Computer Shortcuts: కీబోర్డుపై F1 నుంచి F12 వరకు ఉండే ఈ కీస్ ఎందుకో తెలుసా?

కంప్యూటర్ షార్ట్‌కట్స్

ఫొటో సోర్స్, Getty Images

మనలో కంప్యూటర్ వాడని వాళ్లు ఎంతమంది ఉంటారు?

ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమేమో కానీ.... కంప్యూటర్ వాడే వాళ్లలో కీ బోర్డ్‌‌ పై వరుసలో కనిపించే F1 నుంచి F12 వరకు ఉండే కీస్ ఉపయోగమేంటో పక్కాగా.. తెలిసిన వాళ్ల సంఖ్య మాత్రం చాలా తక్కువే అని చెప్పవచ్చు.

అప్పుడప్పుడు కొంత మంది కంప్యూటర్ షట్ డౌన్ చెయ్యడానికో లేదా కంప్యూటర్‌ను రీఫ్రెష్ చెయ్యడానికో ఒకట్రెండు కీస్‌ని ఉపయోగిస్తుంటారేమో కానీ ఆ 12 కీస్‌ని విస్తృతంగా ఉపయోగించడం మాత్రం తక్కువే.

అందుకే కీబోర్డ్‌లో ఉండే ఆ 12 కీస్ ఏంటి...? వాటిని ఉపయోగిస్తే మన పని ఎంత సులభంగా పూర్తవుతుందో ఈ కథనంలో చూద్దాం. సౌలభ్యం కోసం కొన్ని కంప్యూటర్ పరిభాషా పదాలను ఆంగ్లంలోనే ప్రస్తావిస్తున్నాం.

F1 నుంచి F12 వరకు వీటిని క్విక్ ఫంక్షన్ కీస్ అంటారు.

వీటిని సరిగ్గా ఉపయోగిస్తే మీకు చాలా టైం సేవ్ అవుతుంది. ముఖ్యంగా విండోస్, మైక్రోసాఫ్ట్ వర్డ్‌ విషయంలో ఈ కీస్ చాలా బాగా ఉపయోగపడతాయని, ఫలితంగా టచ్ స్క్రీన్, మౌస్ వినియోగం తగ్గుతుందని మైక్రోసాఫ్ట్ తన బ్లాగులో పేర్కొంది.

యాపిల్ కీబోర్డ్‌లో కూడా Fతో కూడిన కొన్ని ప్రత్యేకమైన ఫంక్షన్స్‌ గురించి తన వెబ్ సైట్లో వివరించింది.

కంప్యూటర్ షార్ట్‌కట్స్

ఫొటో సోర్స్, Getty Images

F1

విండోస్‌లో F1 ప్రెస్ చెయ్యగానే హెల్ప్ మెన్యూ ఓపెన్ అవుతుంది. అదే ఎక్సెల్‌, వర్డ్‌లో అయితే కంట్రోల్ ప్లస్ F1 ప్రెస్ చెయ్యగానే ఆప్షన్స్ మెన్యూను హైడ్ చెయ్యవచ్చు. తిరిగి రప్పించవచ్చు. F1 + Shift క్లిక్ చేస్తే ఫార్మేటింగ్ టాస్క్ బార్ చూపిస్తుంది. అందులో మీరు ఏ పదం వద్ద కర్సర్ పెడితే అ పదం ఫాంట్, ఫాంట్ సైజ్, లాంగ్వేజ్, ఎలైన్మెంట్, స్పెసింగ్ ఈ వివరాలన్నింటినీ చూపిస్తుంది. మీరు కావాలంటే మార్పులు చేర్పులు కూడా చేసుకోవచ్చు.

అదే యాపిల్ కీ బోర్డ్ విషయానికి వస్తే F1 కీలో చిన్న బల్బ్‌తో కూడిన ఐకాన్ స్క్రీన్ బ్రైట్ నెస్‌ను తగ్గిస్తుంది.

వీడియో క్యాప్షన్, ఈ యాప్ మీకు తెలియకుండా ఫోన్‌లో అన్నీ చూస్తుంది

F2

ఇక F2 సంగతి చూద్దాం.

Alt + Ctrl + F2 ప్రెస్ చెయ్యగానే ఎంఎస్ ఆఫీసులో డాక్యుమెంట్ లైబ్రరీ ఓపెన్ అవుతుంది.

మీరు ఎంఎస్ వర్డ్‌ వాడుతుంటే Ctrl + F2 ప్రెస్ చెయ్యగానే మీరు పని చేస్తున్న ఫైల్ ప్రింట్ ప్రివ్యూ కనిపిస్తుంది.

విండోస్ ఎక్స్‌ప్లోరర్‌లో అయితే F2 కీసాయంతో ఫోల్డర్ లేదా ఫైల్ రీనేమ్ చెయ్యవచ్చు.

ఎక్సెల్‌లో అయితే F2 ప్రెస్ చేసి యాక్టివ్ సెల్‌ను ఎడిట్ చెయ్యవచ్చు.

ఇక యాపిల్‌ కీ బోర్డ్‌లో F2 స్క్రీన్ బ్రైట్‌నెస్‌ను పెంచుతుంది.

కంప్యూటర్ షార్ట్‌కట్స్

ఫొటో సోర్స్, Getty Images

F3

విండోస్ ఎక్స్‌ప్లోరర్ ప్రస్తుతం విండోస్‌ 10లో దీన్నే ఫైల్ ఎక్స్‌ప్లోరర్ అని పిలుస్తున్నారు. అలాగే ఫైర్ ఫాక్స్, క్రోమ్‌ బ్రౌజర్లలో సెర్చ్ ఫంక్షన్ ఓపెన్ చెయ్యడానికి F3ని ఉపయోగిస్తారు.

అలాగే Shift key+F3 ప్రెస్ చేస్తే కర్సర్ తర్వాత ఉన్న లెటర్ లేదా వర్డ్ వెంటనే అప్పర్ కేస్ లేదా లోవర్ కేస్‌లోకి మారిపోతుంది.

మ్యాక్ సిస్టమ్‌లో మిషన్ కంట్రోల్ ఆన్ లేదా ఆఫ్ చేసుకోవచ్చు. అదే మ్యాక్‌లో వర్డ్ ఉపయోగిస్తున్నట్టయితే సెలెక్ట్ చేసిన కంటెంట్‌ను క్లిప్ బోర్డ్‌లో కాపీ చేసుకునేందుకు F3ని ఉపయోగించవచ్చు.

F4

Alt + F4 ప్రెస్ చెయ్యడం ద్వారా ఓపెన్ చేసిన విండోలతో పాటు కంప్యూటర్‌ని కూడా షట్ డౌన్ చెయ్యవచ్చు.

అదే యాపిల్ సిస్టమ్‌లో F4 ప్రెస్ చెయ్యడం ద్వారా లాంచ్ ప్యాడ్ ఆన్, ఆఫ్ చెయ్యవచ్చు.

కంప్యూటర్ షార్ట్‌కట్స్

ఫొటో సోర్స్, Getty Images

F5

వెబ్ బ్రౌజర్‌ను అప్ డేట్ లేదా రీఫ్రెష్ చెయ్యాలంటే F5 ప్రెస్ చెయ్యాల్సిందే. అలాగే క్లియర్ ద క్యాషే అంటే టెంపరరీగా స్టోర్ అయిన ఫైల్స్‌ను డిలీట్‌ చెయ్యాలంటే షార్ట్ కట్ Ctrl + F5 . అలాగే పవర్ పాయింట్ ఉపయోగిస్తున్నట్టయితే మీ ప్రెజెంటేషన్ స్టార్ట్ చేసేందుకు కూడా F5 ఉపయోగించవచ్చు.

మైక్రోసాఫ్ట్ ఆఫీసులో ఫైండ్ అండ్ రీప్లేస్‌ ఆప్షన్‌కి షార్ట్ కట్ కూడా F5 .

యాపిల్ మ్యాక్‌లో కీ బోర్డ్ లైట్ ఇంటెన్సిటీని తగ్గిస్తుంది. అలాగే వర్డ్‌లో గో టూ డైలాగ్ బాక్స్‌ను డిస్ ప్లే చేస్తుంది.

F6

ఒకటి కన్నా ఎక్కువ వర్డ్ డాక్యుమెంట్లను ఓపెన్ చేసినప్పుడు ఒక డాక్యుమెంట్‌ నుంచి మరో దానికి స్ప్లిట్ అయ్యేందుకు షార్ట్ కట్ ... Ctrl + Shift + F6 లేదా Ctrl + F6.

F6 ప్రెస్ చెయ్యడం ద్వారా మ్యాక్‌లో కీ బోర్డ్ లైటింగ్ పెంచుకోవచ్చు. అలాగే మ్యాక్‌లో వర్డ్ డాక్యుమెంట్లు ఒకటి కన్నా ఎక్కువ ఓపెన్ చేసినప్పుడు ఒక దాన్నుంచి మరో దానికి మారేందుకు కూడా F6ని షార్ట్ కట్‌గా ఉపయోగించవచ్చు.

వీడియో క్యాప్షన్, ఆన్‌లైన్ పేకాట ఆడుతూ పట్టుబడితే ఏ శిక్ష పడుతుంది?

F7

వర్డ్ డాక్యుమెంట్లో గ్రామర్ చెక్ చెయ్యాలనుకుంటున్నారా జస్ట్ Alt + F7 షార్ట్ కట్‌ను ఉపయోగించండి. అదే మ్యాక్‌ సిస్టమ్‌లో అయితే Fn కీ పక్కనే ఉన్న shortcut కీని యాక్టివేట్ చేసి F7 ప్రెస్ చెయ్యండి సేమ్ రిజల్ట్ వస్తుంది.

మీకు టైప్ చేసే పదానికి synonym కావాలనుకుంటే విండోస్‌ సిస్టమ్‌లో జస్ట్ Shift + F7 ప్రెస్ చేసి చూడండి. సైడ్ విండోలో డీటైల్డ్‌గా కనిపిస్తాయి.

యాపిల్ యూజర్స్ ఐ ట్యూన్స్‌లో అంతకు ముందు పాట వినాలనుకుంటే జస్ట్ F7 ప్రెస్ చెయ్యండి సరిపోతుంది.

F8

విండోస్‌లో F8 ప్రెస్ చేస్తే వెంటనే సేఫ్ మోడ్ ఎనేబుల్ అయిపోతుంది.

ఎక్సెల్‌లో అయితే ఎక్స్‌టెండెడ్ మోడ్ టర్న్ ఆన్ అవుతుంది.

యాపిల్‌లో ఐట్యూన్స్‌ స్టాప్ చెయ్యడానికి లేదా పాజ్ చెయ్యడానికి F8 షార్ట్ కట్.

అలాగే యాపిల్‌లో వర్డ్ ఉపయోగించినప్పుడు F8 ప్రెస్ చెయ్యడం ద్వారా సెలక్షన్‌ ఎన్‌లార్జ్ చెయ్యవచ్చు.

కంప్యూటర్ షార్ట్‌కట్స్

ఫొటో సోర్స్, Getty Images

F9

విండోస్‌లో Ctrl+F9 షార్ట్ కట్ ద్వారా న్యూ ఎమ్టీ ఫీల్డ్ అంటే మీసాల బ్రాకెట్లను ఇన్ సెర్ట్ చెయ్యవచ్చు. అదే యాపిల్‌లో అయితే సెలెక్టడ్ ఫీల్డ్స్‌ను అప్ డేట్ చెయ్యవచ్చు. అలాగే ఐ ట్యూన్స్‌లో నెక్స్ట్ సాంగ్ వెళ్లాలన్నా షార్ట్ కట్ F9.

F10

ఎంఎస్ వర్డ్‌లో కంటెక్స్ట్ మెన్యూ అంటే మౌజ్ రైట్ క్లిక్‌ చేస్తే వచ్చే మెన్యూకి షార్ట్ కట్ Shift+F10. అదే మాగ్జిమైజ్, మినిమైజ్ చెయ్యాలంటే Ctrl+F10 ప్రెస్ చేస్తే సరిపోతుంది. యాపిల్ సిస్టమ్‌లో ఆడియో టర్న్ ఆన్ లేదా టర్నాఫ్ చెయ్యడానికి షార్ట్ కట్ F10.

వీడియో క్యాప్షన్, కంప్యూటర్, ఫోన్ స్క్రీన్ల నుంచి మన కళ్ళను కాపాడుకోవడం ఎలా?

F11

పీసీలో తక్షణం ఫుల్ స్క్రీన్ మోడ్‌లోకి వెళ్లాలంటే సింపుల్ షార్ట్ కట్ జస్ట్ ప్రెస్ F11 అంతే.

అదే ఎక్సెల్‌లో Shift+F11 ప్రెస్ చేస్తే వెంటనే కొత్త స్ప్రెడ్ షీట్ యాక్టివ్ అవుతుంది.

యాపిల్‌లో F11 ప్రెస్ చెయ్యడం ద్వారా ఆడియో వాల్యూమ్ తగ్గించుకోవచ్చు. అలాగే యాపిల్ సిస్టమ్‌లో వర్డ్ వాడుతున్నప్పుడు నెక్స్ట్ ఫీల్డ్‌కి వెళ్లేందుకు కూడా ఇదే షార్ట్ కట్.

వీడియో క్యాప్షన్, ఈ యాప్స్ ఉంటే మీ ఫోన్ హ్యాక్ అయినట్లే...

F12

విండోస్‌ సిస్టమ్‌లో వర్డ్ ఉపయోగిస్తున్నప్పుడు సేవ్ యాజ్ ఫంక్షన్ ఓపెన్ చెయ్యడానికి షార్ట్ కట్ F12.

Ctrl + Shift + F12 ప్రెస్ చేస్తే వెంటనే ప్రింట్ ఫంక్షన్ కనిపిస్తుంది.

యాపిల్‌ సిస్టమ్‌లో ఆడియో వాల్యూమ్ పెంచుకునేందుకు F12 సింపుల్ షార్ట్ కట్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)