సత్య నాదెళ్ల: మైక్రోసాఫ్ట్ చైర్మన్‌గా నియమితులైన తెలుగు తేజం

ఫొటో సోర్స్, Getty Images
మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ బుధవారం తమ ప్రస్తుత ఛైర్మన్ జాన్ థాంప్సన్ స్థానంలో సీఈఓ సత్య నాదెళ్లను చైర్మన్‌గా ప్రకటించినట్లు రాయిటర్స్ తెలిపింది.
2014లో స్టీవ్ బాల్మర్ స్థానంలో మైక్రోసాఫ్ట్ సీఈఓ అయిన సత్య నాదెళ్ల లింక్డిన్, నాన్స్ కమ్యూనికేషన్స్, జెనిమాక్స్ లాంటి బిలియన్ డాలర్ల కొనుగోళ్లతోపాటూ సంస్థ వ్యాపారాన్ని వృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు.
2014లో సంస్థ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ నుంచి చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన థాంప్సన్, లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా సంస్థకు సేవలు అందిస్తారని మైక్రోసాఫ్ట్ చెప్పింది.
ప్రపంచంలో అతిపెద్ద స్వచ్ఛంద సంస్థల్లో ఒకటైన 'బిల్, మెలిండా గేట్స్ ఫౌండేషన్' పనులపై దృష్టి పెట్టాలంటూ బిల్ గేట్స్ బోర్డు నుంచి తప్పుకున్న ఏడాది తర్వాత సంస్థలో ఉన్నతస్థాయి కార్యనిర్వాహక మార్పు జరిగింది.

ఫొటో సోర్స్, FACEBOOK/MICROSOFT
సత్య నాదెళ్ల నేతృత్వంలో మైక్రోసాఫ్ట్
సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈఓ అయిన తరువాత ఆ కంపెనీ కొత్త మార్గాల్లోకి విస్తరించింది. ముఖ్యంగా, కోవిడ్ మహమ్మారి వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పెరగడం, విద్యార్థులకు బోధన కూడా ఆన్‌లైన్లో కొనసాగాల్సి రావడం వంటి పరిణామాలు మైక్రోసాఫ్ఠ్‌కు చెందిన అజ్యూర్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ 50 శాతం అభివృద్ధి సాధించిందని 2021 జనవరిలో ఆ కంపెనీ తెలిపింది.
2020లో మైక్రోసాఫ్ట్ కంపెనీ షేర్ ధర 41 శాతం పెరిగింది. ఈ ఏడాదిలో ప్రారంభంలోనూ ఈ విలువ మరో 5 శాతం పురోగమించింది. మొత్తంగా, 2019 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఈ సంస్థ 3,690 కోట్ల డాలర్ల ఆదాయం ఆర్జిస్తే, అది 2020 డిసెంబర్లో ఆ సంఖ్య 4308 కోట్ల డాలర్లకు పెరిగింది.

ఫొటో సోర్స్, Twitter/Satya Nadella
మైక్రోసాఫ్ట్‌ను సత్య నాదెళ్ల అమెరికాలోని రెండవ అతిపెద్ద విలువైన సంస్థగా తీర్చిదిద్దారని అమెరికాకు చెందిన ది వాల్ స్ట్రీట్ జనరల్ పత్రిక పేర్కొంది. ఆపిల్ తరువాత రెండవ అతిపెద్ద కంపెనీగా అవతరించిన మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రస్తుత మార్కెట్ విలువ 1,90,000 కోట్ల డాలర్లు.
ప్రస్తుతం చైర్మన్‌గా నియమితులైన సత్య నాదెళ్ల సీఈఓగా కూడా కొనసాగుతారని మైక్రోసాఫ్ట్ తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- వంట నూనెల ధరలు సలసల కాగుతున్నాయి... ఎందుకిలా?
- జీ 7: రెవెన్యూ ఆర్జించే చోటే పన్నులు వసూలుచేసే ఒప్పందానికి పచ్చజెండా
- భారీ కృత్రిమ దీవి నిర్మాణానికి డెన్మార్క్ పార్లమెంట్ ఆమోదం
- క్రికెట్ 2050: వాతావరణ మార్పులతో ఈ ఆట ఆడే తీరే మారిపోతుందా?
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- కరోనావైరస్: గర్భిణులు వ్యాక్సీన్ తీసుకోకూడదా... డాక్టర్లు ఏమంటున్నారు?
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- కరోనావైరస్ను జయించారు సరే, కానీ ఈ విషయాలను ఏమాత్రం మర్చిపోకండి
- మ్యూకోర్మైకోసిస్: భారత్‌లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








