హనుమాన్ జయంతి: దిల్లీ జహాంగీర్‌పురీలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు, అరెస్టైన వారికి 14 రోజుల కస్టడీ

ఫొటో సోర్స్, Getty Images
వాయువ్య దిల్లీలోని జహాంగీర్‌పురీ ప్రాంతంలో రెండు వర్గాల మధ్య హింస చెలరేగింది. ఈ ఘటనలో మొత్తంగా తొమ్మిది మంది గాయపడినట్లు వాయువ్య దిల్లీ డీసీపీ ఉష రంగ్‌నానీ చెప్పారు. ''గాయపడిన వారిలో ఎనిమిది మంది పోలీసులు ఉన్నారు. వీరికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు''అని ఉష వివరించారు. ఈ ఘటనకు సంంబంధించి ఇప్పటివరకు 14 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
ఈ కేసు విచారణ చేస్తున్న రోహిణ్ కోర్ట్ అరెస్టయిన 14 మందిలో ఇద్దరిని 14 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది. మిగతా 12 మందిని జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించాలని ఆదేశించింది.
కొన్నిచోట్ల ఆందోళనకారులు రాళ్లు రువ్వారని, వాహనాలకు కూడా నిప్పు పెట్టారని పోలీసులు వెల్లడించారు.
పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలను తక్షణమే తీసుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. దిల్లీ పోలీసు విభాగానికి సూచించారు. దిల్లీ పోలీసుల్లోని ఉన్నత అధికారులతో ఆయన మాట్లాడారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1

ఫొటో సోర్స్, ANI
పరిస్థితులు అదుపులో..
ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని దిల్లీ పోలీసు కమిషనర్ రాకేశ్ అస్థానా చెప్పారు. ప్రభావిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించినట్లు ఆయన వెల్లడించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
‘‘దిల్లీలోని అన్ని సున్నితమైన ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించాం. తాజా ఘర్షణల్లో ఇద్దరు పోలీసులు కూడా గాయపడ్డారు. ఘర్షణలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’’అని ఆయన చెప్పారు.
సీనియర్ పోలీసు అధికారులు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని సూచించినట్లు ఆయన ఒక ట్వీట్ చేశారు.
ఎలాంటి వదంతులు వినొద్దని, ఫేక్ న్యూస్‌కు ప్రభావితం కావొద్దని ప్రజలకు దిల్లీ పోలీసు కమిషనర్ అభ్యర్థించారు.

ఫొటో సోర్స్, ANI
14 మంది అరెస్టు
ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు 14 మందిని అరెస్టు చేశారు.
ఈ ఘటనలో మొత్తంగా తొమ్మిది మంది గాయపడినట్లు వాయువ్య దిల్లీ డీసీపీ ఉష రంగ్‌నానీ చెప్పారు. ''గాయపడిన వారిలో ఎనిమిది మంది పోలీసులు ఉన్నారు. వీరికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు''అని ఉష వివరించారు.
''యాత్ర శాంతి యుతంగానే జరుగుతోంది. అయితే, సీబ్లాక్‌లోని మసీదుకు సమీపంగా వెళ్లినప్పుడు నలుగురు నుంచి ఐదుగురు వచ్చి వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత రెండు వైపుల నుంచీ రాళ్ల దాడుల జరిగాయి''అని జహాంగీర్‌పురీ ఇన్‌స్పెక్టర్ రాజీవ్ రంజన్ ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.
భద్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలని రెండు వర్గాలకూ ముందే హెచ్చరికలు జారీచేశామని, అయినప్పటికీ రెండు వర్గాలూ రాళ్లతో దాడులకు దిగాయని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
కేజ్రీవాల్ ఏం అన్నారు?
శాంతి, భద్రతల పరిరక్షణలో సహకరించాలని ప్రజలను దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అభ్యర్థించారు. ‘‘దిల్లీలోని జహాంగీర్‌పురీలో రాళ్లతో దాడులు చేసుకోవడాన్ని ఖండిస్తున్నాం. ఈ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. రెండు వర్గాలూ శాంతి భద్రతల పరిరక్షణలో సహకరించాలి’’అని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అభ్యర్థించారు.
ఆ తర్వాత ఈ విషయంపై లెఫ్టినెంట్ గవర్నర్‌తో మాట్లాడానని, శాంతి భద్రతల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చినట్లు కేజ్రీవాల్ మరో ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
మరోవైపు ఈ విషయంపై దిల్లీ పోలీసు విభాగంలో శాంతి భద్రతల విభాగం ఎస్పీ దీపేందర్ పాఠక్ మాట్లాడారు. శాంతి భద్రతల పరిరక్షణలో సహకరించాలని జహాంగీర్‌పురీ ప్రాంతవాసులను ఆయన అభ్యర్థించారు.
పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు తగిన స్థాయిలో పోలీసులను మోహరించినట్లు ఆయన చెప్పారు. ఒక యాత్ర జరుగుతున్నప్పుడు రెండు వర్గాలు ఘర్షణలకు పాల్పడినట్లు ఆయన వివరించారు.
‘‘అది సాధారణ యాత్రే. పోలీసులు కూడా అప్పుడు అక్కడే ఉన్నారు. అయితే, కుశాల్ సినిమా హాల్ పరిసరాల్లో ఒక్కసారిగా ఘర్షణలు మొదలయ్యాయి’’అని ఓ పోలీసు అధికారి పీటీఐతో చెప్పారు.
ఈ అంశంపై భిన్న రాజకీయ పార్టీల నేతలు కూడా స్పందిస్తున్నారు. ఈ ఘర్షణలకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- అంబేడ్కర్ రెండో పెళ్ళి కథ: 'ప్రియాతి ప్రియమైన షారూ... ప్రేమతో నీ రాజా'
- ఇండియన్ స్టాండర్డ్ టైమ్: ఈశాన్య రాష్ట్రాలు రెండో టైమ్ జోన్ కావాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నాయి
- బాయిల్డ్, రా రైస్ మధ్య తేడా ఏమిటి? తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై వివాదం ఎందుకు
- మోహన్ భాగవత్: ‘‘15ఏళ్లలో అఖండ భారత్ కల సాకారం’’.. నెటిజన్లు ఏం అంటున్నారంటే..
- యుక్రెయిన్‌లో రష్యా యుద్ధ ట్యాంకులను భారీగా ఎందుకు కోల్పోతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












