జేసీ ప్రభాకర్ రెడ్డి: మున్సిపల్ సిబ్బందికి వంగి వంగి దండాలు ఎందుకు పెట్టారు?

జేసీ ప్రభాకర్ రెడ్డి

ఫొటో సోర్స్, ugc

ఫొటో క్యాప్షన్, మున్సిపల్ సిబ్బందికి వంగి నమస్కరిస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డి
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసనకు దిగారు.

సోమవారం మధ్యాహ్నం తర్వాత నిరసనకు దిగిన జేసీ ప్రభాకర్ రెడ్డి రాత్రి కూడా మునిసిపల్ ఆఫీసులోనే ఉన్నారు.

రాత్రి భోజనం మునిసిపల్ ఆఫీసులో చేసి అక్కడే పడుకున్నారు.

మంగళవారం ఉదయాన్నే లేచి కాలకృత్యాల తర్వాత మళ్లీ నిరసనకు దిగారు.

జేసీ ప్రభాకర్ రెడ్డి

ఫొటో సోర్స్, ugc

ఫొటో క్యాప్షన్, మంగళవారం ఉదయం కార్యాలయ ప్రాంగణంలో జేసీ ప్రభాకర్ రెడ్డి

అంతకుముందే ఆయన మునిసిపల్ కమిషనర్ సహా 26 మంది మునిసిపల్ అధికారులు కనిపించడం లేదంటూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు.

దాంతో ఈ వ్యవహారం ఆసక్తిగా మారింది.

జేసీ ప్రభాకర్ రెడ్డి

ఫొటో సోర్స్, ugc

నిరసన ఎందుకు?

సోమవారం ఉదయం 10 గంటలకు మునిసిపల్ ఆఫీసులో చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. అధికారులంతా హాజరుకావాలని ముందుగా సమాచారం కూడా ఇచ్చారు.

అయితే సరిగ్గా అదే సమయానికి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కరోనాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. దాంతో అధికారులు సందిగ్ధంలో పడ్డారు.

చివరకు ఎమ్మెల్యే నిర్వహించిన కార్యక్రమానికి అంతా హాజరయ్యారు. ఆ తర్వాత తన సమావేశానికి వస్తారని ఎదురుచూసినప్పటికీ ఎవరూ రాకపోవడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ తర్వాత ఆఫీసుకి వచ్చిన సిబ్బందికి వంగి వంగి నమస్కారాలు చేస్తూ వినూత్నంగా తన నిరసన తెలిపారు.

జేసీ ప్రభాకర్ రెడ్డి

ఫొటో సోర్స్, ugc

ఈ పరిణామాలతో తాడిపత్రి మున్సిపల్ కమిషనర్ సెలవు పెట్టేశారు.

ముందస్తు సమాచారం లేకుండా సెలవు పెట్టడాన్ని కూడా జేసీ తప్పుబడుతున్నారు. 26 మంది అధికారులకు నోటీసులు జారీ చేస్తున్నట్టు వెల్లడించారు.

తనకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకూ కార్యాలయం నుంచి కదిలేది లేదని తేల్చిచెప్పారు.

వీడియో క్యాప్షన్, రోడ్లు వేయమని అడిగినందుకు జేసీ ఏమన్నారో చూడండి

జేసీకి మద్ధతుగా పలువురు టీడీపీ నేతలు కూడా బైఠాయించారు.

జేసీ ఆందోళనతో కమిషనర్ మళ్ళీ ఆఫీసుకి వచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)