దిల్లీ ఎన్నికల్లో గెలుపెవరిది.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి

దిల్లీ ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 70 స్థానాలకు నిర్వహించిన ఈ ఎన్నికల్లో సాయంత్రం 6.30 గంటలకు 55.18 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎలక్షన్ కమిషన్ అధికార ప్రతినిధి షెఫాలి శరణ్ వెల్లడించారు.

కాగా పోలింగ్ సరళి ఆధారంగా వివిధ సంస్థలు ఫలితాలను అంచనా వేస్తూ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి.

అడ్డగీత
News image
అడ్డగీత

70 సీట్ల దిల్లీ అసెంబ్లీలో 36 స్థానాలు సాధించిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు. ఆ లెక్కన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ప్రస్తుతం అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీయే(ఆప్) మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని సూచిస్తున్నాయి. ప్రధాన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఆప్‌కు 50 సీట్ల కన్నా ఎక్కువే వచ్చే అవకాశాలున్నాయని సూచిస్తున్నాయి.

ఎలక్షన్ కమిషన్ ఫిబ్రవరి 11న ఓట్లు లెక్కించి అసలు ఫలితాలు ప్రకటించనుంది.

ఏ ఎగ్జిట్ పోల్స్ అంచనా ఎలా ఉంది?

కాంగ్రెస్ ఈసారైనా బోణీ చేసేనా?

2014 ఎన్నికల్లో 70 స్థానాలకు 67 సీట్లను గెలుచుకుని ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం చేపట్టింది. ఆ ఎన్నికల్లో బీజేపీ 3 సీట్లు సాధించగా కాంగ్రెస్ ఒక్క స్థానమూ గెలవలేదు.

ప్రస్తుత ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ప్రభావమేమీ ఉండదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి.

ఏబీపీ న్యూస్-సీఓటర్ ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్‌కు గరిష్ఠంగా 4 సీట్లు రావచ్చని అంచనా వేశారు. మిగతా ఎగ్జిట్ పోల్స్ అన్నీ అంతకంటే తక్కువ సీట్లనే అంచనా వేశాయి.

టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్‌ కాంగ్రెస్ పార్టీకి ఒక్క స్థానమూ దక్కదని అంచనా వేసింది.

ఓటరు వేలికి ఇంకు చుక్క

ఫొటో సోర్స్, Getty Images

70 స్థానాలు.. 672 మంది అభ్యర్థులు

ఈ ఎన్నికల్లో వివిధ పార్టీలకు చెందిన 672 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. మొత్తం 13,750 పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఆమ్‌ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్‌లు ఎన్నికల్లో ప్రధాన పోటీదార్లుగా తలపడ్డాయి. అరవింద్ కేజ్రీవాల్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించగా, బీజేపీ, కాంగ్రెస్‌లు సీఎం అభ్యర్థి పేరును వెల్లడించలేదు.

స్పోర్ట్స్ ఉమెన్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)