ఆస్కార్ 2019: ఉత్తమ నటీనటులు - ఒలీవియా కోల్మన్, రమీ మాలిక్... ఉత్తమ చిత్రం గ్రీన్ బుక్

ఫొటో సోర్స్, Getty Images
ఆస్కార్ అవార్డుల సంబరం ఆదివారం లాస్ ఏంజెలెస్ నగరంలో అట్టహాసంగా జరిగింది. బ్రిటిష్ నటి ఓలీవియా కోల్మన్ ఉత్తమ నటి అవార్డు గెల్చుకున్నారు. అందర్నీ విస్మయానికి గురి చేస్తూ గ్రీన్ బుక్ చిత్రం బెస్ట్ ఫిల్మ్ అవార్డు కైవసం చేసుకుంది.
ది ఫేవరెట్ చిత్రంలో అభినయానికి ఉత్తమ నటిగా ఆస్కార్ అందుకున్న కోల్మన్ భావోద్వేగంతో కూడిన ప్రసంగంతో అందరినీ అలరించారు
గ్రీన్ బుక్ చిత్రానికి ఉత్తమ చిత్రం సహా మొత్తం మూడు అవార్డులు లభించాయి. ఈసారి అవార్డు రోమా చిత్రానికే అనే అంచనాలను ఆ చిత్రం తలకిందులు చేసింది.

ఫొటో సోర్స్, Reuters
ఈసారి అవార్డుల్లో అత్యధికంగా బోహిమియన్ రాప్సొడి చిత్రం నాలుగు అవార్జులు గెల్చుకుంది. గ్రీన్ బుక్, రోమా, బ్లాక్ పాంథర్ చిత్రాలు మూడేసి అవార్డులు సొంతం చేసుకున్నాయి.
2018 సంవత్సరంలో విడుదలైన సినిమాలకు సంబంధించి ఉత్తమ చిత్రం, నటీనటులతో పాటు వివిధ సాంకేతిక విభఆగాల్లో విజేతలను ప్రకటించి అవార్డులను అందజేశారు.
ఉత్తమ నటి: ఒలీవియా కోల్మన్ (ది ఫేవరెట్)

ఫొటో సోర్స్, Getty Images
'ఇది నిజంగా తీవ్రమైన ఒత్తిడితో కూడిన ఆనందం కలిగిన సందర్భం. నాకు ఆస్కార్ వచ్చింది" అని కోల్మన్ కంటతడి పెడుతూ అన్నారు. ఆమె 2009లో కేట్ విన్‌స్లెట్ తరువాత ఆస్కార్ అందుకున్న రెండో బ్రిటిష్ నటి.
ఉత్తమ నటుడు: రమీ మాలెక్ (బొహిమినియన్ రాప్సొడి)

ఫొటో సోర్స్, Getty Images
అత్యధికంగా నాలుగు ఆస్కార్‌లు గెల్చుకున్న 'బొహిమియన్ రాప్సొడి' చిత్రంలో క్వీన్ బ్యాండ్ లీడ్ సింగర్ ఫ్రెడ్డీ మెర్క్యురీ పాత్ర పోషించిన రమీ మాలెక్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు.
"తనదైన ఉనికిని, గుర్తింపును చాటుకోవాలని తపించిన ఒక గాయకుడి కథ, ఒక గే కథ ఇది. అచ్చంగా తన కోసమే జీవించిన ఓ కాందిశీకుడి కథ. ఆయన జీవితాన్ని నేను వేడుక చేసుకున్నాను. ఈ వేడుకకు పురస్కారం లభించడం, ఇలాంటి కథల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారనడానికి నిదర్శనం" అని రమీ మాలెక్ అన్నారు.
మహెర్షలా అలీ, రెజీనా కింగ్

ఫొటో సోర్స్, AFP/reuters
మహెర్షలా అలీకి ఇది గత మూడేళ్ళలో సహాయ నటుడిగా రెండో అవార్డు. 2017లో మూన్‌లైట్ చిత్రానికి అవార్డు అందుకున్న అలీ 'గ్రీన్ బుక్' చిత్రంలో జాజ్ పియానిస్ట్ డాన్ షిర్లే పాత్ర పోషించి మరోసారి అదే అవార్డు అందుకున్నారు.
ఇక, 'బీల్ స్ట్రీట్ కుడ్ టాక్' చిత్రానికి రెజీనా కింగ్ ఉత్తమ సహాయ నటిగా ఎంపికయ్యారు. ఆస్కార్‌కు నామినేట్ అయిన తొలిసారే ఆమెను అవార్డు వరించడం విశేషం.
ఆస్కార్ 2019 విజేతలు వీరే...

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Reuters
ఉత్తమ యానిమేషన్ చిత్రం: స్పైడర్ మ్యాన్: ఇంటూ ద స్పైడర్-వెర్స్
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, AFP

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Reuters

ఫొటో సోర్స్, Getty Images
ఉత్తమ విదేశీ భాషా చిత్రం: రోమా - మెక్సికో
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఉత్తమ లఘు యానిమేషన్ చిత్రం: బావో
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఇతర విభాగాల్లో అవార్డుల విజేతలు
ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం: ఫ్రీ సోలో
బెస్ట్ ఒరిజనల్ స్క్రీన్ ప్లే: గ్రీన్ బుక్ - నిక్ వల్లెలోంగా, బ్రియాన్ క్యూరీ, పీటర్ ఫారెలీ
ఉత్తమ ఛాయాగ్రహణం: రోమా - అల్ఫాన్సో కువారాన్
బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్: ఫస్ట్ మ్యాన్ - పాల్ లాంబార్ట్, ఇయాన్ హంటర్, ట్రిస్టన్ మైల్స్, జె.డి. ష్వామ్
బెస్ట్ సౌండ్ ఎడిటింగ్: బొహీమియన్ రాప్సొడీ - జాన్ వార్‌హర్స్ట్, నీనా హర్ట్‌స్టోన్
బెస్ట్ సౌండ్ మిక్సింగ్: బొహీమియన్ రాప్సొడీ - పాల్ మాసే, టిమ్ కవాగిన్, జాన్ కాసలి
బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్: బొహీమియన్ రాప్సొడీ - జాన్ ఒటామన్
బెస్ట్ లఘు లైవ్ యాక్షన్: స్కిన్
ఈసారి ఆస్కార్ అవార్డుల కార్యక్రమానికి ప్రధాన వ్యాఖ్యాత (మెయిన్ హోస్ట్)గా ఎవరూ వ్యవహరించలేదు. టీనా ఫే, మాయా రుడాల్ఫ్, అమీ పోహ్లర్‌లు కార్యక్రమాన్ని ప్రారంభించి తొలి అవార్డు బహూకరించారు.

ఫొటో సోర్స్, Getty Images
వివిధ విభాగాల్లో విజేతలకు ప్రముఖ నటీనటులు అవార్డులను అందజేశారు.
నామినీలందరికీ కృతజ్ఞతలు చెప్తూ ప్రఖ్యాత నటి జూలియా రాబర్ట్స్ అవార్డుల ఉత్సవాన్ని ముగించారు.
ఇవి కూడా చదవండి:
- శానిటరీ ప్యాడ్స్ చేసే భారతీయ యువతి డాక్యుమెంటరీకి ఆస్కార్ అవార్డు
- ఆస్కార్స్ 2019: నామినేషన్ పొందిన సినిమాలు, దర్శకులు, నటులు
- బీబీసీ రియాలిటీ చెక్ సిరీస్: రాజకీయపార్టీలు చెబుతున్న మాటల్లో ఏది వాస్తవం?
- అనిల్ అంబానీ సంపద ఎలా ఆవిరైపోయింది
- మాంసాహారం: మన నైతిక సందిగ్ధాలు
- ప్రేమికులు ప్రేమలో పడటానికి, వారిలో రొమాన్స్‌కు కారణం ఇదే
- జాకబ్ డైమండ్: హైదరాబాద్ నిజాం 'పేపర్ వెయిట్'గా వాడిన రూ.900 కోట్ల వజ్రం ఇదే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








