కరోనావైరస్: ఫేస్‌మాస్కుల ఫ్యాషన్ కొత్తపుంతలు తొక్కుతోంది...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సోఫీ విలియమ్స్
- హోదా, బీబీసీ న్యూస్
కరోనావైరస్ ప్రబలడంతో ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఇప్పుడు ఫేస్‌మాస్కులు తప్పనిసరయ్యాయి.
ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచం ఈ మాస్కులు ట్రెండీగా మారడం ఖాయమంటోంది.
ముందుముందు మాస్కులు రోజువారీ జీవితంలో భాగం కావడం తప్పదని అర్థం కావడంతో ప్రజలు తమ వస్త్రధారణ, వేషధారణలో భాగంగా మలచుకునే మార్గాలను వెతుకుతున్నారు.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది, 1
‘‘డిజైనర్లు సహా అందరూ ఇప్పుడు దీనిపైనే ఉన్నారు. ఇకనుంచి ఇది తప్పనిసరి ఫ్యాషన్ ప్రకటన’’ అన్నారు ఫ్యాషన్ కన్నాజియర్ అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నడిపే ఏంజెల్ ఒబాసీ.
సూట్ వేసుకుని, దానికి తగ్గ మ్యాచింగ్ మాస్క్ పెట్టుకున్న ఫొటోను ఒబాసీ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఆ పోస్టుకు వచ్చిన లైక్‌లు లక్ష పైనే.

ఫొటో సోర్స్, EPA
తన స్టైల్‌కు అది బాగా నప్పడమే కాకుండా తనను భద్రంగా ఉంచుతుందున్న కారణంతో ఆ మాస్కును అనేకసార్లు ధరించినట్లు ఒబాసీ ‘బీబీసీ’తో చెప్పారు.
సురక్షితంగానూ, ఫ్యాషనబుల్‌గా ఉంటామంటున్నద ఒబాసీ ఒక్కరే కాదు హైప్రొఫైల్ వ్యక్తులు చాలామంది తమ దుస్తులకు తగ్గ మాస్కులు ధరించడం ప్రారంభించారు.
అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ గురించి ఇటీవల హిల్లరీ క్లింటన్ మాట్లాడుతూ ‘‘మెజారిటీ సభ నాయకురాలు, ప్యాంట్, సూట్ నుంచి మాస్కు వరకు కలర్ కాంబినేషన్ మెంటైన్ చేస్తారు’’ అన్నారు.

ఫొటో సోర్స్, REUTERS
స్లొవేకియా అధ్యక్షురాలు జుజానా కేప్యుటోవా ప్రజల్లో కనిపిస్తున్న ప్రతిసారీ తన దుస్తులకు తగ్గ మాస్కులతో వస్తున్నారు. ఆమె వస్త్రధారణకు ఆన్‌లైన్లో ప్రశంసలు దక్కుతున్నాయి.
ఈ ట్రెండు పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది ఫ్యాషన్ డిజైనర్లు ఈ తరహా దుస్తులను తయారుచేస్తున్నారు.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది, 2
గివెంచీ అయితే ఇప్పటికే మాస్క్, టోపీ కాంబినేషన్ ఒకటి విడుదల చేసింది. దీని ధర 425 పౌండ్లు ఉంది.
ఇటలీలో బికినీకి తగ్గ మాస్కు రూపొందించి డిజైనర్ టిజియానా స్కారాముజో పతాకశీర్షికలకు ఎక్కారు. ఈ మొత్తం బికినీ, మాస్క్ సెట్‌కు ఆమె ట్రికినీ అని పేరు పెట్టారు.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది, 3
అమెరికాలోని రూమ్ షాప్ వింటేజ్ టాప్‌కు తగ్గ మాస్కులను విక్రయిస్తోంది. ‘‘మా కస్టమర్లు వీటిని ఇష్టపడుతున్నారు. మాస్కు తప్పనిసరి కావడం.. అది తాము ధరించే టాప్‌కు తగినట్లు ఉండడంతో సంతోషిస్తున్నారు’’ అని రూమ్ షాప్ వింటేజ్ సహవ్యవస్థాపకురాలు షెల్లీ హార్స్ట్ చెప్పారు.
ఈ ట్రెండ్ కంటిన్యూ కావాలని కోరుకుంటున్నానని.. ముందుముందు ఏ మాస్క్ ధరించాలన్న అవసరాన్ని బట్టి దానికి తగ్గ దుస్తులు ఎంపిక చేసుకునే పరిస్థితీ వస్తుందన్నారామె.
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ సాకుతో కార్మికుల హక్కులపై వేటు.. మూడేళ్ల వరకూ కొన్ని చట్టాలు రద్దు
- పోర్న్ సైట్లకు క్రెడిట్ కార్డులతో చెల్లింపులు ఆపండి: స్వచ్ఛంద సంస్థల విజ్ఞప్తి
- "మా సిబ్బందికి కరోనావైరస్ వస్తుందో లేదో తెలియదు, కానీ వాళ్లు ఆకలితో చనిపోయేలా ఉన్నారు"
- 1918లో 5 కోట్ల మందిని బలి తీసుకున్న స్పానిష్ ఫ్లూ కట్టడికి ఏం చేశారంటే...
- కరోనావైరస్లో వందల సంఖ్యలో కొత్త మ్యుటేషన్లు: పరిశోధనలో ఉన్న వ్యాక్సీన్లు పనికి రాకుండా పోతాయా?
- లిపులేఖ్ రోడ్డు విషయంలో భారత్ తీరుపై నేపాల్‌లో ఆగ్రహం ఎందుకు
- కాలాపానీ: నేపాల్ సరిహద్దులోని 35 చ.కి.మీ భూమి సమస్యను వాజ్‌పేయి నుంచి మోదీ వరకు ఎవ్వరూ ఎందుకు పరిష్కరించలేదు?
- వుహాన్‌లో లాక్ డౌన్ ఎత్తేసిన చైనా ప్రభుత్వం.. రైళ్లు, విమానాల్లో మొదలైన ప్రయాణాలు
- ఇండియా లాక్డౌన్: ‘‘నెల రోజులు బండ్లు తిరగకపోతే.. బతుకు బండి నడిచేదెలా?’’ - రవాణా, అనుబంధ రంగాల కార్మికుల వేదన
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








