India Vs New Zealand రెండో వన్డేలో పోరాడి ఓడిన భారత్, న్యూజీలాండ్‌దే సిరీస్

ఫొటో సోర్స్, Getty Images
ఆక్‌లాండ్‌లో భారత్-న్యూజీలాండ్ మధ్య జరిగిన రెండో వన్డేలో ఆతిథ్య జట్టు టీమిండియాను 22 పరుగుల తేడాతో ఓడించింది. మరో మ్యాచ్ మిగిలుండగానే వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది.
మొదటి వన్డేలో కూడా న్యూజీలాండ్ భారత్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించింది.
రెండో వన్డేలో 49వ ఓవర్ వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో టీమిండియా 251 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
న్యూజీలాండ్ ఇచ్చిన 274 పరుగుల విజయ లక్ష్యం అందుకునేందుకు బరిలోకి దిగిన టీమిండియాకు సరైన ప్రారంభం లభించలేదు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఒక సమయంలో భారత జట్టు తక్కువ పరుగులకే ఆలౌట్ అవుతుందేమో అనిపించింది.
కానీ శ్రేయస్ అయ్యర్(52), రవీంద్ర జడేజా(55), నవదీప్ శైనీ(45) బ్యాటింగ్ ఫలితంగా మ్యాచ్‌లో తుదివరకూ గట్టి పోటీ ఇవ్వగలిగింది.
భారత ఓపెనర్లు పృథ్వీ షా, మయంక్ అగ్రవాల్ 21 పరుగుల భాగస్వామ్యం మాత్రమే అందించగలిగారు.
మూడో ఓవర్‌లో 3 పరుగులు చేసి మయంక్ అగ్రవాల్ హిమేష్ బెనెట్‌కు క్యాచ్ ఇస్తే, ఐదో ఓవర్లో పృథ్వీ షా 24 పరుగులు చేసి కైల్ జెమిసన్ బంతికి బౌల్డ్ అయ్యాడు.
కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా 15 పరుగులే చేసి టిమ్ సౌథీ బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
కోహ్లీ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కే.ఎల్.రాహుల్ 4 పరుగులకే గ్రాండ్‌హామే బౌలింగ్‌లో బౌల్డ్ అవడం, కేదార్ జాధవ్ 9 పరుగులకే సౌథీ బౌలింగ్‌లో నికొలస్‌కు క్యాచ్ ఇవ్వడంతో భారత్ కష్టాల్లో పడిపోయింది.
అర్థ సెంచరీ చేసిన శ్రేయస్ అయ్యర్ అవుటైన తర్వాత శార్దూల్ ఠాకూర్, నవదీప్ శైనీతో కలిసి రవీంద్ర జడేజా జట్టుకు విజయాన్ని అందించే ప్రయత్నం చేశాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
శైనీ 49 బంతుల్లో రెండు సిక్సర్లు, 5 ఫోర్లతో 45 పరుగులు చేసి జేమిసన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.
భారత జట్టులో అత్యధికంగా 55 పరుగులు చేసిన రవీంద్ర జడేజా చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. లక్ష్యాన్ని అందుకునే ప్రయత్నంలో 49వ ఓవర్ వేసిన నీషామ్ బౌలింగ్‌లో గ్రాండ్‌హామేకు క్యాచ్ ఇచ్చాడు.
న్యూజీలాండ్ బౌలర్లు హెమిష్ బెనెట్, టిమ్ సౌథీ, కాలిన్ గ్రాండ్‌హామే, కైల్ జెమిసన్ రెండేసి వికెట్లు పడగొట్టగా, నీషామ్‌కు ఒక వికెట్ దక్కింది.
అంతకు ముందు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించాడు.

ఫొటో సోర్స్, Getty Images
టాస్ గెలిచి భారత్ ఫీల్డింగ్
బ్యాటింగ్‌కు దిగిన న్యూజీలాండ్ జట్టుకు మంచి ప్రారంభం లభించింది. ఓపెనర్లు మార్టిన్ గప్తిల్, హెన్రీ నికొల్స్ మొదటి వికెట్‌కు 93 పరుగుల భాగస్వామ్యం అందించారు.
మార్టిన్ గప్తిల్ 79, నికొల్స్ 41 పరుగులు చేశారు. వీరితోపాటు ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసిన రాస్ టేలర్(73) మరోసారి రాణించడంతో న్యూజీలాండ్ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 273 పరుగులు చేయగిలిగింది.
భారత బౌలర్లలో యజువేంద్ర చహల్ 3 వికెట్లు పడగొట్టగా, శార్దూల్ ఠాకూర్‌కు 2, రవీంద్ర జడేజా 1 వికెట్ లభించాయి.

ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: వధువు, వరుడు లేకుండా పెళ్లి వేడుక జరిగింది
- జింకల వేటకు పెంపుడు చిరుతలు... క్రూర మృగాలనే మచ్చిక చేసుకున్న కొల్హాపూర్ వాసులు
- పెర్ఫ్యూమ్తో పెద్దపులి వేట: మనిషి రక్తం రుచిమరిగిన పులిని పట్టుకునేందుకు చివరి అస్త్రం
- సొమాలియాలో మిడతల దండయాత్ర.. అత్యవసర పరిస్థితి ప్రకటించిన ప్రభుత్వం
- షహీన్‌బాగ్: ‘దిల్లీ కాలుష్యంలో ఆశల గాలి పీల్చాలంటే ఇక్కడకు రావాల్సిందే’ - అభిప్రాయం
- కోనసీమలో కలకలం రేపిన బ్లో అవుట్, మూడోరోజు అదుపు చేసిన ఓఎన్జీసీ
- భారత్‌లో యువత క్యాన్సర్ బారిన ఎందుకు పడుతోంది
- తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలను వదులుకుంటున్న యువకులు
- బడ్జెట్ 2020 :ఆదాయ పన్ను కొత్త శ్లాబ్స్‌తో యువత భవిష్యత్తుతో ఎందుకీ చెలగాటం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









