గవర్నర్ అవినీతి పరుడన్న మమతా బెనర్జీ...పరువు నష్టం దావా వేయబోనన్న ధన్‌ఖడ్- Newsreel

ఫొటో సోర్స్, SANJAY DAS/BBC
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ రాష్ట్ర గవర్నర్ జగ్‌దీప్ ధన్‌ఖడ్‌పై సోమవారం నాడు తీవ్రమైన ఆరోపణలు చేశారు.
గవర్నర్ ధన్‌ఖడ్ తీవ్ర అవినీతి పరుడని, ఆయన పేరు జైన్ హవాలా కుంభకోణం ఛార్జిషీట్‌లో ఉందని అన్నారు. ఆయనను తొలగించాల్సిందిగా కోరుతూ తాను ఇప్పటికే మూడుసార్లు కేంద్రానికి లేఖ రాసినట్లు మమతా పేర్కొన్నారు. అయితే, మమతా విమర్శలను గవర్నర్ ఖండించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఉత్తర బెంగాల్ ప్రాంతపు పర్యటనకు వెళ్లిన గవర్నర్ మధ్యాహ్నం కోల్‌కతాకు తిరిగి వచ్చిన వెంటనే గూర్ఖాలాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ (జీటీఏ) సంస్థలో తీవ్ర అవినీతి జరిగిందని, దీనిపై వెంటనే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తో దర్యాప్తు జరిపించాలని అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
గవర్నర్ ఈ ఆరోపణలు చేసిన వెంటనే మమతా బెనర్జీ మీడియా సమావేశం నిర్వహించి గవర్నర్‌పై విమర్శలు కురిపించారు. '' గవర్నర్ అవినీతి పరుడు. మూడు దశాబ్దాల నాటి జైన్ హవాలా కేసు ఛార్జిషీట్‌లో ఆయన పేరు ఉంది. తన పేరు తొలగించాల్సిందిగా ఆయన కోర్టుకు వెళ్లారు. ఇప్పటికి కూడా ఆ కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది'' అని మమతా బెనర్జీ అన్నారు.
అయితే, మమతా బెనర్జీ లాంటి సీనియర్ నాయకురాలు ఇలా నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదని గవర్నర్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ అన్నారు. తన పేరు హవాలా కేసులో ఎప్పుడూ లేదని ఆయన స్పష్టం చేశారు.
అవినీతి ఆరోపణలు చేసినందుకు మీరు మమతా బెనర్జీపై పరువు నష్ట దావా వేస్తారా అని విలేఖరులు ఆయన్ను అడిగినప్పుడు, ''భారతీయ సంస్కృతిలో ఒక చెల్లి మీద అన్న చర్యలు తీసుకున్నట్లు ఎక్కడా లేదు. నేను అలాంటి పనులు చేయను. కానీ, ఆమె అలా ఎందుకు మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదు'' అని అన్నట్లు ఏఎన్ఐ వెల్లడించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3

ఫొటో సోర్స్, TWITTER/ANI
ఆర్థిక రంగానికి ఊతమిచ్చేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయాలివే
రెండవ దశ కోవిడ్‌తో కుంగిన దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ నిర్ణయాలను వెల్లడించారు.
మొత్తం 8 ఆర్థిక ఉపశమన చర్యలను ప్రకటించారు. అందులో నాలుగు పూర్తిగా కొత్తవి కాగా, ఒక్కటి మాత్రం వైద్య మౌలిక సదుపాయాలకు సంబంధించినదని తెలిపారు.
వైద్య రంగానికి రూ.50వేల కోట్లు, కోవిడ్ ప్రభావిత రంగాలకు రూ.1.1 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
చిన్నారుల వైద్యం, ఆసుపత్రుల్లో బెడ్స్ కోసం రూ.23,220 కోట్లను కేటాయించనున్నట్లు మంత్రులు చెప్పారు.
ఈ పథకాల కింద జారీ చేసే రుణాలకు 3 సంవత్సరాల వ్యవధి, రిజర్వు బ్యాంకు నిర్ణయించిన వడ్డీ కంటే 2 శాతం తక్కువ వడ్డీ ఉంటుందని తెలిపారు.
ఆత్మనిర్భర్ భారత్ రోజ్ గార్ యోజన పథకాన్ని జూన్ 30 2021 నుంచి మార్చి 31, 2022 వరకు పొడిగిస్తున్నట్లు వివరించారు.
ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 80,000 సంస్థలకు చెందిన 21.4 లక్షల మందికి పైగా లబ్ది పొందినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.
పర్యటక రంగానికి కూడా ఊతం ఇచ్చేందుకు ట్రావెల్ ఏజెన్సీలకు వర్కింగ్ క్యాపిటల్ కింద 10 లక్షల వరకు, టూరిస్ట్ గైడ్‌లకు లక్ష వరకు వ్యక్తిగత రుణం ఇస్తామని అన్నారు.
అంతర్జాతీయ ప్రయాణాలు మొదలు కాగానే భారతదేశానికి వచ్చే తొలి 5 లక్షల పర్యటకులకు ఉచిత టూరిస్ట్ వీసాలు ఇస్తామని తెలిపారు. ఈ పథకం మార్చి 31, 2022 వరకు అమలులో ఉండి, ఒక్కసారి మాత్రమే వినియోగించుకునే వీలుంటుందని ఆర్థిక మంత్రి చెప్పారు.
గ్రామ పంచాయితీలకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ ఏర్పాటు చేసే కార్యక్రమానికి అదనంగా రూ.19,041 కోట్ల నిధులు అందిస్తామని వివరించారు.
పసిపిల్లలు, చిన్నారుల వైద్యం మీద ప్రత్యేక దృష్టి పెడుతూ ప్రజారోగ్యం కోసం రూ.23,220 కోట్లు వెచ్చించనున్నట్లు సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు.
ఇందులో భాగంగా, వైద్య విద్యార్థులు, నర్సులు, వైద్య రంగంలో మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు కూడా ప్రణాళికలు చేస్తామని చెప్పారు. ఈ మొత్తాన్ని ఈ ఒక్క సంవత్సరంలోనే వెచ్చిస్తామని ప్రకటించారు.
పేదలకు ఉచితంగా సరఫరా చేసిన నిత్యావసర సరుకుల కోసం ఈ ఏడాది రూ.93,869 కోట్లను ఖర్చు పెట్టనున్నట్లు వెల్లడించారు.

ఫొటో సోర్స్, Getty Images
జమ్మూలో అర్ధరాత్రి డ్రోన్‌ల కలకలం- పేల్చేసిన సైన్యం
ఆదివారం అర్ధరాత్రి సమయంలో జమ్మూలో రెండు ప్రాంతాలలో డ్రోన్‌ల కదలికలను గుర్తించినట్లు భారత సైన్యం వెల్లడించింది. కాల్పులు జరిపి ఆ రెండు డ్రోన్లను పేల్చివేశామని కూడా సైన్యం పేర్కొంది.
రత్నుచక్-కలుచక్ మిలిటరీ ఏరియాలో ఈ డ్రోన్లు సంచరించాయని సైన్యం తెలిపింది. వెంటనే భద్రతా దళాలను అలర్ట్ చేశామని ఆర్మీ ప్రతినిధి కల్నల్ దేవేందర్ ఆనంద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఆదివారం తెల్లవారుజామున జమ్మూ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ టెక్నికల్ ఏరియాలో రెండు పేలుళ్లు సంభవించిన విషయం తెలిసిందే. ఈ దాడి జరిగి 24 గంటలు గడవక ముందే మరోసారి డ్రోన్‌లు కనిపించడం కలకలం సృష్టించింది.
ఆదివారం ఉదయం జరిగినవి తక్కువ తీవ్రతగల పేలుళ్లని, వీటివల్ల ఎటువంటి నష్టం జరగలేదని భారత సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది.
ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద జరిగిన పేలుళ్లు తీవ్రవాదుల చర్యేనని జమ్ముకశ్మీర్ డీజీపీ దిల్‌బాగ్ సింగ్ పేర్కొన్నారు. ఈ పేలుళ్లకు కారణమైన పదార్ధాలను డ్రోన్ల ద్వారా జార విడిచి ఉంటారని సైన్యం అనుమానిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
డ్రోన్లతో ఇదే మొదటి దాడి?
జమ్మూకశ్మీర్‌లో ఆదివారం నాటి దాడులను మొదటిసారి డ్రోన్లతో జరిపిన దాడులుగా పలు మీడియా సంస్థలు రిపోర్ట్ చేశాయి. అయితే, దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాల్సి ఉంది.
''ఈ దాడిలో రెండు డ్రోన్‌లను ఉపయోగించారు. ఇందులో అత్యాధునిక పేలుడు పదార్థాలు అమర్చారు'' అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది.
ఆదివారం నాటి పేలుళ్ల ఘటనపై ఎన్ఐఏ, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్‌జీ)లకు చెందిన బాంబ్ డేటా సెంటర్‌ల నుంచి ఒక్కో బృందం పరిశోధన జరుపుతోంది.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎస్‌పీఓ కుమార్తె మృతి
మరోవైపు జమ్ముకశ్మీర్ ప్రత్యేక పోలీసు అధికారి (ఎస్‌పీఓ) ఫయాజ్ అహ్మద్, ఆయన కుటుంబంపై ఆదివారం నాడు ఉగ్రవాదులు కాల్పులు జరిపిన ఘటనలో ఫయాజ్ అక్కడికక్కడే మృతి చెందగా, అదే రోజు ఆయన భార్య ఆసుపత్రిలో మరణించారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కూతురు కూడా సోమవారం మృతి చెందినట్టు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇరాక్, సిరియాలలో ఇరాన్ మద్దతు గల మిలీషియా స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు
ఇరాక్, సిరియాలలో ఇరాన్ మద్దతుతో కార్యకలాపాలు సాగిస్తున్న మిలీషియాపై వైమానిక దాడులు చేసినట్లు అమెరికా ప్రకటించింది.
ఆ మిలీషియాకు చెందిన ఆయుధాగారాలు, కార్యక్షేత్రాలు లక్ష్యంగా దాడులు చేసినట్లు పెంటగాన్ ఒక ప్రకటనలో తెలిపింది.
అమెరికా బలగాలపై మిలీషియా చేసిన డ్రోన్ దాడులకు ప్రతిగా ఈ వైమానిక దాడులు చేసినట్లు అమెరికా ఆ ప్రకటనలో చెప్పింది.
బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఇరాన్ మద్దతున్న మిలీషియా స్థావరాలపై వైమానిక దాడులు చేయడం ఇది రెండో సారి.
ఇరాక్‌లో ఉన్న అమెరికా సేనలపై ఇటీవల కాలంలో చాలాసార్లు డ్రోన్ దాడులు జరిగాయి. అయితే, ఆ దాడులకు తమకు సంబంధం లేదని ఇరాన్ చెప్పుకొస్తోంది.

ఫొటో సోర్స్, Reuters
ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌తో అంతర్జాతీయ సంకీర్ణం చేస్తున్న యుద్ధంలో భాగంగా ఇరాక్‌లో సుమారు 2,500 మంది అమెరికా సైనికులు పోరాడుతున్నారు.
సిరియాలో రెండు, ఇరాక్‌లో ఒక స్థావరంపై దాడులు చేసినట్లు పెంటగాన్ ప్రకటనలో ఉంది.
ఇరాన్ మద్దతు ఉన్న కతయిబ్ హెజ్బుల్లా, కతయిబ్ సయ్యిద్ అల్ సుహాదా గ్రూపులు ఈ స్థావరాలను ఉపయోగిస్తున్నాయని అమెరికా చెప్పింది.
కతయిబ్ హెజ్బుల్లాను అమెరికా 2009 నుంచి ఉగ్రవాద గ్రూపుగా పరిగణిస్తోంది. ఇరాక్‌లో శాంతి, సుస్థిరతలకు ఈ గ్రూపు భంగం కలిగిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది.
అయితే, తాజా దాడుల్లో ఎవరైనా చనిపోయారా, గాయపడ్డారా అనే విషయాలు పెంటగాన్ ప్రకటనలో లేవు.
కానీ సిరియాలో మిలీషియాకు చెందిన అయిదుగురు సాయుధులు చనిపోయారని.. ఎంతోమంది గాయపడ్డారని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్‌ని ఉటంకిస్తూ ఏఎఫ్‌పీ న్యూస్ ఏజెన్సీ చెప్పింది.
మరోవైపు సిరియా వార్తా ఏజెన్సీలు ఒక చిన్నారి చనిపోయినట్లు చెబుతున్నాయి.
2003లో అమెరికా.. ఇరాక్‌లో సద్దాం హుస్సేన్‌ను గద్దె దించిన తరువాత ఇరాక్ అంతర్జాతీయ వ్యవహారాలపై ఇరాన్ ప్రభావం పెరిగిపోయింది.
ఇవి కూడా చదవండి:
- పోలవరం ముందుకు వెళ్తోందా, లేదా? అప్పటి నుంచి ఇప్పటికి పురోగతి ఉందా?
- గౌతమ్ అదానీ కంపెనీల షేర్లు ఎందుకు కుప్పకూలాయి.. కంపెనీ ఏం చెబుతోంది..
- ద గేట్స్ ఆఫ్ హెల్: ఎడారిలో అగ్ని బిలం.. దశాబ్దాలుగా మండుతూనే ఉంది
- బెంజమిన్ నెతన్యాహు: ఈ ఇజ్రాయెల్ రాజకీయ మాంత్రికుడు ప్రపంచానికి ఎలా గుర్తుండి పోతారు
- మిజోరాం: 38 మంది భార్యలు.. 89 మంది పిల్లలు.. ‘ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబ పెద్ద’ ఇకలేరు
- పాకిస్తాన్లో మహిళల లోదుస్తులు అమ్మడం ఎందుకంత కష్టం?
- ప్రధాని పదవి నుంచి తప్పుకున్న బెంజమిన్ నెతన్యాహూ, ఇజ్రాయెల్ కొత్త ప్రధాని నాఫ్తాలి బెన్నెట్
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్: ఏడాది గడిచినా వీడని డెత్ మిస్టరీ
- ఉత్తరాఖండ్ జల ప్రళయం: ''సొరంగంలో 7 గంటలు ప్రాణాలను అరచేత పెట్టుకుని గడిపాం''
- భారత్‌లో కోవిడ్ సంక్షోభం మోదీ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసిందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









