ప్రపంచంలో కరోనావైరస్ కేసులు అత్యధికంగా నమోదైన దేశాల్లో ఏడో స్థానానికి భారత్

ఫొటో సోర్స్, ANI
కరోనావైరస్ పాజిటివ్ కేసులు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ ఏడో స్థానానికి చేరుకుంది.
జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ సమాచారం ప్రకారం భారత్‌లో ఇప్పటివరకూ మొత్తంగా 1,90,609 కేసులు నమోదయ్యాయి. 5,408 మంది మరణించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గణాంకాల ప్రకారం కూడా కరోనావైరస్ కేసుల సంఖ్య అధికంగా ఉన్న దేశాల్లో భారత్ ఏడో స్థానానికి వెళ్లింది. భారత్‌లో మొత్తంగా 1,82,143 కేసులు నమోదయ్యాయని, 5,164 మంది చనిపోయారని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.
కరోనావైరస్ వ్యాప్తి తీవ్రత అధికంగా ఉన్న దేశాల్లో అమెరికా, బ్రెజిల్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
అమెరికాలో కరోనావైరస్‌తో మరణించినవారి సంఖ్య లక్ష దాటింది. కేసుల సంఖ్య 17 లక్షలు దాటింది.
మరోవైపు బ్రెజిల్ 5 లక్షలకుపైగా కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 30 వేలకుపైగా మంది మరణించారు.

ఫొటో సోర్స్, SAJJAD HUSSAIN
దేశంలో కొత్తగా 8వేల కేసులు
భారత ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం వెల్లడించిన సమాచారం ప్రకారం గత 24 గంటల్లో 8,392 కేసులు నమోదయ్యాయి.
మొత్తం కేసుల సంఖ్య 1,90,535. వీటిలో 93,322 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 91,818 మంది కోలుకున్నారు. 5,394 మంది మరణించారు.
కేసులు అత్యధికంగా ఉన్న ఐదు రాష్ట్రాలు ఇవే...
- మహారాష్ట్ర - కేసులు: 67,655; కోలుకున్నవారు: 29,329; మరణాలు: 2,286.
- తమిళనాడు - కేసులు: 22,333; కోలుకున్నవారు: 12,757; మరణాలు: 173.
- దిల్లీ - కేసులు: 19,844; కోలుకున్నవారు : 8,478; మరణాలు: 473.
- గుజరాత్ - కేసులు: 16,779; కోలుకున్నవారు: 9,919; మరణాలు:1,038.
- రాజస్థాన్ - కేసులు: 8,831; కోలుకున్నవారు: 5,927; మరణాలు: 194.
నేటి నుంచి లాక్‌డౌన్ తొలగింపు
భారత్‌లో లాక్‌డౌన్ ఉపసంహరణ సోమవారం మొదలైంది. ఏయే కార్యకాలాపాలను అనుమతించాలి, వేటిని నిలిపి ఉంచాలనే విషయమై నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకే వదిలేసింది.
కరోనావైరస్ కేసులు ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలో జూన్ 30 వరకూ లాక్‌డౌన్ పొడగించారు.
దిల్లీలో జూన్ 8 నుంచి కొన్ని షరతుల మధ్య హోటళ్లు, షాపింగ్ మాళ్లు, రెస్టారెంట్లు, సెలూన్లు తెరుచుకోనున్నాయి.

ఫొటో సోర్స్, GETTY IMAGES
నేటి నుంచి 200 ప్రత్యేక రైళ్లు
కొన్ని ఎంపిక చేసిన మార్గాల్లో సోమవారం నుంచి ప్రత్యేక రైళ్లు పరుగులుతీయబోతున్నాయి. ప్రయాణికుల మధ్య కరోనావైరస్ వ్యాప్తించకుండా రైల్వే ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.
తొలి రోజు 1.45 లక్షల మంది ఈ రైళ్లలో ప్రయాణించబోతున్నట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. జూన్ 30 వరకు మొత్తంగా 25,82,671 మంది టిక్కెట్లు బుక్ చేసుకున్నట్లు వెల్లడించింది.
వలస కూలీల కోసం మే 12 నుంచీ 30 ప్రత్యేక శ్రామిక్ రైళ్లను రైల్వే నడిపిస్తోంది. వాటికి అదనంగా ఈ 200 రైళ్లు పరుగులు తీస్తాయి.
ప్రత్యేక రైళ్లలో ఏసీతోపాటు నాన్-ఏసీ కోచ్‌లు ఉంటాయి. జనరల్ బోగీల్లోనూ కూర్చుని ప్రయాణించేందుకు రిజర్వేషన్ చేయించుకోవాలి. అన్‌రిజర్వుడ్ బోగీలంటూ ఏమీ ఉండవు.
మే 22 నుంచీ ఈ రైల్ టికెట్ల బుకింగ్ మొదలైంది. అడ్వాన్స్ రిజర్వేషన్ సమయాన్ని 30 రోజుల నుంచి 120 రోజులకు పెంచారు.
ప్రయాణికుల తొలిచార్ట్‌ను నాలుగు గంటల ముందే సిద్ధంచేస్తారు. రెండో చార్ట్‌ను రెండు గంటల ముందు సిద్ధంచేస్తారు. ఇదివరకు 30 నిమిషాల ముందే సిద్ధంచేసేవారు.
కరోనావైరస్ కేసులు పెరుగుతుండటంతో ప్రత్యేక రైలు సేవలపై ఝార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు అభ్యంతరం వ్యక్తంచేశాయి. దీనికి సంబంధించి రాష్ట్రాలతో రైల్వే ప్రతినిధులు సంప్రదింపులు జరుపుతున్నట్లు రైల్వే అధికార ప్రతినిధి వెల్లడించారు.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- గృహ హింస: ‘లాక్‌డౌన్ నాకు ఆలోచించుకునేంత సమయం ఇచ్చింది.. నా భర్త నుంచి నేను విడిపోవాలనుకుంటున్నా’
- వరంగల్ హత్యలు: ‘‘ఒక మహిళను చంపేసి.. అది బయటపడుతుందని మరో 9 మందిని చంపేశాడు’’
- రెండు ఖండాల్లో, 28 మారు పేర్లతో 26 సంవత్సరాలుగా తప్పించుకు తిరిగాడు.. చివరికి ఎలా దొరికిపోయాడంటే
- పాకిస్తాన్: 'పది అడుగుల ఎత్తు నుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నాను...' - కరాచీ విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ జుబైర్
- తెలంగాణ: ‘రెండేళ్ల కిందట తప్పిపోయి, 2 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న నాన్నను టిక్‌టాక్ చూపించింది’
- అమెరికా డాలర్ కనుమరుగవుతుందా? చైనా డిజిటల్ యువాన్ రాజ్యం చేస్తుందా?
- సంక్షేమానికి, వివాదాలకూ రారాజు జగన్
- కరోనావైరస్లో వందల సంఖ్యలో కొత్త మ్యుటేషన్లు: పరిశోధనలో ఉన్న వ్యాక్సీన్లు పనికి రాకుండా పోతాయా?
- నరేంద్ర మోదీ వారసుడు అమిత్ షాయేనా?
- స్వాల్బార్డ్‌కి సుస్వాగతం: ఇది అందరిదీ.. వీసా లేకున్నా ఎవరైనా రావొచ్చు, ఉండొచ్చు
- రెండో ప్రపంచ యుద్ధంలో బాంబుదాడుల నుంచి బతికి బయటపడ్డ మొసలి ఇప్పుడు మృతి
- జాక్ మా: కరోనావైరస్ను కట్టడి చేయాలని, చైనా ప్రతిష్ఠను పునరుద్ధరించాలని ప్రయత్నిస్తున్న మహా కోటీశ్వరుడు
- ఓ వైపు యుద్ధం - మరోవైపు కరోనావైరస్.. తీవ్ర ప్రమాదంలో కామెరూన్ ప్రజలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








