మమతా బెనర్జీ: నందిగ్రామ్‌లో తనపై దాడి జరిగిందన్న దీదీ.. అంతా ఎన్నికల గిమ్మిక్కన్న విపక్షాలు

ఫొటో సోర్స్, @ABHISHEKAITC
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. నందిగ్రామ్‌లో నామినేషన్ వేసిన అనంతరం తనపై దాడి జరిగిందని ఆరోపించారు. తన వెంట పోలీసులు లేనపుడు నలుగురు, ఐదుగురు పురుషులు తనను నెట్టివేశారని ఆమె చెప్పారు.
ఆమె ప్రస్తుతం కోల్‌కతాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే.. మమతా బెనర్జీ డ్రామా ఆడుతున్నారని, ఎన్నికల్లో సానుభూతి కోసం ఇలా చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం ఆరోపించాయి.
పశ్చిమ బెంగాల్ శాసనసభకు ఎన్నికలు జరుగుతుండటంతో మమత బుధవారం నాడు ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లాలోని నందిగ్రాం నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు.
ఆలయం నుంచి తిరిగి కారు దగ్గరకు వస్తుండగా.. కొందరు పురుషులు తనను నెట్టివేశారని, కారు డోరును కూడా వారు గట్టిగా తోయటంతో తన కాలు డోరులో చిక్కుకుందని.. మోకాలు, మడమలకు గాయాలయ్యాయని ఆమె చెప్పారు.
మమత బుధవారం రాత్రి నందిగ్రామ్‌లోనే ఉంటారని భావించారు. కానీ ఆమె కోల్‌కతా తిరిగి వెళ్లాలని నిర్ణయించుకోవటంతో ఆమెను నేరుగా రాష్ట్ర రాజధానిలో ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేస్తున్నారు.
ఆమెకు వైద్యం చేస్తున్న డాక్టర్లు.. మమత ఎడమ కాలుకి, మడమ ఎముకకి తీవ్ర గాయాలయ్యాయని.. ఆమె కుడి భుజానికి, కుడి చేయికి, మెడకు కూడా గాయాలయ్యాయని చెప్పారు.

ఫొటో సోర్స్, Ani
''ముఖ్యమంత్రిని 48 గంటల పాటు వైద్య పరిశీలనలో ఉంచుతున్నాం. మరిన్ని వైద్య పరీక్షలు చేయాల్సిన అవసరముంది. అవి చేసిన తర్వాత తదుపరి చికిత్సను నిర్ణయిస్తాం'' అని కోల్‌కతాలోని ఎస్ఎస్‌కేఎం ప్రభుత్వ ఆస్పత్రిలో సీనియర్ వైద్యుడు ఎం.బందోపాధ్యాయ ఒక ప్రకటన విడుదల చేశారు.
నందిగ్రామ్‌లో జరిగినట్లు చెప్తున్న దాడి అనంతరం.. మమతా బెనర్జీ తనకు ఛాతీ నొప్పిగా ఉందని, శ్వాస తీసుకోవటం కష్టంగా ఉందని చెప్పారని.. దీంతో ఆమెను నిరంతర వైద్య పర్యవేక్షణలో ఉంచాలని నిర్ణయించామని ఆయన పేర్కొన్నారు.
ఆమెకు స్వల్పంగా జ్వరం ఉందన్నారు. బాంగూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూరోసైన్సెస్‌లో ఎంఆర్ఐ చేయించిన అనంతరం ఎస్ఎస్‌కేఎం హాస్పిటల్‌లో ప్రత్యేక వార్డుకు మార్చినట్లు తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
మమతా బెనర్జీకి వైద్యం చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసింది. వారిలో కార్డియాలజిస్ట్, ఎండోక్రినాలజిస్ట్, సర్జన్, ఆర్థోపెడిస్ట్, ఫిజీషియన్‌లు ఉన్నారు.
కోల్‌కతాలోని ఆస్పత్రిలో మమతను పరామర్శించటానికి రాష్ట్ర గవర్నర్ జగ్‌దీప్ ధాంకర్ కూడా వచ్చారు. అయితే.. గవర్నర్ 'గో బ్యాక్' అంటూ తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు.
ముఖ్యమంత్రిని తాను పరామర్శించానని.. ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, భద్రతా విభాగం డైరెక్టర్‌ను పిలిపించి మాట్లాడానని ట్వీట్ చేశారు. అవసరమైన చర్యలన్నీ చేపట్టాలని ఆస్పత్రి డైరెక్టర్, ఆరోగ్య శాఖ కార్యదర్శికి చెప్పినట్లు తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
మమత బుధవారం రాత్రి నందిగ్రామ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ''ఇది ఒక కుట్ర. ఆ సమయంలో నన్ను రక్షించటానికి ప్రభుత్వ సిబ్బంది ఎవరూ అక్కడ లేరు. వారు నన్ను నిజంగా గాయపరచటానికి వచ్చారు'' అని ఆమె తెలిపారు.
ఆమె ఒక వీడియోలో తన కాలును చూపుతూ.. ''చూడండి.. ఎంతగా వాచిందో'' అని చెప్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
అయితే.. తనపై దాడికి కుట్ర జరిగిందంటూ మమత ఆరోపించటం ఓ గిమ్మిక్కని ప్రతిపక్షం కొట్టివేసింది. ఆమెకు గల జడ్ ప్లస్ సెక్యూరిటీ వలయంలోకి బయటివారు ఎలా ప్రవేశించారని ప్రశ్నించింది.
ఈ వంకతో సానుభూతి సృష్టించటానికి మమత ప్రయత్నిస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అర్జున్ సింగ్ విమర్శించారు.
మమత చర్యలు రాజకీయ హిపోక్రసీ అని కాంగ్రెస్, సీపీఎం అభివర్ణించాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
''నందిగ్రామ్‌లో ఇబ్బందులు తప్పవని గుర్తించిన మమత.. ఎన్నికలకు ముందు ఈ గిమ్మిక్కు ప్రణాళిక రచించారు. ఆమె ముఖ్యమంత్రి కావటంతో పాటు పోలీసు శాఖ మంత్రి కూడా. పోలీసు మంత్రితో పాటు పోలీసులు లేరంటే మీరు నమ్మగలరా?'' అని కాంగ్రెస్ ఎంపీ ఆధిర్ రంజన్ చౌదరి వ్యాఖ్యానించారు.
అదేసమయంలో.. ''ఇదంతా ఒక డ్రామా అనేది పూర్తిగా స్పష్టం'' అని సీపీఎం నేత మొహమ్మద్ సలీం ట్వీట్ చేశారు.
ఇదిలావుంటే.. మమతా బెనర్జీ మీద దాడిని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా ఖండించారు. దీనికి బాధ్యులైన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలన్నారు. మమత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- మహాశివరాత్రి: పురుష లింగాకారానికి పూజలు చేసే అరుదైన ఆలయం.. గుడిమల్లం
- సిద్దిక్ కప్పన్: రేప్ కేసు రిపోర్ట్ చేయడానికి ప్రయత్నించినందుకు జైల్లో పెట్టి 'హింసిస్తున్నారు'
- No Smoking Day: ‘పొగంగేట్రం’ నుంచి ఉపసంహారం దాకా... ‘నేను స్మోకింగ్ ఎలా మానేశానంటే’
- ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన మృతుల ఖననానికి మారుమూల దీవిని ఎంపిక చేసిన శ్రీలంక
- కొండ బారిడి: తుపాకులు గర్జించిన నేలలో ఇప్పుడు సేంద్రియ వ్యవసాయ విప్లవం
- కరోనా వైరస్ వ్యాక్సీన్ కోసం నమోదు: కోవిన్ యాప్, వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ఇలా.. ఏఏ ధ్రువపత్రాలు కావాలంటే
- హాథ్రస్: కూతురిని వేధించారని కేసు పెట్టినందుకు తండ్రిని కాల్చి చంపేశారు
- కరోనావైరస్: ఇండియాలో మళ్లీ పాజిటివ్ కేసులు పెరుగుతుండడానికి కారణమేమిటి.. మరో వేవ్ మొదలైందా
- ఇథియోపియా టిగ్రే సంక్షోభం: బీబీసీ విలేకరిని నిర్బంధించిన సైన్యం
- కృత్రిమ గర్భధారణ ఖర్చులు భరించలేక ఫేస్బుక్లో వీర్యదాతలను ఆశ్రయిస్తున్నారు... ఆరోగ్యం ఏమవుతుంది?
- భారతదేశంలోని ‘అస్థిపంజరాల సరస్సు’.. అంతు చిక్కని రహస్యాల నిలయంయాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









