కరోనావైరస్: చైనా 'ప్లేగ్ ఇంక్' వీడియోగేమ్‌ను ఎందుకు నిషేధించింది

ఫొటో సోర్స్, PLAGUE INC
ఒక ప్రాణాంతక వైరస్‌ను ప్రపంచమంతా వ్యాపింపజేయాలని ప్లేయర్లను సవాల్ చేసే ఒక వీడియో గేమ్‌ను చైనా నిషేధించిందని గేమ్ తయారీదారులు చెప్పారు.
చట్టవిరుద్ధమైన కంటెంట్ కలిగి ఉందంటూ ప్లేగ్ ఇంక్ అనే ఈ గేమ్‌ను చైనా యాప్ స్టోర్ నుంచి తొలగించినట్లు బ్రిటన్ కేంద్రంగా పనిచేసే డెవలపర్ 'ఎండెమిక్ క్రియేషన్స్' చెప్పింది.
దేశంలో ప్రాణాంతక కరోనావైరస్ వ్యాప్తితో ఉక్కిరిబిక్కిరవుతున్న తరుణంలో చైనా ఈ వీడియో గేమ్‌ను నిషేధించింది.


చైనా నిబంధనలకు విరుద్ధమైన కంటెంట్ ఈ గేమ్‌లో ఉందని 'సైబర్‌స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా' పేర్కొందని, దీనిని చైనా యాప్ స్టోర్ నుంచి తీసేశారని ఎండెమిక్ క్రియేషన్స్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పరిస్థితి పూర్తిగా తమ నియంత్రణలో లేనిదని వ్యాఖ్యానించింది.
చైనాలో కరోనావైరస్ వ్యాప్తికి, ఈ నిషేధానికి సంబంధం ఉందో లేదో తమకు స్పష్టం కాలేదని సంస్థ వ్యాఖ్యానించింది. నిషేధాన్ని ఎత్తి వేయించేందుకు కృషి చేస్తున్నామని చెప్పింది.
ప్లేయర్లలో అవగాహన పెంచడంలో 'ప్లేగ్ ఇంక్' ప్రాధాన్యాన్ని అమెరికాలోని వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం (సీడీసీ) లాంటి సంస్థలు చాలాసార్లు గుర్తించాయని ఎండెమిక్ క్రియేషన్స్ ప్రస్తావించింది. కరోనావైరస్‌తో వచ్చే కోవిడ్-19 వ్యాధి నియంత్రణకు ప్రధాన అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయని, ఈ పోరాటంలో తమ శక్తిమేర ఏ విధంగా తోడ్పాటు అందించగలమో నిర్ణయించేందుకు ఆయా సంస్థలతో కలసి పనిచేస్తున్నామని వివరించింది.

ఫొటో సోర్స్, Getty Images
తీవ్రమైన ప్రజారోగ్య అంశాల గురించి ఆలోచించి, అవగాహన పెంచుకొనేలా ప్లేయర్లను తమ గేమ్ ప్రోత్సహిస్తుందని, తాజా నిషేధం విచారకరమని ఎండెమిక్ క్రియేషన్స్ వ్యాఖ్యానించింది.
ఎనిమిదేళ్ల క్రితం విడుదలైన ఈ గేమ్ చైనా సహా ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందింది. ప్రపంచ దేశాల్లో 13 కోట్ల మంది ప్లేయర్లు దీనిని ఆడతారు.
కరోనావైరస్ శరవేగంగా వ్యాపిస్తున్న సమయంలో జనవరిలో చైనాలో అత్యధికంగా అమ్ముడుపోయిన యాప్ ఇదే.
కరోనావైరస్‌తో అలముకొన్న భయాందోళనలను తగ్గించుకొనేందుకు తాము ఈ గేమ్ డౌన్‌లోడ్ చేసుకొంటున్నామని కొందరు ప్లేయర్లు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఫిబ్రవరి 28 రాత్రి వరకున్న సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 82 వేల కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. 2,800 మంది చనిపోయారు.
కేసులు, మరణాలు చైనాలోనే అత్యధికంగా ఉన్నాయి.
చైనా వెలుపల 3,664 కేసులు నమోదయ్యాయి. 57 మంది చనిపోయారు.

ఇవి కూడా చదవండి
- కన్హయ్య కుమార్‌పై దేశ ద్రోహం కేసు విచారణకు అనుమతి మంజూరు చేసిన దిల్లీ ప్రభుత్వం
- బాలాకోట్ దాడులు: మసూద్ అజర్ నియంత్రణలోని ఆ మదరసా వద్దకు నేటికీ ఎవరినీ అనుమతించరు
- వివాదాస్పద మత బోధకుడు జాకిర్ నాయక్ ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? - Ground Report
- అభినందన్ క్రాష్ ల్యాండింగ్ ఎలా జరిగింది? అప్పుడు అక్కడ ఉన్నవాళ్లు ఏమన్నారు...
- CAA-NRC: జనన ధ్రువీకరణ పత్రాల కోసం మాలెగావ్‌లో 4 నెలల్లో 50వేల దరఖాస్తులు
- CAA, దిల్లీ హింసలపై ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి
- కరోనావైరస్ ప్రభావంతో ప్రపంచమంతటా కుప్పకూలుతున్న స్టాక్ మార్కెట్లు... సెన్సెక్స్ 1300 పాయింట్లు పతనం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









