పాకిస్తాన్ ఎయిర్‌లైన్స్‌లో నకిలీ లైసెన్సుల పైలట్లు

వీడియో క్యాప్షన్, పాకిస్తాన్ ఎయిర్‌లైన్స్‌లో నకిలీ లైసెన్సుల పైలట్లు

పాకిస్తాన్ విమానయాన రంగంలో కొత్త సంక్షోభం మొదలైంది. ఆ దేశానికి చెందిన 262 మంది పైలట్లు నకిలీ లైసెన్సులు కలిగి ఉన్నారని స్వయంగా ఆ దేశ విమానయాన శాఖ మంత్రి ఒక జాబితా విడుదల చేశారు.

అయితే, ఆ జాబితా తప్పులతడకని పైలట్లు అంటున్నారు. విమర్శలు రావడంతో లైసెన్సులు నకిలీవి కాదని, పరీక్ష ప్రక్రియలో లోపోలున్నాయని ప్రభుత్వం పేర్కొంది.

ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకుంటుండగా.. లైసెన్స్ స్కామ్‌తో సంబంధం ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. బీబీసీ ప్రతినిధి షుమాయిలా జాఫ్రీ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)