ఒమిక్రాన్: భారత్‌లోనూ కొత్త వేరియంట్ కేసులు.. దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరు వచ్చిన ఇద్దరిలో గుర్తింపు - Newsreel

కోవిడ్-19

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌లో తొలిసారి రెండు కోవిడ్-19 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి.

ఈ రెండూ కర్ణాటకలో వెలుగు చూశాయని కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ గురువారం వెల్లడించారు.

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే అనేక దేశాల్లో వెలుగుచూసిన ఈ వేరియంట్‌ను భారత్‌లో గుర్తించడం ఇదే తొలిసారి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ఈ విషయాన్ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ కూడా స్పష్టంచేశారు.

ఎవరూ భయపడాల్సిన అవసరంలేదని, అయితే, అందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని బలరామ్ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

కేంద్ర ఆరోగ్య శాఖ ఏర్పాటుచేసిన ఐన్సాకాగ్ లేబరేటరీల జీనోమ్ సీక్వెన్సింగ్‌లో ఈ రెండు కేసులూ వెలుగు చూశాయని ఆయన తెలిపారు.

కోవిడ్-19

ఫొటో సోర్స్, Getty Images

దక్షిణాఫ్రికాకు వెళ్లి బెంగళూరుకు వచ్చిన ఇద్దరు కర్ణాటక వాసులకు ఒమిక్రాన్ సోకినట్లు ప్రభుత్వ అధికారులు స్పష్టంచేశారు. 66ఏళ్లు, 46ఏళ్ల వయసున్న వీరిద్దరూ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని పేర్కొన్నారు.

భారత్‌లో వెలుగుచూసిన తొలి ఒమిక్రాన్ కేసులు ఇవే. ఒమిక్రాన్ వేరియంట్‌తో ఇన్ఫెక్షన్లు భారీగా వచ్చే ముప్పుందని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది.

ఈ ఇద్దరు కలిసిన వ్యక్తులందరినీ గుర్తించామని, అందరికీ పరీక్షలు చేయించామని అధికారులు తెలిపారు.

ఇప్పటికే పాజిటివ్‌గా తేలిన దిల్లీ నుంచి ఆరుగురు, మహారాష్ట్ర నుంచి మరో ఆరుగురు శాంపిల్స్ కూడా జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించామని, ఫలితాల కోసం ఎదురు చూస్తున్నామని అధికారులు తెలిపారు.

ఒమిక్రాన్

ఫొటో సోర్స్, Reuters

ఏమిటీ కొత్త వేరియంట్?

వేగంగా మ్యుటేషన్ చెందుతున్న కరోనావైరస్ ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఆందోళనకరంగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కోవిడ్‌లో వేలకొద్దీ మ్యుటేషన్లు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాయి. వైరస్‌లు నిత్యం పరివర్తన చెందుతుంటాయి కాబట్టి ఇది ఊహించలేని విషయం కాదు. కానీ బి.1.1.529 రకం లేదా ఒమిక్రాన్ అని పిలిచే ఈ కొత్త వేరియంట్, ప్రస్తుత వ్యాక్సీన్‌లు పోరాడుతున్న వేరియంట్ కంటే భిన్నమైంది. అందుకే నిపుణులు ఆందోళన చెందుతున్నారు.

ఈ వేరియంట్‌‌లో జన్యు మార్పులు 50 వరకు ఉన్నాయి. వీటిలో 32 వైరస్ స్పైక్ ప్రోటీన్‌లు ఉన్నాయి. వాస్తవానికి వ్యాక్సీన్‌లు టార్గెట్ చేసేది వీటినే. అయితే, ఇది ఎంత ముప్పును కలిగిస్తుందో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

ప్రస్తుత వ్యాక్సీన్‌లు ఈ వేరియంట్‌కు మ్యాచ్ కావు కాబట్టి అవి పని చేయకపోవచ్చని నిపుణులు అంటున్నారు, అలాగని, అవి పూర్తిగా రక్షణ కల్పించలేవని భావించడానికి వీలు లేదు.

మోదీ

ఫొటో సోర్స్, ANI

జవాద్ తుపాను: ఉత్తరాంధ్రలో రానున్న మూడు రోజులలో భారీ వర్షాలు.. పరిస్థితులను సమీక్షించిన ప్రధాని మోదీ

బంగాళా ఖాతంలో అల్ప పీడనం బలపడి తుపానుగా మారడంతో పరిస్థితులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమీక్షించారు.

‘‘రానున్న మూడు రోజుల్లో పరిస్థితులపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సమాచారం అందించాం. సహాయక చర్యల ఏర్పాట్లను హోం శాఖ కార్యదర్శి వివరించారు. ప్రభావిత ప్రాంతాల్లో 29 బృందాలను మోహరించాం. తుపాను తీరం దాటేటప్పుడు గంటకు 90 నుంచి 100 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశముంది’’అని జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్) డీజీ అతుల్ కర్వాల్ చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

మధ్య అండమాన్ సముద్రంలో డిసెంబరు 1న ఏర్పడిన ఈ అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతూ ఆగ్నేయ బంగాళా ఖాతంలో తీవ్ర అల్పపీడనంగా మారింది.

ఇది పశ్చిమ వాయువ్య దిశలో ప్రయాణించి రానున్న 12 గంటల్లో వాయు గుండంగా మారుతుంది. ఆ తర్వాత 24 గంటల్లో ఇది మరింత బలపడి తుపానుగా మారుతుంది.

ఈ తుపానుకు జవాద్‌గా నామకరణం చేశారు. ఇది నాలుగో తేదీ అంటే శనివారం ఒడిశా లేదా ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో తీరందాటే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.

తుపాను

ఫొటో సోర్స్, IMD

100 కి.మీ. వేగంతో గాలులు..

ఆంధ్రప్రదేశ్‌, ఒడిశాలోని తీర ప్రాంతాల్లో జవాద్ తుపాను ప్రభావంతో గంటకు 90 నుంచి 100 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశముందని ఐఎండీ కూడా వెల్లడించింది.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, శ్రీకాకుళంతోపాటు ఒడిశాలోని తీర ప్రాంతాల్లో ఈ తుపాను తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది.

పశ్చిమ బెంగాల్‌లోని గంగా పరివాహక ప్రాంతాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది.

తుపాను సన్నద్ధతపై కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గాబా నేతృత్వంలో నేషనల్ క్రైసిస్ మేనేజ్ కమిటీ (ఎన్‌సీఎంసీ) కూడా సమావేశమై, పరిస్థితులను సమీక్షించింది.

మరోవైపు ఒడిశాలోని గజపతి, గంజాం, పూరీ, జగత్‌సింగ్‌పుర్‌లకు ఐఎండీ రెడ్ అలర్టులు జారీచేసింది.

తుపాను ముప్పు నడుమ నేటి నుంచి మూడు రోజులవరకు మొత్తంగా 95 రైళ్లను కోస్తా రైల్వే విభాగం రద్దుచేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)