ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి

ఫొటో సోర్స్, BBC
1.టీటీడీ -గుండె ఆపరేషన్లు: లక్షలు ఖర్చయ్యే చికిత్సలు ఉచితంగా
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానాలు(టీటీడీ) ఆధ్వర్యంలో చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లను ఉచితంగా చేస్తున్నారు.
ప్రైవేటు ఆసుపత్రుల్లో లక్షల రూపాయల ఖర్చయ్యే సేవలను ఇక్కడ ఉచితంగానే అందిస్తున్నట్లు టీటీడీ చెబుతోంది.
తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రి ఆవరణలో ఉండే ''శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం'', పుట్టుకతో వచ్చే గుండె సమస్యల నుంచి గుండె మార్పిడి ఆపరేషన్ల వరకు అనేక రకాల సేవలను అందిస్తోంది.
టీటీడీ ఆధ్వర్యంలోని ''వేంకటేశ్వర ప్రాణదానం'' ట్రస్ట్ ద్వారా ఇది పని చేస్తోంది.
పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

2.గృహలక్ష్మి పథకం: రూ. 3 లక్షలతో ఇంటి నిర్మాణం సాధ్యమేనా?
గృహలక్ష్మి పేరిట తెలంగాణ ప్రభుత్వం కొత్త గృహ నిర్మాణ పథకాన్ని ప్రకటించింది.
సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునే పేదలకు దశల వారీగా రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించడం ఈ పథకం ఉద్దేశం.
గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఈ పథకానికి సంబంధించి ఇచ్చిన హామీకి, ప్రస్తుతం తీసుకువచ్చిన గృహలక్ష్మి పథకానికి వ్యత్యాసం కనిపిస్తోంది.
ముఖ్యంగా లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించే విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సగానికి కోత విధించింది.
పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ఫొటో సోర్స్, Getty Images
3.ఈ విషయాలు తెలుసుకుంటే మీకు డబ్బు సమస్యలు ఉండవు
డాక్టర్ విమల్ కృష్ణ రాజ్‌పుత్ కంటి వైద్యులు. బెంగళూరు నారాయణ నేత్రాలయలో ఆయన పనిచేస్తున్నారు.
కోవిడ్ మహమ్మారి మన దేశాన్ని కుదిపేసిన సమయంలో ఎంతో మంది పేషెంట్ల కష్టనష్టాలు ప్రత్యక్షంగా ఆయన చూశారు.
ఆ గడ్డు పరిస్థితులలో పేషెంట్ల ఆవేదన నుంచి పుట్టిన పుస్తకం '5 W's of Financial Planning'.
ఆర్థిక స్వావలంబన ఎంత ముఖ్యమో ప్రతీ ఒక్క వ్యక్తికీ సులభంగా అర్థం కావడానికి ఆయన చేసిన ప్రయత్నమే ఈ పుస్తకం.
ఎలాంటి ఫైనాన్స్ లేదా ఎకనామిక్స్ అనుభవం లేకుండా కేవలం తను స్వయంగా చేసిన రీసెర్చ్ నుంచి తెలుసుకున్న పాఠాలు అందరికీ అందజేయాలనే ఉద్దేశంతో రాసిన పుస్తకం ఇది.
డాక్టర్ విమల్ ఇదే విషయాన్ని తన ముందుమాటలో పేర్కొన్నారు.
పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ఫొటో సోర్స్, AFP
4.యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తే హిందువులపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
భారత్‌లో వివిధ మతాలు, విశ్వాసాలను బట్టి పెళ్లి, విడాకులు, వారసత్వం, దత్తత అనే అంశాల్లో వేర్వేరు చట్టాలు అమల్లో ఉన్నాయి.
అయితే, దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫామ్ సివిల్ కోడ్-యూసీసీ) కోసం డిమాండ్ వినిపిస్తూనే ఉంది.
ఈ కోడ్ కింద ఒకే చట్టం ఉంటుంది. ఈ చట్టం అనేది మతం, లింగం, లైంగిక అంశాలను పట్టించుకోదు. అందర్నీ ఒకే రీతిలో చూస్తుంది.
పౌరులకు ఇలాంటి చట్టాలను అందించేందుకు దేశం ప్రయత్నించాలని రాజ్యాంగం కూడా చెబుతోంది.
అయితే, దేశంలోని హిందూ, ముస్లిం కమ్యూనిటీలు ఈ చట్టాన్ని విమర్శిస్తున్నాయి. సుప్రీంకోర్టు మాటల్లో చెప్పాలంటే ఇది ఒక 'డెడ్ లెటర్'.
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.

ఫొటో సోర్స్, BRITISH LIBRARY
5.అనుప్‌గిరి గోసైన్: ఈ నగ్న నాగా సాధువు ఒక 'భయంకర' యుద్ధ వీరుడు
అనుప్‌గిరి గోసైన్... ఓ భయంకరమైన కమాండర్. నగ్న యోధుల ప్రైవేట్ సైన్యాన్ని కాలినడకన, గుర్రాలు, ఫిరంగులతో యుద్ధభూమికి నడిపించిన వీరుడు.
నిజానికి, అనుప్‌గిరి గోసైన్ ఒక సన్యాసి. శివభక్తికి అంకితమైన వ్యక్తి. భారతదేశంలో ప్రత్యేక గౌరవం పొందే ఒక నాగ సాధువు.
నాగసాధువులు నగ్నంగా, జడలతో, బూడిద పూసుకుని కనిపిస్తారు. దేశంలో ఎంతో ఘనంగా జరుపుకునే కుంభమేళాలో వీళ్లు తరచుగా కనిపిస్తారు.
'వారియర్ అస్టిక్స్ అండ్ ఇండియన్ ఎంపైర్స్' పుస్తకం రచయిత విలియం ఆర్ పించ్ వివరణ ప్రకారం గోసైన్ ఒక యోధ సన్యాసి.
కచ్చితంగా చెప్పాలంటే నాగులకు భయంకరమైన, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారనే ఖ్యాతి ఉంది. స్పష్టమైన తేడా ఏంటంటే 18వ శతాబ్దపు నాగులు ఎక్కువగా ఆయుధాలు, క్రమశిక్షణతో ఉండేవారు.
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి:
- విజయవాడ ఎయిర్-పోర్ట్- ప్రైవేట్ క్యాబ్ సేవల విషయంలో అధికారులది రోజుకో తీరు, ప్రయాణికులు బేజారు
- హజ్ యాత్ర- మండిపోతున్న ధరలతో పెరిగిన భారం
- వాగ్నర్ లాంటి 'ప్రైవేట్ ఆర్మీలు' ప్రపంచమంతటా ఎలా పని చేస్తుంటాయి... హైదరాబాద్ నిజాం మీదకు విజయనగర సామ్రాజ్యం కిరాయి సైనికులను
- సీపాప్ - సీపీఏపీ- నిద్రలో ఊపిరాడక ఇబ్బంది పడుతున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వాడుతున్న ఈ పరికరం ఏమిటి- ఎలా పనిచేస్తుంది
( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








