డోనల్డ్ ట్రంప్ మీద నేరాభియోగాలు నమోదు చేయాలన్న అమెరికన్ కాంగ్రెస్ కమిటీ

వీడియో క్యాప్షన్, కేపిటల్ హిల్ అల్లర్లలో ట్రంప్ పాత్రపై కాంగ్రెస్ కమిటీ కీలక నిర్ణయం
డోనల్డ్ ట్రంప్ మీద నేరాభియోగాలు నమోదు చేయాలన్న అమెరికన్ కాంగ్రెస్ కమిటీ

అమెరికన్ పార్లమెంటు భవనం కేపిటల్ హిల్‌పైన గతేడాది జనవరి 6న జరిగిన దాడి, అల్లర్లపై విచారణ చేపట్టిన కాంగ్రెస్ కమిటీ ఓ కీలక ప్రకటన చేసింది.

ట్రంప్‌పైన నేర అభియోగాలు నమోదు చేయాలని ఏకగ్రీవంగా సిఫారసు చేసింది.

అధికార కార్యకలాపాలకు ఆటంకం కలిగించడం, దేశాన్ని మోసం చేయాలనే కుట్ర, తిరుగుబాటు కోసం జనాలను రెచ్చగొట్టడం అనే అభియోగాలు అందులో ఉన్నాయి.

అయితే కమిటీ సిఫార్సులకు కట్టుబడి ఉండాల్సిన చట్టపరమైన నిబంధనలేమీ లేవు.

కాబట్టి ట్రంప్‌పైన విచారణ చేపట్టాలా, లేదా అనేది అమెరికా న్యాయ శాఖ నిర్ణయించాల్సి ఉంది.

బీబీసీ ప్రతినిధి జాన్ సడ్వర్త్ అందిస్తోన్న రిపోర్ట్.

డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Reuters

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)