కన్హయ్య కుమార్‌పై దేశ ద్రోహం కేసు విచారణకు అనుమతి మంజూరు చేసిన దిల్లీ ప్రభుత్వం

ఫొటో సోర్స్, Getty Images
జేఎన్‌యూ మాజీ విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్‌కు వ్యతిరేకంగా నమోదైన దేశ ద్రోహం కేసులో విచారణ జరిపేందుకు దిల్లీ ప్రభుత్వం పోలీసులకు అనుమతి మంజూరు చేసింది.
దిల్లీ పోలీసు వర్గాల నుంచి ఈ మేరకు తమకు సమాచారం అందినట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.
దిల్లీ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు కన్హయ్యకుమార్ ట్విటర్‌లో వ్యాఖ్యానించారు.
ఈ కేసుపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులో త్వరితగతిన విచారణ జరగాలని కోరుకుంటున్నానని, దేశద్రోహ చట్టం ఎలా దుర్వినియోగం అవుతుందో అందరికీ తెలియాలని ఆశిస్తున్నానని ఆయన అన్నారు.


2016, ఫిబ్రవరి 9న దిల్లీలోని జేఎన్‌యూలో భారత్ వ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణలపై ఈ కేసు నమోదైంది.
ఈ కేసులో కన్హయ్యతోపాటు ఉమర్ ఖాలిద్, అనిర్బన్ భట్టాచర్య కూడా నిందితులుగా ఉన్నారు.

ఫొటో సోర్స్, Twitter
గత ఏడాది జనవరి 14న దిల్లీ పోలీసులు ఈ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. కేసు దర్యాప్తుకు అనుమతి మంజూరు చేయాలని దిల్లీ ప్రభుత్వాన్ని రాతపూర్వకంగా కోరారు. కానీ, దిల్లీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.
కొన్ని రోజుల క్రితం అనుమతి మంజూరు చేసేలా దిల్లీ ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలంటూ సుప్రీం కోర్టును పోలీసులు ఆశ్రయించారు. కానీ, ఆ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది.
ఇప్పుడు దిల్లీ ప్రభుత్వం అనుమతి మంజూరు చేయడంతో పోలీసులకు మార్గం సుగమమైంది.
గత ఫిబ్రవరి 19న పోలీసులు పంపిన అభ్యర్థనకు బదులుగా దిల్లీ ప్రభుత్వం ఈ అనుమతిని మంజూరు చేసింది.

ఇవి కూడా చదవండి
- దిల్లీ హింస: హెడ్‌కానిస్టేబుల్ రతన్‌లాల్ చనిపోయాడని తెలీక, ఆయన కోసం ఎదురుచూస్తున్న భార్య
- దిల్లీ హింస: 'ప్రేమికుల దినోత్సవం రోజు పెళ్ళి చేసుకున్నాడు... 11 రోజులకే అల్లర్లలో చనిపోయాడు"
- వివాదాస్పద మత బోధకుడు జాకిర్ నాయక్ ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? - Ground Report
- సింహాల సఫారీలో చిక్కిన టీనేజర్
- పాఠశాలలో విద్యార్థులు వేసిన నాటకం... తల్లి, టీచర్ల అరెస్టుకు దారి తీసింది
- అభినందన్ క్రాష్ ల్యాండింగ్ ఎలా జరిగింది? అప్పుడు అక్కడ ఉన్నవాళ్లు ఏమన్నారు...
- కరోనావైరస్: జంతువుల నుంచి మనుషులకు సోకింది ఇలాగేనా? శాస్త్రవేత్తల ‘డిటెక్టివ్ కథ’
- CAA-NRC: జనన ధ్రువీకరణ పత్రాల కోసం మాలెగావ్‌లో 4 నెలల్లో 50వేల దరఖాస్తులు
- బాలాకోట్ దాడులు: మసూద్ అజర్ నియంత్రణలోని ఆ మదరసా వద్దకు నేటికీ ఎవరినీ అనుమతించరు
- కరోనావైరస్ ప్రభావంతో ప్రపంచమంతటా కుప్పకూలుతున్న స్టాక్ మార్కెట్లు... సెన్సెక్స్ 1300 పాయింట్లు పతనం
- కరోనావైరస్ వ్యాప్తిని ఉత్తర కొరియా సమర్థంగా ఎదుర్కోగలదా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.









