మూత్రం నల్లగా ఎప్పుడు వస్తుంది, అది ఎంత ప్రమాదం?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జోస్ మిగుయెల్ రాబ్లెస్ రొమెరొ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆండీస్ పర్వతశ్రేణుల్లో జరిగిన వాస్తవిక ఘటన ఆధారంగా రూపొందించిన “ద స్నో సొసైటీ” చిత్రానికి స్పానిష్ జువాన్ అంటోనియో బయోనా దర్శకత్వం వహించారు. యురుగ్వే ఎయిర్ ఫోర్స్‌కు చెందిన 571 విమానానికి ప్రమాదం జరిగినప్పుడు అందులో కొంతమంది ప్రాణాలతో బయటపడ్డారు.
1972 అక్టోబర్ 13న ఆ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన వారు ఆండీస్ పర్వతాల్లో ఈడ్చి కొట్టే చలిగాలుల మధ్య 72 రోజుల పాటు ప్రాణాలు కాపాడుకున్నారు. ఆహారం, నీరు లేకపోవడంతో అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. ప్రమాదంలో మరణించిన వారి శరీరంలోని మాంసం తిని ప్రాణాలు నిలుపుకున్నారు.
దీని వల్ల వారిలో అనేక మానసిక సమస్యలు ఏర్పడ్డాయి, కొంతమందికి భయంకరమైన గాయాలయ్యాయి. దీని కారణంగా కూడా వారు అనేక ఇబ్బందులు పడ్డారు.
ఆందోళన కలిగించే సంకేతం
ఆ సమయంలో ఆందోళన కలిగించే అనేక అంశాలలో ఒక విషయం బాగా హైలైట్ అయింది. ఈ కథనంలో ఒక చోట, ఒక క్యారెక్టర్ మూత్రం పోసినప్పుడు అది నల్లగా వస్తుంది. శరీరంలో మార్పుల వల్ల జరిగే పరిణామాలకు ఇదొక సంకేతం.
ఇలా ఎందుకు జరుగుతుందని తెలుసుకునే ముందు, శరీరంలో రక్తంలో ప్రవహించే వ్యర్థ పదార్ధాలను కిడ్నీలు వేరు చేసి బయటకు పంపుతాయనే దాన్ని తెలుసుకోవడం అవసరం. రక్తంలో వ్యర్థాలను బయటకు పంపకుంటే అవి విషపూరితంగా మారి తీవ్రమైన వ్యాధులకు దారి తీస్తాయి.
అలా అది కిడ్నీ ఫెయిల్యూర్‌కి దారి తీస్తుంది. కిడ్నీలు ఫెయిలైతే కొన్ని రోజుల్లోనే మరణిస్తారు.
సాధారణ పరిస్థితుల్లో మన మూత్రం లేత పసుపు పచ్చ రంగులో ఉంటుంది. మూత్రంలో 95 శాతం నీరు, 2 శాతం లవణాలు, మూడు శాతం యూరియా ఉంటాయి.
ప్రొటీన్లు క్షీణించినప్పుడు అమ్మోనియాను తటస్థం చేయడానికి ఈ సమ్మేళనం అవసరం. అంటే శరీరంలో ప్రొటీన్లు క్షీణించే కొద్దీ మూత్రం రంగు, వాసన కూడా మారుతూ వస్తుంది. మూత్రం రంగు మారడం అనారోగ్యానికి సంకేతం.

ఫొటో సోర్స్, Getty Images
ఎలా తెలుసుకోవచ్చు?
సినిమాలో ఓ క్యారెక్టర్‌కు మూత్రం నల్లగా వచ్చినట్లు చూపిస్తారు. ఇలా రావడానికి శరీరంలో నీరు బాగా క్షీణించడం కారణం కావచ్చు. ప్రమాదంలో బాధితులు తాగే నీరంతా గడ్డ కట్టిన మంచు నుంచి వచ్చింది. వారు రోజువారీ కనీసం తాగాల్సిన ఒకటిన్నర లీటర్లతో పోలిస్తే చాలా తక్కువ మొత్తమే తాగేవారు.
రోజులు గడిచే కొద్దీ మూత్రం గాఢత పెరుగుతుంది. అలా అది నల్లగా మారుతుంది. మూత్రం నల్లగా రావడం శరీరంలో వ్యాధి ఉందని చెప్పడానికి ఒక సంకేతం.
అలా చూస్తే, 571 విమాన ప్రమాద బాధితులు రాబ్డోమియోలసిస్ అనే వ్యాధితో బాధ పడ్డారు. భయం, లేదా అధిక చలి, అధిక శ్రమ కారణంగా కండరాలలోని కణాలు చనిపోవడాన్ని రాబ్డోమియోలసిస్ అని పిలుస్తారు.
చనిపోయిన కణాలు రక్తంలోకి మయో గ్లోబిన్ అనే ప్రొటీన్‌ను విడుదల చేస్తాయి. రక్తంలో దీని గాఢత పెరిగితే, కిడ్నీలు వాటిని మూత్రం ద్వారా బయటకు పంపుతాయి. అలాంటి పరిస్థితుల్లో మూత్రం నల్లగా వస్తుంది.

ఫొటో సోర్స్, Netflix
మరో ఆప్షన్ ఏంటంటే, ఈ జబ్బు వచ్చే అవకాశం లేకున్నా, మెలనురియాతో బాధ పడుతూ ఉండవచ్చు. మూత్రంలో మెలనిన్ కణాలు ఉంటే ఇలా జరుగుతుంది.
ఎండల నుంచి శరీరాన్ని కాపాడేందుకు చర్మాన్ని నల్లగా మార్చే ప్రొటీన్‌నే మెలనిన్ అంటారు. శరీరంలో ఏర్పడే ఎఫిలిడ్స్ లేదా ఫ్రెకిల్స్‌ను ఇది కలిపేస్తుంది. ఈ లక్షణం మోలనోమస్ అని పిలిచే చర్మ క్యాన్సర్లలో కనిపిస్తుంది.
అలాగే మూత్రం ముదురు గోదుమ రంగులో వస్తే ఆ వ్యక్తి తీవ్రమైన యూరినరీ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు గుర్తించవచ్చు.
కిడ్నీలలో వ్యాధి చేరితే, ఆ వ్యాధి వల్ల ఉత్పత్తి అయ్యే వ్యర్ధాలను కిడ్నీలు బయటకు పంపుతాయి. ఇలాంటి సమయాల్లో కూడా మూత్రం వాసన, రంగు మారడంతో పాటు గాఢత ఎక్కువగా ఉంటుంది.
చివరిగా, మూత్రం రంగు మారితే చొల్లూరియా అనే వ్యాధి వచ్చినట్లు కూడా అనుమానించాలి. ఇది ఎర్రరక్తణాల విచ్చిన్నానికి కారణమయ్యే పసుపు రంగులో ఉండే బిల్లిరూబిన్ అనే ఆమ్లం ఉత్పత్తి కావడం వల్ల కూడా మూత్రం పసుపు పచ్చగా రావచ్చు.
రక్తంలో దీని తీవ్రత పెరిగితే రెండు లక్షణాలు కనిపిస్తాయి ఒకటి జాండీస్( కామెర్లు). దీని వల్ల శరీరం పసుపు రంగులోకి మారుతుంది. రెండోది చొల్లురియా. అంటే మూత్రం కోలా రంగులో రావడం, చొల్లూరియా వస్తే కాలేయం మీద కూడా ప్రభావం పడినట్లే.
హెపటైటిస్ లేదా లివర్ సిర్రోసిస్ ఉన్నప్పుడు కూడా ఇలా జరగవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
మూత్రం పచ్చ రంగులో లేదా, అయితే వైద్యుడిని సంప్రదించడం మంచిది
మూత్రం రంగు మారడం మన శరీరంలో ఏదో సమస్య ఉందనే దానికి సంకేతం. దాన్ని ఎలా గుర్తించాలి?
ముందు చెప్పినట్లుగానే మూత్రం నల్లగా వస్తుంటే మనం మంచినీళ్లు ఎక్కువగా తాగాలి.
- ఎరుపు రంగు లేదా హెమటురియా ఉంటే మూత్రంలో రక్తాన్ని బయటకు పంపుతున్నామని హెచ్చరిస్తుంది. ఇది పురుషుల విషయంలో ప్రొస్టేట్ గ్రంధి సమస్యలు లేదా యూరిన్ ఇన్‌ఫెక్షన్ లక్షణం కావచ్చు.
- మూత్రం తరచుగా వస్తుంటే ఎక్కువ నీళ్లు తాగడం వల్ల లేదా గ్లూకోజ్‌ను విసర్జించడం, షుగర్ పేషంట్లలో ఇలాంటి సమస్య వస్తుంది.
- మూత్రం ఉదారంగులో వస్తే మూత్రపిండం మార్గంలో బాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించవచ్చు.
- ఔషధాలు ఎక్కువగా వాడటం, రంగులు ఉపయోగించిన ఆహార పదార్ధాలను ఎక్కువగా తినడం వల్ల మూత్రం ఆకుపచ్చ రంగులో వస్తుంది.
యూరిన్ పసుపు పచ్చ రంగులో ఉండాలనేది సుస్పష్టం. అయితే ఆ రంగు మారినా, వాసనలో తేడా వచ్చినా అది శరీరం ఇస్తున్న హెచ్చరికగా గుర్తించాలి. వెంటనే డాక్టర్ని కలవడం మంచింది.
దురదృష్టత్తువశాత్తూ “ సొసైటీ ఆఫ్ ది స్నో” చిత్రంలోని ఆ పాత్రకు అలాంటి అవకాశం లేదు.
ఇవి కూడా చదవండి:
- కశ్మీర్లో మంచు కురవని శీతాకాలం ఎప్పుడైనా చూశారా... ఈ ఏడాదే ఎందుకిలా?
- అయోధ్య: ‘దివ్యాంగ మందిరంలో సకలాంగుడైన రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ధర్మవిరుద్ధం’ -శంకరాచార్య అవిముక్తేశ్వరానంద
- సచిన్ తెందూల్కర్: డీప్‌ఫేక్ బారిన పడిన భారత క్రికెట్ దిగ్గజం, కూతురుతో కలిసి ప్రమోషన్స్ చేస్తున్నట్లుగా వీడియో వైరల్...
- చైనీస్ మాంజా మెడకు చుట్టుకోవడంతో హైదరాబాద్‌లో జవాన్ కోటేశ్వర్ రెడ్డి మృతి... ఈ పతంగి దారం ఎందుకంత ప్రమాదకరం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














