అఫ్గానిస్తాన్: కాబుల్ ఎయిర్‌పోర్ట్ దారిలో భారతీయులు ఎక్కడ చిక్కుకున్నారు?

ఫొటో సోర్స్, Ravinder Singh Robin
- రచయిత, రవీందర్ సింగ్ రాబిన్
- హోదా, బీబీసీ కోసం
అఫ్గానిస్తాన్‌లో చిక్కుకున్న భారతీయులను విడిపించేందుకు భారత విదేశాంగ శాఖ ప్రయత్నిస్తోంది. అక్కడ చిక్కుకున్న అఫ్గాన్ హిందువులు, సిక్కులను కూడా కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
‘‘మేం కాబుల్‌లోని భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతం కాబుల్ విమానాశ్రయం అమెరికా బలగాల ఆధీనంలో ఉంది. బయట పెద్దయెత్తున తాలిబాన్లు మోహరించి ఉన్నారు’’ అని విదేశాంగ శాఖ సీనియర్ అధికారి తెలిపారు.
కాబుల్ విమానాశ్రయంలోకి ప్రవేశించేందుకు వేల మంది ప్రయత్నిస్తున్నారని అక్కడున్న వారు చెబుతున్నారు. అయితే, కొద్ది మంది మాత్రమే లోపలకు వెళ్లగలుగుతున్నారని చెబుతున్నారు. తమ పౌరులను విమానాశ్రయానికి తీసుకు వచ్చేందుకు భారత్ కూడా ప్రయత్నిస్తోంది.

ఫొటో సోర్స్, Ravinder Singh Robin
‘‘అధికారులు లేరు’’
కాబుల్ విమానాశ్రయానికి సమీపంలో చిక్కుకున్న భారతీయుల్లో ఒకరు బీబీసీతో ఫోన్‌లో మాట్లాడారు.
‘‘మమ్మల్ని విమానాశ్రయంలోకి తీసుకెళ్లేందుకు రెండు రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి’’.
‘‘ఇక్కడ భారత అధికారులు ఎవరూ లేరు. మమ్మల్ని కాంట్రాక్టర్లే తీసుకుని వస్తున్నారు’’అని ఆయన వివరించారు.
‘‘గత రెండు రోజులుగా మమ్మల్ని విమానాశ్రయానికి సమీపంలోని ఓ కల్యాణ మండపంలో ఉంచారు. అయితే, ఈ రోజు ఉదయం మాతో ఉన్న కో-ఆర్డినేటర్‌ను తాలిబాన్లు తీసుకెళ్లారు’’అని మరో వ్యక్తి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
అఫ్గాన్ హిందువులను వేరు చేశారు..
ఈ బృందానికి కో-ఆర్డినేటర్‌గా పనిచేస్తున్న భారతీయుడు జుహైబ్ కూడా బీబీసీతో మాట్లాడారు. ‘‘మా బస్సుల్లోకి ఇద్దరు తాలిబాన్లు ఎక్కారు. వారు అఫ్గాన్ హిందువులు, సిక్కులను.. భారతీయుల నుంచి వేరుచేశారు. భయంతో కొందరు అఫ్గాన్ సిక్కులు, హిందువులు దగ్గర్లోని గురుద్వారాకు వెళ్లిపోయారు’’అని ఆయన వివరించారు.
‘‘తాలిబాన్లు మా డాక్యుమెంట్లను పరిశీలించారు. ఆ తర్వాత దగ్గర్లోని ఓ ఫ్యాక్టరీకి మమ్మల్ని తరలించారు. అక్కడే మేమంతా కూర్చుని ఉన్నాం.’’
‘‘మమ్మల్ని త్వరలో కాబుల్ విమానాశ్రయానికి పంపించే అవకాశముంది. భారతీయుల్లోని కొందరిని తాలిబాన్లు ప్రశ్నించారు. కొందరి మొబైల్ ఫోన్లను బద్దలు కొట్టారు’’అని జుహైబ్ వివరించారు.
‘‘అఫ్గాన్ పౌరులను బస్సుల్లోనే కూర్చొబెట్టారు. మేం రాత్రి పది గంటల నుంచి ఇక్కడే ఉన్నాం’’అని అఫ్గానీ సిక్కు అనార్కలీ కౌర్ బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Ani
విదేశాంగ శాఖ ఏం చెబుతోంది?
ఈ వార్తలను ఇప్పుడే తాము ధ్రువీకరించలేమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్ బాగ్చీ బీబీసీతో చెప్పారు.
మరోవైపు భారతీయులను తాలిబాన్లు కిడ్నాప్ చేశారనే వార్తలు కూడా అఫ్గాన్ మీడియాలో వస్తున్నాయి.
అయితే, భారతీయులను కిడ్నాప్ చేశామనే వార్తలను తాలిబాన్లు ఖండిస్తున్నారు.
‘‘మేం ఎవరినీ కిడ్నాప్ చేయలేదు. వారిని ఎయిర్‌పోర్ట్‌కు తరలిస్తున్నాం’’అని తాలిబాన్ అధికార ప్రతినిధి అమనుల్లా వాసిక్ ఓ ప్రకటన విడుదల చేశారు.
ఇవి కూడా చదవండి:
- ఇంటింటినీ జల్లెడ పడుతున్న తాలిబాన్లు.. భారత కాన్సులేట్లలోనూ సోదాలు
- హుజూరాబాద్: ఉప ఎన్నికలకు ముందు ప్రభుత్వం భారీ సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం సబబేనా?
- ఓబీసీ బిల్లు: 127వ రాజ్యాంగ సవరణతో ఎవరికి లాభం, కులాలకా, పార్టీలకా?
- ఈ ఆర్థిక సంక్షోభం 'రాజకీయ-సామాజిక సంక్షోభం'గా మారనుందా
- అప్పుల ఊబిలో కూరుకుపోతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు - అభిప్రాయం
- ఏనుగుల ప్రాణాలు తీస్తున్న చర్మం వ్యాపారం, ఆసియాలో పెరుగుతున్న దారుణం
- నీరజ్ చోప్రా: ఒలింపిక్ గోల్డ్ గెలిచిన భారత అథ్లెట్ కెరీర్లో 5 కీలక మలుపులు
- పాకిస్తాన్లో ప్రధానమంత్రి నివాసాన్ని అద్దెకు ఇవ్వబోతున్నారా, ఇది నిజమేనా?
- కరోనా కాలంలో భారత ‘వ్యాక్సిన్ కింగ్’ ఆస్తి 25 శాతం వృద్ధి
- అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్ధాల కేసు.. ఆ పోలీస్ అధికారి చుట్టూ ఎందుకు తిరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)









