రఖ్మాబాయి రౌత్: బలవంతపు పెళ్లిళ్లపై జైలుకు వెళ్లేందుకు సిద్ధపడిన ధీరవనిత

- రచయిత, అనఘా పాఠక్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆధునిక భారత్‌లో తొలి మహిళా డాక్టర్ అనగానే రఖ్మాబాయి రౌత్ పేరు గుర్తుకు వస్తుంది. అయితే, ఓ స్త్రీవాదిగా ఆమె ఎక్కువ మందికి సుపరిచితం. 22ఏళ్ల వయసులోనే తన విడాకుల కోసం ఆమె కోర్టులో పోరాడారు.
అప్పట్లో భార్యలను విడిచిపెట్టడం లేదా విడాకులు ఇవ్వడం సర్వసాధారణం.
అయితే, భర్త నుంచి విడాకులు కావాలని కోరిన తొలి మహిళ రఖ్మాబాయి కావొచ్చు.
ఆమె విడాకుల కేసు అప్పటి సంప్రదాయ సమాజంలో ప్రకంపనలే సృష్టించింది.

1864లో అప్పటి బాంబే(నేటి ముంబయి)లో రఖ్మాబాయి జన్మించారు. ఆమె తల్లి ఓ వితంతువు.
రఖ్మాబాయికి 11ఏళ్ల వయసులోనే వివాహమైంది. అయితే ఎప్పుడూ ఆమె భర్తతో ఉండాలని కోరుకోలేదు. తల్లితోపాటు తన పుట్టింట్లోనే ఆమె ఉండేది.
1887లో ఆమెపై హక్కులను కోరుతూ ఆమె భర్త దాదాజీ భికానీ కోర్టును ఆశ్రయించారు. అయితే తన అనుమతి లేకుండానే తనకు బలవంతంగా పెళ్లి చేశారని ఆమె కోర్టులో వాదించారు.
చివరగా, ఆ పెళ్లికి వత్తాసు పలుకుతూ కోర్టు తీర్పునిచ్చింది.

కోర్టు ఆమెకు రెండు ఆప్షన్లు ఇచ్చింది. భర్త దగ్గరకు వెళ్లాలని లేదా ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించాలని తీర్పు నిచ్చింది. దీంతో భర్తతో ఉండేకంటే జైలుకు వెళ్లేందుకు సిద్ధమని రఖ్మాబాయి తెగేసి చెప్పారు. ఆ సమయంలో ఇదొక సాహసమనే చెప్పాలి.

అప్పట్లో ఈ కేసు పెద్ద దుమారమే రేపింది. స్వాతంత్ర్య ఉద్యమకారుడు బాల గంగాధర్ తిలక్.. ఆమెకు వ్యతిరేకంగా పత్రికలో కథనం రాశారు. ఆమెను హిందు సంప్రదాయానికి మాయని మచ్చలా అభివర్ణించారు.
రఖ్మాబాయి లాంటి వారిని దొంగ, హంతకులతో సమానంగా చూడాలని ఆయన చెప్పారు. అయితే ఆమె వెనక్కి తగ్గలేదు. సవతి తండ్రి సఖారామ్ అర్జున్ సాయంతో ఆమె విడాకుల కోసం మళ్లీ పోరాడారు. మళ్లీ తన భర్తకు అనుకూలంగా కోర్టు తీర్పు నిచ్చినప్పటికీ ఆమె వెనకడుగు వేయలేదు. తన పెళ్లిని రద్దు చేయాలంటూ ఆమె క్వీన్ విక్టోరియాకు లేఖ రాశారు. అప్పుడు ఆ కోర్టు తీర్పును క్వీన్ రద్దుచేశారు.

ఆధునిక భారతదేశంలో మార్పుకు ప్రతినిధులుగా ఉన్న, చరిత్ర పుటల్లో స్థానం దక్కని పది మంది మహిళల స్ఫూర్తిదాయక కథలను బీబీసీ అందిస్తోంది. వీళ్లంతా మీరు తెలుసుకోవాల్సిన భారతీయ చారిత్రక మహిళలు.
ఈ సిరీస్‌లోని ఇతర కథనాలు:
- ముత్తులక్ష్మి రెడ్డి: దేశంలో తొలి మహిళా ఎమ్మెల్యే.. దేవదాసీ వ్యవస్థపై పోరాడిన మొదటి డాక్టర్
- చంద్రప్రభ సైకియాని: అసోంలో పర్దా పద్ధతికి తెరదించడంలో కీలకపాత్ర పోషించిన వనిత
- రుకేయా షకావత్: అమ్మాయిల జీవితాలను మార్చిన ‘మహిళా రామ్మోహన్ రాయ్’
- ఇందర్జీత్ కౌర్: స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌కు తొలి మహిళా అధ్యక్షురాలు
- సుగ్రా హుమాయూన్ మీర్జా: బురఖా లేకుండా బయటకు వచ్చిన తొలి మహిళ.. దక్కన్ మహిళల గొంతుక
- అన్నా చాందీ: భారత్‌లో హైకోర్టు తొలి మహిళా జడ్జి.. మహిళలకు రిజర్వేషన్ల కోసం పోరాడిన న్యాయవాది
- అనసూయ సారాభాయ్: కార్మిక ఉద్యమానికి బాటలు వేసిన మహిళ


చివరగా తన భర్త కేసును వెనక్కి తీసుకున్నారు. డబ్బులు తీసుకొని పెళ్లిని రద్దు చేసుకున్నారు.
ఈ కేసు తర్వాత ఏం మారింది?
వివాహానికి తగిన వయసు చట్టం 1891ను ఆమోదించడంలో రఖ్మాబాయి కేసు కీలకంగా మారింది. ఈ చట్టం ద్వారా బాలికల వివాహ వయసు, ముఖ్యంగా శృంగారంలో పాల్గొనే వయసును, పది నుంచి 12ఏళ్లకు పెంచారు. ఆ మార్పు ఇప్పుడు విప్లవాత్మక మార్పులా కనబడకపోవచ్చు. కానీ చిన్న వయసుండే బాలికతో శృంగారంలో పాల్గొనే పురుషులకు శిక్ష విధించిన తొలి చట్టం ఇదే. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే అత్యాచారం చేసినట్లుగా పరిగణించేవారు.

తన పెళ్లి రద్దయిన వెంటనే 1889లో లండన్ స్కూల్ ఆఫ్ మెడిసన్ ఫర్ విమెన్‌లో రఖ్మాబాయి చేరారు. 1894లో ఆమె వైద్య పట్టా పొందారు. అయితే ఆమె ఎండీ చేయాలని అనుకున్నారు. అప్పట్లో మహిళలు ఎండీ చేసేందుకు లండన్ స్కూల్ ఆఫ్ మెడిసన్ అనుమతించేది కాదు. ఆ విద్యా సంస్థ నిర్ణయంపై ఆమె గళమెత్తారు. తర్వాత బ్రసెల్స్‌లో ఆమె ఎండీ పూర్తిచేశారు.
భారత్‌లో తొలి మహిళా ఎండీ డాక్టర్ రఖ్మాబాయి. అయితే భర్తతో విడాకుల తీసుకున్నందుకు ఆమెను చాలా మంది చిన్న చూపు చూసేవారు.

మొదట్లో రఖ్మాబాయి ముంబయిలోని కామా ఆసుపత్రిలో పనిచేసేవారు. తర్వాత ఆమె సూరత్‌కు వెళ్లిపోయారు. మహిళల ఆరోగ్యం కోసం ఆమె తన జీవితాన్ని అంకితం చేశారు. 35ఏళ్లపాటు ఆమె వైద్య సేవలు అందించారు. ఆమె మళ్లీ పెళ్లి చేసుకోలేదు.
చిత్రాలు: గోపాల్ శూన్య
ఇవి కూడా చదవండి:
- కృష్ణా, గోదావరి పరవళ్లు.. దశాబ్దం తర్వాత మళ్లీ నిండుకుండల్లా ప్రాజెక్టులు
- కరోనావైరస్: బ్రెజిల్లో లక్ష దాటిన కోవిడ్ మరణాలు... భారత్ కూడా అలాంటి తప్పులే చేస్తోందా?
- ఇంటి పనులు చేయడం లేదా? అయితే ఇది చదవండి!
- మహిళల ఆరోగ్యం: ఇంటిపని చేయడం వ్యాయామం కిందకు వస్తుందా?
- 'మోదీజీ, మా ఆయన ఇంటి పనిలో సాయం చేయడం లేదు, మీరైనా చెప్పండి...'
- కరోనావైరస్: వర్క్ ఫ్రమ్ హోమ్ బాటలో కంపెనీలు.. ఇంటి నుంచి ఒంటరిగా పనిచేయటం ఎలా?
- వంట చేశాడు... ఇల్లు ఊడ్చాడు... హింసించే భర్త మనిషిగా మారాడు
- ప్రపంచంలోనే అత్యంత చల్లని కంప్యూటర్... ఇది శత్రు విమానాల్ని అటాక్ చేస్తుందా?
- నిజాయితీగా పన్ను చెల్లించేవారికి కొత్త ప్రయోజనాలు ఉంటాయన్న మోదీ
- కరోనావైరస్: తెలంగాణ, బీహార్, గుజరాత్, యూపీలలో టెస్టులు పెంచాలి - ముఖ్యమంత్రుల సదస్సులో మోదీ
- ముస్లిం పెళ్లి కూతురు, క్రైస్తవ పెళ్లి కొడుకు... హిందూ సంప్రదాయంలో పెళ్లి
- #HisChoice: అవును... నేను హౌజ్ హస్బెండ్‌ని
- కమలా హ్యారిస్ ఎవరు? జో బిడన్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఆమెనే ఎందుకు ఎంచుకున్నారు?
- ఇండియా, ఇరాక్, బ్రిటన్, ఆస్ట్రేలియా.. అన్ని చోట్లా అమ్మోనియం నైట్రేట్ టెన్షన్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










