జార్జ్ ఫ్లాయిడ్: అమెరికాలో జరుగుతున్న నిరసనలకు ట్రంప్ కుమార్తె టిఫానీ ట్రంప్ మద్దతు

ఫొటో సోర్స్, Reuters
అమెరికాలో నల్ల జాతీయులపై పోలీసుల అరాచకత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ నిరసనలకు ఆ దేశ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చిన్న కూతురు టిఫానీ ట్రంప్ మద్దతు తెలిపారు.
జార్జి ఫ్లాయిడ్ అనే నల్ల జాతీయుడు పోలీసులు అరెస్టు చేసే క్రమంలో మరణించడంతో గత వారం నుంచి అమెరికాలో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
దాదాపు 40 నగరాల్లో కర్ఫ్యూ విధించినా, జనాలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు.
సోషల్ మీడియాలోనూ సామాన్యుల నుంచి ప్రముఖుల వరకూ ఈ నిరసనలకు మద్దతు తెలుపుతూ పోస్ట్‌లు చేస్తున్నారు.
టిఫానీ కూడా పూర్తిగా నలుపు రంగుతో ఉన్న ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
#BlackoutTuesday #justiceforgeorgefloyd హ్యాష్‌ట్యాగ్‌లను వాడుతూ... ‘‘ఒంటరిగా మనమేం సాధించలేం. కానీ కలిసికట్టుగా ఏదైనా చేయగలం’’ అని అర్థం వచ్చేలా ఓ వ్యాఖ్యను పెట్టారు.
అధ్యక్ష భవనం వైట్ హౌస్ బయట ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించిన సమయంలోనే టిఫానీ ఈ పోస్ట్ చేశారు.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది
టిఫానీ తల్లి, డోనల్డ్ ట్రంప్ రెండో భార్య మార్లా మేపల్స్ కూడా నిరసనలకు మద్దతు ప్రకటిస్తూ ఇలాంటి ఫొటోనే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
టిఫానీ పెట్టిన పోస్ట్‌ను సమర్థిస్తూ చాలా మంది కామెంట్లు పెట్టారు. ఈ విషయంలో ముందుగా ఆమె తన తండ్రి డోనల్డ్ ట్రంప్‌తో మాట్లడాల్సిందని కూడా కొందరు వ్యాఖ్యానించారు.
అమెరికాలో సోషల్ మీడియాలో #blackoutTuesday హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఏం జరిగింది?
మినెసోటా రాష్ట్రంలోని మినియాపోలిస్ నగరంలో మే 25న జార్జి ఫ్లాయిడ్ (46) అనే ఓ నల్ల జాతి వ్యక్తి పోలీసులు అరెస్టు చేస్తున్నప్పుడు చనిపోయారు.
ఫ్లాయిడ్ అరెస్టు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఫ్లాయిడ్‌ను అరెస్టు చేసే క్రమంలో తెల్ల జాతికి చెందిన పోలీసు అధికారి డెరెక్ షావిన్... ఆయన్ను నెలకు అదిమిపట్టి, మెడను మోకాలితో నొక్కిపట్టి చాలా సేపు కూర్చోవడం ఆ వీడియోలో కనిపించింది.
జార్జ్‌తో పాటు అక్కడున్న మిగతా వాళ్లు కూడా పోలీసును అలా చేయొద్దని వారించడం అందులో రికార్డైంది.
‘‘ప్లీజ్, నాకు ఊపిరి ఆడటం లేదు’’ అంటూ జార్జి మొరపెట్టుకున్నా, పోలీసు వినిపించుకోలేదు. జార్జికి అవే ఆఖరి మాటలయ్యాయి.
జార్జి మరణంతో పోలీసుల తీరుపై అమెరికా వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. చాలా చోట్ల నిరసనలు జరుగుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: ‘గుజరాత్లో కరోనా కల్లోలానికి ప్రత్యక్ష సాక్షిని నేనే.. 20 ఏళ్ల కలల జీవితం మూడు రోజుల్లో కూలిపోయింది’
- ఏనుగు మరణం: కేరళలోని గుళ్లలో 600 ఏనుగులను చంపేశారని మేనకా గాంధీ ఆరోపణలు.. అది నిజమేనా?
- ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ నిరసనలు: అమెరికాలోని భారత్, పాకిస్తాన్ సంతతి ప్రజలు ఏమంటున్నారంటే..
- ఆపరేషన్ బ్లూ స్టార్: స్వర్ణ మందిరంలోకి భారత యుద్ధ ట్యాంకులు ప్రవేశించగానే ఏం జరిగింది
- స్ట్రాబెర్రీ మూన్: ఈరోజు, రేపు చంద్ర గ్రహణం - భారతదేశంలో కనిపించే సమయాలివీ...
- అమెరికాలో నిరసనలు: సైన్యాన్ని రంగంలోకి దింపే అధికారం అధ్యక్షుడు ట్రంప్‌కు ఉందా?
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వెళ్లాలంటే ఈ-పాస్ తీసుకోవాలా.. వెళ్లాక ప్రభుత్వ క్వారంటైన్లో ఉండాలా హోం క్వారంటైనా
- కలలకు అర్ధం ఏమిటి? భవిష్యత్తుకు సూచికలా? మనో స్థితికి ప్రతీకలా?
- జార్జ్ ఫ్లాయిడ్ ఎవరు? అనేక సార్లు అరెస్టయిన ఫ్లాయిడ్ కోసం అమెరికా ఎందుకు రగులుతోంది?
- చనిపోయారని మృతదేహం అప్పగించారు... ఆ తర్వాత కోలుకున్నారు వచ్చి తీసుకెళ్లండని ఫోన్ చేశారు...
- కరోనావైరస్ సైలెంట్ స్ప్రెడర్స్: మన మధ్యే ఉంటూ చాపకింద నీరులా వైరస్‌ను వ్యాపింపచేస్తోంది వీరేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








