వీడియో గేమింగ్‌లో విపరీతంగా పెరుగుతున్న మహిళల సంఖ్య

ఫొటో సోర్స్, REIA AYUNAN
- రచయిత, జస్టిన్ హార్పర్
- హోదా, బిజినెస్ రిపోర్టర్
ఆసియాలో వీడియో గేమ్స్ ఆడుతున్నవారిలో మహిళల సంఖ్య విపరీతంగా పెరుగుతోందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.
చైనా, భారత్, జపాన్ సహా ఆసియాలోని అన్ని కీలక దేశాలలో పురుషులతో సమానంగా మహిళలూ వీడియో గేమ్స్ ఆడేస్తున్నారట.
గత ఏడాది మహిళా వీడియోగేమర్లు 19 శాతం పెరిగారని గూగుల్ గణాంకాలు చెబుతున్నాయి.
ప్రపంచ వీడియో గేమింగ్ మార్కెట్‌లో ఆసియాదే అధిక వాటా.. వీడియో గేమింగ్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఆదాయంలో 48 శాతం ఆసియా ఖండం నుంచే వస్తోంది.
''ఏటా చేరుతున్న లక్షల కొద్దీ గేమర్లలో మహిళలూ ఉంటున్నారు.. ఈ స్థాయిలో వృద్ధి సాధించడానికి వారే కారణం'' అన్నారు గూగుల్ ఆసియా పసిఫిక్‌కు చెందిన రోహిణి భూషణ్.
ఈ వృద్ధికి ఇంకా అనేక కారణాలున్నాయని రోహిణి చెప్పారు.
2019లో ఒక్క ఆసియాలోనే మహిళా గేమర్ల సంఖ్యలో 38 శాతం పెరుగుదల కనిపించింది.
మార్కెట్లను అధ్యయనం చేసే సంస్థ నికో పార్టనర్స్‌తో కలిసి గూగుల్ వీడియో గేమింగ్ రంగంపై అధ్యయనం చేసి ఈ వివరాలు వెల్లడించింది.
చైనాలో 45 శాతం, దక్షిణ కొరియా, జపాన్, ఆగ్నేయాసియాలో 40 శాతం వృద్ధి కనిపించింది.
మొబైల్ ఫోన్లలో వీడియోగేమ్స్ ఆడేవారి సంఖ్య ఆసియా ప్రాంతంలో విపరీతంగా పెరిగింది.

ఫొటో సోర్స్, AMANDA LIM
''మొబైల్ గేమింగ్‌లోకి ఎక్కువగా మహిళలు వస్తున్నారు. మిగతా డివైస్‌లకు ఇంటర్నెట్ పొందడం కంటే మొబైల్ ఇంటర్నెట్ అందుబాటులో ఉందడమే దీనికి కారణం'' అని గూగుల్ ఆసియా పసిఫిక్ ప్రాంత యాప్స్, పార్టనర్‌షిప్స్, ప్లాట్‌ఫామ్ మార్కెటింగ్ హెడ్ మేట్ బ్రోకిలహస్ట్ చెప్పారు.
గేమింగ్ ఇప్పుడు అందరికీ ఆకర్షణీయ రంగంగా మారింది. వీడియో గేమ్స్ తయారుచేసే ఈఏ, యాక్టివిజన్ బ్లిజార్డ్ వంటి కంపెనీలకే కాదు ఈ-స్పోర్ట్స్, ఆన్‌లైన్ గేమర్లకూ ఇది ఆకర్షణీయ రంగంగా మారింది.
ఈ-స్పోర్ట్స్ టాప్ ఉమెన్ ప్లేయర్లు స్పాన్సర్‌షిప్‌లు, ప్రైజ్ మనీ, ఎండార్స్‌మెంట్ల ద్వారా 2 కోట్ల డాలర్లకు పైగా సంపాదించారు.
ఆన్‌లైన్‌లో ప్రత్యక్ష ప్రసారం(లైవ్ స్ట్రీమింగ్) ద్వారా ఆడే వీరికి లక్షల్లో ఫాలోవర్లు ఉంటున్నారు. సోషల్ మీడియాలోనూ వీరు ప్రభావవంతంగా మారుతున్నారు.
ఆసియాలో పూర్తిగా మహిళా గేమర్లతోనే ఏర్పాటు చేస్తున్న టీములు, ఆడుతున్న లీగ్‌లు ఈ రంగంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధోరణులను ప్రభావితం చేస్తున్నాయి.
గత ఏడాది మొబైల్ కమ్యూనికేషన్స్ సంస్థ సింగ్‌టెల్ ఇలాంటి ఈస్పోర్ట్ ఫిమేల్ లీగ్‌ను స్పాన్సర్ చేసింది.
ప్రొఫెషనల్ గేమర్ అమండా లిమ్టట(25) తన సోదరుడు, అంకుల్‌తో బంధాన్ని పెంపొందించుకోవడానికి ఈ గేమింగ్‌లోకి వచ్చినట్లు చెప్పారు.
''నేను గేమింగ్‌లోకి వచ్చేటప్పటికి ఫిమేల్ గేమర్స్ పెద్దగా పాపులర్ కాదు.. అయితే, ఇంకా మహిళా గేమర్లు పెరిగితే పరిస్థితులు మారుతాయి. మగవాళ్లతో సమానంగా మేమూ ఆడుతాం'' అంటారామె.
'వి బీటర్స్' అనే పూర్తిగా మహిళా గేమర్లే ఉన్న టీమ్ తరఫున లిమ్ ఆడుతుంటారు. మలేసియా, సింగపూర్ అంతటా ఈ టీం సభ్యులుంటారు.
మాజీ ప్రొఫెషనల్ గేమర్ రియా అయునాన్ బేటిల్ రాయల్ వంటి గేమ్స్ రోజుకు 6 గంటలకు పైగా ఆడేవారు. ఆమె లైవ్ స్ట్రీమింగ్‌కు ఫిలిప్పీన్స్, మలేసియా, ఇండోనేసియాలో ఆదరణ ఉండేది.
ఆన్‌లైన్ లైవ్ స్ట్రీమింగ్‌లో చాలామంది మహిళా గేమర్లు ఉన్నారని అయునాన్ చెప్పారు.
మహిళా గేమర్లు పెద్దసంఖ్యలో ఉన్నప్పటికీ మహిళలు/బాలికలు వీడియో గేమ్స్ ఆడడాన్నిసమాజం పెద్దగా ఇష్టపడకపోవడంతో గేమింగ్ పరిశ్రమ మహిళలను లక్ష్యంగా చేసుకుని వీడియో గేమ్స్ రూపొందించడం లేదని ఆమె అభిప్రాయపడ్డారు.
ప్రొఫెషనల్ గేమర్‌గా ఆమె నెలకు 4 వేల సింగపూర్ డాలర్లు(సుమారు రూ. 2.16 లక్షలు) సంపాదించేవారు.
వీడియోగేములను రూపొందించే సంస్థ యుబీ సాఫ్ట్ ఇటీవల ఆమెను తమ సంస్థలోకి తీసుకుంది. ఇప్పుడామె మహిళలే లక్ష్యంగా గేమింగ్ కంటెంట్ రూపొందించే పనిలో ఉన్నారు.

ఫొటో సోర్స్, VALERIE ONG
సింగపూర్‌కు చెందిన పద్దెనిమిదేళ్ల విద్యార్థిని వలీరియీ ఓంగ్ రోజుకు 3 నుంచి 7 గంటలు వీడియో గేమ్స్ ఆడుతుంటారు.
ఈ ఏడాది ప్రారంభంలో తన బెస్ట్ ఫ్రెండ్‌కు జాతీయ స్థాయి పోటీలో సహకరించేందుకు వెళ్లిన తరువాత కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్ ఆడడం ప్రారంభించారామె. ''ఆ పోటీతో నా కళ్లు తెరుచుకున్నాయి. ఈ రంగంలో పూర్తిగా పురుషాధిక్యత ఉంది. ఆ పోటీలో నా స్నేహితురాలు ఒక్కరే మహిళ'' అని చెప్పారు వలీరియీ.
అయితే, వీడియో గేమింగ్‌లో మహిళలు పెరుగుతుండడంలో చీకటి కోణం కూడా ఉంది. వీరిలో చాలామంది ఆన్‌లైన్‌లో వేధింపులకు గురవుతున్నారు.
''నేను ఆన్‌లైన్‌లో లైంగిక వేధింపులకు గురయ్యాను. నా ఫొటోలతో మీమ్స్ చేసి వేధించారు. ఒకసారి పాపులర్ అయితే ఇక మిమ్మల్ని ద్వేషించేవారు పెరుగుతూనే ఉంటారు. మీ తప్పులు, లోపాలు వెతికే పనిలో ఉంటారు'' అన్నారు అయునాన్.
ఇలాంటి వేధింపులు తప్పించుకోవాలంటే మహిళలు తమ అసలు పేరు కాకుండా వేరే యూజర్ నేమ్ వాడడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- PUBGకి ప్రత్యామ్నాయంగా చైనాలో దేశభక్తి నింపే వీడియో గేమ్
- PUBG: ఈ ఆటకు ఎందుకంత క్రేజ్? ఎలా ఆడతారు? ఇందులో గెలుపు ఓటములు ఏమిటి?
- భారత్‌లో సోషల్ మీడియాను ఒక వ్యక్తి సగటున ఎన్ని గంటలు వాడుతున్నారో తెలుసా?
- చైనా, ఇరాన్‌ల సీక్రెట్ డీల్: భారత్‌కు ఎంత నష్టం
- పాకిస్తాన్ నిర్మిస్తున్న ఆనకట్టపై భారత్ ఎందుకు అభ్యంతరం చెబుతోంది?
- అక్కడ అమ్మాయి పేరు ఎవరికీ చెప్పకూడదు.. పెళ్లి పత్రాల్లో రాయరు, మరణ ధ్రువీకరణల్లో ఉండదు
- ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ హాట్ స్పాట్‌గా మారిన తూర్పు గోదావరి
- భారత జనాభా ఈ శతాబ్దం చివరికి ఎందుకు తగ్గుతుంది... తగ్గితే ఏమవుతుంది?
- వ్యాక్సిన్ త్వరలో వచ్చేస్తుందనుకుంటే అది అత్యాశే: ప్రపంచ ఆరోగ్య సంస్థ
- తూర్పుగోదావరి జిల్లాలో ఒక వ్యక్తి నుంచి 100 మందికి కరోనావైరస్.. ఎలా వ్యాపించింది?
- హైదరాబాద్ నుంచి ఇప్పటివరకు ఎంతమంది వెళ్లిపోయారు
- సెక్స్ వర్కర్లు ఆ దేశంలో రెయిన్ కోట్ ఎందుకు వేసుకుంటున్నారు?
- రిలయన్స్ జియో 5జీ వస్తోంది.. కానీ భారతీయులు ఎన్నాళ్లు ఎదురు చూడాలి?
- చైనా - భారత్ మధ్య 45 ఏళ్లుగా లేనంత గొడవలు ఇప్పుడెందుకు?
- భారత్ - చైనా 1962 యుద్ధం: పిరికిపందల చర్యా లేక నమ్మకద్రోహమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








