కరోనావైరస్: 'దిల్లీలో ప్రతి నలుగురిలో ఒకరికి కోవిడ్-19'

ఫొటో సోర్స్, Getty Images
దేశ రాజధాని దిల్లీ నగర జనాభాలో దాదాపు ప్రతి నలుగురిలో ఒకరికి కరోనావైరస్ సోకినట్లు ఒక నమూనా సర్వే సూచిస్తోంది.
ప్రభుత్వం నిర్వహించిన ఈ సర్వేలో.. 21,387 మంది రక్త నమూనాలను పరీక్షించగా వారిలో 23.48 శాతం మందిలో కరోనావైరస్‌కు సంబంధించిన యాంటీబాడీస్ కనిపించాయి. అంటే వారికి ఈ వైరస్ సోకి ఉండటమో, సోకి తగ్గటమో జరిగిందని అర్థం.
నగరంలో నిర్ధారిత కేసుల సంఖ్య సూచించే దానికన్నా చాలా ఎక్కువగా వైరస్ వ్యాప్తి ఉన్నట్లు ఈ సర్వే సూచిస్తోంది.
దిల్లీలో ఇప్పటివరకూ 1,23,747 కేసులు ఉన్నాయి. ఇది మొత్తం 1.98 కోట్ల నగర జనాభాలో ఒక శాతంతో సమానం.
అయితే.. రాండమ్‌గా నిర్వహించిన సాంపిల్ సర్వే 23.44 శాతం మందికి వైరస్ సోకినట్లు సూచిస్తోంది. ఆ లెక్కను నగర జనాభా సంఖ్యకు అన్వయిస్తే కరోనా సోకిన వారు 46.5 లక్షల మంది ఉండాలి.
ఈ తేడా.. ''వైరస్ సోకిన వారిలో చాలా ఎక్కువ మందికి ఎటువంటి లక్షణాలూ కనిపించటం లేద''ని చెప్తున్నట్లు ప్రభుత్వం ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
దిల్లీలోని పలు ప్రాంతాల్లో జనాభా చాలా చిక్కగా ఉంటుంది కాబట్టి సర్వేలో కనిపించిన 23.48 శాతం సంఖ్య కూడా తక్కువే కావచ్చునని కూడా ఆ ప్రకటన చెప్తోంది.
అలాగే గణనీయ సంఖ్యలో జనాభాకు ఇంకా వైరస్ ముప్పు పొంచివుందని.. అన్ని రకాల రక్షణ చర్యలను కచ్చితంగా పాటించాలని ప్రభుత్వం ఉద్ఘాటించింది.
కరోనావైరస్‌కు సంబంధించి ఇటువంటి నమూనా సర్వే నిర్వహించటం భారతదేశంలో ఇదే మొదటిసారి. వైరస్ వ్యాప్తి గురించి మరింత మెరుగైన అవగాహన పొందటానికి ఈ సర్వే కీలకమని నిపుణులు చెప్తున్నారు.
పరీక్ష సదుపాయాలను మెరుగుగా పంపిణీ చేయటానికి, ప్రాంతాల వారీగా నిర్దిష్ట కంటైన్‌మెంట్ విధానాలను రూపొందించటానికి ఈ సర్వే దోహదపడుతుంది.
భారతదేశంలో కరోనా మహమ్మారి బలంగా దెబ్బతీసిన ప్రాంతాల్లో దిల్లీ ఒకటి. జూన్ నెలలో తొలి రెండు వారాల్లో ఆస్పత్రుల్లో బెడ్ల కొరత తీవ్రంగా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
అప్పటి నుంచి ఆస్పత్రి సదుపాయాలను మెరుగుపరిచారు. రోజు వారీ నమోదయ్యే కేసుల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది.
దిల్లీలో గడచిన రెండు వారాల్లో రోజుకు 1,200 నుంచి 1,600 వరకూ కొత్త కేసులు నమోదయ్యాయి. ఇది అంతకుముందలి నెల జూన్ చివరి వారంలో రోజు వారీగా నమోదైన కేసుల సంఖ్యలో దాదాపు సగం.
సోమవారం నాడు రాజధాని నగరంలో కేవలం 954 కేసులు మాత్రమే నమోదయ్యాయి.
పరీక్షలు, ట్రేసింగ్, కంటైన్‌మెంట్, ఐసొలేషన్ గణనీయంగా పెరగటం వల్ల కేసుల సంఖ్య తగ్గినట్లు చెప్పవచ్చు.
నగరంలో కోవిడ్ మరణాల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?
- లక్షణాలు: కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ప్రభావం: కరోనావైరస్ మీ శరీరాన్ని ఏం చేస్తుంది?
- మందు, చికిత్స: కరోనావైరస్: కోవిడ్-19కు చికిత్స చేసే మందు ఎప్పుడు వస్తుంది? ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు?
- టిప్స్: కరోనావైరస్ చిట్కాలు: మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? వైరస్ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలి?
- కోలుకోవడం: కరోనావైరస్ బారిన పడితే తిరిగి కోలుకోవడానికి ఎంత కాలం పడుతుంది?
- వ్యాక్సిన్: కరోనావైరస్ వ్యాక్సిన్ పరిశోధనలు ఎంత వరకూ వచ్చాయి? వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది?
- లాక్డౌన్: తిరిగి సాధారణ జీవితం ఎప్పుడు, ఎలా మొదలవుతుంది?
- ఎండ్‌గేమ్: కరోనావైరస్ మహమ్మారి నుంచి బయటపడటం ఎలా?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- ఉమ్ము పరీక్షలతో కరోనా మహమ్మారిని అంతం చేయవచ్చా?
- హైదరాబాద్ నుంచి ఇప్పటివరకు ఎంతమంది వెళ్లిపోయారు
- సెక్స్ వర్కర్లు ఆ దేశంలో రెయిన్ కోట్ ఎందుకు వేసుకుంటున్నారు?
- రిలయన్స్ జియో 5జీ వస్తోంది.. కానీ భారతీయులు ఎన్నాళ్లు ఎదురు చూడాలి?
- చైనా - భారత్ మధ్య 45 ఏళ్లుగా లేనంత గొడవలు ఇప్పుడెందుకు?
- భారత్ - చైనా 1962 యుద్ధం: పిరికిపందల చర్యా లేక నమ్మకద్రోహమా?
- చైనా, ఇరాన్‌ల సీక్రెట్ డీల్: భారత్‌కు ఎంత నష్టం
- పాకిస్తాన్ నిర్మిస్తున్న ఆనకట్టపై భారత్ ఎందుకు అభ్యంతరం చెబుతోంది?
- అక్కడ అమ్మాయి పేరు ఎవరికీ చెప్పకూడదు.. పెళ్లి పత్రాల్లో రాయరు, మరణ ధ్రువీకరణల్లో ఉండదు
- ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ హాట్ స్పాట్‌గా మారిన తూర్పు గోదావరి
- భారత జనాభా ఈ శతాబ్దం చివరికి ఎందుకు తగ్గుతుంది... తగ్గితే ఏమవుతుంది?
- ‘టీకా వేయించుకోవాలి.. కరోనావైరస్ సోకించుకోవాలి - వలంటీర్లు కావలెను’
- కరోనావైరస్: హైదరాబాద్‌లో ఇళ్లల్లో ఆక్సిజన్ సిలిండర్లు... మార్కెట్లో పెరిగిన డిమాండ్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








