టీవీ షోలో బంగారం వేట.. గంటల్లోనే రెండు కోట్ల విలువైన 3.5 కేజీల బంగారం దొరికింది

ఫొటో సోర్స్, AussieGoldHunters/DiscoveryChannel
దాదాపు రెండు కోట్ల రూపాయలు (350,000 ఆస్ట్రేలియన్ డాలర్లు) విలువ చేసే రెండు బంగారపు ముద్దలు ఆస్ట్రేలియాలో తవ్వకాల్లో దొరికాయి.
బ్రెంట్ షానన్, ఈథన్ వెస్ట్ వీటిని కనుగొన్నారు. విక్టోరియా రాష్ట్రంలో టర్నాగులా పట్టణంలో బంగారపు గనులున్న దగ్గర తవ్వాకాల్లో ఇవి బయటపడ్డాయి.
గురువారంనాడు ఆసీ గోల్డ్ హంటర్స్ అనే టీవీ కార్యక్రమంలో వీళ్లకు బంగరపు ముద్దలు దొరికాయన్న విషయాన్ని ప్రసారం చేసారు.
వీరు ఆ ప్రాంతంల్లో భూమిని తవ్వి, మెటల్ డిటెక్టర్ల సహాయంతో బంగారం దొరికే ప్రాంతాన్ని కనుగొన్నారు.
సీఎన్ఎన్తో మాట్లాడుతూ "ఇవి నిజంగా చాలా విలువైనవి. రెండు పెద్ద ముద్దలు ఒకే రోజులో దొరకడం చాలా పెద్ద విశేషం" అని ఈథన్ వెస్ట్ అన్నారు.
మొత్తం 3.5 కేజీల బరువున్న రెండు బంగారం ముద్దలను కొన్ని గంటల్లోనే కనుక్కోగలిగారు. ఈ వేటలో ఈథన్ వెస్ట్ తండ్రి వీరికి సహాయం అందించారు అని ఆ టీవీ ప్రోగ్రాంలో చూపించారు. ఆ కార్యక్రమం డిస్కవరీ ఛానల్లో ప్రసారమయ్యింది.
ఈ టీవీ కార్యక్రమంలో ఆస్ట్రేలియాలోని మారుమూల ప్రాంతాల్లో బంగారం వేట చేపట్టేవారిని అనుసరిస్తూ, వారికి దొరికినవాటి విశేషాలను ప్రసారం చేస్తారు.

ఫొటో సోర్స్, AussieGoldHunters/DiscoveryChannel
"ఆ ప్రాంతంలో మునుపు పెద్దగా తవ్వకాలేమీ జరగలేదని గ్రహించాం. మాకు అక్కడ బంగారం దొరికే అవకాశం ఉందనే అనిపించింది" అని షానన్ సర్రైస్ అనే టీవీ కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పారు.
"అక్కడ తవ్వుతునప్పుడు వేలకొద్దీ చిన్న చిన్న బంగారం ముక్కలు బయటపడ్డాయి" అని వెస్ట్ చెప్పారు.
2019లో కూడా ఆస్ట్రేలియాకు చెందిన ఒక వ్యక్తికి 1.4 కేజీల (దాదాపు 52 లక్షలు) బరువున్న బంగారం ముద్ద దొరికింది. అతను కూడా మెటల్ డిటెక్టర్ వాడి బంగారం జాడ తెలుసుకున్నారు.
ఆస్ట్రేలియాలో 1850లలో బంగారపు గనుల తవ్వకం ప్రారంభమయ్యింది. ఇప్పటికీ ఆ దేశంలో ఇది ఒక ముఖ్యమైన పరిశ్రమ.
టర్నాగులా పట్టణం కూడా విక్టోరియా గోల్డ్ రష్ కాలంలోనే బయటపడిందని ఒక స్థానిక వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- 'రాక్షసుడి బంగారం' బయటకు తీసే కార్మికుల కథ
- సూపర్ ఫుడ్స్: ఇవన్నీ మీకు చౌకగా రోజూ దొరికేవే.. తింటున్నారా మరి?
- బంగారం కొనాలా.. అమ్మాలా? ధర ఎందుకు పెరుగుతోంది?
- రాత్రిపూట మద్యం తాగితే నిద్ర బాగా పడుతుందా?
- నా కార్టూన్లే నా ప్రాణాలు కాపాడాయి.. కొత్త జీవితాన్ని ఇచ్చాయి.. ఇదీ నా కథ
- నిద్రలో వచ్చే కలలు ఎందుకు గుర్తుండవు? గుర్తుండాలంటే ఏం చేయాలి...
- అత్యంత భారీ ఎయిర్పోర్ట్.. అంతా ఒక్క బిల్డింగ్‌లోనే
- ఫ్రిజ్‌లో ఉంచిన ఆహారాన్ని మీరు చాలా రోజులు తింటారా?
- గోల్డెన్ బ్లడ్... ఈ రక్తం కలిగి ఉండటం చాలా ప్రమాదకరం
- శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో షార్ట్ సర్క్యూట్.. దట్టమైన పొగ వల్ల సహాయక చర్యలకు ఆటంకం
- ప్రశాంత్ భూషణ్: ప్రజల కోసం పోరాడుతున్న న్యాయవాదా? ప్రభుత్వాలంటే గిట్టని అరాచకవాదా?
- ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు చేయొచ్చు? ఫోన్ ట్యాప్ అవుతోందని అనుమానం వస్తే ఏం చేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








