ఆంధ్రప్రదేశ్ : విద్యుత్ కోతలపై ఆన్‌లైన్‌లో మీమ్‌లు - ‘పవర్ రాలేదా పుష్పా’

ఫొటో సోర్స్, Instagram/Namaskaram_ba
‘‘చూశారా మాస్టారూ పెట్రోలు ధరలు పెంచాడని టీవీలో చూడకుండా ఉండటానికి పవర్ కట్ చేస్తున్నాడు.’’ఇది ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ కోతలపై ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న మీమ్.
విద్యుత్ కోతలపై సోషల్ మీడియాలో ఇలాంటి జోకులు పేలుతున్నాయి. మీమ్ పేజీల నుంచి సాధారణ ప్రజల వరకు పవర్ కట్‌పై వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలను విద్యుత్ కోతలు వేధిస్తున్న సంగతి తెలిసిందే. ఆస్పత్రుల్లోనూ విద్యుత్ సమస్య కనిపిస్తోంది. వ్యవసాయ విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో రైతులు ఆందోళన బాట పడుతున్నారు.
మరోవైపు పరిశ్రమలకు శుక్రవారం నుంచి పవర్ హాలిడే ప్రకటించారు. ఇప్పటికే ఆదివారం పరిశ్రమలు మూసివేయాల్సి ఉండగా ఇక నుంచి మరో రోజు అదనంగా పవర్ హాలిడే అమలు చేయాల్సి ఉంటుంది. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటలలోపు విద్యుత్ వినియోగం నియంత్రించాలి. వ్యవసాయ విద్యుత్‌ని కూడా 7 గంటలకు కుదించారు. గతంలో తొమ్మిది గంటలు అందించేవారు.
ఏపీలో బుధవారం నాటి లెక్కల ప్రకారం 230 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంది. సరఫరాలో కొరత కారణంగా 25 మిలియన్ యూనిట్ల విద్యుత్ కోత అమలు చేశారు. అనధికారికంగానే ప్రస్తుతం విద్యుత్ కోతలు అమలవుతుండగా, పరిశ్రమలకు అదనంగా పవర్ హాలిడే అమలులోకి రావడంతో పారిశ్రామిక కార్మికుల ఉపాధిపై ప్రభావం పడనుంది. ఈ విషయంపై ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న మీమ్స్‌లో కొన్ని..

ఫొటో సోర్స్, PA
‘‘అది పవర్ అనుకున్నారా.. రిబ్బన్ అనుకున్నారా.. అన్నిసార్లు ఎందుకు కట్ చేస్తున్నారు?’’ అని నమస్కారం బా అనే మీమ్ పేజీలో పవర్ కట్‌పై మీమ్ వేశారు.
దీనికి వెంకీ సినిమాలో రవితేజపై బ్రహ్మానందం ఫైర్ అవుతున్న టెంప్లేట్‌ను పోస్ట్ చేశారు.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది, 1
‘‘లెట్‌మి లివ్ లాంగ్’’ మీమ్ పేజీలో ప్రజలను ఆసుపత్రి మంచంపై పడుకోబెట్టి ప్రభుత్వం వెంటిలేటర్ స్విచ్‌లతో ఆడుకుంటున్న ఫోటోను ట్వీట్ చేశారు.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది, 2
ఆంధ్రప్రదేశ్ ప్రజలు కరెంటు ఎప్పుడొస్తుందన్నా అని అడుగుతుంటే.. ‘‘నాక్కూడా తెలియదమ్మా’’అని పవర్ స్టేషన్ ఇన్‌ఛార్జి చెబుతున్నట్లుగా రాయలసీమ రతనాలసీమ ఇన్‌స్టా పేజీలో ఒక మీమ్ పోస్ట్ చేశారు. దీనికి అఖండలో బాలకృష్ణ టెంప్లేట్‌ను పోస్ట్ చేశారు.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది, 3
అపరిచితుడు టెంప్లేట్‌తో ఎల్లెహే మీమ్ పేజీలో ఒక మీమ్ వేశారు.
అందులో ఏమైనా మాట్లాడు రామా అని అంటే.. నందిని మీకు కూడా పవర్ తీసేశాడా అని రామా అడుగుతున్నట్లుగా రాశారు.
‘‘పాపం రా నైట్ షిఫ్ట్ చేసే వాళ్ల పరిస్థితి ఏంటిరా ఇలా కరెంట్ తీసేస్తే’’అని డిస్క్రిప్షన్‌లో రాశారు.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది, 4
మనోభావాలు పేజీలో ఆర్ఆర్‌ఆర్ టెంప్లేట్‌తో మీమ్ వేశారు. దీనిలో ఏపీ ప్రజలు ‘‘కొమ్మ ఉయ్యాల, కోన జంపాల.. చీకట్లోనే మేము బతకాలా’’అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు పాట పాడుకుంటున్నట్లు రాసుకొచ్చారు.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది, 5

ఫొటో సోర్స్, Facebook/Shivananda
మరోవైపు దసరా సెలవులకు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేవారికి విజ్ఞప్తి.. కొవ్వుత్తులు ఒక కట్ట, దోమల చక్రాలు ఒక బుట్ట, అగ్గి పెట్టెలు, విసనకర్రలు కలిపి ఒక తట్టలో పెట్టుకుని గుట్టుగా రావాల్సిందిగా మనవి.
లేకపోతే చీకటి రాజ్యంలో బతకలేరు’’అని శివానంద రాజు అనే ఫేస్‌బుక్ యూజర్ పోస్ట్ చేశారు.
కేరింత టెంప్లేట్‌తో కిరాక్ అమ్మాయి ఇన్‌స్టా పేజీలో ఒక మీమ్ పోస్ట్ చేశారు.
‘‘వద్దు అన్న టైమ్‌లో ఉంటావ్. కావాలన్న టైమ్‌లో వదిలేసి పోతున్నావ్. నువ్వు లేక ప్రాణం పోతున్నట్లు ఉంటోంది.
ఎంతైనా నువ్వు గ్రేటే పవరు’’అంటూ రాసుకొచ్చారు. డిస్క్రిప్షన్‌లో మరీ సమ్మర్ టైమ్‌లో పవర్ కట్స్ అంటే ప్రాణం పోతుంది’’అని రాశారు.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది, 6
‘‘కరెంట్ ఛార్జీలు బాగా పెరిగిపోయాయి అని ప్రజలు అంటున్నారు. దానికి మీరేం అంటారు?’’అని యాంకర్ సుమ అడుగుతున్నప్పుడు ‘‘పవర్ కట్ చేస్తాను’’ అని బాద్‌షా సినిమాలో రివేంజ్ నాగేశ్వర్రావు సమాధానం చెబుతున్నట్లు తెలుగు థగ్ పేజీలో మీమ్ పోస్ట్ చేశారు.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది, 7
‘‘చూశారా మాస్టారూ పెట్రోలు ధరలు పెంచాడని టీవీలో చూడకుండా ఉండటానికి పవర్ కట్ చేస్తున్నాడు’’అంటూ నమస్కారం బా పేజీలో మరో మీమ్ పోస్ట్ చేశారు. దీనికి కూడా వెంకీలో బ్రహ్మానందం టెంప్లేట్ వాడారు.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది, 8
‘‘పవర్ రాలేదా పుష్పా’’అంటూ పుష్పా సినిమాలో పార్టీ లేదా పుష్పా డైలాగ్‌ను మార్చి మీమర్ వచ్చాడు రోయ్ పేజీలో పోస్ట్ చేశారు.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది, 9
డీజే టిల్లు టెంప్లేట్‌తో మన మండపాక మీమ్ పేజీలో ఒక పోస్టు పెట్టారు. ‘‘కరెంటు ఎందుకు కట్ చేస్తున్నారో తెలుసా రాధికా.. గెస్ వై? మల్లా కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని నువ్వు ఫీల్ అవ్వకూడదని’’అని దానిలో రాసుకొచ్చారు.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది, 10
జాతి రత్నాలు టెంప్లేట్‌తో కామన్ మ్యాన్ కౌంటర్స్ పేజీలో ఒక మీమ్ పెట్టారు. ‘‘సర్ డైలీ ఎందుకు ఇన్ని గంటలు కరెంటు తీస్తున్నారు? అని విలేఖరి ప్రశ్నించినప్పుడు.. అలా తీస్తేనే కదా అది మా గుర్తు అని అందరికీ గుర్తు ఉంటుంది. అప్పుడు అందరూ దాన్నే చూస్తూ ఉంటారు అని మంత్రి సమాధానం ఇస్తారు.’’ వైఎస్సార్సీపీ ఎన్నికల గుర్తు ఫ్యాన్‌ను గుర్తుచేస్తూ ఈ మీమ్ వేశారు.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది, 11
ఇవి కూడా చదవండి:
- నవరాత్రి వేడుకల సమయంలో మాంసం షాపులను ఎందుకు మూయించేస్తున్నారు? అసలు మాంసం తినని వారు ఎంత మంది?
- షాంఘై లాక్డౌన్: ఆహారం దొరకడం లేదంటున్న కొందరు స్థానికులు
- ఇమ్రాన్ ఖాన్ భార్య ఫ్రెండ్ ఫరాఖాన్ ఎవరు, పాకిస్తాన్లో ఈమె పేరు ఎందుకు మారుమోగుతోంది?
- పుతిన్‌కు ఎంతమంది పిల్లలు.. వాళ్లు ఎక్కడున్నారు.. ఏంచేస్తుంటారు?
- Kinder Surprise చాక్లెట్ ఎగ్స్‌ను రీకాల్ చేసిన కంపెనీ, అసలు కారణం ఇదే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)