కైకాల సత్యనారాయణ కన్నుమూత: ఎన్‌టీఆర్‌తో కలిసి 101 సినిమాల ప్రయాణం

కైకాల సత్యనారాయణ

ఫొటో సోర్స్, twitter

తెలుగు సినిమా సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఈ రోజు ఉదయం కన్నుమూశారు.

హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో తన నివాసంలో తుది శ్వాస విడిచారు.

ఆయన మృతదేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్ ఛాంబర్‌కు తీసుకువస్తారు.

ఆయన గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నారు.

 కైకాల సత్యనారాయణ

ఫొటో సోర్స్, SVKRISHNAREDDY/FACEBOOK

సినీ రంగ ప్రవేశం

కైకాల సత్యనారాయణ 1959లో 'సిపాయి కూతురు' చిత్రంతో సినిమాలలో అడుగుపెట్టారు.

60 ఏళ్లకి పైగా సాగిన సినీ జీవితంలో 750కి పైగా చిత్రాలలో నటించారు.

సత్యనారాయణ 1935 జులై 25న కృష్ణా జిల్లాలోని కౌతారం గ్రామంలో జన్మించారు.

గుడివాడ, విజయవాడలలో చదువుకున్నారు.

1960లో నాగేశ్వరమ్మతో ఆయనకు వివాహమైంది. వారికి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్నారు.

సత్యనారాయణ ఒడ్డూపొడవు ఎన్‌టీఆర్‌లా ఉండడంతో తొలి రోజుల్లో ఎన్‌టీఆర్‌కు డూప్‌గా నటించేవారని చెబుతారు.

కెరీర్ తొలి దశలో ఎక్కువగా విలన్ పాత్రలు చేశారు. తరువాత కేరక్టర్ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకున్నారు.

గంభీరమైన స్వరం, నిండైన విగ్రహంతో సత్యనారాయణ పౌరాణిక పాత్రలలో రాణించారు.

రావణాసురుడు, యమధర్మరాజు, దుర్యోధనుడు వంటి పాత్రలలో ఆయనకు సాటిలేరన్న ప్రశంసలు అందుకున్నారు.

రాజ మకుటం, శ్రీకృష్ణార్జున యుద్ధం, లవ కుశ, నర్తనశాల, పాండవ వనవాసం, శ్రీకృష్ణ పాండవీయం, ఉమ్మడి కుటుంబం, నిండు మనసులు, ఏకవీర, చిక్కడు దొరకడు, సంపూర్ణ రామాయణం, ప్రేమ్ నగర్, తాతా మనవడు, యమగోల, సోగ్గాడు, దాన వీర శూర కర్ణ, కురుక్షేత్రం, తాయారమ్మ బంగారయ్య, వేటగాడు, సర్దార్ పాపా రాయుడు, కొండవీటి సింహం, యమకింకరుడు, బొబ్బిలి పులి, మంత్రిగారి వియ్యంకుడు, బొబ్బిలి బ్రహ్మన్న, విజేత, మజ్ను, యముడికి మొగుడు, కొండవీటి దొంగ, ఆఖరి పోరాటం, భైరవ ద్వీపం, యమలీల, ఘటోత్కచుడు, బావగారు బాగున్నారా, మురారి, యమగోల మళ్లీ మొదలైంది, అరుంధతి మొదలైన ఎన్నో సినిమాలలో పాత్రలు చేశారు.

సినిమాలలో యముడంటే సత్యనారాయణే. 1977లో వచ్చిన యమగోల, 1994లో వచ్చిన యమలీల సినిమాలో యముడిగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

సత్యనారాయణ 2011లో రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు.

2017లో ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ ఆయనకు లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు ఇచ్చి సత్కరించింది.

తెలుగు సినిమా అభిమానులు ఆయనకు నవరస నటనా సార్వభౌమ అని బిరుదునిచ్చారు.

 కైకాల సత్యనారాయణ

ఫొటో సోర్స్, TWITTER

నిర్మాతగా..

నటుడిగానే కాకుండా, సొంతంగా సినిమాలు కూడా నిర్మించారు సత్యనారాయణ.

రమా ఫిలిమ్స్ ఆయన సొంత సంస్థ. కొదమ సింహం, బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు వంటి చిత్రాలు నిర్మించారు.

ఎన్‌టీ రామారావుతో సినిమా పరమైన అనుబంధం, వ్యక్తిగతంగా కూడా వారిని మంచి స్నేహితులుగా చేసింది.

ఎన్‌టీఆర్‌, సత్యనారాయణలు కలసి 101 సినిమాల్లో నటించారు.

ఇంత అద్భుత సినిమా చరిత్ర ఉన్నప్పటికీ సత్యనారాయణకు పద్మ అవార్డు రాలేదంటూ ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు.

ఘటోత్చకుడు సినిమాలో స్టిల్

ఫొటో సోర్స్, SVKRISHNAREDDY/FACEBOOK

ఫొటో క్యాప్షన్, ఘటోత్చకుడు సినిమాలో స్టిల్

నవరస నటనా సార్వభౌమ

విలన్‌గా కెరీర్ ప్రారంభించినా, హాస్య, కరుణ రసాల్లో కూడా ఆయన మెప్పించారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

"సత్యనారాయణ అన్ని రసాలూ పోషించాడు. దేవుడు చేసిన మనుషులు సినిమాలో అద్భుతమైన కామెడీ కూడా చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆయన తొలి చిత్రం సిపాయి కూతురు ఫ్లాప్ అయిన తరువాత, ఆయన్ను విలన్ గా మారిపోమని చెప్పారు విఠలాచార్య. ఆ తరువాత ఎన్‌టీఆర్ ఉమ్మడి కుటుంబంలో కరుణ రసం కూడా పోషించాడు. సత్యనారాయణ ధుర్యోధనుడి పాత్ర చేయగలడా అని అనుమానాలు వచ్చినా, ఎన్‌టీఆరే రికమండ్ చేశారు ఆ పాత్రకి. యముడి పాత్రకు కూడా సత్యనారాయణని ఎన్‌టీఆరే రికమండ్ చేశారు. గుడివాడ వ్యక్తి కావడమో మరొకటే కానీ ఎన్‌టీఆర్, సత్యనారాయణల మధ్య మంచి అనుబంధం ఉండేది. వారిద్దరూ కలసి 101 సినిమాల్లో నటించారు. గుడ్లవల్లేరులో ఆయన చదువు సాగింది. కృష్ణా జిల్లాలో ఆయన నాటకాలు వేసేప్పుడే 'ఎన్‌టీఆర్ బ్రదర్‌'లా ఉన్నాడు అనేవారు. ప్రజా నాట్య మండలి అంబటి వారు తొలి అవకాశం ఇస్తానని సత్యనారాయణకు హామీ ఇచ్చినప్పటికీ, డీఎల్ నారాయణ తొలి అవకాశం ఇచ్చారు. మొత్తం 13 సినిమాల్లో హీరోగా నటించారు. సిపాయి కూతురు హీరోగా తొలి సినిమా అయితే, మొరటోడు అనేది హీరోగా ఆయన చివరి సినిమా. ఆ సినిమాను నగేశ్ డైరెక్ట్ చేశారు. అందులో జయసుధ హీరోయిన్" అంటూ సత్యనారాయణ గురించి బీబీసీకి చెప్పారు సీనియర్ జర్నలిస్టు భరద్వాజ.

ప్రముఖుల సంతాపం

సత్యనారాయణ మరణానికి రాజకీయనాయకులు, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సత్యనారాయణ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

సత్యనారాయణ తెలుగు సిని ప్రపంచంలో తనదైన ముద్ర వేశారని, లోక్‌సభ ఎంపీగా సేవలు అందించారని అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కైకాల సత్యనారాయణ మరణం తెలుగు చలన చిత్ర రంగానికి తీరని లోటని తెలంగాణ సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు.

చలన చిత్ర రంగంలో తొలితరం నటుడిగా పలు విభిన్నమైన పాత్రలను పోషిస్తూ, తన వైవిధ్యమైన నటన ద్వారా మూడు తరాల తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందారని సీఎం గుర్తుచేసుకున్నారు.

వారి కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

"గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కైకాల సత్యనారాయణ గారు. నటునిగా సుదీర్ఘ కాలం సేవలందించి ఎన్నో మరపురాని పాత్రలతో మెప్పించారు. ఎంపీ గానూ ప్రజలకు మరింత దగ్గరయ్యారు. కైకాల మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం తెలియజేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

కైకాల సత్యనారాయణతో కలిసి ఎన్నో సినిమాలలో నటించానని, ఆయన మరణం కలచి వేస్తోందని సినీ నటుడు చిరంజీవి అన్నారు. సత్యనారాయణ భారతదేశం గర్వించదగ్గ నటుడని, ఆయన పోషించినన్ని పాత్రలు ఎవరూ పోషించి ఉండరని అన్నారు. "సత్యనారాయణ గారితో కలిసి ఎన్నో సినిమాలలో నటించాను, ఆయన నటనా వైదుష్యాన్ని, వ్యక్తిత్వాన్ని దగ్గర నుంచి పరీశీలించే అవకాశం నాకు కలిగింది. డైలాగ్ డెలివరీలో ఆయనది ప్రత్యేక పంథా. స్వచ్ఛమైన స్ఫటికం లాంటి మనిషి. నిష్కల్మషమైన మనసు ఉన్న వ్యక్తి. నన్ను 'తమ్ముడూ' అంటూ తోడబుట్టినవాడిలా ఆదరించారు. ఆయనతో నాకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి" అని చిరంజీవి అన్నారు.

చిరంజీవి

ఫొటో సోర్స్, Chiranjeevi/Twitter

ఈ ఏడాది జూలై 22న సినీ నటుడు చిరంజీవి సత్యనారాయణను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఆయన చేత కేక్ కట్ చేయించారు. అప్పటికే సత్యనారాయణ అనారోగ్యంతో మంచంపై ఉన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 4

లెజెండ్రీ నటుడు సత్యనారాయణ ఆత్మ శాంతించాలని కోరుతూ నిర్మాత బండ్ల గణేష్, దర్శకుడు మారుతి తదితరులు నివాళులు అర్పించారు.

సత్యనారాయణ

ఫొటో సోర్స్, SVKRISHNAREDDY/FACEBOOK

సినీ నటుడు, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ సత్యనారాయణ మృతికి సంతాపం తెలియజేశారు.

"ఆహార్యం, అభినయం, ఆంగికాలతో అశేషాభిమానుల్ని సంపాదించుకున్న సీనియర్ నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి కైకాల సత్యనారాయణ మరణం చిత్రపరిశ్రమతో పాటు, తెలుగువారికి తీరనిలోటు. తెలుగు సినీ వినీలాకాశం ఒక గొప్ప ధ్రువతారను కోల్పోవడం విచారకరం. ఎన్టీఆర్ వంటి మహానుభావుడితో కలిసి సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల్లో కైకాల చూపిన అభినయం ఎన్నటికీ మరువలేనిది. సత్యనారాయణగారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబసభ్యులకు, వారి అభిమానులకు నాప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను." అంటూ ఆయన సంతాపం తెలిపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 5

సత్యనారాయణ మృతి పట్ల నటుడు రామ్ చరణ్ విచారం వ్యక్తం చేశారు.

తెలుగు సినీ రంగానికి సత్యనారాయణ చేసిన సేవలు మరచిపోలేమని అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 6
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 6

రాజకీయాల్లో..

1996లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తెలుగుదేశం నుంచి మచిలీపట్నం ఎంపీగా గెలిచారు.

ఎన్టీఆర్‌తో దాదాపు 40 ఏళ్ల అనుబంధం ఉన్న సత్యనారాయణ మొదట నుంచి రాజకీయాలకు దూరంగానే ఉన్నారు.

కానీ ఎన్టీఆర్ మరణం తరువాత 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ తరఫున మచిలీపట్నం నుంచి పోటీ చేసి గెలిచారు.

1998 ఎన్నికల్లో ఓటమి తరువాత రాజకీయాలకు దూరం అయ్యారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరపున మరోసారి మచిలీపట్నం నుంచి ఎంపీగా పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి కానీ ఆయన బరిలో దిగలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)