సరుకులు కొనేటప్పుడు ఈ టిప్స్ పాటిస్తే డబ్బులు ఆదా చేయొచ్చు, పర్యావరణాన్ని కూడా కాపాడొచ్చు..

నిత్యావసర వస్తువులు, లాస్ ఏంజిల్స్, అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్యాకేజింగ్ ఖర్చులు, నిత్యావసర సరకుల బిల్లు తగ్గించుకునేందుకు వాటిని అధిక మొత్తంలో కొనుగోలు చేసే ప్రయత్నం
    • రచయిత, లూసీ షెరీఫ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆహార పదార్ధాలు ఒకేసారి ఎక్కువ మొత్తంలో కొనడం ఇబ్బందికరమైన వ్యవహారంగా కనిపించవచ్చు. అయితే దాని వల్ల పర్యావరణానికి మేలు జరగడమే కాదు, మీకు చాలా డబ్బు మిగులుతుంది.

మీరు దీన్ని మేల్కొలుపు అని అనవచ్చు. నేను లాస్ ఏంజిల్స్‌లోని మా ఇంటి దగ్గర్లో ఉన్న స్టోర్ వద్ద నిల్చుని ఉన్నాను. నేను ఆర్గానిక్ ఓట్స్ ఉన్న బ్యాగు వైపు చూస్తున్నాను.

ఆ బ్యాగ్ ధర 960 రూపాయలు. అవి మా కుటుంబాని వారం రోజులకు సరిపడా వస్తాయి. నా దగ్గర ఇ్పపుడు ఇంట్లో సరిపడా ఓట్స్ లేవు. ఓట్స్ అంత ఖరీదైనవి కాదని నాకు తెలుసు.

నేను మా ఇంటి దగ్గర ఉన్న స్టోర్‌లో ఉన్నాననుకోండి, సౌకర్యం విషయంలోనే కాదు, డబ్బుల విషయంలో కూడా ఇది మంచి నిర్ణయం, అయితే ఈ షాపు అంత బాగా లేదు. ఇక్కడ నాకు ఎలాంటి లాభం లేదు.

పైగా మా ఇంటి పక్కనే ఉన్న సూపర్ మార్కెట్ నన్ను మోసం చేస్తుందేమోనని అనిపిస్తోంది.

ప్రమాణం చేసి చెబుతున్నాను, అక్కడ అప్పుడు మధ్యవర్తులు లేకుండా నేరుగా ఉత్పత్తి దారుల నుంచి కొనేందుకు ఎలాంటి మార్గాలు ఉన్నాయో కనుక్కునేందుకు వెళ్లాను.

నేను ఏమి కొనగలనో చూడాలి. ప్యాకేజింగ్‌ను తగ్గించుకోవడం ద్వారా నేను ఎంత డబ్బు ఆదా చెయ్యగలనో తెలుసుకోవాలి.

మొదటగా నేను ఏం చేశానంటే నేను తరచుగా కొనుగోలు చేసే సరకుల గురించి ఒక జాబితా తయారు చేశాను.

పాల ఉత్పత్తుల్ని నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు పరిశోధన చేశాను. అయితే అది చాలా కష్టం అని తెలిసింది. దీంతో ఆయిల్, ఓట్స్, బియ్యం, పెసలు, టీ బల్క్‌గా ఎలా కొనవచ్చు అనే దానిపై పరిశోధన చేశాను.

ఆర్గానిక్ వస్తువులు అమ్మే వారిలో నమ్మకమైన వ్యక్తులను కనుక్కోవాలి. సరఫరా వ్యవస్థను అధ్యయనం చెయ్యాలి.

అమ్మకం దారులు ఎక్కడ ఉంటారు. వాళ్లు తమ ఉత్పత్తుల్ని ఎక్కడ నుంచి తెస్తారు.

దాన్ని ఎలా రవాణా చేస్తారు. దాని ధర ఎలా నిర్ణయిస్తారు?. ప్రతి వస్తువును ఎలా ప్యాక్ చేస్తారు?. దీనిపై నేను నా పరిశోధన చేశాను. ఓట్స్ విషయంలో ఈ పరిశోధన ప్రత్యేకంగా చేశాను.

బియ్యం, పెసలు, ఓట్స్, వంట నూనెలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అధికమొత్తంలో కొనడం వల్ల చౌకగా లభిస్తున్నట్లు తేల్చిన పరిశోధన

డబ్బుల్ని ఆదా చేసుకోవడం ఎలా?

11.4 కేజీలున్న ఆర్గానిక్ ఓట్స్ బ్యాగ్ కొనడం 1.18 కేజీల ఓట్స్ బ్యాగ్ కొనడం కంటే చౌకని తెలుసుకోవడానికి నేను స్కూలులో చదువుకున్న లెక్కల నైపుణ్యం అంతా ఉపయోగించాల్సి వచ్చింది.

ఒక పౌండు బరువున్న ఓట్స్ బల్క్‌ బ్యాగు ధర 160 రూపాయలు. సూపర్ మార్కెట్‌లో అదే పౌండు బరువున్న చిన్న బ్యాగ్ ధర 288 రూపాయలు. నేను సూపర్ మార్కెట్‌లో 11.4 కేజీలున్న ఓట్స్ బ్యాగు కొంటే నేను 7,219 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

ఆర్గానిక్ కొబ్బరి నూనే విషయానికొస్తే సూపర్ మార్కెట్‌లో400 మిల్లీ లీటర్ల డబ్బాకు 625 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అదే 3.8 లీటర్లకు 2,566 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే విడివిడిగా చిన్న డబ్బాలు 3.8 లీటర్లు కొంటే 5,937 రూపాయలు చెల్లించాలి. ఈ పోలిక చూస్తే చాలు. బల్క్‌గా కొనడం వల్ల ఎంత లాభమో తేలిగ్గా తెలుసుకోవచ్చు.

పెసలు కొనడంలోనూ ఇలాంటి ఆనందకరమైన విజయం లభించింది.

నేను సాధారణంగా 910 గ్రాములు ఉండే పెసరపప్పు బ్యాగ్ కొనేందుకు 960 రూపాయలు చెల్లిస్తాను.

11.4 కేడీల బ్యాగ్ కోసం 5,986 రూపాయలు చెల్లించాను. దీని వల్ల 6,518 ఆదా అయింది. అదే నేను పెసరపప్పును చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో కొంటే 11.1 కేజీలు కొనడానికి బల్క్‌గా కొన్నదాని కంటే రెండు రెట్లు ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉండేది.

అధిక మొత్తంలో కొనడం వల్ల వస్తువులు ఆర్థికంగా చూస్తే చాలా చౌకగా వచ్చాయి.

నిత్యావసర వస్తువులు, షాపింగ్
ఫొటో క్యాప్షన్, అధిక మొత్తంలో సరకుల్ని కొనడం వల్ల ఎక్కువసార్లు మార్కెట్‌కు వచ్చే అవసరం తగ్గుతుందంటున్న అధ్యయనం

కర్బన ఉద్గారాలను తగ్గించే మార్గం

సరకుల్ని అధికమొత్తంలో కొనుగోలు చేయటడం వల్ల భూమికి మేలు జరుగుతుందా లేదా అని తెలుసుకోవడం కష్టం. అలా అని అనుకుంటున్నది నేను మాత్రమే కాదు.

“వినియోగదారుడి కోణం నుంచి చూస్తే, ఒక వస్తువు పర్యావరణ హితమైనదేనా అనే దాన్ని సవాలు చేసేందుకు ఆ వస్తువు పర్యావరణం మీద ఎలాంటి ప్రభావం చూపుతుందనే దాని గురించి సంపూర్ణ అంచనాలు అవసరం” అని వలేరీ పెట్రో చెప్పారు.

కెనడాలోని పాలిటెక్నిక్ మాంట్రియల్ నుంచి సుస్థిర ఆవిష్కరణలపై ఆమె డాక్టరేట్ తీసుకున్నారు.

“ఒక వస్తువు వల్ల ఎంత తక్కువ వృధా ఉంటుందనే దాన్ని మనం కొలవగలిగినప్పుడు, దాని వల్ల పర్యావరణానికి ఎంత హాని జరుగుతుందో తెలుసుకోవడానికి మనకు సంపూర్ణ డేటా అవసరం, దాని జీవన చక్రాన్ని పరిశోధించడం ద్వారా తెలుసుకోవడం ముఖ్యం”

చివరకు, నేను దీన్ని చాలా తేలిగ్గా చెప్పదలచుకున్నాను. ఈ ప్రయోగం కోసం నాకు అవసరమైన వస్తువులన్నింటిని అమ్మే ఒక కంపెనీని గుర్తించాను.

ఆ కంపెనీ నుంచి నేను పెసలు, డాండేలియోన్ వేరు ( కాఫీ, టీలకు బదులుగా ఉపయోగించే మొక్క వేరు), బియ్యం, ఓట్స్ ఆర్డర్ చేశాను.

ఈ వస్తువులన్నింటినీ నేను ఒకే కంపెనీ నుంచి ఆర్డర్ చెయ్యడం ద్వారా ప్రయాణించడం వల్ల ఏర్పడే కాలుష్య ఉద్గారాలు, డెలివరీ ప్యాకేజింగ్‌ను తగ్గించగలిగాను.

అంతర్జాతీయంగా ఆహార వస్తువుల ఎగుమతులు, దిగుమతుల వల్ల 19 శాతం కర్బన ఉద్గారాలు విడుదల అవుతున్నాయి.

అందుకే స్థానికంగా దొరికేవి కొనడమే నాకు ముఖ్యం.

ఎస్సెన్షియల్ ఆర్గానిక్స్ సంస్థ ప్రధాన కార్యాలయం వాషింగ్టన్‌లో ఉంది. ఆ సంస్థ అమ్మే ఉత్పత్తులు అనేక దేశాల నుంచి వస్తాయి.

నేను వాడే డాండేలియన్ టీ చైనా నుంచి వస్తోంది. బియ్యం థాయిలాండ్, పెసలు భారత్ నుంచి వస్తోంది. కొబ్బరి నూనె ఫిలిప్పీన్స్ నుంచి వస్తోంది. అమెరికా నుంచి వస్తోంది ఓట్స్ మాత్రమే. ఈ వస్తువుల దిగుమతికి కర్బన ఉద్గారాలు ఏ స్థాయిలో ఉత్పత్తి అవుతాయో అంచనా వేసే సామర్థ్యం నాకు లేదు. అలాంటప్పుడు నాకు విడివిడిగా వస్తువులు కొనే సామర్థ్యం లేదు.

బల్క్‌గా కొనడాన్ని ప్రోత్సహించడమే తమ సంస్థ లక్ష్యమని ఆన్‌లైన్ రిటైలర్ ఎస్సెన్షియల్ ఆర్గానిక్స్ అధికార ప్రతినిధి లానా ల వర్గెనే చెప్పారు.

“వినియోగదారులు బల్క్‌గా కొనుక్కోవడం వల్ల ప్యాకేజింగ్ కోసం ప్లాస్టిక్ వాడటం తగ్గుతుంది. వినియోగదారులకు డబ్బు ఆదా అవుతుంది” అని ఆమె అన్నారు.

స్థానిక మార్కెట్లలో బల్క్‌గా కొనడం చాలా కష్టమైన వ్యవహారం. చక్కగా షాపింగ్ చెయ్యడంలో ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి.

నాకు అన్నింటిలోనూ అలాంటి పరిస్థితి ఎదురవుతుంది. నేను ఒక చోట నుంచి బల్క్‌గా ఆర్డర్ చేయగలిగితే, ఆహార సరఫరాలో కర్బన ఉద్గారాలను కట్టడి చేయగలిగేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు.

నేను స్థానికంగా ఉండే షాపుకు వెళ్లి కేవలం ఓట్స్ మాత్రమే కొంటే నా వల్ల కర్బన ఉద్గారాలు పెరుగుతాయా, తగ్గుతాయా. దీని గురించి ప్రతీ ఒక్కరూ గంటల కొద్దీ ఆలోచించాలి.

ఆహార పదార్ధాలు, సూపర్ మార్కెట్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వృథాను తగ్గించాలని భావిస్తున్న అమెరికన్ వినియోగదారులు

వృథాను తగ్గించడంపై దృష్టి

అమెరికాలో కేవలం 4 శాతం ప్లాస్టిక్‌ను మాత్రమే రీసైకిల్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇది 9 శాతం ఉంది.

అయితే మనం వాడుతున్న ప్లాస్టిక్‌తో పోల్చుకుంటే రీసైకిల్ చేస్తున్నది చాలా తక్కువ. ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి జరుగుతున్న హాని కూడా ఎక్కువ.

వస్తువుల్ని అధిక మొత్తంలో కొనడం వల్ల డబ్బులు ఆదా చేయడంతో పాటు వృథాను తగ్గించగలమా అంటే ఆశ్చర్యకరమే.

దురదృష్టత్తువశాత్తూ ఈ అంశం మీద అవసరమైనంత పరిశోధన జరగలేదు. అయితే అమెరికన్ వినియోగదారులు ప్లాస్టిక్ వృథాను తగ్గించే పరిష్కారాల కోసం ఎదురు చూస్తున్నారు.

ప్రత్యేకించి ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ను తగ్గించాలని భావిస్తున్నట్లు 2023లో పెట్రో సహ రచయితగా ఉన్న ఓ అధ్యయనంలో తేలింది.

“అధిక మొత్తంలో కొనుగోళ్ల విషయంలో జరుగుతున్న పరిణామాలను అంచనా వేసేందుకు జరుగుతున్న సాంకేతిక పరమైన అధ్యయనాల సంఖ్య పెరగుతోంది” అని పెట్రో చెప్పారు.

“తమకు అవసరమైన వస్తువులను చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో కాకుండా భారీ మొత్తంలో కొనడం ద్వారా ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గంచవచ్చని అనేక మంది ఆచరణలో చూపిస్తున్నారు” అని ఆమె అన్నారు.

అయితే పర్యావరణంపై ప్రభావం అనేది వివిధ ఉత్పత్తుల మధ్య రకరకాలుగా ఉంది. “కొన్ని వస్తువుల్ని ఉపయోగించిన తర్వాత వాటిని శుభ్రం చేసేందుకు ఎక్కువ శ్రమ అవసరం. ఉదాహరణకు పెరుగు, గింజల విషయంలో తీసుకుంటే వాటిని క్లీన్ చేసేందుకు అవసరమైన వనరులు విడుదల చేసే కర్బన ఉద్గారాలు వేర్వేరుగా ఉండవచ్చు” అని పెట్రో చెప్పారు.

ఆమె చెబుతున్న దానిలో ప్రధానమైనది డబ్బాలను మళ్లీ వాడకం పెరగాలని.

నేను షాంపూ, కంటైనర్ల ప్లాస్టిక్ బాటిళ్లకు బదులుగా వాటి బార్లను ఉపయోగిస్తున్నాను. అందుకే బాత్‌రూమ్‌లో మళ్లీ వాడుకునే వాటి కోసం చూడటం లేదు.

అయితే వంటగదిని మరింత పర్యావరణ హితంగా ఉండాలనేది నా ఆలోచన.

డబ్బు ఆదా, సరకులు, బల్క్ కొనుగోళ్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సరకుల్ని అధికమొత్తంలో కొనడాన్ని ప్రోత్సహించడం వెనుక ప్రధాన కారణం పర్యావరణ హితం, డబ్బు ఆదా చేసుకోవడమే

నెలవారీ బడ్జెట్‌ను అదుపులో ఉంచే అలవాటు

ఓట్స్ పెద్ద గోధుమ రంగు పేపర్ బ్యాగ్‌లో వస్తాయి, అది నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది.

నేను ఉపయోగించే ఓట్స్ సాధారణంగా అట్ట పెట్టె లేదా ప్లాస్టిక్ డబ్బా లేదా ప్లాస్టిక్ కవర్‌లో వస్తుంటాయి.

ఓట్స్ భారీ మొత్తంలో కొనడం వల్ల పర్యావరణపరంగానే కాకుండా డబ్బులు కూడా ఆదా అవుతాయి.

ఇక వంట నూనెల విషయానికొస్తే అది పెద్ద ప్లాస్టిక్ డబ్బాలో వస్తుంది. చిన్నవి అయితే ప్లాస్టిక్ కవర్లు లేదా జార్లలో వస్తుంది.

లాస్ ఏంజిల్స్‌లో ప్లాస్టిక్ వస్తువుల రీసైక్లింగ్ చూస్తే, దాని మీద మరో కథనం రాయవచ్చు. సాధారణంగా ప్లాస్టిక్ కంటే ఎక్కువగా గ్లాసును మళ్లీ వినియోగిస్తుంటారు. మొత్తం గ్లాసులో మూడో భాగాన్ని మళ్లీ వినియోగంలోకి తెస్తున్నారు.

రీ యూజబుల్ ప్యాకేజింగ్‌తో అమ్మే సరకులను అధికమొత్తంలో కొనుగోలు చెయ్యడానికి ఎక్కువ చెల్లించేందుకు వినియోగదారులు సిద్ధంగా లేరని 2023లో ఓ అధ్యయనం తెలిపింది.

అధికమొత్తంలో వస్తువుల్ని కొనడానికి అడ్డంకిగా ఉన్న వాటిలో శుభ్రత ప్రధానంగా ఉంది. మరో సమస్య వాటి లభ్యత.

అధిక మొత్తంలో సరకుల్ని కొనేందుకు ప్రోత్సహిస్తున్న వాటిలో పర్యావరణ హితం, డబ్బు ఆదా ప్రధానంగా ఉన్నాయి.

నా వంటగది అరల్లో కొత్తగా తీసుకొచ్చిన స్టాక్ చూస్తే, ఇతర అడ్డంకుల విషయంలో నేను అశ్యర్యపోయాను.

కొన్ని ఆహార పద్దతులు కూడా అధికమొత్తంలో సరకుల్ని కొనేవారికి సరిపోతాయి.

మొత్తంగా చూస్తే పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడం వల్ల మనకున్నచౌకగా వచ్చినప్పటికీ మన బడ్జెట్‌పై ఉండే సమస్యల కారణంగా ప్రతీ సారి భారీ మొత్తంలో చేయడం సాధ్యం కాకపోవచ్చు.

అధికమొత్తంలో కొనుగోలు చేయడం వల్ల లాభాలపై చాలా తక్కువ సమాచారం ఉందని పెట్రో చెప్పారు.

"అది పర్యావరణానికి మంచిదని మనం అనుకుంటుంటాం. అయితే ఆ వస్తువు ఉత్పత్తి నుంచి వినియోగం వరకు, దాని పూర్తి జీవ చక్రం గురించి తెలియకుండా పర్యావరణంపై దాని ప్రభావం ఎలా ఉంటుందనేది అర్థం చేసుకోవడం కష్టం. అందుకే మనం అధిక మొత్తంలో కొనేందుక సిద్ధంగా ఉండాలి" అని పెట్రో చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)