జింబాబ్వేతో మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ ఆ షాట్లు ఎలా కొట్టగలిగాడు?

జింబాబ్వేపై టీమిండియా గెలుపు.. సెమీ ఫైనల్‌లో ఇండియా వర్సెస్ ఇంగ్లండ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, బీఎస్ఎన్ మల్లేశ్వర రావు
    • హోదా, బీబీసీ ప్రతినిధి

టీ20 ప్రపంచకప్ సూపర్ 12 దశలో చివరి మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించింది.

జింబాబ్వేతో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 71 పరుగుల తేడాతో గెలుపొందింది.

భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది.

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న సూర్యకుమార్ యాదవ్ ఈ ప్రపంచకప్‌లో మరొక అర్థ సెంచరీ సాధించాడు. 25 బంతుల్లోనే నాలుగు సిక్స్‌లు, ఆరు ఫోర్ల సహాయంతో 61 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

ఓపెనర్ కేఎల్ రాహుల్ వరుసగా రెండో అర్థ సెంచరీ సాధించాడు. మూడేసి సిక్స్‌లు, ఫోర్ల సహాయంతో 35 బంతుల్లో 51 పరుగులు చేశాడు.

విరాట్ కోహ్లీ 26 పరుగులు, హార్దిక్ పాండ్యా 18 పరుగులు సాధించగా, రోహిత్ శర్మ 15 పరులుగు, రిషభ్ పంత్ 3 పరుగులు చేశారు.

జింబాబ్వే 17.2 ఓవర్లలో 115 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.

ఆ జట్టులో ర్యాన్ బర్ల్ 35 పరుగులు, సికందర్ రజా 34 పరుగులు, క్రెగ్ ఇర్విన్ 13 పరుగులు, సీన్ విలియమ్స్ 11 పరుగులు చేశారు.

భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు, పాండ్యా, షమీ చెరొక రెండు వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ తలొక వికెట్ తీశారు.

సూర్యకుమార్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

4వ సారి సెమీ ఫైనల్స్‌కు చేరిన టీమిండియా

సూపర్ 12 దశలో టీమిండియా 8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.

ఐదు మ్యాచ్‌లు ఆడిన భారత్ నాలుగు మ్యాచ్‌ల్లో గెలుపొందగా, దక్షిణాఫ్రికాపై పరాజయం పాలైంది.

టీమిండియా టీ20 ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్స్‌కు చేరడం ఇది 4వ సారి.

గతంలో 2007, 2014, 2016ల్లో కూడా భారత జట్టు సెమీ ఫైనల్స్ వరకూ చేరుకుంది.

10వ తేదీ గురువారం ఆడిలైట్‌లో జరిగే సెమీ ఫైనల్లో టీమిండియా ఇంగ్లండ్‌తో తలపడనుంది.

గ్రూప్ 2 నుంచి పాకిస్తాన్ కూడా సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధించింది.

ఈనెల 9వ తేదీ బుధవారం సిడ్నీలో జరిగే మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో గ్రూప్‌1లో అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్‌తో పాకిస్తాన్ తలపడుతుంది.

ఈనెల 13వ తేదీన మెల్‌బోర్న్‌లో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.

ఆ షాట్ ఎలా కొట్టానంటే..

ఆఫ్ స్టంప్‌కు చాలా దూరంగా, వైడ్ మార్కర్‌ను కూడా దాటి వెళుతున్న బంతుల్ని సూర్య కుమార్ యాదవ్ స్వీప్ చేస్తూ వికెట్ కీపర్‌కు ఎడమవైపు నుంచి బౌండరీ దాటిస్తూ కొట్టిన షాట్లు ఈ మ్యాచ్‌లో హైలైట్ అయ్యాయి.

(ఈ కింద కనిపిస్తున్న వీడియోలో ఒక షాట్‌ను చూడొచ్చు)

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

‘ఇలాంటి షాట్లు ఎవరైనా కొట్టాలంటే.. ముఖ్యంగా అలా వంపు తిరిగి కొట్టాలంటే వాళ్ల నడుం పట్టేయడం ఖాయం’’ అని టీమిండియా మాజీ కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రి వాటిని వర్ణించారు.

ఈ తరహాలో సూర్యకుమార్ యాదవ్ మూడు షాట్లు కొట్టగా రెండు సిక్స్‌లు, ఒకటి ఫోర్ అయ్యింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

కాగా, సిక్స్ కొట్టిన షాట్ ఆఫ్ స్టంప్‌కు ఏడు స్టంప్‌ల దూరంగా ఉందని, అలాంటి బంతిని సూర్యకుమార్ యాదవ్ తన ఎడమ చెవికి ఐదు అంగుళాల దూరంలో వెనక్కి కొట్టాడని రవిశాస్త్రి అన్నారు.

ఈ షాట్ ఎలా కొట్టగలిగావు అని రవిశాస్త్రి ప్రశ్నించగా.. ‘‘నేను ఆ షాట్‌ చాలాసార్లు ప్రాక్టీస్ చేశాను. ముఖ్యంగా రబ్బర్ బంతితో ప్రాక్టీస్ చేశాను. బౌలర్ ఎలా ఆలోచిస్తున్నాడు, ఫీల్డింగ్ ఎలా ఉంది అన్నది ఆలోచించి ప్రిపేర్ అవుతాను’’ అని సూర్య కుమార్ యాదవ్ అన్నాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)