ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి

ఫొటో సోర్స్, Getty Images
1.హైదరాబాద్: హుస్సేన్ సాగర్‌లో బుద్ధ విగ్రహం మునిగిపోయినప్పుడు ఏం జరిగింది?
హైదరాబాద్ పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చేవాటిలో నగరం నడిబొడ్డున ఉండే హుస్సేన్ సాగర్, అందులోని బుద్ధ విగ్రహం తప్పక ఉంటాయి.
నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) ప్రత్యేకంగా తయారు చేయించిన ఈ విగ్రహం హైదరాబాద్ ప్రత్యేకతల్లో ఒకటి.
అయితే ఈ విగ్రహం చుట్టూ ఓ విషాద గాథ ఉందని, ఇది హుస్సేన్ సాగర్ అడుగున రెండేళ్లు ఉందని ఈ తరం వారిలో చాలా మందికి తెలియదు.
అప్పట్లో విగ్రహం తరలింపు సమయంలో దీని కింద పడి ఎనిమిది మంది చనిపోయారు.
ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ద వాషింగ్టన్ పోస్టు అప్పట్లో ఈ విషాదంపై విమర్శనాత్మక కథనం కూడా రాసింది.
పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ఫొటో సోర్స్, DR. MOHAMMED SAFIULLAH, THE DECCAN HERITAGE TRUST
2.ముకరం జా: ఈ ఏడో నిజాం వారసుడి రూ.4,000 కోట్ల సంపద ఎలా ఆవిరైంది?
హైదరాబాద్ సంస్థానం ఎనిమిదో నిజాం 'ముకరం జా'కు ''మీరు 86 ఏళ్ల వయసు వరకు జీవిస్తారు''అని ఒక స్విట్జర్లాండ్ జ్యోతిష్యుడు చెప్పారు.
దీనికి కొన్నేళ్ల ముందే, తుర్కియేలోని అనాతోలియాలో ముకరం జాను జర్నలిస్టు-రచయిత జాన్ జుబ్రిస్కీ కలిశారు. అప్పటికి ముకరం వయసు 71 ఏళ్లు.
మధుమేహాన్ని నియంత్రించేందుకు ఆయన మందులు వేసుకునేవారు. సిగరెట్లు కూడా తాగేవారు.
''మా తాతయ్య రోజుకు 11 గ్రాముల నల్లమందు తీసుకునేవారు. పైగా ఆయన చైన్ స్మోకర్. ఆయనే 80 ఏళ్లు బతికారు. నేను కచ్చితంగా ఆయన కంటే ఎక్కువ ఏళ్లే జీవిస్తాను''అని జాన్ జుబ్రిస్కీతో ముకరం అన్నారు.
అయితే, 2023లో ముకరం మరణించినప్పుడు సరిగ్గా ఆయన వయసు 89 ఏళ్లు.
పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

3.హైదరాబాద్: 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం గురించి 10 ఆసక్తికర అంశాలు
హైదరాబాద్‌లో హుస్సేన్ సాగర్ ఒడ్డున, కొత్త సచివాలయం పక్కన భారీ అంబేడ్కర్ విగ్రహం ప్రారంభానికి సిద్ధమైంది.
2016 ఏప్రిల్ 14న అప్పటికి బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా 125 అడుగులు భారీ విగ్రహం ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు.
ఆ విగ్రహం అంబేడ్కర్ 132వ జయంతి నాడు ఆవిష్కారం కాబోతోంది. విగ్రహం విశేషాలు పది పాయింట్లలో...
పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

4.విశాఖ రుషికొండపై నిర్మాణాలు: హైకోర్టు కమిటీ ఏం తేల్చింది?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రుషికొండ హాట్ టాపిక్‌గా మారింది. మైనింగ్ సహా వివిధ కారణాలతో పలు చోట్ల కొండలను పిండిచేస్తున్నా పట్టించుకోని రాజకీయ పక్షాలు రుషికొండ విషయంలో మాత్రం ప్రత్యేక ఆసక్తి ప్రదర్శిస్తుంటాయి.
దానికి ప్రధాన కారణం విశాఖపట్నాన్ని పాలనా కేంద్రంగా ప్రకటించడమే కాకుండా, దానికి అనుగుణంగా ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాలకు రుషికొండ కేంద్రంగా మారడం.
వాస్తవానికి రుషికొండపై ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ( ఏపీటీడీసీ) ఆధ్వర్యంలో హరిత రిసార్ట్స్ నిర్మాణం జరిగి దాదాపు పదేళ్లవుతోంది.
అయితే, ఏపీటీడీసీ రిసార్ట్స్‌ను ఆధునికరిస్తున్నామంటూ ప్రకటించిన ప్రభుత్వం వాటిని తొలగించి, అక్కడ కొత్తగా నిర్మాణాలు చేపట్టింది.
పర్యాటకం పేరు చెప్పినప్పటికీ, కొత్త భవనాల నిర్మాణం పాలనా అవసరాలకు అనుగుణంగా ఉండడంతో వివాదం తలెత్తింది. పర్యావరణ విధ్వంసం అంటూ ఫిర్యాదులు వచ్చాయి.
పూర్తి కథనం కోసం లింక్ మీద క్లిక్ చేయండి.

ఫొటో సోర్స్, Getty Images
5.వజైనల్ ఆట్రఫీ: సెక్స్‌లో నొప్పికి కారణమయ్యే ఈ రుగ్మతకు చికిత్స ఏమిటి?
వజైనల్ ఆట్రఫీ.. దాదాపు మహిళలంతా తమ జీవితంలో ఏదో ఒక దశలో ఈ రుగ్మతకు గురయ్యే ఉంటారు. కానీ, దీని గురించి పెద్దగా ఎవరూ బయటకు మాట్లాడరు.
కొన్నిసార్లు లక్షణాలు తీవ్రంగా కనిపిస్తున్నప్పటికీ వైద్యులను సంప్రదించేందుకు చాలా మంది వెనుకాడుతూ ఉంటారు.
''మొదట్లో చాలా కొద్ది మందినే ఈ రుగ్మత పీడిస్తుందని అనుకునేవారు. కానీ, నేడు చాలా మందికి ఇది వేధిస్తోందని పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా చాలా మందిలో లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొంతమందిలో అయితే, లక్షణాలు ఆందోళనకర స్థాయిలో కూడా కనిపిస్తున్నాయి'' అని సెక్సాలజిస్టు, రీప్రోడక్టివ్ హెల్త్ నిపుణురాలు లారా కామెరా చెప్పారు.
ఈ వ్యాధి వచ్చినట్లు ఎలా తెలుస్తుంది? దీన్ని ఎలా గుర్తు పట్టాలి? దీనికి చికిత్స ఏమిటి?
పూర్తి కథనం కోసం ఈ లింక్ మీద క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి:
- అతీక్ అహ్మద్- ఈ బాహుబలి క్రిమినల్ భార్య, పిల్లలు, సోదరుడి క్రైమ్ కథలు మీకు తెలుసా-
- విశాఖ స్టీల్- ప్లాంట్-ను తెలంగాణ ప్రభుత్వం కొనగలదా- నిబంధనలు ఏం చెబుతున్నాయి-
- తెలంగాణ- సింగరేణి ప్రైవేటు పరం అవుతుందా, బీఆర్ఎస్ పార్టీ నిరసనలు దేనికి-
- పోలీసుల ఘోర తప్పిదంతో టీనేజర్-కు మరణశిక్ష, 28 ఏళ్లు జైల్లోనే..చివరికెలా బయటపడ్డారంటే-
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








