి ఆడిన కెప్టెన్ ఆరాన్ ఫించ్, మాథ్యూ వేడ్(18)తో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. దీంతో పది ఓవర్లు పూర్తయ్యే సరికి ఆస్ట్రేలియా 4 వికెట్ల నష్టానికి 41 పరుగులే చేయగలిగింది.

12వ ఓవర్లో భారీ షాట్ కొట్టడానికి ప్రయత్నించిన వేడ్ కూడా జేసన్ రాయ్‌కు క్యాచ్ ఇచ్చాడు.

తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ఆష్టన్ ఆగర్‌తో కలిసి ఫించ్ స్కోరును పరిగెత్తించాడు. 17వ ఓవర్లో చెరో సిక్స్ కొట్టిన ఇద్దరూ ఆ ఓవర్లో 20 పరుగులు రాబట్టారు.

కానీ, తర్వాత టైమల్ మిల్స్ ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించిన ఆగర్(18) లివింగ్ స్టోన్‌కు క్యాచ్ ఇచ్చాడు.

19వ ఓవర్లో ఆస్ట్రేలియాకు మరో షాక్ తగిలింది. క్రిస్ జోర్డాన్ వేసిన 19వ ఓవర్ మొదటి, రెండు బంతులకు ఆరాన్ ఫించ్, కమిన్స్(12) వెంటవెంటనే అవుటయ్యారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

19వ ఓవర్ వరకూ నిలిచిన కెప్టెన్ ఆరాన్ ఫించ్ 49 బంతుల్లో 4 ఫోర్లతో 44 పరుగులు చేశాడు.

చివరి ఓవర్లో 13 పరుగులు చేయగలిగిన ఆస్ట్రేలియా మిచెల్ స్టార్క్(13), ఆడం జంపా(1) వికెట్లు కోల్పోయింది.

ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ మూడు వికెట్లు పడగొట్టగా, క్రిస్ వోక్స్, టైమల్ మిల్స్ చెరి రెండు వికెట్లు, లియామ్ లివింగ్‌స్టన్ 1 వికెట్ తీశారు.

డేవిడ్ మిల్లర్

ఫొటో సోర్స్, Matthew Lewis-ICC/getty images

ఫొటో క్యాప్షన్, డేవిడ్ మిల్లర్, రబాడా

టీ20 వరల్డ్‌కప్ గ్రూప్ 1లో భాగంగా శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో చివరి ఓవర్లో డేవిడ్ మిల్లర్ మెరుపు సిక్సర్లతో దక్షిణాఫ్రికా ఇంకా ఒక బంతి మిగిలి ఉండగానే 146 చేసింది.

హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన శ్రీలంక బౌలర్ వాణిందు హసరంగ జట్టులో విజయం ఆశలు రేపాడు.

143 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా నాలుగో ఓవర్లో వెంటవెంటనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది.

నాలుగో ఓవర్ మూడో బంతికి రీజా హెండ్రిక్స్‌(11)ను ఎల్‌బీడబ్ల్యు చేసిన దుష్మంత చమీరా, ఐదో బంతికి క్వింటన్ డికాక్‌(12) ఇచ్చిన క్యాచ్‌ను అందుకున్నాడు.

తర్వాత కెప్టెన్ టెంబా బవుమాతో కలిసి కాసేపు క్రీజులో నిలిచిన రసీ వాండెర్ డసెన్(16) 8వ ఓవర్లో రనౌట్ అయ్యాడు.

కెప్టెన్ బవుమా, డేవిడ్ మార్‌క్రంతో కలిసి స్కోరును వందకు దగ్గరగా తీసుకొచ్చాడు. 15వ ఓవర్ చివరి బంతికి మార్‌క్రం అవుడవడంతో దక్షిణాఫ్రికా ఇబ్బందుల్లో పడ్డట్టు కనిపించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 6
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 6

డేవిడ్ ‌మార్‌క్రంను 15వ ఓవర్ చివరి బంతికి అవుట్ చేసిన హసరంగ, 18వ ఓవర్లో తొలి రెండు బంతులకు కెప్టెన్ బవుమ, డ్వేన్ ప్రిటేరియస్ వికెట్లు తీసి హ్యాట్రిక్ నమోదు చేశాడు.

బవుమ ఒక సిక్సర్ ఒక ఫోర్‌తో 46 బంతుల్లో 46 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా ఆరో వికెట్ కోల్పోయే సమయానికి స్కోరు 112.

క్రీజులో ఉన్న డేవిడ్ మిల్లర్, కగిసో రబడా మరో వికెట్ కోల్పోకుండా చివరి ఓవర్లో విజయం కోసం జట్టు 18 పరుగుల చేయాల్సిన స్థితికి తీసుకొచ్చారు.

ఆ సమయానికి అందరూ శ్రీలంక విజయం దాదాపు ఖాయమనే అనుకున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 7
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 7

చివరి ఓవర్ వేసిన లహిరు కుమార బౌలింగ్‌లో రబడా ఒక పరుగు చేసి మిల్లర్‌కు స్ట్రైకింగ్ ఇచ్చాడు. డేవిడ్ మిల్లర్ వరుసగా రెండు మూడు బంతులకు భారీ సిక్సర్లు కొట్టడంతో మ్యాచ్ పూర్తిగా దక్షిణాఫ్రికా చేతికొచ్చింది.

చివర్లో విజయానికి ఒక పరుగు అవసరమైన సమయంలో రబాడా ఫోర్ కొట్టడంతో ఇంకా ఒక బంతి మిగిలుండగానే 4 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం అందుకుంది.

డేవిడ్ మిల్లర్ 13 బంతుల్లో 2 సిక్స్‌లతో 23, కాగిసో రబాడా 1 సిక్స్, 1 ఫోర్‌తో 13 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. శ్రీలంక విజయం ఆశలకు తెరదించారు.

శ్రీలంక బౌలర్లలో వాణిందు హసరంగ 3 వికెట్లు పడగొట్టగా, దుష్మంత చమీరా 2 వికెట్లు తీశాడు.

శ్రీలంక ఓపెనర్ పథుమ్ నిసంక

ఫొటో సోర్స్, Alex Davidson/getty images

ఫొటో క్యాప్షన్, శ్రీలంక ఓపెనర్ పథుమ్ నిసంక

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 142 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.

ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు క్రీజులో నిలిచిన ఓపెనర్ పథుమ్ నిసంక జట్టు 142 పరుగులు చేయడంలో కీలకం అయ్యాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 8
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 8

58 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 72 పరుగులు చేసిన నిసంక 19వ ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు.

టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా మొదట ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక 20 పరుగులకే ఓపెనర్ కుశాల్ పెరీరా(7) వికెట్ కోల్పోయింది. అన్రిజ్ నార్ట్జే బౌలింగ్‌లో పెరీరా క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

అతడి స్థానంలో కాసేపు క్రీజులో నిలిచిన చరిత్ అసలంక(21) వేగంగా స్కోర్ పెంచే ప్రయత్నంలో అవుటయ్యాడు.

14 బంతుల్లో 1 సిక్స్ 2 ఫోర్లు కొట్టిన అసలంక సిక్స్ కొట్టిన 9వ ఓవర్లోనే రనౌట్ అయ్యాడు.

ఆ తర్వాత శ్రీలంక వెంటనే భానుక రాజపక్స వికెట్ కూడా కోల్పోయింది. పరుగులేమీ చేయని రాజపక్స తబ్రైజ్ వేసిన 10వ ఓవర్లో అతడికే క్యాచ్ ఇచ్చాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 9
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 9

వరసగా మూడు ఓవర్లలో మూడు వికెట్లు తీసిన షంసీ శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. షంసీ 12వ ఓవర్లో అవిష్క ఫెర్నాండో(3), 14వ ఓవర్లో వాణిందు హసరంగను(4)ను అవుట్ చేశాడు.

కెప్టెన్ డసున్ షనక కూడా 11 పరుగులకే పెవిలియన్ చేరడం, తర్వాత వచ్చిన చమిక కరుణరత్న కూడా 5 పరుగులకే డసెన్‌కు క్యాచ్ ఇవ్వడంతో స్కోర్ పెంచాల్సిన బాధ్యతంతా ఓపెనర్ నిసంక మీదే పడింది.

చివరికి 72 పరుగులు చేసిన నిసంక 19వ ఓవర్లో భారీ షాట్ కొట్టబోయి అవుటయ్యాడు. 17వ ఓవర్లో డసున్ షనక వికెట్ తీసిన ప్రిటోరియస్ 19వ ఓవర్లో 131 పరుగుల దగ్గర కరుణరత్న, నిసంకను వెంటవెంటనే అవుట్ చేశాడు.

తర్వాత అన్రిచ్ నార్ట్‌జే వేసిన చివరి ఓవర్లో స్కోర్ పెంచే క్రమంలో శ్రీలంక మిగతా రెండు వికెట్లు కూడా కోల్పోయింది.

ఐదో బంతికి దుష్మంత చమీరా(3) బౌల్డ్ కాగా, చివరి బంతికి లరిహు కుమార(0) రనౌట్ అయ్యాడు. మహీష్ తీక్షణ 7 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

దక్షిణాఫ్రికా బౌలర్లలో తబ్రైజ్ షంసీ, డ్వెయిన్ ప్రిటోరియస్ మూడేసి వికెట్లు పడగొట్టగా, అన్రిచ్ నార్ట్‌జే రెండు వికెట్లు తీశాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 10
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 10

వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్ ముందు మోకాళ్లపై కూర్చుని బ్లాక్ లైవ్ మాటర్స్‌ ఉద్యమానికి సంఘీభావం ప్రకటించలేనని చెప్పి కలకలం సృష్టించిన క్వింటన్ డికాక్, ఇవాళ శ్రీలంకతో జరిగే మ్యాచ్‌కు ముందు తన జట్టుతో కలిసి మోకాళ్లపై కూర్చున్నాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)