వందేళ్ల గేట్ వే ఆఫ్ ఇండియా: దీనిని ఎందుకు నిర్మించారంటే..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జాహ్నవి మూలే, అమృత దుర్వే
- హోదా, బీబీసీ ప్రతినిధులు
ముంబయిలోని చరిత్రాత్మక స్మారక తోరణం గేట్ వే ఆఫ్ ఇండియా డిసెంబర్ 4న వందేళ్లు పూర్తి చేసుకుంది.
వందేళ్లుగా ఈ ప్రఖ్యాత కట్టడం భారత దేశపు ప్రముఖ నగరానికి చిహ్నంగా నిలిచింది. అంతే కాదు చరిత్రలో ఈ ప్రాంతంలో జరిగిన అనేక సంఘటనలకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది.
1911లో బ్రిటన్ రాజు జార్జ్ V, రాణి మేరీ భారత దేశంలో అడుగు పెట్టినందుకు గుర్తుగా బ్రిటిషర్లు ఈ కట్టడాన్ని నిర్మించారు. బ్రిటన్ రాజ దంపతులిద్దరు ముంబయిలోని అపోలో బందర్‌లో అడుగుపెట్టారు.
అయితే, తర్వాతి రోజుల్లో ఆదే కట్టడం బ్రిటిషర్లు 1948లో భారత దేశాన్ని వీడి వెళ్లడాన్ని చూసింది. భారత దేశం బ్రిటిషర్ల నుంచి స్వేచ్ఛను పొందింది. పరిపాలన భారతీయుల చేతుల్లోకి వచ్చింది.

గేట్ వే ఆఫ్ ఇండియాను బసాల్ట్ స్టోన్, రీఇన్‌ఫోర్స్‌డ్ కాంక్రీట్ కలిపి నిర్మించారు. ఇది 26 మీటర్ల (85 అడుగులు) ఎత్తు ఉంది. దీన్ని ఇండో సార్సెనిక్ శైలి(దీన్నే ఇండో గోతిక్ శైలి అంటారు)లో నిర్మించారు.
ఇండో సార్సెనిక్ శైలిలో ఇండో ఇస్లామిక్, పాశ్చాత్య నిర్మాణ శైలి కలిసి ఉంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
సముద్రం ఒడ్డున అపోలో బందర్ ప్రాంతంలో ఒక రాతి గోడ ఉంది. అప్పట్లో ఇక్కడ నుంచి ప్రయాణికులు, సరకు రవాణా జరిగేది. ఇక్కడే గేట్ వే ఆఫ్ ఇండియాను నిర్మించారు.

ఫొటో సోర్స్, Getty Images
గేట్ వే ఆఫ్ ఇండియాకు ఎదురుగా టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జెంషెడ్‌జీ టాటా నిర్మించిన తాజ్‌మహల్ ప్యాలెస్ హోటల్ ఉంటుంది.
గేట్ వే ఆఫ్ ఇండియాను నిర్మించడానికి ముందే ఈ హోటల్ 1903 డిసెంబర్ 16న ప్రారంభమైంది.

ఫొటో సోర్స్, Getty Images
బ్రిటన్ రాజవంశీయుల రాక
1911లో కింగ్ జార్జ్ V, క్వీన్ మేరీ బ్రిటిష్ సామ్రాజ్య రాజు, రాణిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్‌ను సందర్శించారు. భారత దేశాన్ని సందర్శించిన తొలి రాజదంపతులు వీరే.
వారు ముంబయిలో అడుగు పెట్టినందుకు గుర్తుగా గేట్‌వే ఆఫ్ ఇండియాను నిర్మించారు.

ఫొటో సోర్స్, Getty Images
రాజవంశానికి స్వాగతం పలికిన కార్డ్‌బోర్టు కట్టడం
1911 మార్చ్ 31న గేట్ వే ఆఫ్ ఇండియా నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
బ్రిటన్ రాజవంశం భారత్‌లోకి వచ్చినప్పటికి ఈ నిర్మాణం జరగలేదు. దానిక బదులుగా కార్డ్‌బోర్డ్ మోడల్ ఒక దాన్ని అక్కడ ఉంచారు.

ఇప్పటికీ భద్రంగా ఉన్న నమూనా
1914లో గేట్ వే ఆఫ్ ఇండియా చివరి నమూనాను స్కాటిష్ ఆర్కిటెక్ట్ జార్జ్ విట్టెట్ రూపొందించారు.
1924లో గేట్ వే ఆఫ్ ఇండియా నిర్మాణం పూర్తైంది.
ఈ నిర్మాణానికి సంబంధించిన నమూనాను రావు బహదూర్ యశ్వంత్‌రావు హరిశ్చంద్ర దేశాయ్ ఒక రాయితో రూపొందించారు. ఈ కట్టడానికి యన ఓవర్ సీర్( సూపరింటెండెంట్ మేనేజర్)గా పని చేశారు.
ఆయన వారసులు తర్వాత ఆ చిట్టి గేట్ వేను ముంబయిలో భద్రపరిచారు.

ఫొటో సోర్స్, Getty Images
బ్రిటిష్ వైస్రాయ్‌లు, గవర్నర్లు, ఇతర ప్రముఖులు భారత్ వచ్చినప్పుడు వారిని ఆహ్వనించడానికి, వేడుకలు జరపడానికి గేట్ వే ఆఫ్ ఇండియా ఒక వేదికగా ఉండేది.
1915లో మహాత్మ గాంధీ సౌతాఫ్రికా నుంచి భారత దేశానికి తిరిగి వచ్చినప్పుడు అపోలో బందర్‌లోనే అడుకు పెట్టారు.
గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద చెప్పుకోదగ్గ మరో కార్యక్రమం స్వతంత్ర్యం వచ్చిన తర్వాత జరిగింది.
1948 ఫిబ్రవరి 28నన బ్రిటిష్ బలగాలు గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద నుంచి బ్రిటన్ వెళ్లాయి.
సోమర్‌సెట్ లైట్ ఇన్‌ఫాంట్రీకి చెందిన ఫస్ట్ బెటాలియన్ భారత దేశంలో బ్రిటిష్ రాజ్యం ముగిసినట్లు సంకేతాలు ఇస్తూ ఈ కట్టడం గుండా నిష్క్రమించాయి.

ఫొటో సోర్స్, Getty Images
బ్రిటిష్ దళాల నిష్క్రమణ
కెప్టెన్ కింగ్‌కు చెందిన రెజిమెంటల్ పతాకాలను కిందకు దించి ఇండియాకు సెల్యూట్ చేస్తూ భారత దేశంలో సేవలందించిన చివరి బ్రిటిషన్ బెటాలియన్‌గా బాంబే నుంచి నిష్క్రమిస్తున్నట్లు పరేడ్ నిర్వహించారు.
ముంబయిలో గేట్ వే ఆఫ్ ఇండియా ప్రాంతం అతిపెద్ద పర్యటక కేంద్రం.
ఈ కట్టడం ఆర్చ్ ఎదురుగా 1961లో చత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కింగ్ జార్జ్ V కాంస్య విగ్రహాన్ని తొలగించి శివాజీ విగ్రహాన్ని నిర్మించారు.
ఈ కాంప్లెక్స్‌లో స్వామి వివేకానంద విగ్రహం కూడా ఉంది. ఆయన ఇక్కడి నుంచే ఆమెరికాకు వెళ్లారు.

ఇక్కడ నిర్మించిన జెట్టీ నుంచి ఫెర్రీలు ప్రయాణికుల్ని ఎలిఫెంటా గుహల వరకు తీసుకెళతాయి. ఈ ప్రాంతాన్ని యునెస్కో హెరిటేజ్ సైట్‌గా గుర్తించారు.
ఎలిఫెంటా కేవ్స్‌తో పాటు తీర పట్టణాలు అలిబౌగ్, రేవాస్, మండ్వ వెళ్లడానికి కూడా పడవలు ఇక్కడి నుంచే బయల్దేరతాయి.
2003 ఆగస్టులో గేట్ వే దగ్గర తీవ్రవాదులు పేలుళ్లకు పాల్పడటంతో అప్పటి నుంచి ఈ ప్రాంతంలో భద్రతను పెంచారు.

ఫొటో సోర్స్, Getty Images
గేట్ వే ఉన్న దారిలోనే ప్రఖ్యాత తాజ్ హోటల్ ఉంది. సముద్రం నుంచి చూస్తే హోటల్ ఈ చారిత్రక కట్టడం ఎడమ వైపున ఉన్నట్లు కనిపిస్తుంది.
2008 నవంబర్ 26న తాజ్‌మహల్ హోటల్ మీద తీవ్రవాదులు దాడి చేశారు.
అలాగే అనేక సందర్బాల్లో ఈ ప్రాంతం ప్రజల ఆందోళలకు వేదికగా నిలిచింది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ చారిత్రక కట్టడం తరచుగా బాలీవుడ్ సినిమాల్లో కనిపిస్తోంది. గేట్ వే ఆఫ్ ఇండియా వేదికగా సంగీత కచేరీలు, ఇతర సాంస్కృతిక వేడుకలు జరుగుతున్నాయి.
2023 మేలో గేట్‌వే ఆఫ్ ఇండియా బ్యాక్‌డ్రాప్‌గా మరియా గ్రాజియా చియురి ఫ్యాషన్ షో నిర్వహించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇండియన్ నేవీ ఏటా డిసెంబర్ 4న నేవీ డే ఉత్సవాలను గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద నిర్వహిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
రుతుపవనాల సమయంలో భారీ వర్షాలు కురుస్తున్నా, తుపానులు వచ్చినా, సముద్రంలో ఎగసిపడుతున్న అలలు గేట్ వే ఆఫ్ ఇండియా గోడను తాకి వెనక్కి వెళుతున్న చిత్రాలు తప్పకుండా కనిపిస్తాయి.
బహుశా ఇదే కారణం కావచ్చు. ముంబయి, ఆ నగర ప్రజల తిరుగుబాటు ధోరణికి ఈ కట్టడం కూడా ఒక నిదర్శనంగా నిలుస్తోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














