కరోనావైరస్: పుకార్లు, తప్పుడు సమాచారాన్ని వైరల్ చేసే మనుషులు ఏడు రకాలు

- రచయిత, మారియానా స్ప్రింగ్
- హోదా, స్పెషలిస్ట్ డిజిన్ఫర్మేషన్ రిపోర్టర్
కరోనావైరస్ గురించి కుట్ర సిద్ధాంతాలు, వదంతులు, ఊహాగానాలు.. సోషల్ మీడియాలో వరదలా ప్రవహిస్తున్నాయి. అసలు ఈ వదంతులను మొదలుపెట్టేది ఎవరు? వాటిని వ్యాపింపజేసేది ఎవరు?
ఈ మహమ్మారి కాలంలో తప్పుదోవ పట్టించే వందలాది కథనాల మీద మేం దర్యాప్తు చేశాం. దానివల్ల.. ఈ తప్పుడు సమాచారం వెనుక ఎవరు ఉన్నారనే దాని గురించి ఒక అవగాహన వచ్చింది.
ఈ పుకార్లు పుట్టించి, ప్రచారం చేసే ఏడు రకాల మనుషులు వీరే:
లండన్ వాసులకు తినిపించటం కోసం ప్రభుత్వం వెంబ్లీ స్టేడియంలో ఓ భారీ కుండలో వంట చేస్తోందని ఒక వాట్సాప్ వాయిస్ సందేశం వచ్చినపుడు అది జోక్ అని కొంత మందికి అర్థం కాలేదు.
ఇంకాస్త సీరియస్ ఉదాహరణను పరిశీలిస్తే.. ఒక వ్యక్తి ప్రభుత్వం నుంచి వచ్చిన టెక్ట్స్ మెసేజ్ అంటూ ఒక స్క్రీన్‌షాట్ తయారు చేశాడు. ఈ సందేశం అందుకున్న వ్యక్తి.. ఇంటి నుంచి చాలా సార్లు బయటకు వెళ్లినందుకు జరిమానా విధించామన్నది ఆ టెక్ట్స్ మెసేజ్ సారాంశం. లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తున్న వారిని భయపెట్టటం సరదాగా ఉంటుందని అతడు అనుకున్నాడు.
ఇన్‌స్టాగ్రామ్‌లో అతడి ఫాలోవర్లు దానిని షేర్ చేశాక, అది స్థానిక ఫేస్‌బుక్ గ్రూపుల్లోకి చేరింది. ఆందోళన చెందిన స్థానిక జనం దాన్ని సీరియస్‌గా పట్టించుకున్నారు.

‘‘భయాందోళనలు కలిగించాలని నేను కోరుకోను. కానీ సోషల్ మీడియాలో కనిపించిన ఒక స్క్రీన్‌షాట్‌ను ఎవరైనా నమ్ముతున్నారంటే.. ఇంటర్నెట్‌లో సమాచారాన్ని ఎలా స్వీకరిస్తున్నారనే దాని గురించి వాళ్లు పున:పరిశీలన చేసుకోవాల్సిన అవసరముంది’’ అని ఆ స్క్రీన్‌షాట్ తయారుచేసిన వ్యక్తి చెప్పాడు. అతడి పేరు మాత్రం వెల్లడించలేదు.
ఈ మహమ్మారిని అడ్డుపెట్టుకుని డబ్బులు దండుకోవటానికి ప్రయత్నించే మోసగాళ్లు కూడా ప్రభుత్వం నుంచి, స్థానిక అధికారుల నుంచి అంటూ నకిలీ టెక్ట్స్ మెసేజ్‌లు సృష్టించారు.
ప్రభుత్వం ప్రజలకు సహాయం అందించబోతోందని, కాబట్టి బ్యాంకు ఖాతాల వివరాలు అందించాలని చెప్తున్న ఇటువంటి ఒక సందేశం మీద ‘ఫుల్ ఫ్యాక్ట్’ అనే ఫ్యాక్ట్ చెకింగ్ సంస్థ దర్యాప్తు చేసింది.
ఆ స్కామ్ మెసేజ్ ఫొటోలను ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. అవి టెక్ట్స్ మెసేజ్‌లో సర్క్యులేట్ చేయటం వల్ల వాటి వెనుక ఎవరున్నారనేది తేల్చటం కష్టం.
మోసగాళ్లు డబ్బు సంపాదించటానికి వైరస్ గురించి ఫేక్ న్యూస్‌ను ఉపయోగించుకోవటం ఫిబ్రవరిలోనే మొదలైంది. ‘‘కరోనావైరస్ చికిత్స రివ్యూ కోసం క్లిక్ చేయండి’’ అంటూ, లేదంటే ‘‘మహమ్మారి విజృంభణ కారణంగా మీకు పన్నులు వాపసు వస్తాయి’’ అంటూ ఈమెయిళ్లు మొదలయ్యాయి.

ఈ తప్పుడు సమాచారం ఇంటర్నెట్‌లో ఏవో చీకటి మూలల నుంచి పుట్టుకురాదు.
రోగుల శరీరాలను అతినీలలోహిత కాంతికి గురిచేయటం ద్వారా కానీ, బ్లీచింగ్ పౌడర్‌ను శరీరంలోకి ఎక్కించట ద్వారా కానీ కరోనావైరస్ నయమవుతుందా అని అమెరికా అద్యక్షుడు డోనల్డ్ ట్రంప్ గత వారంలో ప్రశ్నించారు. ఆయన ఊహాగనాలు చేస్తూ.. ఒక సందర్భంలోని విషయాల గురించి వేరే సందర్భంలో మాట్లాడారు.
ఆ వ్యాఖ్యలు వ్యంగ్యంగా చేశానని ట్రంప్ ఆ తర్వాత చెప్పుకొచ్చారు. కానీ.. అది జనాన్ని ఆపలేకపోయింది. చాలా మంది హాట్‌లైన్‌కు ఫోన్‌చేసి.. డిజిన్ఫెక్టెంట్లతో తమకు తాము చికిత్స చేసుకోవటం గురించి అడగడటం మొదలుపెట్టారు.
అమెరికా అధ్యక్షుడు ఒక్కరు మాత్రమే కాదు. చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి ఒకరు.. కోవిడ్-19ను చైనాకు అమెరికా సైన్యమే తీసుకొచ్చిందనే సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు.
మహమ్మారి విజృంభణ వెనుక కుట్ర సిద్ధాంతాల గురించి రష్యా ప్రభుత్వ టీవీ చానల్‌లో ప్రైమ్ టైమ్‌లోనూ, ఆ దేశానికి అనుకూలమైన ట్విటర్ ఖాతాల్లోనూ చర్చలు చేపట్టారు.

వైరస్‌కు సంబంధించిన అనిశ్చితమైన అంశాలన్నీ.. కుట్ర సిద్ధాంతాలు పుట్టుకు రావటానికి సరిగ్గా సరిపోయే పరిస్థితులు కల్పించాయి.
బ్రిటన్ తయారు చేసిన వ్యాక్సిన్‌ను తీసుకున్న మొట్టమొదటి వలంటీర్ చనిపోయారంటూ ఒక తప్పుడు కథనం ప్రచారంలోకి వచ్చింది. వ్యాక్సిన్ వ్యతిరేక, కుట్ర సిద్ధాంత ఫేస్‌బుక్ గ్రూపుల్లో అది సర్క్యులేట్ అయింది. అదంతా కట్టుకథ.
యూట్యూబ్‌లో డేవిడ్ ఐక్ ఇంటర్వ్యూ కూడా.. కరోనావైరస్‌కు, 5జీకి సంబంధం ఉందనే తప్పుడు వాదనలను వ్యాప్తి చేసింది. ఆ ఇంటర్వ్యూను తర్వాత తొలగించారు. డేవిడ్ ఐక్ లండన్ టీవీలో కూడా కనిపించి మాట్లాడారు. తర్వాత అది బ్రిటన్ ప్రసార ప్రమాణాలకు విరుద్ధమని తేల్చారు. ఆయన ఫేస్‌బుక్ పేజీని కూడా.. ‘భౌతిక హాని కలిగించే ఆరోగ్యపరమైన తప్పుడు సమాచారం’ ప్రచురించినందుకు తొలగించారు.

ఒక్కోసారి.. డాక్టర్, ప్రొఫెసర్, హాస్పిటల్ సిబ్బంది వంటి విశ్వసనీయమైన వర్గాల నుంచి కూడా తప్పుడు సమాచారం వస్తున్నట్లు కనిపిస్తోంది.
కానీ ఇటువంటి ‘అంతర్గత వర్గాలు’ ఎక్కువగా ఈ రకంగా ఉండరు.
కరోనావైరస్‌తో బాధపడుతున్న ఆరోగ్యవంతమైన చిన్నారి రోగులు పెద్ద సంఖ్యలో చనిపోతారంటూ భయకంపిత స్వరంతో చెప్తున్న ఒక వాయిస్ మెసేజ్‌ను.. వెస్ట్ ససెక్స్‌లోని క్రాలీకి చెందిన ఒక మహిళ పుట్టించారు. ఒక అంబులెన్స్ సర్వీసులో పనిచేసే తనకు అంతర్గత సమాచారం తెలుసునని ఆమె అందులో పేర్కొన్నారు.
దీని గురించి స్పందించాలని అడిగినపుడు ఆమె నుంచి జవాబు రాలేదు. ఆమె చేస్తున్న ఉద్యోగం గురించి ఆధారం చూపమన్నా స్పందించలేదు. కాబట్టి నిజంగా ఆమె వైద్య సిబ్బందేనా అన్నది మనకు తెలీదు. కానీ ఆమె సందేశంలో చెప్పిన వాదనలు నిరాధరామని మాత్రం తెలుసు.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్‌కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- కరోనావైరస్: ఇంక్యుబేషన్ పీరియడ్ ఏమిటి? వైరస్ - ఫ్లూ మధ్య తేడా ఏమిటి?
- సెక్స్ ద్వారా కరోనావైరస్ సోకుతుందా? కీలకమైన 8 ప్రశ్నలు, సమాధానాలు

అటువంటి భయంగొలిపే సందేశాలు చాలా వైరల్‌గా మారాయి. ఎందుకంటే అవి జనానిని ఆందోళనకు గురిచేశాయి. వాళ్లు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకు షేర్ చేస్తూ పోయారు.
ఎసెక్స్‌లో నివసించే నలుగురు పిల్లల తల్లి డానియెల్ బేకర్ అటువంటి వారిలో ఒకరు. ఫేస్‌బుక్ మెసెంజర్‌లో వచ్చిన ఒక సందేశం ‘ఒకవేళ నిజమే అయితే’ అనుకుని ఫార్వార్డ్ చేశారామె.
‘‘మొదట కొంచెం అనుమానంగా ఉంది. ఎందుకంటే దానిని నాకు తెలియని మహిళ ఎవరో పంపించారు. కానీ.. నేను ఫార్వార్డ్ చేశాను. కారణం.. నాకు, నా చెల్లెలికి అదే వయసులో చిన్న పిల్లలున్నారు. కొంచెం పెద్ద పిల్లలు కూడా ఉన్నారు. మా ఇళ్లలో అందరికీ ఎక్కువ ప్రమాదం ఉంది’’ అని ఆమె వివరించారు.
వీళ్లు సాయపడటానికి ప్రయత్నిస్తున్నారు. ఏదైనా సానుకూలమైన పని చేస్తున్నట్లు భావిస్తున్నారు. కానీ అంతమాత్రాన వారు ఫార్వార్డ్ చేసిన మెసేజీలు నిజమైపోవనుకోండి.
మన అమ్మో, మామో మాత్రమే కాదు.. తప్పుడు వార్తలు పతాక శీర్షికల్లోకి ఎక్కటానికి సెలబ్రిటీలు కూడా సాయపడ్డారు.

గాయకుడు ఎం.ఐ.ఎ, నటుడు వూడీ హారెల్సన్ వంటి ప్రముఖులు సోషల్ మీడియాలో లక్షలాది మంది తమ ఫాలోయర్లకు.. 5జీ కరోనావైరస్ సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్న వారిలో ఉన్నారు.
రాయిటర్స్ ఇన్‌స్టిట్యూట్ ఇటీవల ఇచ్చిన ఒక నివేదికలో.. ఆన్‌లైన్‌లో తప్పుడు సమాచారం వ్యాప్తి చేయటంలో సెలబ్రిటీలు కీలక పాత్ర పోషిస్తారని వెల్లడైంది.
కొందరికి సంప్రదాయ మీడియాలో కూడా భారీ వేదికలున్నాయి. 5జీ కుట్ర సిద్ధాంతాలకు వత్తాసు పలుకుతూ ‘ఐటీవీ దిస్ మోర్నింగ్’ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఏమాన్ హోమ్స్ విమర్శల పాలయ్యారు.
‘‘అది నిజం కాదని వాళ్లకి తెలియనపుడు.. అది నిజం కాదని మెయిన్‌స్ట్రీమ్ మీడియా వెంటనే కొట్టిపారేయటాన్ని నేను ఒప్పుకోను’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
హోమ్స్ ఆ తర్వాత క్షమాపణ చెప్పారు. ఆ వ్యాఖ్యల విషయంలో ఐటీవీకి ఆఫ్‌కామ్ మార్గదర్శకాలు జారీ చేసింది.
ఇలస్ట్రేషన్స్: సైమన్ మార్టిన్
అదనపు రిపోర్టింగ్: ఓల్గా రాబిన్సన్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- లాక్డౌన్ సడలింపు: ఏపీలో మద్యం షాపుల ముందు భారీగా క్యూలు... ఇతర దుకాణాలు తెరవడంపై గందరగోళం
- అమెరికాలో కరోనావైరస్ వల్ల కనీసం 1,00,000 మంది చనిపోతారు: డోనల్డ్ ట్రంప్
- కరోనావైరస్ సంక్షోభం తర్వాత గూగుల్, ఫేస్‌బుక్, యాపిల్, అమెజాన్ మరింత బలపడతాయా?
- కరోనావైరస్ లాక్డౌన్: దేశంలో నిరుద్యోగం, పేదరికం విపరీతంగా పెరిగిపోతాయా? సీఎంఐఈ నివేదిక ఏం చెప్తోంది?
- చైనాలో యాంటీ వైరస్ కార్లు నిజమా? గిమ్మిక్కా?
- ఫేస్ మాస్కులు ధరించిన దేవుళ్లు: కరోనావైరస్ మీద జానపద చిత్రకారుల పోరు
- కరోనావైరస్ లాక్డౌన్: విమాన, రైల్వే ప్రయాణాలకు రంగం సిద్ధం... 'ఈ నెలలోనే సేవలు ప్రారంభం'
- కరోనావైరస్ సంక్షోభం తర్వాత తయారీ రంగంలో చైనా స్థానాన్ని భారత్ భర్తీ చేస్తుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








