టీ20 వరల్డ్ కప్: అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ క్రికెటర్ ఆసిఫ్ బ్యాట్‌ను తుపాకీలా ఎందుకు పట్టుకున్నాడు? దానితో ధోనీకి సంబంధం ఏంటి?

ఫొటో సోర్స్, TWITTER/MASHRAFHAIDARI
అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పాక్ ఆటగాడు ఆసిఫ్ అలీ అద్భుత ప్రదర్శన కనబర్చడంతో గత రెండు రోజులుగా ప్రశంసలు అందుకుంటున్నాడు.
ఈ మ్యాచ్ చివరి క్షణాల్లో ఆసిఫ్ అలీ నాలుగు సిక్సర్లు బాది పాక్ జట్టుకు విజయాన్ని అందించాడు. అప్పటి నుంచి ట్విటర్‌లో ఆసిఫ్ ప్రదర్శనపై చర్చ కొనసాగుతోంది.
అయితే, శనివారం శ్రీలంకలోని అఫ్గానిస్తాన్ రాయబారి ఎం అష్రఫ్ హైదరీ.. ఆసిఫ్ అలీపై విమర్శలు గుప్పించారు. ఈ మ్యాచ్‌లో ఆసిఫ్ అలీ ఓ సందర్భంలో తన బ్యాట్‌ను తుపాకీలా పట్టుకున్నాడు.
‘‘పాకిస్తాన్ క్రికెటర్ ఆసిఫ్ అలీ అగౌరవపరిచే చర్యలతో దూకుడుగా వ్యవహరించాడు. అతడికి, అతడి సహచరులకు గట్టి పోటీనిచ్చిన అఫ్గాన్ ఆటగాళ్ల వైపు తన బ్యాట్‌ను తుపాకీలా ఎక్కుపెట్టాడు. అన్నింటికంటే క్రీడల్లో ఆరోగ్యకరమైన పోటీతో స్నేహం, శాంతి వెల్లువిరుస్తాయి. యుద్ధానికి సమయం వస్తుంది!’’ అని ఆసిఫ్ చర్యలను విమర్శిస్తూ, హైదరీ ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
''పాకిస్తాన్ ఓ టెర్రరిస్ట్ ఫ్యాక్టరీ. ఆసిఫ్ అలీ చర్యలు అవమానకరం'' అని మరో ట్విటర్ యూజర్ పరాయణ్ పయెజ్ పోస్ట్ పెట్టారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
అయితే, ఈ విమర్శలకు ముందు నుంచే ఆసిఫ్ అలీ బ్యాట్‌ను గన్‌లా పట్టుకున్న ఫోటో వైరల్ అవుతోంది. కానీ హైదరీ విమర్శల తర్వాత ఇది వివాదంగా మారింది.
ఆసిఫ్ అలీపై కొందరు విమర్శలు గుప్పించగా, మరికొందరు ఇవన్నీ అనవసరమైన విమర్శలు అంటూ కొట్టిపారేశారు.
జైపుర్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కూడా ఇదే తరహాలో బ్యాట్‌ను చూపించినట్టు పాకిస్తానీ వార్తాపత్రిక డాన్‌కు చెందిన స్పోర్ట్స్ జర్నలిస్ట్ అబ్దుల్ గఫార్ ఒక ఫోటోను పోస్ట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
"శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ధోనీ కూడా అలాగే చేశాడు. కానీ శ్రీలంక ప్రజలు తెలివైనవారు. మంచి స్ఫూర్తితో వారు క్రికెట్ ఆడతారు. క్రీడలను రాజకీయాలతో కలపొద్దు"అని అబ్దుల్ గఫార్ పోస్ట్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ధోనీ గన్‌షాట్ ఫోటోపై చర్చ
ఈ వివాదం తర్వాత, ఆసిఫ్ అలీ ఫోటోతోపాటూ ధోనీ పాత ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
2006లో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో సెంచరీ పూర్తి చేసిన తర్వాత ధోనీ ఇలానే బ్యాట్ పట్టుకున్నాడు.
అయితే ధోనీ కంటే ముందే ప్రపంచ దిగ్గజ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ కూడా ఇలాంటి పోజే ఇచ్చాడు.
ప్రస్తుతం రిచర్డ్స్ ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఆసిఫ్ అలీ బ్యాట్ అఫ్గాన్ ఆటగాళ్ల వైపు కాకుండా పెవిలియన్ వైపు ఉంది. ఈ విషయంలో రాజకీయాలు చేయొద్దని చాలా మంది హైదరీని ట్యాగ్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.
"అష్రఫ్ హైదరీ... మీరు ఆసిఫ్ అలీకి క్రెడిట్ ఇవ్వడానికి బదులుగా, ఆయన తీరును విమర్శిస్తున్నారు. ఆయన ఒక ఆటగాడు, సైనికుడు కాదు. మీరు ఆయనపై 'దూకుడు చర్య'లాంటి పదాలను ఉపయోగించారు. దయచేసి ఓటమిని చూసి ఏడ్చే బదులు.. అంగీకరించడం నేర్చుకోండి" అంటూ అజీజ్ ఖాన్ అనే వ్యక్తి ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
"ఆయన ఎంఎస్ ధోని స్టైల్‌ని అనుకరించాడు. అలీ పాకిస్తానీ డ్రెస్సింగ్ రూమ్ వైపు బ్యాట్ చూపుతున్నాడు. ఆ రాయబారిది చౌకబారు ఆలోచన" అని అబ్దుల్లా అనే మరో అనే వ్యక్తి పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
"మీకు రాయబారి అయ్యే అర్హత లేదనడానికి, మీ ట్వీట్‌లో వాడిన చివరి పదాలే నిదర్శనం" అని పాకిస్తానీ అడ్మినిస్ట్రేటర్ అయిన షహీర్ వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5

ఫొటో సోర్స్, Getty Images
వివాదాస్పదమైన పాక్ విలేకరి ప్రశ్న
ఈ మ్యాచ్‌లో ఇది రెండో వివాదం. ఓ పాకిస్తానీ జర్నలిస్టు.. అఫ్గాన్ కెప్టెన్ మొహమ్మద్ నబీను ఓ ప్రశ్న అడగడంతో మొదట వివాదం చెలరేగింది.
"ప్రభుత్వం మారింది, పరిస్థితులు మారాయి. మీరు తిరిగి అఫ్గాన్ వెళ్లాక, (ఎందుకు ఓడిపోయారని) మిమ్మల్ని అడుగుతారని ఏదైనా భయంగా ఉందా? కొత్త శకం ప్రారంభమైంది. పాకిస్తాన్‌తో సంబంధాలు బాగుంటే, అఫ్గానిస్తాన్ జట్టు మరింత బలపడుతుందని భావిస్తున్నారా?" అని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఒక పాకిస్తానీ జర్నలిస్ట్ నబీని అడిగారు.
ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు మొహమ్మద్ నబీ నిరాకరించాడు. ఇలాంటి ప్రశ్నలను వదిలేసి క్రికెట్ గురించి మాత్రమే మాట్లాడుకుందామా అని అన్నాడు.
"క్రికెట్ గురించి మాట్లాడగలిగితే మంచిది. వరల్డ్‌కప్ కోసం ఇక్కడికి వచ్చాం. పూర్తి సన్నద్ధతతో, పూర్తి నమ్మకంతో వచ్చాం. క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్నలుంటే మీరు అడగండి"అని సమాధానం ఇచ్చాడు.
పాకిస్తాన్‌తో సత్సంబంధాల వల్ల భవిష్యత్తులో అఫ్గానిస్తాన్ జట్టుకు ఎంతవరకు మేలు జరుగుతుందని పాక్ జర్నలిస్ట్ మళ్లీ అలాంటి ప్రశ్నే అడిగారు.
అయితే మొహమ్మద్ నబీ మళ్లీ ఇది క్రికెట్‌కు సంబంధంలేని ప్రశ్న అని చెప్పాడు. అనంతరం విలేకరుల సమావేశం ముగించుకుని వెళ్లిపోయాడు.
మీడియా సమావేశంలో చోటుచేసుకున్న ఈ తతంగంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఒక క్రికెటర్‌ను రాజకీయాల గురించి ప్రశ్నించడాన్ని పలువురు తప్పుబట్టారు. మహ్మద్ నబీ సమాధానాన్ని ప్రశంసించారు.
ఇవి కూడా చదవండి:
- టీ20 ప్రపంచకప్: పాకిస్తాన్ జర్నలిస్ట్ ‘ఘోరమైన ప్రశ్న’.. సమాధానం ఇవ్వడానికి నిరాకరించిన అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ మొహమ్మద్ నబీ
- ‘తాలిబాన్లు ఇంటింటికీ తిరిగి డబ్బు వసూలు చేస్తున్నారు, వితంతువులను చెరబడుతున్నారు’
- మెటా: ఫేస్‌బుక్ కొత్త పేరుపై ఎందుకు జోకులు పేలుతున్నాయి?
- పోలీసులు ఫోన్ తీసుకుని మన వాట్సాప్ చాట్ చెక్ చేయొచ్చా
- టీ20 వరల్డ్ కప్: జాస్ బట్లర్ మెరుపులు, ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ విజయం
- ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు: ఆర్థర్ రోడ్ జైలు అత్యంత ప్రమాదకరమని ఎందుకంటారు?
- కరోనావైరస్ ఎక్కడ పుట్టిందో తెలుసుకోవడం ఎప్పటికీ సాధ్యంకాకపోవచ్చు – అమెరికా నిఘా సంస్థలు
- టీ20 వరల్డ్ కప్: 'మతం పేరుతో ఒక వ్యక్తిపై దాడి చేయడం అత్యంత నీచం' - విరాట్ కోహ్లీ
- అప్గానిస్తాన్: తాలిబాన్లు ఐఎస్‌కు వ్యతిరేకంగా రహస్య యుద్ధం చేస్తున్నారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)