ప్రధాని పదవి నుంచి తప్పుకున్న బెంజమిన్ నెతన్యాహూ, ఇజ్రాయెల్ కొత్త ప్రధాని నాఫ్తాలి బెన్నెట్

ఫొటో సోర్స్, REUTERS
గత 12 సంవత్సరాలుగా పాలన సాగించిన బెంజమిన్ నెతన్యాహూ ఇజ్రాయెల్ ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు.
ఇజ్రాయెల్ ప్రజలు కొత్త సంకీర్ణ ప్రభుత్వానికి ఓటు వేయడంతో నాఫ్తాలి బెన్నెట్ ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యారు.
ఈసారి ప్రధాని పదవికి గట్టి పోటీ ఎదురయిందనే చెప్పాలి. నెతన్యాహూకు 59 మంది ప్రతినిధుల మద్దతు లభించగా, ప్రతిపక్ష కూటమికి 60 మంది ప్రతినిధులు ఓటు వేశారు.
ఒక్క ఓటు తేడాతో నెతన్యాహూ 12 ఏళ్ల పాటూ కొనసాగించిన ప్రధాని పదవికి స్వస్తి చెప్పాల్సి వచ్చింది.
కొత్త ప్రధాని నాఫ్తాలి బెన్నెట్ 2023 సెప్టెంబర్ వరకు పదవిలో కొనసాగుతారు. ఆ తర్వాత యెష్ అతీద్ నాయకుడు యెయిర్ లాపిడ్‌కు అధికారాన్ని అప్పగిస్తారు. లాపిడ్ మరో మరో రెండేళ్లపాటు పాలన కొనసాగిస్తారు.
నెతన్యాహూ ప్రధాని పదవి నుంచి వైదొలిగినప్పటికీ, మితవాద పార్టీ లికుడ్‌కు అధ్యక్షుడిగా కొనసాగుతూ పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా వ్యవహరిస్తారు.
నెతన్యాహూ సుదీర్ఘ కాలం పాటూ ఇజ్రాయెల్‌లో ప్రభుత్వం నడిపారు. ఐదుసార్లు ప్రధానిగా ఎన్నికయ్యారు.
1996 నుంచి 1999 వరకు ఆయన తొలిసారి ప్రధానిగా ప్రభుత్వాన్ని నడిపించారు. ఆ తరువాత 2009 నుంచి 2021 వరకు ప్రధానిగా వ్యవహరించారు.
ఈసారి ఎన్నికల్లో ఎనిమిది పార్టీలతో ఏర్పడిన సంకీర్ణ కూటమికి మెజారిటీ లభించడంతో నెతన్యాహూ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత "మేము మళ్లీ వస్తాం" అంటూ నెతన్యాహూ సెలవు తీసుకున్నారు.
కొత్త ప్రధాని బెన్నెట్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

ఫొటో సోర్స్, AFP
ఇజ్రాయెల్‌లో కొత్త ప్రభుత్వం
మితవాద యమినా పార్టీకి చెందిన నాయకుడు నాఫ్తాలి బెన్నెట్ ఇజ్రాయెల్ కొత్త ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఆయన సొంత పార్టీ నుంచి ఆరుగురు ఎంపీలు మాత్రమే ఉన్నారు. కాని, కూటమి ఆయనను తమ నాయకుడిగా ఎన్నుకుంది.
నెతన్యాహూతో లేదా ప్రతిపక్ష నాయకుడు సెంట్రిస్ట్ యెయిర్ లాపిడ్‌తో ప్రధాని పదవిని పంచుకోవాలనే ప్రతిపాదన నాఫ్తాలికి వచ్చింది.
సైద్ధాంతిక స్థాయిలో విభేదాలు ఉన్నప్పటికీ ఆయన, యెయిర్ లాపిడ్‌తోనే కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
రెండూ పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం నాఫ్తాలి బెన్నెట్ 2023 వరకు ప్రధానిగా వ్యవహరిస్తారు. ఆ తరువాత రెండేళ్లు యెయిర్ లాపిడ్ ప్రధానిగా కొనసాగుతారు.
49 ఏళ్ల నాఫ్తాలి నెతన్యాహూకు విధేయుడిగా ఉండేవారు. ఆయనతో విడిపోక ముందు 2006 నుంచి 2008 వరకు నాఫ్తాలి ఇజ్రాయెల్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా వ్యవహరించారు.
2019 వరకు ప్రతి సంకీర్ణ పార్టీ నుంచి నాఫ్తాలి మంత్రిగా ఎన్నికయ్యారు. ఈ ఏడాది ఆయన పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు.
11 నెలల తరువాత మళ్లీ ఎన్నికలు జరిగాయి. అందులో ప్రతిపక్ష పార్టీ అధినేతగా నాఫ్తాలి మళ్లీ పార్లమెంట్ చేరుకున్నారు.
నెతన్యాహూ కన్నా నాఫ్తాలిని అతివాద జాతీయవాదిగా పరిగణిస్తారు. ఇజ్రాయెల్ యూదుల దేశంగా మాత్రమే ఉండాలని నాఫ్తాలి భావిస్తారు.
వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలెం, సిరియన్ గోలన్ హైట్స్ కూడా యూదు దేశంలో భాగమని ఆయన విశ్వసిస్తారు.
ఇటీవల ఇజ్రాయెల్, పాలస్తీనియన్లకు మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడడం ఆ దేశ రాజకీయాలకు కీలకం కానుంది.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్ వ్యాక్సీన్: భారత్‌లో టీకా కార్యక్రమం అభివృద్ధి చెందిన దేశాల కన్నా వేగంగా జరుగుతోందన్న మోదీ మాటల్లో నిజమెంత?
- ఇజ్రాయెల్ ఎలా ఏర్పడింది, పాలస్తీనా రెండు భూభాగాలుగా ఎందుకుంది... వందేళ్ల ఈ సంక్షోభానికి ముగింపు లేదా?
- ఇజ్రాయెల్ విమానాన్ని హైజాక్ చేసిన పాలస్తీనా మహిళ లైలా ఖాలిద్
- శత్రువు తమపై ప్రయోగించిన మిసైళ్ల శకలాలతోనే రాకెట్లు తయారుచేస్తున్న మిలిటెంట్ గ్రూప్ కథ
- శ్రీలంక: సముద్రంలోకి విషం చిమ్మిన ఎక్స్‌ప్రెస్ పెర్ల్
- ఎల్జీబీటీ: స్వలింగ సంపర్కానికి చరిత్ర ఉందా...దానిని భావితరాలకు అందించాలన్న డిమాండ్ ఎందుకు వినిపిస్తోంది?
- కేరళ: కుటుంబ సభ్యులకు తెలియకుండా పదకొండేళ్ల పాటు ప్రియురాలిని ఇంట్లోనే దాచిన ప్రియుడు
- కోవిడ్-19 వ్యాక్సీన్: రాష్ట్రాల దగ్గర లేదు...కానీ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎలా దొరుకుతోంది?
- జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్, వారన్ బఫెట్.. అందరూ పన్ను ఎగవేతదారులేనా
- కోవిడ్ వ్యాక్సీన్ మూడో డోసు కూడా అవసరమా? - డాక్టర్స్ డైరీ
- కరోనా కాలంలో మోదీ ప్రభుత్వం సామాన్యుల జేబును భద్రంగా చూసుకుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








