కరోనావైరస్: ఆమె రాసిన ‘వుహాన్ డైరీ’లో ఏముంది? ఆమెను చైనాలో ‘దేశద్రోహి’ అని ఎందుకు అంటున్నారు?

ఫొటో సోర్స్, GETTY IMAGES
కరోనావైరస్ విజృంభించిన తొలి నాళ్లలో వుహాన్‌లో రోజువారీ జీవితాన్ని వెలుగులోకి తెచ్చిన ఓ ప్రముఖ రచయిత డైరీని ఇప్పుడు ఇంగ్లిష్‌లోని అనువదిస్తున్నారు.
జనవరి నుంచే వుహాన్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలను, తన అనుభవాలను ఆన్‌లైన్ డైరీగా రాయడం మొదలుపెట్టారు 65 ఏళ్ల ఫేంగ్ ఫేంగ్.
అప్పటికి కరోనావైరస్ సంక్షోభం చైనాకు మాత్రమే పరిమితం.
ఆమె డైరీ బాగా వైరల్ అయ్యింది. కరోనావైరస్ పుట్టిన వుహాన్‌లో ఏం జరుగుతుందో చైనాలో లక్షల మంది తెలుసుకునేందుకు ఇది తోడ్పడింది.
కరోనావైరస్ వ్యాప్తి భయంతో ప్రపంచంలో సంపూర్ణ లాక్‌డౌన్ విధించిన తొలి నగరం వుహాన్. అప్పుడు చైనా ప్రధాన భూభాగంతో పాటు ప్రపంచానికీ ఈ నగరంతో సంబంధాలు దాదాపుగా తెగిపోయాయి.
లాక్‌డౌన్ పొడిగిస్తున్నకొద్దీ ఫేంగ్ పాపులారిటీ కూడా పెరిగింది. దీంతో ఆమె డైరీలోని సంగతులను వేరే భాషల్లోకి అనువదిస్తామంటూ ప్రచురణకర్తలు ముందుకువస్తున్నారు.
అయితే, అంతర్జాతీయంగా ఆమెకు వస్తున్న గుర్తింపుపై చైనా గుర్రుగా ఉంది. ఆమె రిపోర్టింగ్‌ను చాలా మంది చైనావాసులు తప్పుపడుతున్నారు. కొందరైతే ఆమెను దేశద్రోహిగా చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇంతకీ డైరీలో ఏముంది?
జనవరి చివరిలో వుహాన్‌లో చైనా లాక్‌డౌన్ విధించింది. అప్పుడు నగరంలో జరుగుతున్న సంగతులను ఫేంగ్.. చైనా సోషల్ మీడియా వేదిక వీబోలో ఆన్‌లైన్ డైరీగా రాయడం మొదలుపెట్టారు.
బలవంతంగా ఐసొలేషన్‌లో పెట్టడంతో పడే మానసిక ఒత్తిడి మొదలుకుని.. అనునిత్యం ఎదురవుతున్న సవాళ్ల వరకూ అన్నింటినీ ఆ డైరీలో ఆమె ప్రస్తావించారు.
"భయం, ఆవేదన, కోపానికి ఆమె గొంతుకనిచ్చారు. అంతేకాదు లక్షల మంది తోటి పౌరుల్లో ఆమె మళ్లీ ఆశలు చిగురించేలా చేశారు" అని ప్రచురణ సంస్థ హార్పర్ కొలిన్స్ వ్యాఖ్యానించింది.
"కరోనావైరస్‌కు కళ్లెం వేసే క్రమంలో చోటుచేసుకున్న అధికార దుర్వినియోగం, సామాజిక అన్యాయం, ఇతర సమస్యల గురించి కూడా ఆమె డైరీలో ప్రస్తావించారు. దీంతో కొన్ని వివాదాలకు ఆమె కేంద్ర బిందువుగా మారారు."
విమానాశ్రయం నుంచి తన కుమార్తెను తీసుకురావడానికి వెళ్లినప్పుడు జరిగిన సంగతులను ఆమె ఓ కథనంలో వివరంగా రాసుకొచ్చారు. ఇది ‘సండే టైమ్స్’లో ప్రచురితమైంది.
"రోడ్ల మీద కార్లు కానీ పాదచారులు కానీ కనిపించలేదు. ఆ రోజుల్లో భయం రాజ్యమేలేది. నేను, మా అమ్మాయి ఎప్పుడూ మాస్క్‌లు ధరించే ఉండేవాళ్లం" అని ఆమె వివరించారు.

ఫొటో సోర్స్, AFP
అంతర్జాతీయ గుర్తింపు ఎలా వచ్చింది?
చైనా తమ దేశంలో వార్తలను పూర్తిగా నియంత్రిస్తుంది. స్వతంత్రంగా పనిచేసే వార్తా సంస్థలే లేవు. ఈ తరుణంలో అందరూ విశ్వసనీయ సమాచారం కోసం ఫేంగ్ ఫేంగ్‌పై ఆధారపడ్డారు. రచయితగా ఆమెకున్న పేరు కూడా ప్రజల్లో విశ్వాసం పెంచింది.
"ఈ దేశానికి మీలా నిజాయితీతో పనిచేసే రచయితలు కావాలి. ప్రభుత్వం విడుదల చేసే సమాచారాన్ని ఎవరూ నమ్మట్లేదు"అని ఓ వీబో వినియోగదారుడు వ్యాఖ్యానించినట్లు ద ఇండిపెండెంట్ న్యూస్ వెబ్‌సైట్ పేర్కొంది.
"ఆమె డైరీతో పాటు పేరు ప్రఖ్యాతలూ చాలా త్వరగా చైనాను దాటి విదేశాలకు వెళ్లాయి."

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా

చైనాకు కోపం ఎందుకు?
చైనా సోషల్ మీడియాలో సైబర్ జాతీయవాదం సర్వసాధారణం. చైనాను విమర్శించినా, ఆరోపణలు చేసినా, అవమానించినా వేల మంది చైనా పౌరులు సోషల్ మీడియాలో విరుచుకుపడుతుంటారు. ఇలాంటి విమర్శలు ఎదుర్కొన్న రచయితల్లో ఫేంగ్ ఫేంగ్ మొదటివారేమీ కాదు.
కరోనావైరస్ ప్రపంచ దేశాలకు పాకిన సమయంలో.. అసలు చైనా దీనికి ఎలా కళ్లెం వేసేందనే అంశంపై అందరి దృష్టీ పడింది. అదే సమయంలో చైనాలో ఫేంగ్ ఫేంగ్‌పై విపరీతంగా విమర్శలు వెల్లువెత్తాయి.
అప్పుడే ఫేంగ్ ఫేంగ్ డైరీపై పశ్చిమ దేశాల మీడియా దృష్టి పడింది.

ఫొటో సోర్స్, AFP
"ఆమె రాసిన డైరీ అంతర్జాతీయ ఎడిషన్‌గా మారింది. అమెజాన్‌లోనూ దీన్ని విక్రయించారు. దీనిపై చైనావాసులు విమర్శలు గుప్పించారు" అని వాట్స్ ఆన్ వీబో వెబ్‌సైట్ పేర్కొంది.
"వుహాన్‌లో వైరస్ వ్యాప్తి కట్టడికి అనుసరించిన తీరును విమర్శిస్తూ ఫేంగ్ రాసిన డైరీ అనువాదాన్ని చైనా ప్రత్యర్థుల చేతికి దొరికిన ఆయుధంగా చాలా మంది చైనావాసులు భావించారు."
ఆమెను వాస్తవాలు కళ్లకు కడుతున్న రిపోర్టర్‌గా కంటే చైనా దేశ ద్రోహిగా ఎక్కువ మంది అభివర్ణించారు. కొందరైతే పాపులారిటీని ఆమె సొమ్ము చేసుకుంటోందనీ వ్యాఖ్యలు చేశారు.
"ఆత్యయిక పరిస్థితినీ ఆమె అవకాశంగా మలచుకుంటోంది. ఇది చాలా నీచమైన పని" అని ఓ వీబో వినియోగదారుడు వ్యాఖ్యానించారు.
అమెరికా - చైనాల మధ్య దౌత్యపరమైన వాగ్వివాదాలు నడుస్తున్న తరుణంలో అమెరికా ప్రచురణ సంస్థ హార్పర్ కోలిన్స్.. ఆమె డైరీని ప్రచురించడంతో ఈ విమర్శలు మరింత పెరిగాయి.
మరోవైపు ఫేంగ్ ఫేంగ్‌పై తమ వైఖరినీ చైనా ప్రభుత్వ మీడియా కుండ బద్దలుకొట్టినట్టు స్పష్టంచేసింది.
"విదేశీ మీడియా సంస్థల్లో ఆమెను ఆకాశానికెత్తుతూ వస్తున్న కథనాలను చైనాలో చాలా మంది ముప్పుగా చూస్తున్నారు. చైనా ప్రజల కృషిని దొంగదెబ్బ తీసేందుకు పశ్చిమ దేశాలు ఆమెను ఆయుధంగా వాడుకుంటున్నాయి" అంటూ గ్లోబల్ టైమ్స్‌లో ఓ కథనం ప్రచురితమైంది.
"వుహాన్‌లో చీకటి కోణం గురించి మాత్రమే ఆమె డైరీలో ప్రస్తావించారు. కరోనావైరస్ కట్టడికి స్థానికులు చేసిన కృషి, దేశ వ్యాప్తంగా ప్రజల నుంచి వస్తున్న మద్దతును ఆమె పట్టించుకోలేదు" అని విమర్శించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆమె డైరీకి స్పందన ఎలా వస్తోంది?
గత శుక్రవారమే అమ్మకాలు మొదలైన ఈ పుస్తకంపై ప్రజల స్పందన అప్పుడే చెప్పడం కొంత కష్టమే.
అయితే ఆమె నిజాయితీ మీద న్యూయార్క్ టైమ్స్ ప్రశంసలు కురిపించింది. "లాక్‌డౌన్ సమయంలో ఆమె దయనీయమైన జీవితం గడిపి ఉండొచ్చు. కానీ చాలా ధైర్యంగా కలంపట్టారు" అని వ్యాఖ్యానించింది.
"76 రోజుల వుహాన్ లాక్‌డౌన్‌కు సంబంధించి దీనిలో కీలకమైన, సవివర, భయానక సంగతులు ఉన్నాయి. చైనీస్ భాషలోని డైరీలో కనిపించే లోతైన భావోద్వేగాలు ఇంగ్లిష్ అనువాదంలో కనిపించడం లేదు" అని ఎన్‌పీఆర్ సమీక్షలో వ్యాఖ్యలు చేశారు..
అమెజాన్‌లో మాత్రం ప్రతికూల సమీక్షలు కొన్ని వచ్చాయి. ఇది ఫేక్ సమాచారమని ఒకరు వ్యాఖ్యానించారు.
"వుహాన్‌లో జీవితం ఎలా ఉండేదో ఆమె ప్రపంచానికి చూపించారు" అని మరోక సమీక్షకుడు చెప్పారు.
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:
- హైకోర్టుకు చేరిన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ వ్యవహారం.. వివాదం ఏమిటి? ఎందుకు?
- కోవిడ్-19: ‘నేను వెంటిలేటర్ తొలగించి రోగి మరణించడానికి సహాయపడతాను’
- భారత్‌తో సరిహద్దుల్లో పాకిస్తాన్ కంచె ఎందుకు వేయడం లేదు
- కరోనావైరస్: అమెరికా ఎన్నడూ లేనంతగా భయపడుతోందా?
- ఎయిర్ ఇండియా పైలట్లు కరోనావైరస్ బారిన పడే ముప్పు ఎక్కువ ఉందా?
- తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయానికి ‘లాక్‌డౌన్’.. పంటను కోయలేరు, అమ్మలేరు..
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో లాక్ డౌన్: మీరు ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?
- కరోనావైరస్ ప్రభావంతో భారత్‌లో ఎన్ని ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంది?
- కరోనావైరస్: మీరు మీ పిల్లల్ని వేరే పిల్లలతో ఆడుకోడానికి పంపించవచ్చా?
- వందల ఏళ్ల క్రితమే క్వారంటైన్ విధానాన్ని అనుసరించిన పురాతన నగరం ఇది
- కరోనావైరస్ లాక్ డౌన్: భారత్‌లో స్వచ్ఛమైన గాలి కోసం ఉద్యమానికి బాటలు వేస్తుందా?
- 1918లో 5 కోట్ల మందిని బలి తీసుకున్న స్పానిష్ ఫ్లూ కట్టడికి ఏం చేశారంటే...
- రేప్, డిప్రెషన్ నుంచి కోలుకునేందుకు ఈమెకు యోగా ఎలా ఉపయోగపడింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








