పోలీస్ హీరో: నాలుగు నెలల పాప కోసం పాలు తీసుకుని రైలు వెనుక కానిస్టేబుల్ పరుగులు.. వీడియో వైరల్

ఫొటో సోర్స్, MONEY SHARMA / AFP
- రచయిత, షురైహ్ నియజీ
- హోదా, బీబీసీ కోసం
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఒక రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) కానిస్టేబుల్ చేసిన సాహసానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఆ కానిస్టేబుల్ తన ప్రాణాలకు తెగించి రెండు రోజుల నుంచీ పాలు దొరక్క ఆకలితో అల్లాడుతున్న ఒక చిన్నారి కడుపు నింపాడు.
ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఇంద్రయాదవ్ స్టేషన్లో డ్యూటీలో ఉన్న సమయంలో ఈ ఘటన మే 31న ఈ ఘటన జరిగింది. అదే సమయంలో బెలగావ్(కర్ణాటక) నుంచి గోరఖ్‌పూర్ వెళ్తున్న ఒక శ్రామిక్ స్పెషల్ రైలు భోపాల్ స్టేషన్లో ఆగింది.
అదే రైల్లో ఉన్న 23 ఏళ్ల సాఫియా హాష్మీ, తన నాలుగు నెలల పాప గుక్కపట్టి ఏడుస్తుండడంతో ఇబ్బంది పడుతున్నారు.
స్టేషన్లో ఉన్న ఇంద్రయాదవ్‌ను చూసిన సాఫియా అతడిని సాయం అడిగారు. పాపకు రెండ్రోజులుగా పాలు తాగించలేదని, ఆకలితో ఆపకుండా ఏడుస్తోందని, ముందు స్టేషన్లో ప్రయత్నించినా పాలు దొరకలేదని చెప్పారు.
దాంతో, ఇంద్రయాదవ్ వెంటనే పాపకు పాలు తీసుకురావడానికి స్టేషన్ బయటకు పరిగెత్తాడు. ఒక షాపులో పాల ప్యాకెట్ కొని స్టేషన్ దగ్గరకు వచ్చాడు.
అదే సమయానికి రైలు బయల్దేరుతోంది. అది చూడగానే ఇంద్రయాదవ్ సాఫియా ఉన్న కోచ్ వైపు పరిగెత్తాడు. రైలు వేగం అందుకున్నప్పటికీ ఆమె ఉన్న బోగీ దగ్గరకు చేరుకుని ఆ పాల ప్యాకెట్ అందించగలిగాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
సాయానికి తల్లి కృతజ్ఞతలు
ఈ ఘటన జరిగిన తర్వాత సాఫియా ఇంద్రయాదవ్‌కు కృతజ్ఞతలు చెప్పారు.
గోరఖ్‌పూర్ చేరుకున్న తర్వాత పాప కోసం ప్రాణాలకు తెగించి సాయం చేసిన ఆ కానిస్టేబుల్‌కు సాఫియా ఒక వీడియో సందేశం పంపించారు. తన చిన్నారి కోసం అతడు చేసిన సాహసానికి ధన్యవాదాలు చెప్పారు.
ఆమె ఆ వీడియో సందేశంలో “రైలు వేగం అందుకోవడంతో, ఈసారైనా పాలు దొరుకుతాయిలే అనుకున్న నా ఆశలు ఆవిరైపోతూ వచ్చాయి. అదే సమయంలో ఎవరో పరిగెత్తుతూ కిటికీలోంచి పాలు లోపలికి అందించారు. ఇంద్ర భాయ్ లాంటి వారే మనకు అసలైన హీరోలు” అన్నారు.

ఫొటో సోర్స్, SHURAIH NIYAZI / BBC
వైరల్ అయిన వీడియో
ఈ ఘటన రైల్వే స్టేషన్లోని సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందరూ ఇంద్రయాదవ్ చేసిన పనిని ప్రశంసిస్తున్నారు.
అటు, రైల్వే మంత్రి పీయూష్ గోయల్ కూడా ట్విటర్‌లో అతడిని ప్రశంసించారు. ఇంద్రయాదవ్‌కు క్యాష్ రివార్డు కూడా ఇస్తానన్నారు.
పీయూష్ తన ట్విటర్‌లో “రైల్వే కుటుంబం సాహసోపేత చర్య. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఇంద్రయాదవ్ డ్యూటీ సమయంలో తన సాహస కార్యం చేశారు. నాలుగు నెలల పాప కోసం వెళ్తున్న రైలు వెనక పరుగులు తీశారు. నాకు గర్వంగా ఉంది. నేను ఇంద్ర యాదవ్‌ను నగదు పురస్కారంతో గౌరవిస్తామని ప్రకటిస్తున్నాను” అన్నారు.
దీనిపై సాఫియా హష్మీ “నేను బెలగావ్‌లో లాక్‌డౌన్‌లో చిక్కుకుపోయాను. మాకు శ్రామిక్ రైల్లో తిరిగి గోరఖ్‌పూర్ వెళ్లే అవకాశం దొరికింది. కానీ, దారిలో పాపకు పాలు అయిపోయాయి. భోపాల్ స్టేషన్లో నేను ఇంద్రయాదవ్‌ను సాయం చేయమని అడిగాను. పాప ఆకలితో ఏడుస్తోందని చెప్పాను” అన్నారు.
“ఆ తర్వాత ఆయన నన్ను అక్కడే ఉండమని వెంటనే బయటకు పరిగెత్తాడు” అన్నారు.
చిన్నారి ఆకలి తీర్చాడు
ఏడుస్తున్న పాపకు సాఫియా నీళ్లలో బిస్కెట్లు తడిపి తినిపిస్తోంది. కానీ వాటితో ఆకలి తీరకపోవడంతో పాప ఏడుస్తూనే ఉంది. అదే సమయంలో ఇంద్రయాదవ్ వారిపాలిట దేవుడులా వచ్చాడు.
ఈ ఘటన గురించి ఇంద్రయాదవ్ బీబీసీతో “రైల్లో ఆ మహిళ తన సమస్య చెప్పింది. పాలు దొరకలేదని, పాపకు బిస్కెట్లు నీళ్లు ఇస్తున్నానని చెప్పింది. దాంతో నేను ఆమెను అక్కడే ఉండమన్నా, ఆమెతో మాటల్లోనే ఐదు నిమిషాలు గడిచిపోయాయి” అన్నాడు.
“నేను వేగంగా బయటకు వెళ్లాను, షాపులో పాలు తీసుకుని వచ్చాను. అప్పటికే రైలు వెళ్లిపోతోంది. దాంతో దాని పక్కనే పరిగెత్తాను. ఫ్లాట్ ఫాం ముగిసేలోపే బోగీలో ఉన్న ఆ మహిళకు పాలు అందించగలిగాను” అన్నాడు.
ఒక పోలీస్ ఏం చేయాలో తను అదే పనిని చేశానని ఇంద్ర యాదవ్ చెబుతున్నాడు.
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ వ్యాక్సీన్ తయారు చేసే అవకాశాన్ని ప్రపంచం ఎలా చేజార్చుకుంది?
- కరోనావైరస్ వ్యాక్సిన్ తయారీకి ఫార్మా సంస్థలు ఎందుకు ముందుకురావట్లేదు...
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనావైరస్ వ్యాక్సిన్: కోతులపై ప్రయోగంలో పురోగతి.. మానవులపైనా టీకా ప్రయోగాలు
- మీరా చోప్రాపై ట్రోలింగ్‌కు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదు? ఈ కేసులో ఇప్పుడు ఏం జరుగనుంది?
- స్ట్రాబెర్రీ మూన్: ఈరోజు, రేపు చంద్ర గ్రహణం - భారతదేశంలో కనిపించే సమయాలివీ...
- పారిపోయి పెళ్లి చేసుకున్న జంటకు రూ.10 వేల జరిమానా విధించిన కోర్టు.. కరోనా కాలంలో మాస్కు ధరించనందుకు..
- టిఫానీ ట్రంప్: అమెరికాలో జరుగుతున్న నిరసనలకు ట్రంప్ కుమార్తె మద్దతు
- కరోనావైరస్: 36 రోజులు వెంటిలేటర్‌పై మృత్యువుతో పోరాడి, బతికి బయటపడిన వ్యక్తి ఇతను
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ లక్షణాలు: ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- జార్జ్ ఫ్లాయిడ్ ఎవరు? అనేక సార్లు అరెస్టయిన ఫ్లాయిడ్ కోసం అమెరికా ఎందుకు రగులుతోంది?
- పులి, మేకల మధ్య స్నేహ బంధం ఎలా సాధ్యం? వైరి జంతువుల మధ్య మితృత్వం వెనుక రహస్యం ఏమిటి?
- కరోనావైరస్: ‘గుజరాత్లో కరోనా కల్లోలానికి ప్రత్యక్ష సాక్షిని నేనే.. 20 ఏళ్ల కలల జీవితం మూడు రోజుల్లో కూలిపోయింది’
- కరోనావైరస్ సంక్షోభానికి మేధావులు చూపిస్తున్న 7 పరిష్కారాలు 'మిషన్ జైహింద్'
- కరోనావైరస్: మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడే రోగ నిరోధక వ్యవస్థ, మీ శరీరంపైనే దాడి చేస్తే..
- కరోనావైరస్: వ్యాక్సీన్ ప్రయోగాల్లో ఆఫ్రికా వాళ్ళు తప్పకుండా ఉండాలి... ఎందుకంటే?
- హైదరాబాద్: నిజాం పాలకుల క్వారంటైన్ హాస్పిటల్... ఇప్పుడు కోరంటి దవాఖానా
- కరోనావైరస్: ప్రపంచ వస్తూత్పత్తి కేంద్రంగా చైనా స్థానాన్ని భారత్ సొంతం చేసుకోగలదా?
- కరోనావైరస్: ఫేస్‌మాస్కుల ఫ్యాషన్ కొత్తపుంతలు తొక్కుతోంది...
- కరోనావైరస్: రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలంటే ఏం తినాలి.. వేటిని దూరం పెట్టాలి
- కరోనావైరస్: యూట్యూబ్‌లో తప్పుదోవ పట్టించే వీడియోలు చూస్తున్న కోట్ల మంది యూజర్లు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








