ఆస్కార్ వేడుకలో దర్శకుడు రాజమౌళి... గవర్నర్స్ అవార్డ్స్ అంటే ఏంటి... ఎందుకిస్తారు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వరికూటి రామకృష్ణ
- హోదా, బీబీసీ ప్రతినిధి
మార్చి 12, 2023... ఆస్కార్ అవార్డుల వేదిక...
‘ది ఆస్కార్ గోస్ టు... ఎస్.రాజమౌళి ఫర్ ఆర్ఆర్ఆర్’... అంటూ వినపడగానే...
ఆస్కార్ ఆడిటోరియంలో ఒక్కసారిగా చప్పట్లు మోగాయి.
ఆ కరతాళ ధ్వనుల మధ్య బ్లాక్ అండ్ వైట్ షూట్‌లో మెరిసిపోతున్న రాజమౌళి, బెస్ట్ డైరెక్టర్‌గా ఆస్కార్‌ను తీసుకునేందుకు వేదిక దిశగా కదిలాడు.
సగర్వంగా ఆస్కార్ ప్రతిమను చేత పట్టుకుని చెమర్చిన కళ్లతో నిలబడిన రాజమౌళిని ఇక్కడ టీవీలో చూసిన చాలా మంది కళ్లలో నీళ్లు తిరిగాయి.
... ‘ఆర్ఆర్ఆర్’ అభిమానుల్లో కొందరు కొంత కాలం కిందట ఇలాగే కలలు కని ఉంటారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
‘ఆర్ఆర్ఆర్‌కు ఆస్కార్’
‘ఆర్‌ఆర్ఆర్’ సినిమా ఆస్కార్‌కు నామినేట్ అవుతుందా?
జూనియర్ ఎన్టీఆర్‌కు ఆస్కార్ అవార్డ్ వస్తుందా? కొద్ది రోజుల కిందటి వరకు ‘ఆర్‌ఆర్ఆర్’ సినిమా మీద సోషల్ మీడియాలో నడిచిన చర్చ ఇది. ఆస్కార్ నామినేషన్లకు భారత ప్రభుత్వం ‘ఆర్ఆర్ఆర్’ను పంపించకపోవడంతో అభిమానుల ఆశ కలగానే మిగిలి పోయింది.
అయితే ఇప్పుడు వారి కలలో కొంత సాకారమైంది. ఒక ‘ఆస్కార్’ కార్యక్రమంలో తాజాగా రాజమౌళి మెరిశారు.
శనివారం సాయంత్రం లాస్‌ఏంజలీస్‌లో ఆస్కార్ ప్రతిమ బ్యాక్ డ్రాప్ ముందు... బ్లాక్ అండ్ వైట్ సూట్‌లో మెరిసిపోతున్న రాజమౌళి ముఖం మీద హాలీవుడ్ కెమెరాల ఫ్లాష్‌లు తళక్కుమన్నాయి.
ప్రముఖ హాలీవుడ్ నటుడు టామ్ హాంక్స్ వంటి వారు నిలబడిన ఆ వేదికనే రాజమౌళి కూడా పంచుకున్నారు. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ నిర్వహించిన ‘ఆస్కార్స్ గవర్నర్స్ అవార్డ్స్’ వేడుక ఇందుకు వేదికైంది.
ఇలా ‘ఆస్కార్ వాల్’ ముందు జేమ్స్‌బాండ్ స్టైల్లో రాజమౌళి నిలబడిన దృశ్యాలు, సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఫొటో సోర్స్, Facebook/RRR Movie
గవర్నర్స్ అవార్డ్స్ అంటే?
ఆస్కార్ అకాడమీ అయిదు రకాల అవార్డులు ఇస్తుంది. అవి...
1.అకాడమీ అవార్డ్స్
2.గవర్నర్స్ అవార్డ్స్
3.అకాడమీ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ అవార్డ్స్
4.స్టూడెంట్ అకాడమీ అవార్డ్స్
5.నికోల్ ఫెల్లోషిప్ ఇన్ స్క్రీన్ రైటింగ్
ఆస్కార్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ 2009లో ఈ అవార్డులను ప్రారంభించారు. సినిమా పరిశ్రమకు ఎనలేని సేవలు అందించిన వ్యక్తులకు తగిన గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో ‘ఆస్కార్స్ గవర్నర్స్ అవార్డ్స్’ను తీసుకొచ్చారు.
ఈ అవార్డులో భాగంగా మూడు పురస్కారాలు ఇస్తారు.
ఇర్విన్ గ్రాంట్ థాల్బర్గ్ మెమోరియల్ అవార్డ్: మంచి క్వాలిటీ సినిమాలు తీసిన నిర్మాతలకు ఈ అవార్డ్ ఇస్తారు. ఇర్విన్ గ్రాంట్ హాలీవుడ్ ప్రొడ్యూసర్. 1899లో పుట్టిన ఆయన 1936లో మరణించారు. ఆయన పేరు మీదనే ఈ అవార్డును నెలకొల్పారు.
మెట్రో-గోల్డ్‌విన్-మేయర్(ఎంజీఎం) స్టూడియోకు వైస్ ప్రెసిడెంట్‌గా పని చేసిన ఇర్విన్, దాన్ని హాలీవుడ్ ప్రముఖ సినిమా స్టూడియోలలో ఒకటిగా మార్చారు. ఆయన మరణం తరువాత 1937లో ఈ అవార్డ్‌ను నెలకొల్పారు.
జీన్ హర్‌షోల్ట్ హుమానిటేరియన్ అవార్డ్: సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తులు చేసే సామాజిక సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు ఇస్తారు. హాలీవుడ్ నటుడు జీన్ హర్‌షోల్ట్ ఎన్నో సామాజిక సేవలు చేయడంతోపాటు అకాడమీ ప్రెసిడెంట్‌గాను పని చేశారని... ఆయన గౌరవార్థం ఈ అవార్డును తీసుకొచ్చినట్లు ఆస్కార్స్ చెబుతోంది.
అకాడమీ హానరరీ అవార్డ్: సినిమా పరిశ్రమకు ఎనలేని సేవలు అందించిన వ్యక్తులకు, సంస్థలకు ఈ అవార్డ్ ఇస్తారు. 1991లో ప్రముఖ సినిమా దర్శకుడు సత్యజిత్ రేకు ఈ అవార్డ్ లభించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
13వ అవార్డుల వేడుక
శనివారం అమెరికాలో 13వ ‘గవర్నర్స్ అవార్డ్స్’ వేడుక జరిగింది.
పార్కిన్‌సన్స్ మీద అవగాహన కల్పించేందుకు కెనడా నటుడు మైఖేల్ జె.ఫాక్స్ చేసిన కృషికి గాను ఆయనకు జీన్ హర్‌షోల్ట్ హుమానిటేరియన్ అవార్డ్ లభించింది.
హాలీవుడ్ పాటల రచయిత డయాన వారెన్, డైరెక్టర్ పీటర్ లిండ్సే, డైరెక్టర్-ప్రొడ్యూసర్ అయిన ఇ.పాల్సీలకు ‘హానరరీ అవార్డ్స్’ ఇచ్చారు.
ఈ వేడుకకే ఎస్.రాజమౌళి హాజరయ్యారు. అక్కడే ‘స్టార్ వార్స్’, ‘మిషన్ ఇంపాజిబుల్’ వంటి ఫేమస్ సినిమాలకు దర్శకత్వం వహించిన జె.జె.అబ్రమ్స్‌ను ఆయన కలిశారు.
‘ఆర్ఆర్ఆర్‌కు నేను పెద్ద ఫ్యాన్ అంటూ అబ్రమ్స్ చెప్పారు’ అని ఆర్ఆర్ఆర్ మూవీ ట్విటర్ ఖాతా ట్వీట్ చేసింది.
ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ రావాలని కోరుకునే వారు ఇంకా ఆశలు వదలుకోవడం లేదు. ఆర్‌ఆర్ఆర్‌కు సీక్వెల్ తీస్తున్నామంటూ రాజమౌళి ప్రకటించిన నేపథ్యంలో అభిమానుల ఆస్కార్ ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
#RRRforOscars #OscaRRRs అనే హ్యాష్‌ట్యాగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
‘నా అన్ని సినిమాలకు మా నాన్నే కథా రచయిత. ఆర్ఆర్ఆర్-2 గురించి మేం కాస్త మాట్లాడుకున్నాం. ఆయన దాని మీద పని చేస్తున్నారు’ అని ఇటీవల రాజమౌళి అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కిసాన్ క్రెడిట్ కార్డ్: రైతుకు రూ. 3 లక్షల లోన్, ఏటీఎం నుంచి డ్రా చేసుకోవచ్చు. ఎలాగంటే...
- హనీ ట్రాప్ అంటే ఏంటి... సెక్స్‌ను ఒక ఆయుధంగా ఎలా వాడతారు
- ఆన్లైన్ పార్ట్‌టైమ్ జాబ్స్ చేయాలనుకుంటున్నారా? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవీ..
- ఫుట్‌బాల్: భారత జట్టుకు వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం వచ్చినా ఎందుకు ఆడలేదు?
- కృష్ణ: తిరుపతిలో గుండు చేయించుకుని వచ్చాక పద్మాలయ స్టుడియో గేటు దగ్గర ఆపేశారు, అప్పుడు ఏమైందంటే
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














