ట్విటర్ కొత్త సీఈవో పరాగ్ అగర్వాల్ ఎవరు? ఆయన గురించి మాజీ సీఈవో ఏం చెప్పారు?

ఫొటో సోర్స్, LINKEDIN/PARAG AGRAWAL
ట్విటర్‌కు కొత్త సీఈవోగా పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. ఆయన ఐఐటీ బాంబేలో చదువుకున్నారు.
ట్విటర్ మాజీ సీఈవో జాక్ డోర్సీ స్థానంలో ఆయన బాధ్యతలు తీసుకుంటారు. జాక్ డోర్సీ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా విషయంతో పాటు పరాగ్ అగర్వాల్ నియామకాన్ని ఆయన ట్విటర్ ద్వారా ప్రకటించారు.
పరాగ్ అగర్వాల్‌ను ట్విటర్ సీఈవోగా ఎందుకు నియమించారో కూడా ఆయన ట్వీట్‌లో వివరించారు.
''ట్విటర్‌కు సహవ్యవస్థాపకుడిగా, సీఈవోగా, చైర్మన్‌గా, ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా, తాత్కాలిక సీఈవోగా తదితర పదవుల్లో 16 సంవత్సరాల పాటు పని చేశాను. ఇప్పుడు వాటిని వదలిపెట్టడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నాను. కానీ ఎందుకు?''
''మొదటిది, పరాగ్ అగర్వాల్ కొత్త సీఈవో కాబోతున్నారు. అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించిన తర్వాత మా కంపెనీ బోర్డు, పరాగ్ అగర్వాల్‌ను ఏకగ్రీవంగా ఈ పదవి కోసం ఎన్నుకుంది. కంపెనీతో పాటు దాని అవసరాలను పరాగ్ లోతుగా అర్థం చేసుకున్నారు. అందుకే చాలా కాలంగా నేను ఆయనను అభిమానిస్తున్నా'' అని డోర్సీ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పరాగ్ లక్షణాలు
కంపెనీ తీసుకున్న ప్రతీ కీలక నిర్ణయం వెనుక పరాగ్ ఉన్నారని డోర్సీ చెప్పారు. ఆయన చాలా ఉత్సాహవంతుడు. పరిశోధనాత్మకంగా, తార్కికంగా, సృజనాత్మకంగా ఆలోచిస్తారు. అంకితభావంతో పాటు వినయంగా ఉంటారని చెప్పారు.
''అతను టీమ్‌కు హృదయపూర్వకంగా, చిత్తశుద్ధితో నాయకత్వం వహిస్తారు. ఆయన నుంచి నేను ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటాను. సీఈవోగా ఆయన రాణిస్తారని నేను చాలా నమ్మకంగా ఉన్నా'' అని ఆయన రాసుకొచ్చారు.
డోర్సీ చెప్పిన దాని ప్రకారం ఆయన రాజీనామాకు రెండో కారణం, కంపెనీ బోర్డు చైర్మన్‌గా ఉండటానికి బ్రెట్ టేలర్ అంగీకరించడం.
''నేను సీఈవో అయినప్పుడు, ఆయనను బోర్డులో సభ్యునిగా చేరాలని కోరాను. ఆయన ప్రతీ అంశంలోనూ అద్భుతంగా పనిచేశారు. ఆయన నాయకత్వంపై నేను చాలా ఆత్మవిశ్వాసంగా ఉన్నా. ఆయనకు ఈ బాధ్యతను అప్పగించడంతో నాకెంతో ఆనందం కలిగిందో మీకు తెలియదు'' అని డోర్సీ హర్షం వ్యక్తం చేశారు.
తన రాజీనామాకు మూడో కారణాన్ని కూడా ఆయన చెప్పారు. ''తాజా టీమ్ సామర్థ్యంపై చాలా విశ్వాసంగా ఉన్నా. ఈ టీమ్ గురించి నాకు ఎన్నో కలలు ఉన్నాయి. మీరంతా కూడా మా వెంటే ఉన్నారు'' అని ఆయన చెప్పుకొచ్చారు.
తన పదవీకాలం ముగిసేవరకు, కంపెనీ బోర్డులో కొనసాగుతానని... దీనివల్ల పరాగ్, బ్రెట్ టీమ్‌కు కాస్త సాయంగా ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత బోర్డు నుంచి కూడా తప్పుకుంటానని అన్నారు.
''టీమ్‌కు నాయకత్వం వహించే అవకాశం పరాగ్‌కు ఇవ్వాలని నేను నమ్ముతున్నా'' అని ఆయన చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
పరాగ్ అగర్వాల్ ఏం అన్నారు?
జాక్ డోర్సీతో పాటు ఇతర సహచరులకు పరాగ్ అగర్వాల్ ధన్యవాదాలు తెలిపారు.
''థ్యాంక్యూ జాక్. నాకు పెద్ద గౌరవం లభించింది. మీ నిరంతర సలహాలు, సూచనలు, మీ స్నేహానికి నేను కృతజ్ఞుడను. మీరు నాపై ఉంచిన నమ్మకానికి, మేము భవిష్యత్‌ను ఆత్మవిశ్వాసంగా ఎదుర్కొనేలా మమ్మల్ని ప్రేరేపించిన టీమ్ అందరికీ నేను కృతజ్ఞుడిగా ఉంటా''
''నేను 10 ఏళ్ల క్రితం ఈ కంపెనీలో చేరిన సమయంలో 1000 కంటే తక్కువ సంఖ్యలో ఉద్యోగులు ఉండేవారు. దశాబ్దం క్రితం నేను కంపెనీలో చేరాను కానీ నాకు నిన్ననే ఇందులోకి అడుగుపెట్టినట్లుగా ఉంది. ఇన్నేళ్ల ప్రయాణంలో చాలా ఎత్తుపల్లాలు, సవాళ్లు, విజయాలు, తప్పిదాలను చూశాను. కానీ, అప్పుడూ ఇప్పుడూ ట్విటర్ అద్భుత ప్రభావాన్ని చూపిస్తూ నిరంతర అభివృద్ధి దిశగా సాగుతూనే ఉంది'' అని పరాగ్ ట్వీట్ చేశారు.
''మా లక్ష్యాలను సాధించడానికి వీలుగా మేం ఇటీవల వ్యూహాలకు మెరుగులు దిద్దాం. అయితే, మా షేర్ హోల్డర్స్‌తో పాటు వినియోగదారులకు ట్విటర్‌ను ఉత్తమ ప్లాట్‌ఫామ్‌గా ఎలా అందించాలన్నదే ఇప్పుడు మా ముందున్న సవాలు''
''మునుపెన్నడూ లేని విధంగా ప్రపంచం మనల్ని గమనిస్తోంది. చాలామంది ప్రజలు విభిన్న దృక్పథాలను, అభిప్రాయాలను కలిగి ఉంటారు. వారంతా ట్విటర్‌ను, మన కంపెనీ భవిష్యత్‌ను, మన పనిని గమనిస్తుంటారు. అందుకే మన ట్విటర్ పూర్తి శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి చూపెడదాం. రండి'' అని ఆయన ట్వీట్ చేశారు.
పరాగ్ అగర్వాల్ ఎవరు?
- పరాగ్ అగర్వాల్ భారత్‌లో జన్మించారు. ఆయన ఇక్కడి అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్‌లో చదువుకున్నారు.
- ప్రతిష్టాత్మక ఐఐటీ బాంబే నుంచి బీటెక్ కంప్యూటర్ సైన్స్ డిగ్రీని పొందారు. ఆ తర్వాత స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్‌డీ చేశారు.
- 2011 అక్టోబర్‌లో పరాగ్, అడ్వర్టైజింగ్ ఇంజనీర్‌గా ట్విటర్‌లో చేరారు. తక్కువ కాలంలోనే ఆయన కంపెనీ 'బెస్ట్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్'గా ఎదిగారు.
- 2018లో ట్విటర్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్‌గా ఆయన నియమితులయ్యారు.
- ట్విటర్‌లో చేరడానికి ముందు ఆయన AT&T, మైక్రోసాఫ్ట్, యాహూ కంపెనీల్లో రీసెర్చ్ ట్రైనింగ్ పూర్తి చేశారు.
- 2006లో నాలుగు నెలల పాటు మైక్రోసాఫ్ట్‌లో, ఆ తర్వాత 2007 జూన్ నుంచి 2008 సెప్టెంబర్ వరకు యాహూలో రీసెర్చర్‌గా పనిచేశారు.
- ఆ తర్వాత మరో 4 నెలల పాటు మైక్రోసాఫ్ట్‌లో పనిచేసి, ఏటీ&టీ ల్యాబ్స్‌కు మారారు. దీని తర్వాత ట్విటర్‌లో ప్రయాణం ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి:
- 'కేంద్రం గుప్పిట్లో పౌరుల సమాచారం'
- కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు భారత్ తీసుకోవాల్సిన 5 చర్యలు..
- భారత్-పాక్ యుద్ధం-1971: రణరంగంలో భారత కమాండర్ రాసిన లేఖకు పాకిస్తాన్ అధికారి ఎలా బదులిచ్చారంటే...
- కరోనావైరస్ కొత్త వేరియంట్ పేరు 'ఒమిక్రాన్', ఆందోళనకరంగా ఉందన్న డబ్ల్యూహెచ్‌వో
- ‘కూతురిపై రెండేళ్లుగా అత్యాచారం చేసిన తండ్రిని చంపేసిన నలుగురు టీనేజీ కుర్రాళ్లు’
- యూరోపియన్ దేశాల్లో కోవిడ్ ఆంక్షలపై తిరగబడుతున్న జనాలు.. రెచ్చగొడుతున్న 3 అంశాలు..
- అభినందన్ వర్థమాన్‌కు వీర్ చక్ర అవార్డు ఇవ్వడంపై పాకిస్తాన్ ఏమందంటే..
- ఆరంకెల జీతాలతో ఆకర్షిస్తున్న డేటా సైంటిస్ట్ ఉద్యోగాలు
- ఈ చిన్న అట్టపెట్టె లాంటి ఉపగ్రహాలు ప్రపంచాన్ని ఎలా మార్చేయబోతున్నాయి?
- హనుమ విహారి ఫౌండేషన్, ఎన్టీఆర్ ట్రస్టు మధ్య గొడవేంటి? ఈ క్రికెటర్ ట్విటర్ నుంచి ఎందుకు తప్పుకున్నాడు?
- 'ఇప్పుడే నీ చేతుల్లో చచ్చిపోయా'.. ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ విడాకులపై రూమర్లకు ఈ కామెంట్ సమాధానమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










