సీ ప్లేన్: మోదీ ప్రారంభించిన ఈ నీటిపై విమానాలు ఏమిటి? స్పైస్‌జెట్ వీటిని ఎన్ని రూట్లలో నడుపుతోంది

సీప్లేన్‌లో నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, facebook/narendra modi

ఫొటో క్యాప్షన్, సీప్లేన్‌లో నరేంద్ర మోదీ

కోవిడ్ మహమ్మారి కారణంగా ఎదురైన వ్యాపార ఇబ్బందులను ఎదుర్కొంటూ నిలదొక్కుకునేందుకు స్పైస్ జెట్ విమానయాన సంస్థ సీప్లేన్లను ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో ఉంది.

దేశంలోనే అతిపెద్ద ప్రాంతీయ విమానయాన సంస్థల్లో ఒకటైన స్పైస్ జెట్‌కి ఇప్పటికే 18 మార్గాలలో సీ ప్లేన్లు నడిపేందుకు అనుమతి ఉంది.

స్వతంత్ర భారత తొలి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 182 మీటర్ల ఎత్తైన విగ్రహం ఉన్న గుజరాత్‌లోని కేవడియా అందులో ఒకటి.

మహమ్మారి సమయంలో ప్రాంతీయ విమానాల ద్వారా సరకు రవాణా లాంటి పనులు చేపట్టి కొత్త మార్గాల ద్వారా ఆదాయం సంపాదించుకునేందుకు స్పైస్ జెట్ ప్రయత్నం చేసింది.

సీ ప్లేన్

ఫొటో సోర్స్, Getty Images

మహమ్మారి సమయంలో యూకే ఫ్లయిబ్, వర్జిన్ ఆస్ట్రేలియా లాంటి సంస్థలే ఆర్ధికంగా పతనమైన సమయంలో స్పైస్ జెట్ నిలదొక్కుకునేందుకు చాలా కష్టాలు పడింది. కొన్ని విమానయాన సంస్థలు ఉద్యోగాలలో కోతలు కూడా విధించాయి.

కొన్ని విమానయాన సంస్థలు ప్రత్యామ్న్యాయ మార్గాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ప్రయత్నాలు చేశాయి. కొన్ని సంస్థలు కేవలం బోజనాలను కూడా సరఫరా చేసేందుకు పని చేశాయి.

సీ ప్లేన్‌లు నడపడం ద్వారా వివిధ ప్రాంతాల మధ్య అనుసంధానాన్ని పెంచవచ్చు" అని స్పైస్ జెట్ చైర్మన్ అజయ్ సింగ్ అన్నారు. కొత్త ఎయిర్ పోర్టులు, రన్ వేలు నిర్మించే అవసరం లేని ఈ ప్రయత్నాలను ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తోంది.

ఈ విమానాలు భూమిపైన, నీటిపైన కూడా టేక్ ఆఫ్ కాగలగడం కూడా ఒక లాభదాయకమైన విషయమని ఆయన అన్నారు.

సీప్లేన్‌లో నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Bjp

ఫొటో క్యాప్షన్, సీప్లేన్‌లో నరేంద్ర మోదీ

సబర్మతి రివర్ ఫ్రంట్ నుంచి కేవడియాకి తొలి సీప్లేన్‌‌ను నరేంద్ర మోదీ ప్రారంభించారు. వల్లభాయ్ పటేల్ 145వ జయంతి కార్యక్రమాలకు హాజరైన ఆయన ఇక్కడ వాటర్ ఏరోడ్రమ్ ప్రారంభించారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు నివాళిగా గుజరాత్ రాష్ట్రంలో నిర్మించిన ఐక్యతా విగ్రహం (స్టాట్యూ ఆఫ్ యూనిటీ) వద్ద వీటిని స్పైస్ జెడ్ నడుపుతుంది.

30 నిమిషాల పాటు ప్రయాణం చేసే ఈ విమానాలను స్పైస్ జెట్ అనుబంధ సంస్థ స్పైస్ షటిల్ నడుపుతుంది. ఒక వైపుకి ప్రయాణ టికెట్ ధర 1500 రూపాయల నుంచి మొదలవుతుంది.

ఇందుకోసం స్పైస్ జెట్ 300 ట్విన్ ఆటర్ సీ ప్లేన్ లను నడుపుతుంది. వీటిని హావిల్లాండ్ కెనడా నిర్మించింది. ఇందులో విమానయాన సిబ్బందితో కలిపి 19 మంది ప్రయాణం చేయవచ్చు.

పటేల్ విగ్రహం వద్ద మోదీ

ఫొటో సోర్స్, facebook/narendramodi

ఈ ట్విన్ ఆటర్ చిన్న విమాన రంగ సంస్థలలో చాలా పేరు పొందినది. వీటిని ఎక్కువగా సీ ప్లేన్ లకు వినియోగిస్తారు. ముఖ్యంగా మాల్దీవులలో వీటి వాడకం ఎక్కువ అని ఫ్లైట్ గ్లోబల్ మ్యాగజైన్ కి చెందిన గ్రెగ్ వాల్డ్రన్ చెప్పారు.

"వీటి పరిమాణం చిన్నదిగా ఉండటం వలన పెద్ద పెద్ద విమానాలు చేరలేని ప్రాంతాలకు కూడా ఇవి వెళ్లే అవకాశం ఉంటుంది".

స్పైస్ జెట్ 2017లో నాగపూర్ , గౌహతి, ముంబయి లలో సీ ప్లేన్ నిర్వహణ గురించి ప్రయోగాలు చేసింది. దీంతో పాటు, నీటి పరీవాహక ప్రాంతాల దగ్గరకు వాయు మార్గ అనుసంధానాన్ని కూడా పరిశీలిస్తోంది.

భారత దేశంలో లాక్ డౌన్ విధించినప్పుడు విదేశాలలో నిలిచిపోయిన భారతీయులను దేశానికి తిరిగి తీసుకుని రావడానికి స్పైస్ జెట్ విమానాలు నడిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)