కరోనావైరస్ సంక్షోభానికి మేధావులు చూపిస్తున్న 7 పరిష్కారాలు 'మిషన్ జైహింద్'

ఫొటో సోర్స్, Getty Images
కరోనావైరస్‌తో చుట్టుముట్టిన ఆర్థిక, ఆరోగ్య, మానవతా సంక్షోభాలను పరిష్కరించేందుకు ప్రముఖ ఆర్థిక వేత్తలు, మేధావులు, సామాజిక కార్యకర్తలు ఏడు సూత్రాల ప్రణాళికను రూపొందించారు. దీనికి మిషన్ జైహింద్‌గా నామకరణం చేశారు.
వలస కార్మికులను ఆదుకోవడంతో మొదలుపెట్టి.. అందరికీ ఆరోగ్య సంరక్షణ, ఆరు నెలలపాటు ఆహార ధాన్యాల పంపిణీ, పట్టణ-గ్రామాల్లో ఉపాధి హామీ, ఉద్యోగాలు కోల్పోయినవారికి పరిహారం, పంట రుణాలకు మూడు నెలల మినహాయింపులు తదితర సూచనలు ఇందులో ఉన్నాయి.
డాక్యుమెంట్‌ను తయారుచేసిన వారిలో కేంద్ర ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారుడు దీపక్ నయ్యర్, ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు అభిజిత్ సేన్, చరిత్రకారుడు రామచంద్ర గుహ, మహాత్మా గాంధీ మనవడు రాజ్‌మోహన్ గాంధీ, జేఎన్‌యూ అసోసియేట్ ప్రొఫెసర్ హిమాన్షు, సఫాయి కర్మచారి ఆందోళన్ జాతీయ కన్వీనర్ బెజవాడ విల్సన్, గ్రీన్ పీస్ ఇండియా ఫౌండర్ లలితా రామ్‌దాస్, మాజీ నావికాదళ అధిపతి ఎల్ రామ్‌దాస్ తదితరులున్నారు.

ఫొటో సోర్స్, SAMIR JANA/HINDUSTAN TIMES VIA GETTY IMAGES
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
మిషన్ జైహింద్‌లోని వివరాలివీ...
1. వలస కార్మికులను పది రోజుల్లోగా సొంత ఇళ్లకు చేర్చాలి.
- సొంత ఇళ్లకు రావాలనుకునే వలస కార్మికులను.. పది రోజుల్లోగా సురక్షితంగా, గౌరవప్రదంగా ఇంటికి చేర్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలి.
- కార్మికుల కోసం ప్రత్యేక, బస్సులు, ట్రైన్‌లు ఏర్పాటుచేసి ఆ ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరించాలి. బస్సు, ర్వైల్వే స్టేషన్ల నుంచి ఇంటికి తీసుకెళ్లే ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకోవాలి. రాష్ట్రం లోపలే ఉండే వలస కార్మికులకు రాష్ట్రాలు రవాణా సదుపాయాలు ఏర్పాటుచేయాలి.
- కార్మికులకు మంచి నీరు, తిండి, ఉండేందుకు చోటును స్థానిక పరిపాలనా యంత్రాంగం చూసుకోవాలి.
- అవసరమైతే ప్రైవేటు వాహనాలను ప్రభుత్వాలు అద్దెకు తీసుకోవాలి. పరిపాలనా యంత్రాంగానికి సాయం చేసేందుకు సైన్యం అందుబాటులో ఉండాలి.

ఫొటో సోర్స్, SANTOSH KUMAR/HINDUSTAN TIMES VIA GETTY IMAGES
2. కోవిడ్ రోగులు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు అండగా నిలవాలి: పరీక్షల నుంచి వెంటిలేటర్ల వరకు అందరికీ ఉచితంగా..
- లక్షణాలు కనిపించే ప్రతిఒక్కరికీ ఉచితంగా పరీక్షలు అందుబాటులో ఉంచాలి.
- వెంటిలేటర్లు, ఐసీయూ బెడ్లు, క్వారంటైన్ సదుపాయాలు లాంటివి అందరికీ ఉచితంగా ఉంచాలి. అవసరమైతే ప్రైవేటు సదుపాయాలనూ వాడుకోవాలి.
- ఫ్రంట్‌లైన్ వర్కర్లు, వారి కుటుంబాలకు ఏడాదిపాటు కోవిడ్-19 నుంచి రక్షణగా వైద్యపరమైన, ఆర్థిక పరమైన సాయం అందించాలి.
- ఆరోగ్య సదుపాయాలు, వ్యాధి గురించి సమాచారాన్ని పూర్తిగా వెల్లడించాలి.
3. ఎవరూ ఆకలితో ఉండకూడదు
- రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ నెలకు పది కేజీల ఆహార ధాన్యాలు,1.5 కేజీల పప్పు, 800 ఎంఎల్ నూనె, 500 గ్రాముల పంచదార అందించాలి.
- కార్డులపై అదనంగా పేర్లను జత చేయడం లేదా అత్యవసర రేషన్ కార్డుల జారీ కోసం అధికారులు పనిచేయాలి.
- మధ్యాహ్న భోజన పథకం, ఐసీడీఎస్ సరకులను నేరుగా ఇళ్లకు చేర్చాలి.
- ఆకలితో ఉండేవారి కోసం అన్ని స్కూళ్లలోనూ సామూహిక వంటశాలలు ఏర్పాటుచేయాలి.

ఫొటో సోర్స్, JEWEL SAMAD/GETTY IMAGE
4. అందరికీ ఉపాధి
- ఉపాధి హామీ కార్డుపై తప్పనిసరిగా 200 రోజుల ఉపాధి కల్పించాలి.
- పట్టణ ప్రాంతాల్లో గ్రీన్ జాబ్స్ కింద రోజుకు రూ.400 చెల్లిస్తూ వంద రోజులు ఉపాధి కల్పించాలి
- లాక్‌డౌన్ సమయంలో కోల్పోయిన ఉపాధికిగాను ఉపాధి హామీ కార్డుదారులకు 30 రోజుల వేతనం ఇవ్వాలి.
- ఉపాధి హామీ పని ఏడాది పొడవునా ప్రతి గ్రామంలోనూ అందుబాటులో ఉండేలా చూడాలి.
- దివ్యాంగులు, వృద్ధులకు తగిన పని అప్పగించాలి.
5.అందరికీ ఆదాయం
- ఈపీఎఫ్ కింద నమోదైనవారు ఉద్యోగం కోల్పోతే.. పరిహారం ఇవ్వాలి.
- ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు ఒత్తిడిలో ఉన్న సంస్థలకు వడ్డీలేని రుణాలు ఇవ్వాలి.
- లాక్‌డౌన్ సమయంలోనూ జీతాలు ఇచ్చిన ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం ఆరు నెలల ఈపీఎఫ్‌ను చెల్లించాలి.
- మద్దతు ధర పడిపోవడంతో నష్టాలు చవిచూసిన రైతులకు పరిహారం ఇవ్వాలి.
- వీధి వ్యాపారులు, చిన్న చిన్న దుకాణదారులు తిరిగి వ్యాపారాలు మొదలు పెట్టుకొనేందుకు రూ.10,000 సబ్సిడీగా అందించాలి.
- వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు నెలకు రూ.2,000 చొప్పున మూడు నెలల పింఛను అదనంగా ఇవ్వాలి.

6. వడ్డీలు తీసుకోకూడదు
- మూడు నెలలపాటు గృహ రుణాలు వసూలు చేయకూడదు. వడ్డీ కూడా వేయకూడదు.
- ఆరు నెలల వరకు ముద్ర రుణాలు (శిశు, కిశోర్) వసూలు చేయకూడదు.
- ఆరు నెలల వరకు కిసాన్ క్రెడిట్ కార్డుపై తీసుకున్న పంట రుణాలను వసూలు చేయకూడదు.
7. నిధులు లేవని ఆపేయకూడదు
- భారీగా ఇస్తున్న ఉపశమన ప్యాకేజీలకు సరిపడా నిధుల కోసం పన్నులు, సుంకాలు లాంటి సంప్రదాయ రెవెన్యూ వనరులతోపాటు ఇతర మార్గాలనూ ప్రభుత్వం అన్వేషించాలి.
- ఉపశమన చర్యల కోసం అదనంగా వసూలు చేసిన నిధులను 50 శాతం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలి.
- ఈ చర్యల కోసం పెట్టే ఖర్చులకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇతర వ్యర్థ, అత్యవసరంకాని ఖర్చులు, సబ్సిడీలపై నిషేధం విధించాలి.
అయితే ఆదాయం కోసం ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చేసుకోవచ్చనే అర్థం వచ్చేలా ఏడో సూత్రం ఉందని వివాదం చెలరేగింది.
"సంక్షోభ సమయంలో ప్రజల వద్దనున్న డబ్బు, స్థిరాస్తులు, బాండ్లు ఇలా అన్ని వనరులను జాతీయ వనరులుగా ప్రభుత్వం భావించాలి" అని మొదటగా ఏడో పాయింట్లో రాశారు.
కొద్దిసేపటి తర్వాత తమకు జాతీయీకరణ, ప్రైవేటు ఆస్తుల స్వాధీనం లాంటి ఆలోచనలే లేవని స్వరాజ్ ఇండియా పార్టీ నాయకుడు యోగేంద్ర యాదవ్ స్పష్టంచేశారు. ఏడో పాయింట్లో మార్పులుచేసి.. ఆ డాక్యుమెంట్‌ను మరోసారి ఆయన ట్వీట్‌చేశారు.
ఇవి కూడా చదవండి:
- గర్భిణికి వైరస్ సోకితే ఎలా? : కరోనా కల్లోలంలో ఓ డాక్టర్ అనుభవం
- కరోనావైరస్‌తో సహజీవనం: ఫుట్‌బాల్ ప్రీమియర్ లీగ్ ఎలా మొదలైంది.. మ్యాచ్‌లు ఎలా ఆడుతున్నారు
- కరోనావైరస్: మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడే రోగ నిరోధక వ్యవస్థ, మీ శరీరంపైనే దాడి చేస్తే..
- ఆమె రాసిన ‘వుహాన్ డైరీ’లో ఏముంది? ఆమెను చైనాలో ‘దేశద్రోహి’ అని ఎందుకు అంటున్నారు?
- కరోనావైరస్: అమెరికా వర్సెస్ చైనా... పోటాపోటీగా కుట్ర సిద్ధాంతాలు
- ఇండియా లాక్‌డౌన్: వలస కూలీల కోసం మోదీ ప్రభుత్వం ఏం చేస్తోందంటే... – అభిప్రాయం
- తుపాను: ఒకటో నంబరు, రెండో నంబరు, మూడో నంబరు.. ఈ హెచ్చరికలకు అర్థం ఏమిటి?
- ‘20 తుపాన్లు చూశా.. ఈ తుపాను సాధారణంగానే కనిపిస్తోంది’
- గ్లోబల్ వార్మింగ్: ఈ 5 పనులూ చేయండి.. భూ తాపాన్ని మీరే తగ్గించండి
- సూపర్ సైక్లోన్ ఆంఫన్: ప్రపంచంలో అత్యంత ఘోరమైన తుపానులన్నీ బంగాళాఖాతంలోనే ఎందుకు సంభవిస్తాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









