టీ20 వరల్డ్ కప్: 'మతం పేరుతో ఒక వ్యక్తిపై దాడి చేయడం అత్యంత నీచం' - విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, JEWEL SAMAD/AFP via Getty Images
మతం పేరుతో ఒక మనిషిపై దాడి చేయడమన్నది అత్యంత నీచమైన పని అని భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలోని 'వెన్నెముక లేని' కొందరు యూజర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత ఆదివారం నాడు పాకిస్తాన్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత్ ఓడిపోయిన తరువాత సోషల్ మీడియాలో భారత బౌలర్ మహమ్మద్ షమీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వారిని ఉద్దేశిస్తూ విరాట్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆరోజు పాకిస్తాన్‌తో మ్యాచ్ ముగియగానే క్రికెట్ అభిమానులు కొందరు ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు.
అక్టోబర్ 31 ఆదివారం మ్యాచ్‌కు ముందుగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విరాట్ మాట్లాడుతూ, "ఒక వ్యక్తి మీద మతం పేరుతో దాడి చేయడమన్నది నా దృష్టిలో అత్యంత బాధాకరమైన విషయం. ఎవరైనా దేని మీదైనా తమ అభిప్రాయాలు చెప్పవచ్చు. ఆ హక్కు వారికి ఉంటుంది. కానీ, ఒక వ్యక్తి మీద మతపరమైన వివక్ష చూపించడమనే ఆలోచన నాకు వ్యక్తిగతంగా ఎన్నడూ రాలేదు. మతం అన్నది ప్రతి మనిషికీ వ్యక్తిగతమైన పవిత్రమైన విషయం" అని విరాట్ అన్నారు.

ఫొటో సోర్స్, ANI
"మేం క్రికెట్ ఫీల్డులో ఏం చేస్తామన్న దానిపై అవగాహన లేకుండా ప్రజలు తమ నిస్పృహను అలా వెళ్లగక్కుతుంటారు. అలాంటి వారికి మహమ్మద్ షమీ భారత జట్టును ఎన్నో మ్యాచుల్లో గెలిపించాడన్న సంగతి తెలియదు" అన్నారు కోహ్లీ.
ఇంకా, " మ్యాచ్‌లో ప్రభావం చూపించే విషయానికి వస్తే జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు మహమ్మద్ షమీ మాకు కీలకమైన బౌలర్. అదేమీ తెలియకుండా, షమీకి భారతదేశంతో ఉన్న భావోద్వేగాల గురించి పట్టింపు లేకుండా మాట్లాడేవారి కోసం ఒక్క నిమిషం సమయం వృథా చేయడం కూడా నాకిష్టం లేదు" అని కూడా చెప్పిన విరాట్, అలాంటి వారు చేసే వ్యాఖ్యల వల్ల మా సోదరభావం ఏమాత్రం చెక్కుచెదరదన్నారు.
ఒక జట్టుగా సంఘటితంగా ఎలా ఉండాలో, శక్తియుక్తుల మీద ఎలా దృష్టి కేంద్రీకరించాలో తమకు తెలుసని చెప్పిన విరాట్, "భారత జట్టు ఓడిపోవడానికి వీల్లేదన్నట్లుగా కొందరు మాట్లాడుతుంటారు. అలాంటి మాటలతో మాకు పని లేదు. ఎందుకంటే, మేం ఒక ఆట ఆడుతున్నాం. ఆట ఎలా ఆడాలో మాకు తెలుసు" అని అన్నారు.
సూపర్-12లో భాగంగా అక్టోబర్ 31 ఆదివారం భారతజట్టు న్యూజీలాండ్‌తో తలపడుతుంది. పాకిస్తాన్ చేతిలో ఓడిపోయిన ఈ రెండు జట్లూ దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియంలో విజయం సాధించాలని ఆశిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- మళ్లీ కరోనా కలకలం: స్కూళ్లు, రెస్టారెంట్లు, షాపులు మూత.. లాక్డౌన్ ప్రకటించిన ప్రభుత్వం
- చంబల్ లోయలో 400 మంది బందిపోట్లను సుబ్బారావు ఎలా లొంగదీశారు?
- 'మెటా': ఫేస్‌బుక్ కంపెనీకి కొత్త పేరు.. జుకర్బర్గ్ నిర్ణయానికి కారణాలేంటి?
- కోవిడ్-19: మా అమ్మను డాక్టర్లు గినియా పిగ్లా భావించి ప్రయోగాలు చేశారు
- నీళ్లపైనే నగరాలు.. భవిష్యత్తు ఇదేనా? యూరప్ దేశాల్లో ఈ ప్రయోగాలు ఎందుకు జరుగుతున్నాయి?
- కశ్మీర్లో భయాందోళనల్లో హిందువులు.. శాంతి, భద్రతలపై ప్రభుత్వానివి ఉత్తి మాటలేనా?
- లిపులేఖ్ రోడ్డు విషయంలో భారత్ తీరుపై నేపాల్లో ఆగ్రహం ఎందుకు
- కాలాపానీ: నేపాల్ సరిహద్దులోని 35 చ.కి.మీ భూమి సమస్యను వాజ్పేయి నుంచి మోదీ వరకు ఎవ్వరూ ఎందుకు పరిష్కరించలేదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








