సూర్యకుమార్ యాదవ్ ‘వీడియో గేమ్ ఇన్నింగ్స్’.. అంతర్జాతీయ టీ20ల్లో రెండో సెంచరీ

సూర్యకుమార్ యాదవ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, బీఎస్ఎన్ మల్లేశ్వరరావు
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మౌంట్ మౌంగనూయిలో న్యూజీలాండ్, భారత్ జట్ల మధ్య జరిగిన రెండవ టీ20 మ్యాచ్‌లో భారత జట్టు 65 పరుగుల తేడాతో గెలుపొందింది.

తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది.

భారత బ్యాటర్లలో సూర్య కుమార్ యాదవ్ 51 బంతుల్లో 7 సిక్స్‌లు, 11 ఫోర్లతో 111 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

ఓపనర్ ఇషాన్ కిషన్ 36 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 13 పరుగులు, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 13 పరుగులు, రిషభ్ పంత్ 6 పరుగులు చేశారు.

న్యూజీలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ చివరి ఓవర్‌లో 3, 4, 5 బంతుల్లో హార్ధిక్ పాండ్యా, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్‌లను ఔట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు.

192 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజీలాండ్ జట్టు 18.5 ఓవర్లలో 126 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.

కెప్టెన్ కేన్ విలియమ్సన్ 52 బంతుల్లో 61 పరుగులు చేశాడు. ఓపెనర్ డెవోన్ కాన్వే 25, క్లెన్ ఫిలిప్స్ 12, డారిల్ మిచెల్ 10 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లలో నలుగురు సింగిల్ డిజిట్‌కే ఔటవ్వగా, ముగ్గురు డకౌట్ అయ్యారు.

భారత బౌలర్లలో దీపక్ హుడా కొద్దిలో హ్యాట్రిక్ అవకాశం కోల్పోయాడు. ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా నాలుగు వికెట్లు తీశాడు.

యజ్వేంద్ర చాహల్, మొహమ్మద్ సిరాజ్ రెండేసి వికెట్లు, భువనేశ్వర్ కుమార్, వాషింగ్టన్ సుందర్ చెరొక వికెట్ తీశారు.

సూర్యకుమార్ యాదవ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

‘వీడియో గేమ్ ఇన్నింగ్స్’గా అభివర్ణించిన విరాట్ కోహ్లీ

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌ను విరాట్ కోహ్లీ ‘వీడియో గేమ్ ఇన్నింగ్స్’గా అభివర్ణించాడు.

ఈ మేరకు ట్వీట్ చేస్తూ.. ‘‘నుమెరో ఉనో’ తాను ప్రపంచంలోనే అత్యుత్తమం ఎందుకో చూపించాడు. నేనైతే లైవ్ చూడలేదు కానీ, ఇది అతడి నుంచి వచ్చిన మరో వీడియో గేమ్ ఇన్నింగ్స్ అని చెప్పగలను’ అంటూ కళ్లల్లోంచి నీళ్లు కారేలా నవ్వుతున్న ఎమోజీ పెట్టాడు కోహ్లీ.

స్కై.. ఆల్వేస్ ఆన్ ఫైర్ – వీరేందర్ సెహ్వాగ్

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌ను ప్రశంసిస్తూ టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.

ఎర్రటి మేఘాలతో కమ్ముకున్న ఆకాశం ఫొటోను పెట్టి.. ‘‘ఈరోజుల్లో ఆకాశం (స్కై) ఎల్లప్పుడూ రగులుతోంది. తనదైన లీగ్‌లో ఉంటోంది’’ అని ట్వీట్ చేశాడు.

సూర్యకుమార్ యాదవ్‌ను అభిమానులు ముద్దుగా స్కై అని పిలుస్తుంటారు.

సూర్య ఏ గ్రహంపైన అయినా బ్యాటింగ్ చేయగలడు – ఇర్ఫాన్ పఠాన్

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

కాగా, సూర్యుడు ఏ గ్రహంపైన అయినా బ్యాటింగ్ చేయగలడు అంటూ సూర్యకుమార్ యాదవ్‌ను ఉద్దేశించి టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశాడు.

నాలుగు వికెట్లు తీసిన దీపక్ హుడాను కూడా ఇర్ఫాన్ పఠాన్ మెచ్చుకున్నాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 4

ఇది నెక్ట్స్ లెవల్ బ్యాటింగ్.. అలాంటి షాట్లు ఎప్పుడూ చూడలేదు – న్యూజీలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్

సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్.. తాను ఇప్పటి వరకూ చూసిన అత్యుత్తమ ప్రదర్శనల్లో ఒకటని న్యూజీలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అన్నాడు. సూర్యకుమార్ యాదవ్ కొట్టిన కొన్ని షాట్లు అయితే తాను ఇంత వరకూ చూడనేలేదని చెప్పాడు. సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ నెక్ట్స్ లెవల్‌లో ఉందని, మొత్తంగా టీమిండియా మెరుగైన ప్రదర్శన ముందు తాము సరితూగలేకపోయామని చెప్పాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 5

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)