ఆస్కార్ అవార్డు: అకాడమీ అవార్డుకు 'ఆస్కార్' అనే పేరు ఎలా వచ్చింది?

ఆస్కార్

ఫొటో సోర్స్, FB/TheAcademy

92వ ఆస్కార్ పురస్కారాల ప్రదానోత్సవంతో అందరి దృష్టీ మరోసారి ఆ అవార్డులపై పడింది.

అకాడమీ అవార్డులను ఆస్కార్ అవార్డులని ఎక్కువ మంది పిలుస్తారు. వీటికి 'ఆస్కార్' అనే పేరు ఎలా వచ్చింది? ఆస్కార్ గురించి ఎనిమిది ఆసక్తికరమైన అంశాలు...

అడ్డగీత
News image
అడ్డగీత

1. ఈ పురస్కారాలను ఆస్కార్ అవార్డులని ఎందుకు పిలుస్తారనేది ఎవరికీ కచ్చితంగా తెలియదు. మరి ఈ పేరు ఎలా వచ్చింది?

దీనిపై ఒక ఊహాగానం ఉంది. అదేంటంటే- అకాడమీ అవార్డులను ఇచ్చే సంస్థకు మార్గరెట్ హెరిక్ అనే ఒక మహిళ సేవలందించారు. విజేతలకు అందించే బొమ్మను ఆమె తొలిసారి చూసినప్పుడు- దీని ఆకృతి తన అంకుల్ ఆస్కార్‌లా ఉందన్నారు. అలా 'ఆస్కార్ అవార్డు' పేరు వచ్చింది. 1939లో ఇదే పేరును అధికారికంగా కూడా స్వీకరించారు.

2009లో స్లమ్‌డాగ్ మిలియనీర్' చిత్రానికి ఒరిజినల్ స్కోర్, ఒరిజినల్ సాంగ్ విభాగాల్లో రెండు ఆస్కార్ పురస్కారాలు గెలుపొందిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్

ఫొటో సోర్స్, Gettyimages/Jeff Kravitz

ఫొటో క్యాప్షన్, 2009లో స్లమ్‌డాగ్ మిలియనీర్' చిత్రానికి ఒరిజినల్ స్కోర్, ఒరిజినల్ సాంగ్ విభాగాల్లో రెండు ఆస్కార్ పురస్కారాలు గెలుపొందిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్

2. 'ఆస్కార్ అవార్డు' అని పిలిచినప్పటికీ దీని అధికారిక, లాంఛనప్రాయమైన పేరు 'అకాడమీ అవార్డ్ ఆఫ్ మెరిట్'. పెద్ద పేరే కదా!

3. ఆస్కార్ అవార్డు ప్రతిమ పసిడి వర్ణంలో మిలమిల మెరిసిపోతున్నప్పటికీ, అందులో ఉండేదంతా బంగారం కాదు. దీనిని కాంస్యంతో తయారు చేసి, 24 క్యారట్ బంగారంతో పూత పూస్తారు.

ఆస్కార్ 2019 విజేతలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆస్కార్ 2019 విజేతలు

4. 50 ఆస్కార్ ప్రతిమలు తయారుచేయాలంటే సాధారణంగా మూడు నెలలు పడుతుంది.

5. మూడు నెలలంటే ఎక్కువే కదా! మరి అత్యవసరమైతే ఎలా? 2000వ సంవత్సరంలో ప్రదానోత్సవానికి తరలిస్తున్న 55 ప్రతిమలు చోరీ అయ్యాయి. తొమ్మిది రోజుల తర్వాత వీటిలో 52 దొరికాయి. ప్రదానోత్సవంలో విజేతలకు అందించడానికి అప్పటికప్పుడు అత్యవసరంగా తయారు చేయించారు.

ఆస్కార్

ఫొటో సోర్స్, Getty Images

6. ఆస్కార్ ప్రతిమలు చేత్తో పట్టుకొన్నప్పుడు ఎలా ఉంటాయి- పెద్దగానా, చిన్నగానా, మధ్యస్థంగానా? ఒక్కో ప్రతిమ 35 సెంటీమీటర్ల కన్నా తక్కువ ఎత్తు ఉంటుంది. బరువు మాత్రం దాదాపు నాలుగు కేజీలు ఉంటుంది.

7. రెండో ప్రపంచ యుద్ధం ఆస్కార్ బొమ్మలపైనా ప్రభావం చూపించింది. అప్పట్లో లోహాల కొరత ఏర్పడింది. దీంతో మూడేళ్లు ఆస్కార్ ప్రతిమలను పెయింటెడ్ ప్లాస్టర్‌తో తయారుచేసి ఇచ్చారు. అప్పట్లో అవార్డులు అందుకున్న వారికి నిర్వాహకులు యుద్ధం ముగిసిన తర్వాత ఆ బొమ్మలను వెనక్కు తీసుకొని లోహపు ప్రతిమలు ఇచ్చారు.

ఆస్కార్

ఫొటో సోర్స్, Getty Images

8. ఆస్కార్ ప్రతిమ ఏం సూచిస్తుంది? దీనిపై ఫిల్మ్ రీల్ ఉంటుంది. దీనికి ఐదు 'స్పోక్స్' ఉంటాయి. అకాడమీ అవార్డులు అందించే ఐదు ప్రధాన విభాగాలను ఇవి సూచిస్తాయి. నటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు (టెక్నీషియన్లు), రచయితలు.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)