పాన్ కార్డు మోసాలు: సన్నీ లియోనికి తెలియకుండానే ఆమె పాన్ కార్డుపై లోను ఎలా తీసుకున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పెదగాడి రాజేశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
సైబర్ నేరగాళ్లు తమకు తెలియకుండానే తమ పాన్ కార్డును ఉపయోగించుకుని రుణాలు తీసుకున్నారని ఇటీవల కొందరు ట్విటర్లో ఆరోపించారు.
ఇలా మోసపోయిన వారిలో రాయిటర్స్ వార్తా సంస్థ జర్నలిస్టు ఆదిత్య కాల్రా ఒకరు. ఆయన పాన్ కార్డుతో గుర్తుతెలియని వ్యక్తులు ''పర్సనల్ లోన్'' తీసుకున్నారు. ఉత్తర్ ప్రదేశ్, బిహార్ చిరునామాలతో ఆయన పేరిట ఈ రుణం జారీ అయింది.
''నాకు తెలియకుండా నా పేరుతో రుణం ఎలా తీసుకుంటారు?'' అని ఆయన వ్యాఖ్యానించారు. ''నా క్రెడిట్ రిపోర్టు చూడగానే షాక్‌కు గురయ్యాను. ధని లోన్స్ నుంచి ఉత్తర్ ప్రదేశ్, బిహార్ చిరునామాలతో నా పాన్ కార్డుపై రుణం తీసుకున్నట్లుగా ఉంది. పైగా ఇప్పటికే ఈ రుణం ఎగవేసినట్లు నా క్రెడిట్ హిస్టరీలో చూపిస్తోంది''అని ట్విటర్ వేదికగా ఆయన వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఆదిత్య షేర్ చేసిన పత్రాల్లో రూ.9,945 పెండింగ్ ఉన్నట్లు కనిపిస్తోంది. గత నవంబరు, డిసెంబరుల్లో రుణ వాయిదా కట్టకుండా ఎగవేసినట్లు కనిపిస్తోంది. తన క్రెడిట్ స్కోరుపై ఇది ప్రభావం చూపిస్తోందని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘ఆ చిరునామా ఎవరిదో తెలియదు’’
కమ్యూనికేషన్ స్ట్రాటజీ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న కార్తీక్ శ్రీనివాసన్ కూడా ఇలానే మోసపోయినట్లు ట్వీట్ తన పాన్ కార్డుపై ఐవీఎల్ ఫైనాన్స్ (ధని లోన్స్ మాతృ సంస్థ) నుంచి ఎవరో లోన్ తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
రుణ పత్రాల్లో చూపించిన మహారాష్ట్రలోని నందుర్బార్ చిరునామాలో తాను ఎప్పుడూలేనని కార్తీక్ వివరించారు.
మరోవైపు ఇలానే తన పాన్ కార్డుపైనా గుర్తుతెలియని వ్యక్తులు లోన్ తీసుకున్నారని నీరజ్ మెహ్తా కూడా ఆరోపించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ధని లోన్స్ నుంచి రుణం తీసుకున్నట్లుగా రికార్డుల్లో చూపిస్తోందని, తన మొబైల్ నంబరుకు ఎలాంటి ఓటీపీ రాలేదని, ఆ నంబరు ఫేక్ అని ఆయన వివరించారు.
డేటా సైంటిస్టుగా పనిచేస్తున్న జుబిన్ మెహ్తా, మర్చంట్ నేవీలో పనిచేస్తున్న రిషభ్ బబూటా తదితరులు కూడా ఇలానే తమ పాన్ కార్డుతో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు రుణాలు తీసుకున్నారని వెల్లడించారు.
మరోవైపు బాలీవుడ్ నటి సన్నీ లియోని కూడా తన పాన్ కార్డును గుర్తుతెలియని వ్యక్తులు ఉపయోగించుకొని రూ. 2,000 లోన్ తీసుకున్నారని ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
అయితే, ఆ రుణ సమస్యను పరిష్కరించినందుకు ధన్యవాదాలు చెబుతూ ధని లోన్స్ మాతృసంస్థ ఐవీఎల్‌ను ఆమె ట్యాగ్ చేశారు. మిగతావారి సమస్యలను కూడా పరిష్కరించాలని ఆమె కోరారు.

ఫొటో సోర్స్, NSDL
మా దృష్టికి వచ్చింది..
కొందరు సామాన్యుల ఐడీ కార్డులను ఉపయోగించి మోసపూరిత రుణాలు తీసుకున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు ధని లోన్స్ అధికార ప్రతినిధి ప్రకర్ ఖందేల్వాల్ బీబీసీతో చెప్పారు.
''వస్తున్న ఫిర్యాదులన్నింటినీ పరిగణలోకి తీసుకుంటున్నాం. ఒకవేళ నకిలీ ధ్రువపత్రాలతో రుణాలు పొందినట్లు విచారణలో తేలితే, వెంటనే క్రెడిట్ బ్యూరోకు సమాచారం అందిస్తాం''అని ఆయన చెప్పారు.
''కస్టమర్ల నుంచి వచ్చే సమాచారాన్ని ధ్రువీకరించేందుకు మేం అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన జీ-డిఫెన్స్‌ను ఉపయోగిస్తున్నాం. వీటితో మోసపూరిత ఐడీలను అడ్డుకోవచ్చు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తాం. ప్రజల నుంచి వస్తున్న సమస్యలను పరిష్కరించేందుకు కస్టమర్‌కేర్ సిబ్బందిని కూడా పెంచుతున్నాం''అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ-కేవైసీతో..
ధని లాంటి ఫిన్‌టెక్ సంస్థలు ఈ-కేవైసీ ద్వారా రుణాలను ఇస్తుంటాయి. వ్యక్తుల ఐడెంటిటీని ధ్రువీకరించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ లాంటి సాంకేతికతలను ఉపయోగిస్తుంటాయి. తాజా పాన్ కార్డు మోసాలు కూడా ఇలానే జరిగి ఉండొచ్చని ఆర్థిక నిపుణుడు వీ ప్రశాంత్ చెప్పారు.
''కొన్ని ఆర్థిక ముఠాలు ఇలా ఆన్‌లైన్‌లో దొరికే పాన్, ఆధార్ కార్డులతో రుణాలు పొందేందుకు ప్రయత్నిస్తుంటాయి. వీటిని వీడియో కేవైసీతో అడ్డుకోవచ్చు. ఆధార్, పాన్ ధ్రువీకరణ తర్వాత సదరు వ్యక్తితో వీడియో కాల్‌లో మాట్లాడి కొన్ని సంస్థలు రుణాలు మంజూరు చేస్తుంటాయి. తాజా రుణాల విషయంలో అది జరగకపోయుండొచ్చు''అని ఆయన అన్నారు.
మరోవైపు ఇటీవల కాలంలో పాన్‌కార్డు వాడకం ఎక్కువవుతోందని ఆర్థిక నిపుణుడు నాగేంద్ర సాయి అన్నారు.
''రూ.2 లక్షలు దాటితే కేవైసీ తప్పనిసరిగా అడుగుతారు. అలాంటి సమయాల్లో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆన్‌లైన్‌లో దొరికే పాన్ కార్డులు ఉపయోగిస్తుంటారు. బంగారం కొనేటప్పుడు, రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లోనూ ఇలానే ఎవరో ఒకరి పాన్‌కార్డు ఉపయోగించి అప్పటికి పని జరిగేలా చూసుకుంటారు. అందుకే పాన్ విషయంలో మనం అప్రమత్తంగా ఉండాలి''అని ఆయన వివరించారు.
ఈ చర్యలతో పాన్ భద్రంగా
పాన్ కార్డు ఇలా ఆన్‌లైన్ నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్త పడాల్సిన అవసరముందని ఆర్థిక నిపుణుడు నాగేంద్ర సాయి చెప్పారు.
ఈ విషయంలో ఆయన కొన్ని సూచనలు చేశారు.
- ఆదాయపు పన్ను వెబ్‌సైట్‌లోని ఫార్మ్-26ఏను మనం అప్పుడప్పుడు గమనిస్తూ ఉండాలి. పాన్ కార్డుతో ఏదైనా ట్రాన్‌సాక్షన్ జరిగితే దీనిలో మనకు తెలుస్తుంది.
- ఐడీలు అవసరమైనప్పుడు పాన్ కార్డుకు బదులుగా ఆధార్ లాంటి ఓటీపీలు వచ్చే ఐడీలను వాడితే మంచిది.
- పాన్ కార్డును వాడేటప్పుడు జెరాక్స్‌పై దాన్ని ఎందు కోసం ఇస్తున్నామో కూడా రాయాలి. డేట్‌తోపాటు సంతకం కూడా పెట్టాలి. దీంతో దీన్ని వేరే అవసరాలకు వాడకుండా చర్యలు తీసుకున్నట్లు అవుతుంది.
- డిజిటల్ లేదా స్కాన్ కాపీలను ఇతరుల ల్యాప్‌టాప్‌లు, ఫోన్లలో స్టోర్ చేయకూడదు. జెరాక్స్ షాపుల్లోనూ స్కాన్ చేసేటప్పుడు దగ్గరే ఉండాలి. స్కానింగ్ పూర్తయిన తర్వాత మన మెయిల్‌కు పంపుకొని, అక్కడ కాపీని డిలీట్ చేయమని సూచించాలి.
- వెబ్‌సైట్లలో అవసరమైతే తప్ప, పాన్, పుట్టినతేదీ, పూర్తి పేరు లాంటి వివరాలు ఇవ్వకూడదు.
- పాన్‌తో ఎలాంటి అవసరమూ లేకపోతే, దాన్ని ప్రభుత్వానికి సరెండర్ చేయాలి. ఆన్‌లైన్‌లోనూ మనం పాన్‌కార్డును సరెండర్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:
- అహ్మదాబాద్ బాంబు పేలుళ్ల కేసు: 38 మందికి మరణశిక్ష విధించిన కోర్టు.. 56 మంది మృతికి కారణమైన ఆ రోజు ఏం జరిగింది?
- 30 ఏళ్ల తర్వాత బయటపడ్డ ఘోస్ట్ సిటీ.. ‘భయానకం. కానీ, ఇదే వాస్తవం’
- మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలో కోళ్లను ఎందుకు ఎగరేస్తున్నారంటే..
- రంగారెడ్డి జిల్లాలో ‘వితంతువుల తండా’: ‘మా ఊరిలో శుభకార్యాలకు ముత్తైదువలు లేరు.. పక్క ఊళ్ల నుంచి పిలిపిస్తున్నాం’
- విజయవాడలో హిజాబ్ వివాదం, ఆంధ్ర లయోలా కాలేజీలో అసలేం జరిగింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















