గౌతమ్ అదానీ కంపెనీల షేర్లు ఎందుకు కుప్పకూలాయి.. కంపెనీ ఏం చెబుతోంది..

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో రెండో అతిపెద్ద వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి చెందిన సంస్థల షేర్లు సోమవారం భారీగా పతనం అయ్యాయి.
ఐదు సంస్థల్లో ఉదయం మొదలైన ఈ షేర్ల పతనం సాయంత్రం వరకు కొనసాగింది. మొత్తంగా 5 నుంచి 25 శాతం వరకు పతనం నమోదైంది.
అదానీ గ్రీన్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ గ్యాస్, అదానీ పవర్ షేర్లలో 5 శాతం వరకు పతనం కనిపించింది. అదానీ ఎంటర్‌ప్రైసెస్‌లో 20 శాతం తగ్గుదల కనిపించింది.
అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ సంస్థలో 19 శాతం వరకు పతనం నమోదైంది. అయితే కొద్దిసేపటి తర్వాత ఈ షేర్లు రికవరీ అయ్యాయి.
అదానీ కంపెనీల షేర్ల పతనంతో ఒక గంటలోనే 73వేల కోట్ల సంపద ఆవిరైందని ఎకనమిక్ టైమ్స్ పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
ఎందుకు పతనం అయ్యాయి?
అదానీ సంస్థలో పెట్టుబడులు పెట్టే మూడు ఫారెన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టిమెంట్ (ఎఫ్‌పీఐ) ఖాతాలను స్తంభింప చేసినట్లు వార్తలు రావడంతో అదానీ షేర్లు ఒక్కసారిగా పతనం అయ్యాయి.
అల్బులా ఇన్వెస్టిమెంట్ ఫండ్, క్రెస్టా ఫండ్, ఏపీఎంఎస్ ఇన్వెస్టిమెంట్ ఫండ్‌ల ఖాతాలను నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ స్తంభింపజేసినట్లు వార్తలు వచ్చాయి.
ఈ మూడు సంస్థలు అదానీకి చెందిన నాలుగు సంస్థల్లో భారీగా పెట్టుబడులు పెట్టాయి. వీటి ఖాతాలను స్తంభింపజేస్తే అదానీ షేర్ల క్రయవిక్రయాలకు వీలుకాదు.

ఫొటో సోర్స్, Getty Images
ఆ వార్తల్లో నిజం లేదు
అయితే, ఈ మూడు సంస్థల ఖాతాలను స్తంభింప చేస్తున్నారన్న వార్తల్లో నిజంలేదని, అవన్నీ అసత్య వార్తలని అదానీ ఎంటర్‌ప్రైజెస్ తెలిపింది.
‘‘ఈ వార్తల్లో ఎలాంటి నిజమూ లేదు. పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించడానికి ఇలాంటి తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారు’’ అని ప్రకటనలో పేర్కొన్నారు.
‘‘దీని వల్ల కోలుకోలేని ఆర్థిక నష్టం జరుగుతోంది’’
‘‘ఈ వార్తల నేపథ్యంలో మేం రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్‌ఫర్ ఏజెంట్‌కు మెయిల్ పెట్టాం. ఆ మూడు సంస్థల డీమ్యాట్ ఖాతాలు స్తంభించిపోయాయా? అని అడిగాం. దీనిపై జూన్ 14న మాకు ప్రత్యుత్తరం వచ్చింది’’
‘‘విదేశీ నిధులకు చెందిన ఆ డిమ్యాట్ ఖాతాలను స్తంభింపజేయలేదని ఆ మెయిల్‌లో పేర్కొన్నారు’’
ఈ ఏడాది ఆరంభం నుంచి శుక్రవారం వరకు అదానీ షేర్ల విలువ పెరుగుతూ వచ్చింది. మొత్తంగా ఆయన ఆస్తుల్లో 40 బిలియన్ డాలర్ల పెరుగుదల కనిపించింది. దీంతో దేశంలో రెండో అతిపెద్ద వ్యాపారవేత్తగా ఆయన మారారు.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్ వ్యాక్సీన్: భారత్‌లో టీకా కార్యక్రమం అభివృద్ధి చెందిన దేశాల కన్నా వేగంగా జరుగుతోందన్న మోదీ మాటల్లో నిజమెంత?
- ఇజ్రాయెల్ ఎలా ఏర్పడింది, పాలస్తీనా రెండు భూభాగాలుగా ఎందుకుంది... వందేళ్ల ఈ సంక్షోభానికి ముగింపు లేదా?
- ఇజ్రాయెల్ విమానాన్ని హైజాక్ చేసిన పాలస్తీనా మహిళ లైలా ఖాలిద్
- శత్రువు తమపై ప్రయోగించిన మిసైళ్ల శకలాలతోనే రాకెట్లు తయారుచేస్తున్న మిలిటెంట్ గ్రూప్ కథ
- శ్రీలంక: సముద్రంలోకి విషం చిమ్మిన ఎక్స్‌ప్రెస్ పెర్ల్
- ఎల్జీబీటీ: స్వలింగ సంపర్కానికి చరిత్ర ఉందా...దానిని భావితరాలకు అందించాలన్న డిమాండ్ ఎందుకు వినిపిస్తోంది?
- కేరళ: కుటుంబ సభ్యులకు తెలియకుండా పదకొండేళ్ల పాటు ప్రియురాలిని ఇంట్లోనే దాచిన ప్రియుడు
- కోవిడ్-19 వ్యాక్సీన్: రాష్ట్రాల దగ్గర లేదు...కానీ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎలా దొరుకుతోంది?
- జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్, వారన్ బఫెట్.. అందరూ పన్ను ఎగవేతదారులేనా
- కోవిడ్ వ్యాక్సీన్ మూడో డోసు కూడా అవసరమా? - డాక్టర్స్ డైరీ
- కరోనా కాలంలో మోదీ ప్రభుత్వం సామాన్యుల జేబును భద్రంగా చూసుకుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








