ఇజ్రాయెల్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఐక్యమైన ప్రతిపక్షాలు

సంకీర్ణ పార్టీల మధ్య ఒప్పందం కుదిరిన తర్వాత రైట్ వింగ్ పార్టీ నాయకుడు నఫ్తాలి బెన్నెట్, ఎష్ అతిద్ పార్టీ నాయకుడు యైర్ లాపిడ్

ఫొటో సోర్స్, Yesh Atid handout

ఫొటో క్యాప్షన్, సంకీర్ణ పార్టీల మధ్య ఒప్పందం కుదిరిన తర్వాత రైట్ వింగ్ పార్టీ నాయకుడు నఫ్తాలి బెన్నెట్, ఎష్ అతిద్ పార్టీ నాయకుడు యైర్ లాపిడ్

ఇజ్రాయెల్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 8 ప్రతిపక్ష పార్టీలు కలిసి ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీంతో 12సంవత్సరాల పాటు ఇజ్రాయెల్ ప్రధానిగా ఉన్న బెంజమిన్ నెతన్యాహు పాలన ముగుస్తుంది. 8 పార్టీలతో కలిసి సంకీర్ణం ఏర్పాటైనట్లు ఎష్ అతిద్ పార్టీ నాయకుడు ప్రకటించారు.

రైట్ వింగ్ యమీనా పార్టీ నాయకుడు నఫ్తాలి బెన్నెట్ తొలుత ప్రధాని పదవిని స్వీకరిస్తారు. రొటేషన్ పద్ధతిలో పదవి బదలీ జరుగుతుంది. ఆయన పదవీ కాలం ముగిసిన తర్వాత లాపిడ్ అధికారంలోకి వస్తారు. అయితే, ఈ సంకీర్ణం ప్రమాదకరమైనదని నెతన్యాహు అన్నారు.

ఎన్నికల ద్వారా గెలిచిన సభ్యులు ఈ సంకీర్ణాన్ని వ్యతిరేకించాలని ఇజ్రాయెల్ పార్లమెంట్ (నెస్సెట్) సభ్యులను నెతన్యాహు కోరారు.

సంకీర్ణ ప్రభుత్వం అధికారం చేపట్టడానికి ముందు పార్లమెంటులో మెజారిటీ ఓటు సంపాదించాలి. అయితే ఈ వోటింగ్ ఇప్పట్లో జరిగే అవకాశం కనిపించటం లేదు. కొత్తగా ఏర్పాటైన సంకీర్ణంలో అభ్యర్థులు ఈ ఒప్పందం నుంచి వైదొలిగే అవకాశం కూడా కనిపిస్తోంది.

ప్రతిపక్షాలు కుదుర్చుకున్న ఒప్పందం గురించి ఇజ్రాయెల్ అధ్యక్షుడు ర్యూవెన్ రివ్‌లిన్‌కి తెలియచేసినట్లు లాపిడ్ ఒక ప్రకటనలో తెలిపారు. "ఈ ప్రభుత్వానికి ఓటు వేసినా, వేయకపోయినా తమ ప్రభుత్వం ఇజ్రాయెల్ పౌరుల సేవలోనే గడుపుతుందని ఆయన స్పష్టం చేశారు.

ప్రతిపక్షాలను గౌరవించి ఇజ్రాయెల్ సమాజంలో అన్ని వర్గాలను ఐక్యం చేసేందుకు తమ అధికారాన్ని వినియోగించుకుంటామని లాపిడ్ పేర్కొన్నారు.

ప్రతిపక్షాల మధ్య ఒప్పందం కుదరటం అసాధ్యం అని భావించారు. ప్రతిపక్ష నాయకులు లాపిడ్, బెన్నెట్, అరబ్ ఇస్లామిస్ట్ రామ్ పార్టీ నాయకుడు మన్సూర్ అబ్బాస్ కలిసి ఒప్పందం పై సంతకం చేస్తున్న ఫొటో ఇజ్రాయెల్ మీడియాలో ప్రచురితమయింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

Presentational white space

ఇజ్రాయెలీ అరబ్ పార్టీ సంకీర్ణంలో చేరడం దశాబ్దాల తర్వాత ఇది మొదటిసారి.

అయితే, పాలస్తీనాను రాజ్యంగా వ్యతిరేకించే బెన్నెట్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తామని ఇజ్రాయెలీ అరబ్బులకు ప్రాతినిధ్యం వహించే ఇతర పార్టీలు చెబుతున్నాయి. వీరు జనాభాలో 20 శాతం ఉంటారని ఏఎఫ్‌పి వార్తా సంస్థ వెల్లడించింది.

"ఈ ఒప్పందంలో చాలా వివాదాలు ఉన్నాయి. ఇది చాలా కష్టతరమైన నిర్ణయం. కానీ, ఈ అగ్రిమెంట్ కుదరడం చాలా ముఖ్యం. అరబ్ సమాజానికి ఉపయోగపడే చాలా అంశాలు ఈ ఒప్పందంలో ఉన్నాయి" అని అబ్బాస్ విలేఖరులకు చెప్పారు.

line

విశ్లేషణ: జెరేమి బ్రౌన్

మిడిల్ ఈస్ట్ ఎడిటర్

అధికారంలో ఉండటానికి బెంజమిన్ నెతన్యాహుకి ఉన్న పట్టుదల, దయలేని తనం, సంకల్ప బలం గురించి ఏ రాజకీయ శత్రువూ తక్కువ అంచనా వేయలేరు.

కొత్త ప్రధాన మంత్రితో కూడిన కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకూ దానిని అడ్డుకునేందుకు చేయగలిగిన ప్రయత్నాలన్నీ ఆయన చేస్తారు. ఒకవేళ నెతన్యాహు ప్రతిపక్షంలో ఉంటే సంకీర్ణాన్ని అస్థిరం చేయడానికి అవసరమైన చర్యలన్నీ చేపడతారు.

నెతన్యాహును పదవిలోంచి తప్పించాలనే కోరికే ప్రతిపక్షాలను ఐక్యం చేసింది. అయితే, ఇజ్రాయెల్‌లో కొత్తగా ప్రతిపాదించిన ప్రభుత్వాన్ని "ఈ శతాబ్దపు మోసం" అని నెతన్యాహు అభివర్ణించారు. అది ఇజ్రాయెల్‌ను, ప్రజలను, సైనికులను ప్రమాదంలోకి నెట్టేస్తుందని అన్నారు.

ఆయన ఎంత గట్టిగా అరిచినా కూడా ఆయన పదవిని వీడక తప్పేలా లేదు. ఆయన ఓటమి కేవలం లెఫ్ట్ వింగ్‌ పైనే కాకుండా, రైట్ వింగ్‌లో ఉన్న అసమ్మతి వర్గాల పై కూడా ఆధారపడి ఉంది.

కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వం నుంచి కొత్త ప్రణాళికలను ఏమీ ఆశించడానికి లేదు. తీవ్రమైన అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న నెతన్యాహూ పతనం జెరూసలెం కోర్టులో మొదలవుతుందని ఆయన వ్యతిరేకులు భావిస్తున్నారు.

line

అధ్యక్షునికి రాసిన లేఖలో, బెన్నెట్‌తో పాటు తాను కూడా నాయకత్వం వహిస్తానని లాపిడ్ తెలిపారు. ఆయన పదవి ఆగస్టు 27, 2023 నుంచి మొదలవుతుంది.

విశ్వాస పరీక్ష కోసం పార్లమెంటును సమావేశపరచాలని రివ్‌లిన్‌‌ను కోరారు. 120 సభ్యులున్న పార్లమెంటులో మెజారిటీని సాధించలేని పక్షంలో ఇజ్రాయెల్‌లో మరోసారి ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎన్నికలు జరిగితే రెండేళ్లలో ఐదవ సారి ఎన్నికలకు వెళ్ళినట్లవుతుంది.

కొత్తగా ఏర్పడిన సంకీర్ణం అత్యంత ప్రమాదకరమైందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, బెంజమిన్ నెతన్యాహు

సంకీర్ణంలో ఉన్న పార్టీలు:

  • ఎష్ అతిద్ (మధ్యేవాద పార్టీ) యైర్ లాపిడ్ (17 స్థానాలు)
  • కాషోల్ లవన్ (మధ్యేవాద పార్టీ) బెన్నీ గాంట్జ్ (8 స్థానాలు)
  • ఇజ్రాయెల్ బిటీను (సెంటర్ - రైట్ వింగ్ ) అవిగ్డోర్ లీబర్ మన్ (7 స్థానాలు)
  • లేబర్ (సోషల్ - డెమోక్రటిక్ ) మెరావ్ మైకేలి (7 స్థానాలు)
  • యమీనా (రైట్ వింగ్ - సోషల్ - డెమోక్రటిక్) నిట్ జన్ హోరో విట్జ్ (6 స్థానాలు)
  • రామ్ (అరబ్ ఇస్లామిస్ట్) మన్సూర్ అబ్బాస్ (4 స్థానాలు)

పార్లమెంటులో మెజారిటీ సాధించడానికి మొత్తం 61 మంది సభ్యుల మద్దతు ఉండాలి. అయితే, సంకీర్ణం మెజారిటీ సాధిస్తుందా లేదా అనే విషయాల పై పలు అనుమానాలు ఉన్నాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

మార్చిలో ఇజ్రాయెల్‌లో జరిగిన ఎన్నికల్లో నెతన్యాహు అధ్యక్షత వహించిన రైట్ వింగ్ లికుడ్ పార్టీ అత్యధిక స్థానాలను గెలిచింది.

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆయనకు అవకాశం లభించింది. కానీ, ఆయన సంకీర్ణాన్ని ఏర్పాటు చేయలేక పోయారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)