‘నేను మోసం చేస్తున్నానేమో అని నా భర్తకు అనుమానం.. నా సోషల్ మీడియా అకౌంట్లనీ డిలీట్ చేసేశారు’

- రచయిత, జూన్ కెల్లీ, టొమోస్ మోర్గాన్
- హోదా, బీబీసీ న్యూస్
లాక్ డౌన్ విధించినప్పటి నుంచి యూకేలో జాతీయ గృహ హింస హెల్ప్ లైన్ కి వచ్చే ఫిర్యాదుల సంఖ్య 25 శాతం పెరిగినట్లు ‘రెఫ్యూజీ’ అనే అనే స్వచ్చంధ సంస్థ తెలిపింది. గత వారంలో ఈ సంస్థకి వచ్చిన ఫోన్ కాల్ ల సంఖ్య వందల్లో పెరిగిందని ఈ హెల్ప్ లైన్ ని నిర్వహించే రెఫ్యూజీ సంస్థ తెలిపింది.
ఈ లాక్ డౌన్ వలన గృహ హింస పెరిగి బాధితులకి తప్పించుకునే అవకాశాలు తగ్గిపోతాయని రెఫ్యూజీ సంస్థ చెబుతోంది. గృహ హింస పట్ల అవగాహన పెంచే ప్రచారం కూడా పెరిగినట్లు సంస్థ పేర్కొంది.
భారతదేశంలో కూడా లాక్ డౌన్ విధించినప్పటి నుంచి గృహ హింస కేసులు పెరిగినట్లు జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖ శర్మ బీబీసీ న్యూస్ తెలుగుకి చెప్పారు.
గతంలో దేశవ్యాప్తంగా సగటున వారానికి 30 కేసులు నమోదు అయితే, లాక్ డౌన్ విధించినప్పటి నుంచి నమోదైన కేసుల సంఖ్య 69 అని, అంటే ఇది రెండింతలు పెరిగిందని చెప్పారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి బతకడం చాలా కష్టమైపోతోందని ఇంట్లో హింస భరించలేక ఇంటి నుంచి పారిపోయిన ఒక మహిళ బీబీసీకి చెప్పారు
గత ఆరు నెలలుగా తన భాగస్వామి వలన మానసిక, శారీరక హింసకి గురవుతున్నానని తార (పేరు మార్చడమైనది) చెప్పారు.
లాక్ డౌన్ వలన ఈ పరిస్థితి మరింత విషమించిందని తెలిపారు.
“మొదట్లో నా కుటుంబం, స్నేహితులతో నెమ్మదిగా దూరం చేసారు. తనని మోసం చేస్తున్నానేమో అనుకునేవారు. నన్ను అదుపులో పెట్టాలని చూసేవారు.”
ఆమె సోషల్ మీడియా అకౌంట్లు అన్నీ ఆమె భాగస్వామి తొలగించారు.
“మానసికంగా హింసిస్తూ, తిడుతూ, నన్ను అప్పుడప్పుడూ కొట్టడం కూడా చేసేవారు. లాక్ డౌన్తో ఇది మరింత పెరిగింది”.
నాకు తెల్లవారితే ఏమి జరుగుతుందో తెలుసు. ఈ లాక్ డౌన్ తొందరగా ముగియాలని కోరుకుంటున్నాను
నిద్ర నుంచి లేవగానే ఏదో ఒక కారణం వెతుక్కుని నాతో వాదన పెట్టుకోవాలని చూస్తారు. నేను తిరిగి సమాధానం ఇస్తే నన్ను కొట్టడానికి ప్రయత్నిస్తారు.
తార ఇంటి నుంచి పారిపోయి బాధిత మహిళలు, యుక్త వయస్సులో అమ్మాయిల కోసం లమౌ సంస్థ వేల్స్ లో నిర్వహించే ఒక శరణార్థ గృహంలో తల దాచుకుంది.

“ఈ లాక్ డౌన్ సమయంలో కొన్ని తప్పనిసరి నిబంధనలు పాటించకుండా, తమకి ఫిర్యాదు రాగానే, పోలీసులకి తక్షణమే సమాచారం అందించి బాధితులకి తగిన సహాయం అందేటట్లు చూస్తున్నామని చెప్పారు. అంతే కాకుండా, పోలీసుల సహాయంతో కొంత మందిని తమ పుట్టింట్లో వదిలి పెట్టి రావడం కూడా చేస్తున్నట్లు, లేదా వసతి గృహాలకి పంపించడం లాంటి సహాయ చర్యలు చేపడుతున్నట్లు రేఖ శర్మ తెలిపారు.
యూకేలో జాతీయ గృహ హింస హెల్ప్ లైన్ సంస్థ నిర్వహించే వెబ్ సైట్ ని సందర్శించేవాళ్ల సంఖ్య కూడా ఫిబ్రవరి ఆఖరి వారంలో 150 శాతం పెరిగిందని రెఫ్యూజీ తెలిపింది.
సామాజిక నిర్బంధం, లాక్ డౌన్ సమయం పెరిగే కొలదీ, గృహ హింస పెరిగే అవకాశముందని రేచెల్ విలియంస్ అనే ప్రముఖ ప్రచారకర్త చెప్పారు.
“గతంలో అయితే, ఏదైనా సమస్య వచ్చినప్పుడు మహిళలు అమ్మగారి ఇంటికి వెళ్లిపోవడమో, లేదా బంధువులు కానీ, స్నేహితుల దగ్గరకి వెళ్లడమో చేసేవారు. లాక్ డౌన్ వలన ఆ అవకాశం కోల్పోవడంతో హెల్ప్ లైన్ లను ఆశ్రయించే వారి సంఖ్య పెరగడానికి ఒక కారణమని రేఖ శర్మ అన్నారు. ఇంట్లో అందరూ నిర్బంధంలో ఉండటం వలన కూడా ఫిర్యాదు చేయడానికి బాధితులకి అవకాశం తగ్గిపోతుందని”, చెప్పారు.
ఈ నిర్బంధాన్ని చాలా మంది తమ భాగస్వాముల్ని అదుపులో పెట్టడానికి వాడుకుంటున్నారని రెఫ్యూజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సాండ్రా హార్లీ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
గత సంవత్సరం సుమారు 16 లక్షల మంది మహిళలు గృహ హింసకి గురయ్యారు. అయితే ఈ లాక్ డౌన్ వలన కానీ, స్వీయ నిర్బంధం వలన కానీ, మహిళలు, పిల్లలు, నేరం చేసేవాళ్ళతో కలిసి గడిపే సమయం పెరుగుతుందని, దీంతో వాళ్ళ స్వాతంత్రానికి భంగం కలిగి గృహ హింస కూడా పెరగడానికి అవకాశం ఉందని అన్నారు
గృహ హింస కేవలం శారీరకం కాదు, ఇది అదుపులో పెట్టడం, బెదిరించడం, అధికార స్వభావంతో కూడుకుని , మానసికంగా, శారీరకంగా, లైంగికంగా , ఆర్ధికంగా కూడా ప్రభావం చూపిస్తుంది.
దీంతో 18 సంవత్సరాలు తన భర్త చేతిలో హింస భరించిన తర్వాత తాను ఇంటి నుంచి వెళ్ళిపోతున్నానని చెప్పినప్పుడు ఆమె భర్త ఆమెని చిన్న షాట్ గన్ తో కాల్చాలని చూసినట్లు రేచెల్ విలియంస్ చెప్పారు
ఇప్పుడు ఇంటి కప్పు కింద జరిగే హత్యలు పెరగవచ్చని నాకు అనిపిస్తోందని, బీబీసీ తో అన్నారు
“హింసించేవాళ్ళని కనిపిస్తే గాని ఆపలేము”.
"గృహ హింసని ఆపడం కష్టం. దానికి తోడు ఇప్పుడు యూకేని ఈ మహమ్మారి పీడిస్తోంది."
గృహ హింస కి గురవుతున్న వారు పోలీసులకి ఫిర్యాదు చేసి తగిన సహాయం పొందవచ్చని పోలీస్ శాఖ చెబుతోంది.
బాధితులకి తగిన సహాయం చేయడానికి చూస్తామని లూయిసా రాఫ్ వెస్ట్ మిడ్లాండ్స్ డిప్యూటీ చీఫ్ కానిస్టేబుల్ చెప్పారు.
యుకె లో తమ హెల్ప్ లైన్ 24 గంటలు పని చేస్తుందని రెఫ్యూజీ సంస్థ చెప్పింది. ఈ లాక్ డౌన్ వలన ఒక్కొక్కసారి హింసకి గురవుతున్న వారికి కాల్ చేయడానికి కూడా అవకాశం లభించదని చెబుతున్నారు. అందుకే వెబ్సైట్ ద్వారా తమ సమస్యని తెలియచేసే అవకాశం కల్పించినట్లు పేర్కొంది.
ఈ నిర్బంధం వలన తన భాగస్వామితో 24 గంటలు హింసని భరించాల్సి వచ్చినప్పటికీ ఈ సంబంధాన్ని పూర్తిగా వదిలించుకోవడానికి కూడా తగిన అవకాశం కల్పించిందని తార అన్నారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గత ఆరు నెలల్లో మహిళల పై హింసకి సంబంధించిన కేసులు మొత్తం 500 నమోదు కాగా, ఒక్క మార్చ్ నెలలోనే 38 నమోదు అయినట్లు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ బీబీసీకి తెలిపారు.
లాక్ డౌన్ విధించినప్పటి నుంచి ఒక్క కేసు కూడా నమోదు కాలేదని చెప్పారు.
అయితే, కరోనా వైరస్ మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో ప్రాధాన్యతలు మారడం వలన, కానీ, లేదా ఫిర్యాదు చేసే అవకాశాలు తగ్గడం వలన కానీ ఈ సంఖ్య తగ్గి ఉండవచ్చని అన్నారు.
వారి దగ్గరకి వచ్చే గృహ హింసకి సంబంధించిన కేసులలో ఎక్కువగా మానసిక హింస, అక్రమ సంబంధాలకి సంబంధించినవి ఉంటాయని చెప్పారు.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా

లాక్ డౌన్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన గృహ హింసని ఐక్య రాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరేజ్ ఖండించారు.
ప్రపంచంలో నెలకొన్న అనిశ్చితి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న కలహాలను ఆపాలని ఇటీవల అయన విన్నవిస్తూ, యుద్ధాలు కేవలం యుద్ధ భూమికే పరిమితం కాదని అన్నారు.
“ఏదైతే సురక్షిత స్థలం అని అనుకుంటారో , అక్కడే చాలా మందికి మహిళలకి, అమ్మాయిలకి, ముప్పు పొంచి ఉంటుందని”, అన్నారు.
లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి లెబనాన్, మలేషియా లాంటి దేశాలలో గృహ హింస హెల్ప్ లైన్లకి వచ్చే ఫోన్ కాల్ లు గణనీయంగా పెరిగాయని ఐక్య రాజ్యసమితి తెలిపింది. చైనాలో ఈ సంఖ్య మూడింతలు పెరిగింది.
కరోనావైరస్ వలన తలెత్తిన ఆర్ధిక, సామాజిక ఒత్తిడి కూడా గృహ హింస పెరగడానికి ఒక కారణం కావచ్చని గుటెరేజ్ అన్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా గృహ హింసకి గురైన వారికి సహాయం చేయడానికి కష్టం అవుతుందని అన్నారు.
చాలా మంది వైద్య సిబ్బంది, పోలీసులు కరోనావైరస్ ని అరికట్టే పనిలో ఉన్నారని చెప్పారు.
కరోనావైరస్ ని అరికట్టడానికి ప్రయత్నిస్తున్నట్లుగానే యుద్ధ భూముల నుంచి, ఇంటిగోడల వరకు ఉన్న హింసని నిర్మూలించడానికి సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
భారతదేశంలో గృహ హింసకి సంబంధించి హెల్ప్ లైన్ 1091 టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వవచ్చు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:
- ‘నా భార్య నన్ను పదేళ్ళు రేప్ చేసింది'
- రష్యా ఖచటుర్యాన్ సిస్టర్స్- తండ్రిని చంపిన కూతుళ్లు.. ‘ఆత్మరక్షణ కోసం’ చేసిన హత్య కాదా?
- అత్తల పెత్తనం కోడళ్లకు ‘శాపం’గా మారుతోందా.. అత్తలతో కలిసి ఉండటంపై కోడళ్లు ఏమన్నారు
- ఈ దేశాల్లో ఒక్క కరోనావైరస్ కేసు కూడా నమోదు కాలేదు, ఎందుకు?
- కరోనావైరస్: కుక్కలు, పిల్లుల మాంసం తినడంపై నిషేధం విధించిన చైనా నగరం
- కరోనావైరస్: వెంటిలేటర్లు ఏంటి.. అవి ఎందుకు ముఖ్యం
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








