‘మొట్టమొదటి మేడిన్ ఇండియా ఎయిర్‌క్రాఫ్ట్ కమర్షియల్ ఆపరేషన్’ అంటూ మోదీ ప్రభుత్వంలోని మంత్రులు చేస్తున్న ప్రకటనలు ఎంతవరకు నిజం?

ఫొటో సోర్స్, @kishanreddybjp/Twitter
- రచయిత, జుగల్ పురోహిత్
- హోదా, బీబీసీ డిస్ ఇన్ఫర్మేషన్ యూనిట్
'మేడ్-ఇన్-ఇండియా డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా భారతదేశంలో మొట్టమొదటి కమర్షియల్ సర్వీసును ప్రారంభిస్తున్నట్లు గత మంగళవారం (ఏప్రిల్ 12) భారత పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రకటించారు.
మంత్రిత్వ శాఖ ఒక ప్రెస్ నోట్‌లో కూడా ఇదే విషయాన్ని చెప్పింది.
'మేడ్ ఇన్ ఇండియా హెచ్‌ఏఎల్ తయారీ డోర్నియర్ డో-228 మొదటి విమానం అస్సాంలోని దిబ్రూఘర్ నుండి అరుణాచల్ ప్రదేశ్‌లోని పాసిఘాట్‌కి ప్రయాణించింది'' అని వెల్లడించింది.
'అలయన్స్ ఎయిర్ సివిల్ కార్యకలాపాల కోసం మేడిన్ ఇన్ ఇండియా విమానాలను నడిపే భారతదేశపు మొదటి వాణిజ్య విమానయాన సంస్థ అవుతుంది'' అని ఈ ప్రకటన పేర్కొంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన కొందరు మంత్రులు కూడా సోషల్ మీడియాలో ఇదే తరహా ప్రకటనలు చేశారు.
కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఒక ట్వీట్ లో ''మేడ్ ఇన్ ఇండియా డోర్నియర్-228 విమానం ఇప్పుడు ఉడాన్ పథకం కింద పనిచేస్తోంది. ఈ మొట్టమొదటి స్వదేశీ విమానం నిన్ననే ఎగిరింది"అని పేర్కొన్నారు.
''కొంతమంది మేడిన్ ఇండియా క్యాంపెయిన్‌ను, ప్రధానమంత్రి మోదీ ప్రకటించిన ఆత్మనిర్భరభారత్ పథకాలను ఎగతాళి చేస్తూ మాట్లాడారు. ఇప్పుడు హిందుస్తాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ తయారీ డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్ సరికొత్త భారతదేశపు సత్తాను చాటింది'' అని కేంద్ర న్యాయ శాఖమంత్రి కిరెన్ రిజిజు పోస్ట్ చేశారు.
పలు మీడియా సంస్థలు కూడా ఇదే తరహాలో వార్తలు రాశాయి.

ఫొటో సోర్స్, Pushpindar Singh, Vayu Aerospace & Defence Review
మరి వాదనలు, ప్రకటనలు నిజమేనా?
నిజం కాదు. ఈ వ్యవహారాన్ని మనం రెండుగా విభజించి చూడాల్సి ఉంటుంది. మొదటిది, ఇండియా మొట్టమొదట తయారు చేసిన ప్యాసింజర్ విమానం ఏది? రెండోది, డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్ గురించి వాస్తవాలేంటి?
మొదటి ప్రశ్నకు జవాబు: ప్రభుత్వ రికార్డుల ప్రకారమే, ఇండియాలో తయారు చేసిన మొదటి పాసింజర్ విమానం డోర్నియర్ ఎయిర్ క్రాప్ట్ కాదు. మొదటి ఎయిర్ క్రాఫ్ట్ పేరు ‘ఆవ్రో‘
1967, జూన్ 25న ప్రభుత్వం చేసిన ఒక ప్రకటనలో ‘‘ఇండియా దేశీయంగా తయారు చేసిన 14 ఆవ్రో విమానాలలో మొదటి దానిని ఇండియన్ ఎయిర్ లైన్స్ కార్పోరేషన్ రూట్లలో ప్రవేశపెడుతూ, దాని బాధ్యతలను పర్యాటక, పౌర విమానయాశాఖమంత్రి డాక్టర్ కరణ్ సింగ్‌కు, రక్షణ మంత్రి సర్దార్ స్వరణ్ సింగ్ అందజేయనున్నారు. జూన్ 28న జరిగే కార్యక్రమంలో ఈ విమానాలను అందజేస్తారు. ఆవ్రో అనేది భారతదేశంలో దేశీయంగా తయారు చేసిన ప్యాసింజర్ విమానం. ఒక్కో విమానం ధర రూ.82.53 లక్షలు'' అని ఉంది.
ఈ విమానాల తయారీ సంస్థ బీఏఈ సిస్టమ్స్, తమ ఆవ్రో విమానం గురించి ఇలా ప్రకటించింది.
హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసిన 89 విమానాలతోపాటు, మొత్తం 381 విమానాలను నిర్మించాం. ఇది నంబర్ 1, 1961న ఎగిరిన మొట్టమొదటి భారతీయ తయారీ విమానం.
ఈ వ్యవహారం గురించి హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థను సంప్రదించేందుకు బీబీసీ పదే పదే చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ సంస్థ కేంద్ర రక్షణ శాఖ నేతృత్వంలో పని చేస్తుంది.

ఫొటో సోర్స్, BAE
అయితే, ఒక ప్రభుత్వ అధికారి దీని గురించి మాట్లాడారు. కానీ, ఆయన తన పేరు రాయడానికి ఇష్టపడలేదు.
''ఇండియన్ మేడ్ ఎయిర్ క్రాఫ్ట్‌ను మొట్టమొదటిసారి వినియోగించిన సంస్థ ఇండియన్ ఎయిర్ లైన్స్'' అని ఆయన స్పష్టం చేశారు.
దీనిపై బీబీసీ స్వతంత్ర నిపుణులను కూడా సంప్రదించింది.
తాను ఇండియన్ ఎయిర్ లైన్స్‌లో పని చేసినప్పుడు స్వయంగా ఆవ్రో విమానాలలో ప్రయాణించానని విమాయాన రంగ నిపుణుడు కెప్టెన్ మోహన్ రంగనాథన్ వెల్లడించారు. ప్రస్తుతం మంత్రులు చేస్తున్న ప్రకటనలు బోగస్ అన్నారు.
''ఇది తప్పుదోవ పట్టించే ప్రకటన'' అని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ ఫౌండర్ ప్రెసిడెంట్ కెప్టెన్ మినూ వాడియా అన్నారు.
అలయన్స్ ఎయిర్ సంస్థ ఇండియాలో తయారైన ఎయిర్ క్రాఫ్ట్‌లను కమర్షియల్‌గా వినియోగిస్తున్న తొలి సంస్థ అన్న వాదనను వాడియా తోసిపుచ్చారు.
''టిక్కెట్లు అమ్మి, విమానంలో పాసింజర్లను తీసుకెళ్లే ఏ విమానమైనా కమర్షియల్ ఫ్లైట్ అనిపించుకుంటుంది. పాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్‌లకు, కమర్షియల్ ఫ్లైట్లకు తేడా లేదు. ఇండియాలో తయారైన కమర్షియల్ విమానాలు గతంలో కూడా ఎగిరాయి'' అని వాడియా స్పష్టం చేశారు.

ఫొటో సోర్స్, @kishanreddybjp/Twitter
రెండో ప్రశ్న: డోర్నియర్ ఇండియాలో తయారైన తొలి ఎయిర్క్రాఫ్ట్ అవుతుందా?
గతంలో కూడా ఇండియాలో తయారైన డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్‌లు కమర్షియల్ సర్వీసులు నడిపినట్లు బీబీసీ సేకరించిన డాటా ఆధారంగా తేలింది. ప్రభుత్వ రంగంలో నడిచే హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 1980ల నుంచి విమానాలను తయారు చేస్తోంది. వాటిలో కొన్ని ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లీట్‌లో భాగంగా ఉండేవి.
"1980ల ప్రారంభంలో, వైమానిక దళం, నౌకాదళం, కోస్ట్ గార్డ్, ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు ఫీడర్ ఎయిర్‌లైన్ అయిన వాయుదూత్ అవసరాలను తీర్చడానికి ఎల్టీఏ అనే 'లైట్ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్' స్వదేశీ తయారీ విమానాలను పరిశీలించడం ప్రారంభమైంది.
ఇందు కోసం నాలుగు విమాన తయారీ సంస్థలు గుర్తించారు. వాటిలో బ్రిటీష్ ఐలాండర్, జర్మన్ డోర్నియర్, ఇటాలియన్ కాసా, ఇంకా అమెరికన్ ట్విన్ ఒట్టర్ ఉన్నాయి.
వీటిలో డోర్నియర్ విమానాలు అత్యుత్తమంగా ఉన్నాయని నౌకాదళం, కోస్ట్ గార్డ్, వాయుదూత్‌లు వెల్లడించాయి. డోర్నియర్ విమానాల దేశీయ తయారీకి కాన్పూర్‌లోని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ను ఎంపిక చేశారు.
1986 ఏప్రిల్ నాటి డిఫెన్స్ మేగజైన్ వాయు ఏరోస్పేస్ & డిఫెన్స్ రివ్యూ ఆర్కైవ్‌ల నుంచి మేడ్ ఇన్ ఇండియా ఎయిర్‌క్రాఫ్ట్ డోర్నియర్ వాయుదూత్ ఫ్లీట్‌తో అనుబంధంగా మారినట్లు తెలిపే కథనం క్లిప్‌ను బీబీసీ సంపాదించింది. ఇండియన్ ఎయిర్‌లైన్స్ కమర్షియల్ విభాగాలలో వాయుదూత్ ఒకటి.

ఫొటో సోర్స్, Pushpindar Singh Collection
ఆ నివేదికలో "22 మార్చి 1986న ఉదయం కాన్పూర్‌లోని చకేరీ ఎయిర్‌ఫీల్డ్‌లో, కాన్పూర్ డివిజన్ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారుచేసిన ఐదు డోర్నియర్- 228 తేలికపాటి రవాణా విమానాలలో మొదటిదానిని ప్రాంతీయ విమానయాన సంస్థ వాయుదూత్‌కు అప్పగించారు" అని ఉంది.
"హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మొదటిసారి నిర్మించిన డోర్నియర్ (డో- 228) విమానం 1986లో వాయుదూత్‌కు డెలివరీ అయింది. అయితే, అంతకుముందు నుంచే జర్మనీ తయారీ డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్ 1984 నుంచి ఆ సంస్థ (వాయుదూత్) రోల్స్‌లో ఉంది'' అని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అంగద్ సింగ్ అన్నారు.
ఈ సందర్భంగా ఆయన 1998 ఏప్రిల్ 27నాటి ఒక ఫొటోను బీబీసీకి షేర్ చేశారు. ఈ ఫొటో మిలిటరీ హిస్టారియన్ పుష్పిందర్ సింగ్ చోప్రా కలెక్షన్ నుంచి తీసుకున్నారు.
''ఈ విమానం ఎప్పటి నుంచో ఉంది. వీటి సిరీస్‌ను హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసింది'' అని అంగద్ సింగ్ అన్నారు.
''ఏప్రిల్ 12, 2022న ఎగిరిన విమానం ఒక ప్రత్యేక వేరియంట్ విమానం. ఇది గతంలో తయారైన డోర్నియర్-228లకు అప్‌గ్రేడెడ్ వెర్షన్. ఆ విధంగా చూసుకుంటే ఇది మొట్టమొదటి రెవిన్యూ ఫ్లైట్ అవుతుంది'' అన్నారు సింగ్.
వాయుదూత్‌ను 1981లో జనవరి 26న ప్రారంభించారు. విమాన సౌకర్యాలు లేని ప్రాంతాల కోసం ఇది ప్రత్యేకంగా ఏర్పాటైంది. వాయుదూత్ సంస్థ దగ్గరున్న ఆధారాల ప్రకారం, మార్చి 1982 నాటికి ఈశాన్య భారతదేశం సహా 23 ప్రాంతాలకు వాయుదూత్ సర్వీసులు విస్తరించాయి.
''తర్వాత కొన్నాళ్లకు వాయుదూత్‌ను ఇండియన్ ఎయిర్ లైన్స్ విలీనం చేసుకుంది. ఆ తర్వాత కొన్నాళ్లపాటు వాయుదూత్‌కు చెందిన ఎయిర్ క్రాఫ్ట్‌లను ఇండియన్ ఎయిర్ లైన్స్ నడిపింది'' అని సింగ్ వెల్లడించారు.
అంటే దీని అర్ధం, మేడ్ ఇన్ ఇండియా ఫ్లైట్లు దశాబ్ధాల కిందటే కమర్షియల్ ఫ్లైట్లుగా పని చేశాయి. ఈ ఆధారాలతో కేంద్ర పౌర విమానయాన శాఖను సంప్రదించేందుకు బీబీసీ ప్రయత్నించింది.
ఈ అంశంపై ఏప్రిల్ 23న భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్పందించింది. తొలి మేడిన్ ఇండియా ఎయిర్‌క్రాఫ్ట్ డోర్నియర్ అంటూ చెబుతున్న అంశంపై వివరణ ఇచ్చింది. అయితే, ఆవ్రో విమానాలపై మంత్రిత్వ శాఖ స్పందించలేదు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
''నేడు మీరు చూస్తున్న డీవో-228లో పరికరాలు, నమూనా పూర్తి భిన్నమైనవి. ఇది తొలి మేడిన్ ఇండియా కమర్షియల్ ఎయిర్‌క్రాఫ్ట్''అని మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
''పాత మోడల్‌కు ఈ మోడల్‌కు చాలా తేడా ఉంది. తాజా మోడల్‌ను అధునాతన సాంకేతికత, శక్తిమంతమైన ఇంజిన్లతో తయారుచేశారు. దీనిలో నావిగేషన్ వ్యవస్థ కూడా అధునాతనమైనది''అని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
''అలయన్స్ ఎయిర్ నడుపుతున్న తాజా విమానం.. విడి భాగాల నుంచి చివరి వరకు పూర్తిగా భారత్‌లోనే తయారైంది. దీనికి డీజీసీఏ ఎయిర్‌వర్తీనెస్ సర్టిఫికేట్ కూడా ఇచ్చింది''అని మంత్రిత్వ శాఖ వివరించింది. అయితే, ఆవ్రో విమానాల గురించి మంత్రిత్వ శాఖ స్పందించలేదు.
ఇవి కూడా చదవండి:
- నరేంద్ర మోదీ మహిళా ఓటర్లను ఎలా ఆకర్షిస్తున్నారు? ఫెమినిస్ట్‌లు లేకపోయినా బీజేపీకి మహిళల ఓట్లు ఎందుకు పడుతున్నాయి?
- హాలీవుడ్ సెన్సేషన్ 'మెర్ల్ ఓబెరాన్': బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి ఈ భారతీయ తారను మనం మరిచిపోయామా?
- హనుమాన్ జయంతి: దిల్లీ జహాంగీర్‌పురీలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు, పోలీసులకు గాయాలు... 14 మంది అరెస్ట్
- తెలంగాణ జీవరేఖ ప్రాణహిత... రాక్షస బల్లులు, పెద్ద పులులు తిరుగాడిన నదీ తీరం
- గవర్నర్ విషయంలో పాటించాల్సిన ప్రోటోకాల్ ఏంటి? తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య వివాదం ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














