భారత్, చైనా: నిధుల లోటు వల్లే ఇండియా విదేశాంగ విధానం చైనా కంటే బలహీనపడిందా

ఫొటో సోర్స్, DIPTENDU DUTTA/AFP VIA GETTY IMAGES
- రచయిత, జుగల్ పురోహిత్
- హోదా, బీబీసీ ప్రతినిధి
దక్షిణ హిందూ మహాసముద్రంలో వాతావరణం అనుకూలించకపోయినా 55 రోజులు ఒంటరిగా ప్రయాణించిన ఒక యుద్ధ నౌక ఆహార పదార్థాలు, మందులు పంపిణీ చేస్తోంది.
ఒక్క మాటలో చెప్పాలంటే ఇది భారత్ నౌక ఐఎన్ఎస్ కేసరి కథ.
భారత ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్ సాగర్’లో భాగంగా ఐఎన్ఎస్ కేసరి మాల్దీవులు, మారిషస్, కోమరోజ్ ద్వీపం, సీషెల్స్ ద్వీపాల్లో కోవిడ్ సహాయ సామగ్రిని చేర్చడంలో బిజీగా ఉంది.
మహమ్మారి మొదలైన సమయంలో మే 6 నుంచి జూన్ 28 మధ్య భారత నావికాదళం ప్రారంభించిన ఈ ప్రయత్నాలకు వార్తల్లో పెద్దగా చోటు దొరకలేదు.
“ఈ ఆపరేషన్ హిందూ మహాసముద్రంలో పొరుగు దేశాలతో కలిసి పనిచేయాలనే భారత్ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఈ ప్రయత్నం చాలా భారీగా అనిపించవచ్చు, దీనికి సమయం చాలా కీలకం. కానీ, ఇది కొత్తదేం కాద”ని భారత రక్షణ శాఖ చెప్పింది.
నేను మాట్లాడినవారిలో చాలా మంది విశ్లేషకులు భారత్ ఎప్పటిలాగే తన పొరుగు దేశాలకు ప్రాధాన్యం ఇస్తుందని చెబుతున్నారు.
ఆగస్టులో 21వ తేదీ వరకు భారత విదేశాంగ శాఖ మొత్తం 25 పత్రికా ప్రకటనలు జారీ చేసింది. వాటిలో తొమ్మిది ప్రకటనలు భారత్, దాని పొరుగుదేశాల మధ్య సంబంధాలకు సంబంధించినవి.
జులైలో భారత్ 31 పత్రికా ప్రకటనలు జారీ చేసింది. ఇందులో నాలుగు పొరుగు దేశాల గురించే ఉన్నాయి. మరోవైపు జూన్‌లో జారీ చేసిన 36 ప్రకటనల్లో రెండు మాత్రమే పొరుగు దేశాలకు సంబంధించినవి. గత రెండు నెలలుగా ఈ ప్రకటనలను విశ్లేషిస్తే ఈ సంఖ్య ఎక్కువగా ఉంటుంది.
కానీ, పొరుగు దేశాలతో భారత్ సంబంధాలను కొలవడానికి ఉన్న ఒకే ఏకైక కొలమానం పత్రికా ప్రకటనలు మాత్రమేనా? దీనికి ‘కాదు’ అనే సమాధానం వస్తుంది.

ఫొటో సోర్స్, DESHAKALYAN CHOWDHURY/AFP VIA GETTY IMAGES
ఈ ప్రకటనలు ఏం చెబుతున్నాయి
ఆగస్టు 18: భారత్ విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ సింఘలా భారత్ బయట తన మొదటి పర్యటనకు వెళ్లారు. ఢాకా వెళ్లిన ఆయన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో భద్రత, ఉమ్మడి ప్రయోజనాలపై చర్చించారని భారత జాతీయ చానెల్ డీడీ న్యూస్ చెప్పింది.
ఆగస్టు 15: నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. భారత్-నేపాల్ మధ్య సరిహద్దు వివాదాలపై రెండు దేశాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న సమయంలో ఈ కాల్ వచ్చింది.
భారత్ తనను అధికారం నుంచి తప్పించాలని ప్రయత్నిస్తోందని కూడా నేపాల్ ప్రధాని అంతకు ముందు ఆరోపించారు.
ఆగస్టు 13: భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ మాల్దీవుల్లో అతిపెద్ద సివిలియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో పెట్టుబడులు పెడతున్నట్లు ప్రకటించారు.
మాల్దీవులకు భారత్ ఆర్థిక ప్యాకేజ్ ఇస్తోందన్నారు. అందులో 10 కోట్ల అమెరికా డాలర్ల గ్రాంట్, 40 కోట్ల అమెరికా డాలర్ల రుణం ఉంది.
వీటితోపాటూ మాల్దీవుల నుంచి విమాన సేవల కోసం ఎయిర్ బబుల్ ఏర్పాటు చేస్తామని, సరకు రవాణా ఫెర్రీ సేవలూ ప్రారంభిస్తామని భారత్ ప్రకటించింది.
ఆగస్టు 6: ఎన్నికల్లో విజయం సాధించినందుకు శ్రీలంక ప్రధాని మహింద రాజపక్సేకు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
ఆగస్టు 3: ఈద్ ఉల్–అజహా సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ అఫ్గానిస్తాన్ ప్రధాని అష్రఫ్ గనీతో మాట్లాడారు. ప్రాంతీయ భద్రత, ఉమ్మడి ప్రయోజనాలు, మిగతా అంశాలపైనా ఇద్దరు నేతలు చర్చించారు.

ఫొటో సోర్స్, MOHD ARHAAN ARCHER/AFP VIA GETTY IMAGES
చైనాపై నిఘా అవసరం
భారత్-చైనా మధ్య సరిహద్దు దగ్గర ఏర్పడిన ఉద్రిక్తతల వల్లే పైన వివరించిన పరిణామాలు ఏర్పడ్డాయా? లేక కరోనా మహమ్మారి వల్ల భారత్ హఠాత్తుగా తన పొరుగు దేశాలను జాగ్రత్తగా చూసుకోవడం ప్రారంభించిందా? లేదంటే దీని వెనుక వేరే ఏదైనా ఉందా?
ఈ ప్రశ్నలపై విశ్లేషకుల అభిప్రాయం ఒకేలా ఉంది. హఠాత్తుగా పొరుగు దేశాలపై మొదలైన ఈ హై ప్రొఫైల్- సయోధ్యకు ఏం కారణం అయ్యుంటుంది..
సమాధానంగా “ఈ ఘటనా క్రమాలను విడివిడిగా కాకుండా, ఒక పెద్ద చిత్రంలో భాగంగా చూడాల్సి ఉంటుంది. ఈ ప్రాంతంలో మనం ఒక్కరమే లేమనేది చాలా స్పష్టంగా ఉంది. మరో ఆటగాడు చాలా వేగంగా దూసుకెళ్తున్నాడు. మనం అతడిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి” అని మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఒక అధికారి అన్నారు.
“ఇది అసాధారణ సంవత్సరం. బహుశా మే తర్వాత పరిస్థితుల్లో వేగం అందుకుంది. ఇప్పుడు హఠాత్తుగా మనం ఒకే దానిపై దృష్టి పెడుతున్నట్టు అనిపిస్తోంది. ఇది ప్రభుత్వం పనిచేయాలని ఆలోచించే ఒక అంశం. ఇప్పుడు పరిస్థితులు మెల్లమెల్లగా కాస్త వేగం అందుకున్నాయి. అవి ఏ స్థాయిలో ఉండాలో ఆ పాటర్న్ లోనే ఉంటున్నాయి” అని మాజీ దౌత్యవేత్త గౌతమ్ బంబావాలే అన్నారు.
ఇప్పుడు చైనా మనసులో ఏం ఉంది అని మేం బంబావాలేను అడిగాం.
దానికి ఆయన “కోవిడ్-19 మహమ్మారి చైనాను ముందు కంటే దూకుడుగా మార్చింది. ఇప్పుడు చైనా చర్యలు తీసుకుంటోంది. దక్షిణ అమెరికా, ఆప్రికా, ప్రపంచంలోని మిగతా ప్రాంతాల్లో అది ఏం చేస్తోందో, ఇప్పుడు దక్షిణాసియాలోనూ అదే చేస్తోంది. ఎక్కడ కాస్త ఖాళీ కనిపించినా, దాన్ని భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తోంది. అఫ్గానిస్తాన్ విషయమే తీసుకుంటే, అక్కడ అమెరికా ఉనికి తగ్గగానే, చైనా ఎక్కువ యాక్టివ్ అవుతోంది. చైనా గత నెలలో నాలుగు దేశాలతో సమావేశం నిర్వహించింది. అందులో నేపాల్, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ ఉన్నాయి. చైనా క్రియాశీలతలో మనకు బయట చిన్న భాగం మాత్రమే కనిపిస్తోంది.
బీబీసీ మానిటరింగ్‌లో పనిచేసే ఉపాసనా భట్ చైనా ఇటీవలి చర్యలపై మాట్లాడారు.
“దక్షిణాసియాలో భారత్ అతిపెద్ద ప్రత్యర్థి చైనా. అందుకే ఇక్కడ అది ఏం చేస్తోందో ఒక కన్నేసి ఉంచడం భారత్‌కు చాలా ముఖ్యం. భారత-చైనా సరిహద్దుల్లో గత కొన్ని రోజులుగా చెప్పుకోదగ్గ కార్యకలాపాలేవీ జరగలేదు. కానీ భారత్ చుట్టూ ఉన్న దేశాలవైపు చైనా తన చేయి చాస్తోంది” అన్నారు.
నేపాల్‌లో ఇటీవల జరిగింది ఆసక్తికరం. చైనా రాయబారి హువా యాన్‌కీ నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీలో ఏర్పడిన సంక్షోభాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించారు. అది అందరూ చూశారు. బంగ్లాదేశ్‌ను కూడా తమవైపు లాగేయాలని చైనా ప్రయత్నిస్తోంది. ద హిందూ పత్రిక ఒక రిపోర్టులో “తీస్తా నదిపై ప్రాజెక్ట్ నిర్మించేందుకు చైనా బంగ్లాదేశ్‌కు బిలియన్ డాలర్ల సాయం అందించబోతోందని చెప్పింద”ని ఉపాసన తెలిపారు.
భారత్-బంగ్లాదేశ్ మధ్య ముందు నుంచే నదీ-వివాదాలపై చర్చలు జరుగుతున్నాయి. శ్రీలంకలో రాజపక్సే సోదరులు మళ్లీ అధికారంలోకి వచ్చారు. మహింద రాజపక్సే అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఆయనకు చైనాతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. పాకిస్తాన్, చైనా ఎప్పుడూ కలిసే ఉంటున్నాయి.
భారత్ ఎలాంటి ఎత్తుగడలు వేయాలి
వరల్డ్ బ్యాంక్ లెక్కల ప్రకారం 2019 చివర్లో చైనా జీడీపీ 14.34 ట్రిలియన్ డాలర్లు. దానితో పోలిస్తే భారత జీడీపీ 2.87 ట్రిలియన్ డాలర్లే ఉంది.
“చైనా దగ్గరున్నన్ని నిధులు తమ దగ్గర లేవని భారత్‌కు తెలుసు, అలాంటప్పుడు భారత్ ఏం చేయాలి. తన శక్తులను ఎక్కువగా ఉపయోగించాలి. అది మన చుట్టుపక్కల ప్రత్యేక ఆధిపత్యాన్ని అందిస్తుంది. మరింత క్రియాశీలతను, సామర్థ్యాన్ని ఇస్తుంది. ఇక్కడ సామర్థ్యం అంటే ప్రణాళికలు అమలు చేయడమే కాదు, మన మొత్తం వైఖరి పూర్తిగా నైపుణ్యంతో ఉండడం” అంటారు బంబావాలే
“నేపాల్‌తో మ్యాప్ వివాదం విషయానికి వస్తే, నేపాల్ కొత్త మ్యాప్ ప్రచురించినప్పటికీ, ఆ విషయం ఇక్కడ మన వరకూ చేరలేదు” అన్నారు.
ప్రాంతీయ ప్రాజెక్టుల కోసం బయట ఉన్న శక్తులకు భారత్ సహకరించే ఇటీవలి విధానాలపై బంబావాలే మాట్లాడారు. కొలంబోలో ఓడరేవు నిర్మించేందుకు భారత్-జపాన్ మధ్య సహకారం గురించి ఉదాహరణగా చెప్పారు.
ప్రాజెక్టులన్నీ ఆలస్యమే
“చైనా షరతులపై ఆందోళన వ్యక్తం చేయడం లేదంటే, చైనాతో సంబంధాలను తగ్గించుకున్న చాలా దేశాలను మనం చూశాం. కానీ చాలా దేశాలు పెట్టుబడుల ఆకలితో ఉన్నాయి. భారత్ చురుగ్గా వ్యవహరించి ఆ దేశాలకు రుణాలు అందించి మంచి పనిచేసింది. కానీ పథకాన్ని అమలు చేయడంలో, ఫలితాలు రాబట్టడంలో వెనకబడింది” అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక ప్రభుత్వ అధికారి చెప్పారు.
“మన అన్ని ప్రాజెక్టులూ ఆలస్యంగా నడుస్తున్నాయి. అవి పూర్తయినప్పటికీ ఇంకా చాలా చేయడం మిగిలే ఉంటుంది. భారత తన పనితీరును మెరుగుపరచడానికి బలమైన పర్యవేక్షణ వ్యవస్థను అభివృద్ధి చేస్తోందనే విషయం మాకు అర్థమవుతోంది” అన్నారు.
మాంద్యం
“భారత్ దౌత్యానికి చాలా వనరుల అవసరం ఉందని ఒక్కొక్కరుగా విదేశాంగ కార్యదర్శులందరూ చెబుతూనే వస్తున్నారు. ఇందులో దౌత్యవేత్తల సంఖ్య, వారికి ఇచ్చే శిక్షణ కూడా ఉంటుంది. భారత్ తన పాత్రను సమర్థంగా పోషించాలంటే అది కూడా అవసరం” అని మాజీ దౌత్యవేత్త, భారత విదేశాంగ కార్యదర్శి శ్యాం శరణ్ అన్నారు.
2018 మార్చిలో కేంద్ర కేబినెట్ 18 దేశాల్లో భారత కొత్త మిషన్ల ఏర్పాటుకు అనుమతించింది. వాటిలో తొమ్మిదింటిని ఇప్పుడే ప్రారంభించారు.
భారత్ కొత్త మిషన్లు ప్రారంభిస్తోంది. ఇంతకు ముందు అసలు ఉనికి లేని దేశాలకు భారత్ తమ దౌత్యవేత్తలను పంపిస్తోంది. అయితే, ఇప్పటికీ భారత రెసిడెంట్ మిషన్ లేనివి ప్రపంచంలో 60 దేశాలు ఉన్నాయి.
ఇప్పుడు ఎక్కువ వనరులు పొందే విషయాన్ని పక్కనపెడితే, భారత్ దౌత్యంలో కనీస ఖర్చులో పని నడిపించడం నేర్చుకోవాల్సి వస్తోంది. ఎందుకంటే, విదేశాంగ మంత్రిత్వ శాఖ బడ్జెట్ క్రమంగా తగ్గుతూ వస్తోంది.
నిధుల లేమి
“పొరుగు దేశాలకు సాంకేతిక, ఆర్థిక సహకారం కోసం కేటాయించే ఫండ్‌లో కమిటీకి లోటు కనిపించింది. బంగ్లాదేశ్‌కు, నేపాల్‌కు సాయం మినహాయించి దక్షిణాసియా దేశాలకు సాయం అందించే నిధుల్లో కోత విధించారు. చైనా ఉనికి పెరగడం చూస్తుంటే పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది”.
“భూటాన్, మాల్దీవులు, మయన్మార్, శ్రీలంక, ఆఫ్రికా దేశాలు, చుట్టుపక్కల మిగతా అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారత్ తన సాయం తగ్గించింది.
“భారత ప్రభుత్వం మొత్తం బడ్జెట్‌తో పోలిస్తే, విదేశాంగ శాఖ కోసం 20-21లో ఇచ్చిన భాగం గత మూడేళ్లలో అతితక్కువ”.
విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ ముందు సమర్పించిన అంశాల్లో ఇవి కొన్ని మాత్రమే. వీటిని 2020 మార్చి 3న రాజ్యసభలో ప్రవేశపెట్టారు.
భారత ఎంపీలు విదేశాంగ శాఖ బడ్జెట్ పెంచాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. కానీ “ఈ సమస్య లోతైనది, పెద్దది” అని బంబావలే చెబుతున్నారు.
“విదేశాంగ శాఖకు బడ్జెట్ తగ్గిపోతుండడం చూసి నాకు ఆశ్చర్యంగ లేదు. అలా చేయడం వల్ల భారత్‌కు తన పొరుగు దేశాలకు సాయం చేయగలిగే వాస్తవిక సామర్థ్యం కూడా తగ్గిపోతోంది. నిజానికి ఇది భారత జీడీపీ వృద్ధికి సంబంధించినది. మనం నిజానికి దాని గురించి ఆలోచించాలి. చాలా ఏళ్లుగా పొరుగు దేశాలకు భారత్ వల్ల దక్కిన లాభం ఏంటంటే, అభివృద్ధి చెందుతున్న భారత్ నుంచి అవి కూడా ప్రయోజనం పొందాయి. ఇప్పుడు దీనికి మనం బయట కాదు, మన లోపల చూడాలి. కోవిడ్ మహమ్మారికి ముందే మొదలైన ఆ ఆర్థిక మందగమనాన్ని ఆపాలి” అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: బ్రెజిల్లో లక్ష దాటిన కోవిడ్ మరణాలు... భారత్ కూడా అలాంటి తప్పులే చేస్తోందా?
- ఇంటి పనులు చేయడం లేదా? అయితే ఇది చదవండి!
- మహిళల ఆరోగ్యం: ఇంటిపని చేయడం వ్యాయామం కిందకు వస్తుందా?
- 'మోదీజీ, మా ఆయన ఇంటి పనిలో సాయం చేయడం లేదు, మీరైనా చెప్పండి...'
- కరోనావైరస్: వర్క్ ఫ్రమ్ హోమ్ బాటలో కంపెనీలు.. ఇంటి నుంచి ఒంటరిగా పనిచేయటం ఎలా?
- వంట చేశాడు... ఇల్లు ఊడ్చాడు... హింసించే భర్త మనిషిగా మారాడు
- ప్రపంచంలోనే అత్యంత చల్లని కంప్యూటర్... ఇది శత్రు విమానాల్ని అటాక్ చేస్తుందా?
- నిజాయితీగా పన్ను చెల్లించేవారికి కొత్త ప్రయోజనాలు ఉంటాయన్న మోదీ
- కరోనావైరస్: తెలంగాణ, బీహార్, గుజరాత్, యూపీలలో టెస్టులు పెంచాలి - ముఖ్యమంత్రుల సదస్సులో మోదీ
- ముస్లిం పెళ్లి కూతురు, క్రైస్తవ పెళ్లి కొడుకు... హిందూ సంప్రదాయంలో పెళ్లి
- #HisChoice: అవును... నేను హౌజ్ హస్బెండ్‌ని
- కమలా హ్యారిస్ ఎవరు? జో బిడన్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఆమెనే ఎందుకు ఎంచుకున్నారు?
- ఇండియా, ఇరాక్, బ్రిటన్, ఆస్ట్రేలియా.. అన్ని చోట్లా అమ్మోనియం నైట్రేట్ టెన్షన్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








